
అన్నానగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. కడలూరు జిల్లా రామనత్తంలోని తాచూర్ గ్రామానికి చెందిన కలియపెరుమాళ్ కుమారుడు బాలకృష్ణన్ (34)కు భార్య రాధిక (25), ఇద్దరు కుమారులు. ఈ క్రమంలో రాధికకు అదే ప్రాంతానికి చెందిన దినేష్ (23)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
రెండేళ్లలో ఆమె తన ప్రియుడు దినేష్‌తో కలిసి మూడుసార్లు వెళ్లిపోయింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి బాలకృష్ణన్ వద్దకు చేర్చారు. కాగా బుధవారం ఉదయం బాలకృష్ణన్ ఇంటిలో హత్యకు గురయ్యాడు. ఫిర్యాదు మేరకు రామనత్తం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే భార్య రాధిక బాలకృష్ణన్‌ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. పోలీసులు రాధికను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment