తల్లితో వివాహేతర సంబంధం.. కూతురినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్‌ | A Woman Brutally Murdered In YSR District | Sakshi
Sakshi News home page

తల్లితో వివాహేతర సంబంధం.. కూతురినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్‌

Oct 5 2023 11:15 AM | Updated on Oct 5 2023 11:42 AM

woman brutal murder In YSR district - Sakshi

పట్టణంలోని ముస్లింకోటలో మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు..

వైఎస్సార్‌: పట్టణంలోని ముస్లింకోటలో మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. షేక్‌ గౌసియాబేగం (38) స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్‌ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ( ఔట్‌ సోర్సింగ్‌) కూలి పని చేసేది. ఆమె భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె కూలి పని చేసుకుని జీవనం సాగిస్తోంది.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సుబహాని (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల సుబహాని కువైట్‌ వెళ్లి వచ్చాడు.

ఆమెకు ఆర్థికంగా సహాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో గౌసియాబేగం పెద్ద కూతురును తనకిచ్చి పెళ్లి చేయమని సుబహాని అడిగాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోగా ఇటీవల కూతురుకు గిద్దలూరులో సంబంధం ఖాయం చేసుకుంది. దీంతో ఆమైపె కక్ష పెంచుకున్న సుబహాని పథకం ప్రకారం మంగళవారం రాత్రి ఉర్దూ స్కూలుకు పిలిచి హత్య చేసి మృత దేహాన్ని బాత్‌రూమ్‌లో పడేసి వెళ్లాడు.

హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌ వెళ్లి హత్య విషయం చెప్పాడు. లేకపోతే బుధవారం ఉదయం పాఠశాల తెరిచేంతవరకు ఈ విషయం వెలుగు చూసేది కాదు. ఈ సంఘటనపై ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement