
కర్ణాటక: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన తాలూకాలోని గువ్వలకానహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సురేష్(38) భార్య హేమావతి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం.హేమావతి హునేగల్ గ్రామంలోని గంగాధర్‌తో సన్నిహితంగా ఉంటోందని భర్త సురేష్ గొడవ పడేవాడు. దీంతో హేమావతి విడాకులకు దరఖాస్తు చేసుకుంది.
హేమావతి శనివారం గంగాధర్‌తో కలిసి నగరంలో సంచరిస్తుండగా సురేష్ పసిగట్టి అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. దీంతో హేమావతి, గంగాధర్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సురేష్ ను పిలిపించి సర్దిచెప్పారు. అనంతరం సురేష్ తన ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రికార్డు చేసి స్నేహితులకు పంపి ఉరివేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి హేమావతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment