సంగారెడ్డి: దాంపత్య జీవితానికి అడ్డుగా మారిందని మహిళలపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటన నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం వెలుగు చూసింది. జిన్నారం సీఐ వేణు కుమార్, హత్నూర ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..హత్నూర మండలం బడంపేటకు చెందిన మల్లమ్మను (37)అదే మండలం పన్యాలకు చెందిన గొర్రెలకాడి మొగులయ్యతో గత 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి 16ఏళ్ల కూతురు ఉంది. బతుకుదెరువు కోసం గతంలో దంపతులిద్దరూ గుమ్మడిదల మండలం మంబాపూర్‌లోని ఓ కోళ్ల ఫారంలో కొన్నినెలల పాటు పనిచేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజాతో మల్లమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. స్వగ్రామానికి చేరుకున్న తరువాత కొన్ని రోజులకు మల్లమ్మ భర్త మొగులయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.
ఈ క్రమంలో మల్లమ్మ మహమ్మద్ ఖాజా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మహమ్మద్ ఖాజా భార్యకు వివాహేతర సంబంధం గురించి తెలియడంతో భర్తను పలుమార్లు మందలించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మల్లమ్మను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఓ పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా ఈ నెల 3న మహ్మద్ ఖాజా మల్లమ్మకు ఫోన్ చేసి నర్సాపూర్ పిలిపించుకున్నాడు.
అక్కడికి చేరుకుదున్న ఆమెను స్కూటీపై నల్లవల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మల్లమ్మను చున్నీతో బిగించి హత్య చేసి ఆనవాళ్లు దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి పరారయ్యాడు. తన కూతురు కనిపించకపోవడంతో మల్లమ్మ తల్లి అంజమ్మ ఈ నెల 4న హత్నూర పోలీస్టేషన్లో ఫిర్యా చేసింది.
దర్యాప్తులో భాగంగా నల్లవల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి మొహమ్మద్ ఖాజాను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో తను హత్యానేరాన్ని ఒప్పుకోవడంతో నిందితుడు మహమ్మద్ ఖాజాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment