Hemavati
-
భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం... భర్త ఆత్మహత్య
కర్ణాటక: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన తాలూకాలోని గువ్వలకానహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సురేష్(38) భార్య హేమావతి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం.హేమావతి హునేగల్ గ్రామంలోని గంగాధర్‌తో సన్నిహితంగా ఉంటోందని భర్త సురేష్ గొడవ పడేవాడు. దీంతో హేమావతి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. హేమావతి శనివారం గంగాధర్‌తో కలిసి నగరంలో సంచరిస్తుండగా సురేష్ పసిగట్టి అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. దీంతో హేమావతి, గంగాధర్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సురేష్ ను పిలిపించి సర్దిచెప్పారు. అనంతరం సురేష్ తన ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రికార్డు చేసి స్నేహితులకు పంపి ఉరివేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి హేమావతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
ప్రజాశక్తి నగర్లో దారుణం
అనంతపురం క్రైం : అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని ప్రజాశక్తినగర్‌లో నివాసముంటున్న హేమావతి ఇంట్లో సోమవారం రాత్రి సామన్లు ధ్వంసమయ్యాయి. కాలనీవాసులే ఈ దారుణడానికి ఒడిగట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన మేరకు... నెల రోజుల కిందట కాలనీలోని కొన్ని ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నూగులు, ఇతర ధాన్యాలతోపాటు ఓ జంతువు మాంసం ముద్దలు పడి ఉన్నాయి. క్షుద్రపూజల్లో భాగంగా ఇలా చేశారని స్థానికులు గుర్తించి.. ఓ స్వామిని కాలనీకి తీసుకొచ్చి చూపించారు. ఆయన కొందరి ఇళ్లపై అనుమానం వ్యక్తం చేశారు. సదరు ఇళ్లల్లోని ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి రోడ్డుపై నిలబెట్టారు. ఆ తర్వాత రూరల్ పోలీసులకూ వారిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కాలనీలో విచారణ చేసి.. ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. తమ ప్రమేయం లేకపోయినా బాధ్యులను చేసి ఇబ్బందులకు గురి చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు కాలనీలోకెళ్లిన రూరల్ పోలీసులు తూతూమంత్రంగా విచారణ చేసి మిన్నకుండిపోయారు. కాలనీవాసుల చేతిలో దాడికి గురైన ముగ్గురు మహిళల్లో ఒకరైన హేమావతి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఈమె సోమవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చింది. అప్పటికే తలుపు తెరిసి ఉండడంతో లోనికెళ్లి పరిశీలించింది. తలుపు, టీవీ, ఇతర వస్తువులు ధ్వంసమై ఉండటంతో బాధితురాలు బోరున విలపించింది. కాలనీవాసులు కుళ్లాయప్ప, శివారెడ్డి, మద్దెలచెరువు నాగార్జున, మంజునాథ, చిట్టి, రాధ, అరుణ, శిరీష, మున్నీ, తేజ, ఆంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల కిందట అవమానం చేసి.. ఇప్పుడు మళ్లీ ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడమేంటని హేమావతి విలపించింది. తన తప్పు ఉంటే జైలుకు పంపాలే కానీ.. దౌర్జన్యం చేయడం తగదని పేర్కొంది. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా దాడులు కొనసాగుతుండటం చూస్తే తన ప్రాణానికి కాలనీవాసుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపింది. తనతోపాటు మరో ఇద్దరిని అవమానపరిచిన రోజే పోలీసులు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కన్నీటిపర్యంతమయ్యింది. వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. -
దప్పిక తీరేదిలా
=నగరానికి ప్రత్యామ్నాయ జల వనరులు =దృష్టి సారించిన బెంగళూరు జల మండలి =సర్కార్‌కు పలు సూచనలిచ్చిన ‘త్యాగరాజన్’ =‘లింగనమక్కి’ నుంచి నీరు మళ్లింపు =నీటి వృథాను అరికడితే కొంత ఊరట =‘బారాపూలె’ నీటిని సద్వినియోగం చేసుకోవాలి =పలు నదులపై ఆనకట్టలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రత్యామ్నాయ జల వనరులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని బీఎన్. త్యాగరాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో నగర నీటి అవసరా దృష్ట్యా అవసరమైన జల వనరులను గుర్తించడానికి ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఇటీవల నివేదికను సమర్పించింది. బెంగళూరు జల మండలి అధ్యక్షుడుగా పని చేసి రిటైరైన త్యాగరాజన్ నివేదిక ప్రకారం...2051 నాటికి నగర జనాభా 3.45 కోట్లకు చేరుతుంది. వైశాల్యం ప్రస్తుతం ఉన్న 800 చదరపు కిలోమీటర్ల నుంచి 1,500కు పెరుగుంది. అప్పట్లో నగరానికి ఏటా 88.25 టీఎంసీల నీరు అవసరమవుతుంది.కమిటీ సూచించిన ప్రత్యామ్నాయాలు... కావేరి నుంచి కావేరి న్యాయ పంచాయతీ తుది తీర్పు అనంతరం రాష్ట్రానికి 270 టీఎంసీల నీటి కేటాయింపు జరిగింది. ఇందులో 250.62 టీఎంసీలు వ్యవసాయానికి పోతుంది. 1.85 టీఎంసీలను ఇతర అవసరాలకు నిర్ణయిస్తూ, మిగిలిన 17.64 టీఎంసీలను రాష్ట్ర విచక్షణకు వదిలి వేశారు. ఇందులో 12.88 టీఎంసీల నీటిని నగరానికి కేటాయించాలి. లింగనమక్కి నుంచి... శివమొగ్గ జిల్లా సాగర తాలూకా లింగనమక్కి జలాశయం నుంచి దశాబ్దానికి పది టీఎంసీల చొప్పున దశలవారీ 30 టీఎంసీల నీటిని నగరానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టాలి. ప్రస్తుతం అక్కడ జల విద్యుదుత్పాదన జరుగుతోంది. తాగు నీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నందున, విద్యుదుత్పాదనను ఇతర మార్గాల ద్వారా చేపట్టవచ్చు. లింగనమక్కి నుంచి టీజీ హళ్లి మీదుగా నగరానికి పది టీఎంసీలు సరఫరా చేయడానికి రూ.12,500 కోట్లు అవసరమవుతుంది. వృథా అరికడితే... ప్రస్తుతం జల మండలి ద్వారా సరఫరా అవుతున్న నీటిలో సుమారు 50 శాతం వరకు లెక్కలు తేలకుండా వృథా అవుతోంది. దీనిని 16 శాతానికి తగ్గించగలిగితే నాలుగు టీఎంసీల నీటిని ఆదా చేయవచ్చు. బారాపూలె నుంచి... కొడగు జిల్లాలో పుట్టి కేరళ ద్వారా సముద్రంలో కలుస్తున్న బారాపూలె నీటిని సద్వినియోగం చేసుకోవాలి. నీటి పారుదుల శాఖ అంచనా ప్రకారమే ఇక్కడి నుంచి పది టీఎంసీలను లక్ష్మణతీర్థ వదృ్ద కష్ణరాజ సాగర్ జలాశయానికి మళ్లించవచ్చు. రెండేళ్లలో రూ.వంద కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు. హేమావతి నుంచి... చిన్న నీటి పారుదల శాఖ హేమావతి జలాశయం ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు సరఫరా చేయని పక్షంలో ఐదు టీఎంసీల నీటిని కుణిగల్, బుడగనహళ్లి చెరువులకు మళ్లించవచ్చు. అక్కడి నుంచి హెసరఘట్ట, తిప్పగొండనహళ్లి జలాశయాలకు పంప్ చేయడం ద్వారా బెంగళూరుకు తరలించవచ్చు. అయితే దీని వల్ల 73 వేల ఎకరాలకు సాగు నీరు అందకుండా పోతుంది. ఎత్తినహొళె నుంచి... పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న ఎత్తినహొళె తదితర నదులపై ఆనకట్టలను నిర్మించడం ద్వారా తుమకూరు వరకు 24 టీఎంసీల నీటిని తరలించడానికి నీటి పారుదల శాఖ పథకాన్ని సిద్ధం చేసింది. ఇందులో పది టీఎంసీలను బెంగళూరుకు ఇవ్వాల్సిందిగా నిపుణుల కమిటీ కోరింది. దీనికి ప్రభుత్వం సమ్మతిస్తే జల మండలి ఆ నీటిని వినియోగించుకునే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరానికి రోజూ 1.4 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికి ఏటా 18.8 టీఎంసీల నీరు అవసరమవుతుంది.