
తమిళనాడు: వివాహేతర సంబంధంతో పుట్టిన బిడ్డను నీటి డ్రమ్ములో ముంచి చంపి తర్వాత తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అరియలూరు జిల్లా సెంతురై సమీపంలోని దిఖుర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి (27). ఈమె భర్త చనిపోయాడు. రాజేశ్వరి తిరుపూర్‌లోని ఒక బనియన్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఒకరితో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీంతో రాజేశ్వరి గర్భం దాల్లి నాలుగు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ స్థితిలో చిన్నారి తండ్రి ఎవరని బంధువులు తరచూ అడగడంతో రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఇంట్లో ఉన్న వాటర్ డ్రమ్ములో బిడ్డను ముంచి కడతేర్చింది. తర్వాత రాజేశ్వరి ఇంటి సమీపంలోని చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కువాగం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జయంగొండం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment