
తమిళనాడు: వివాహేతర సంబంధం కొనసాగించడానికి అడ్డుచెప్పినందుకు సామాజిక మాధ్యమంలో అసభ్యకర వీడియోలు విడుదల చేస్తానని బ్లాక్‌మెయిల్ చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. నాగై జిల్లా వేదారణ్యం సమీపంలోని పుదుమాపిల్‌లై వీధికి చెందిన రవి (42), కార్తికేశ్వరి (39) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రవి మలేషియాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కార్తికేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన రవిచంద్రన్ (52)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న కార్తికేశ్వరి కుమార్తె తల్లిని మందలించింది.
తండ్రికి విషయం చెప్పింది. దీంతో కార్తికేశ్వరి, రవిచంద్రన్‌తో మాట్లాడడం మానేసింది. ఆగ్రహించిన రవిచంద్రన్ తనతో సన్నిహితంగా ఉన్న సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తారని బెదిరింపులకు దిగాడు. ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తికేశ్వరి శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవిచంద్రన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment