Brutal murder of a woman
-
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్
వైఎస్సార్: పట్టణంలోని ముస్లింకోటలో మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. షేక్ గౌసియాబేగం (38) స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ( ఔట్ సోర్సింగ్) కూలి పని చేసేది. ఆమె భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె కూలి పని చేసుకుని జీవనం సాగిస్తోంది.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సుబహాని (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల సుబహాని కువైట్ వెళ్లి వచ్చాడు. ఆమెకు ఆర్థికంగా సహాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో గౌసియాబేగం పెద్ద కూతురును తనకిచ్చి పెళ్లి చేయమని సుబహాని అడిగాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోగా ఇటీవల కూతురుకు గిద్దలూరులో సంబంధం ఖాయం చేసుకుంది. దీంతో ఆమైపె కక్ష పెంచుకున్న సుబహాని పథకం ప్రకారం మంగళవారం రాత్రి ఉర్దూ స్కూలుకు పిలిచి హత్య చేసి మృత దేహాన్ని బాత్రూమ్లో పడేసి వెళ్లాడు. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి హత్య విషయం చెప్పాడు. లేకపోతే బుధవారం ఉదయం పాఠశాల తెరిచేంతవరకు ఈ విషయం వెలుగు చూసేది కాదు. ఈ సంఘటనపై ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వైద్యుడి ఇంట్లో శవంగా పనిమనిషి.. ఆర్ధరాత్రి ఏం జరిగింది?
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు వీరన్న షెడ్డు పరిసర ప్రాంతంలో రిటైర్డ్ వైద్యుని ఇంట్లో సోమవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళంలో వైద్యునిగా పనిచేసిన డాక్టర్ గొల్లంగి జగన్నాథం ఇంట్లో సుమారు పాతికేళ్లుగా ఇద్దరు మహిళలు తాళ్లవలస రాజు(35), చిట్టెమ్మ పనిమనుషులుగా ఉంటున్నారు. వీరిలో రాజు చిన్నప్పటి నుంచి వైద్యుని ఇంటిలోనే ఉంటోంది. వివాహం కాలేదు. మరో మహిళ చిట్టెమ్మ స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ. ఈమెకు వివాహమైంది. జగన్నాథం కుటుంబమంతా ప్రస్తుతం విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నారు. ఈయన కుమారుడు కూడా డాక్టర్ కావడంతో శ్రీకాకుళంలోని ఓ నర్సింగ్ హోంలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా సేవలందించేందుకు వారానికి ఒకసారి వచ్చి ఓపీ చూసి వెళ్తుంటారు. ఆ సమయంలో వంట చేసేందుకు, ఇంటిని చూసుకునేందుకు రాజు, చిట్టెమ్మలు నమ్మకంగా పనిచేస్తున్నారు. ఏం జరిగిందంటే.. పనిమనుషుల్లో ఒకరైన రాజు శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురంలో బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రానికి వచ్చేసింది. అదే రోజు రాత్రి ఏమైందో గానీ తలపై బలమైన గాయాలతో హత్యకు గురైంది. ఈ విషయాన్ని మరో పనిమనిషి చిట్టెమ్మ వైద్యుని ఇంటి పక్కనే ఉన్న షాపు యజమానులకు మంగళవారం ఉదయం చెప్పింది. వారు విశాఖలోని జగన్నాథంకు ఫోన్లో విషయం చేరవేశారు. ఆయన శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్‌టీం సబ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రక్తపు మరకలతో నైటీ, నిరోధ్ ప్యాకెట్లు గుర్తించినట్లు తెలిసింది. హత్య జరిగిన ప్రదేశాన్ని శ్రీకాకుళం డీఎస్పీ వై.శృతి పరిశీలించారు. టౌన్ సీఐ సన్యాసినాయుడు, రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిలో మహిళ దారుణ హత్య..
ఒడిశా: పట్టణంలోని విశాఖ–అరకు రహదారిలో ఉన్న చందన్ ఎ.సి లాడ్జిలో ఓ మహిళ హత్యకు గురైన విషయం ఆదివారం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా పట్టణవాసులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చందన్ లాడ్జి సర్వీస్ బాయ్ రూమ్ సర్వీస్ కోసం వెళ్లిన సమయంలో రూమ్ నంబర్ 103నుంచి దుర్వాసన వస్తోందని, చెప్పడంతో నిర్వాహకులు అనుమానంతో 100కి కాల్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి రూమ్ తలుపులు తెరిచి చూడగా లాడ్జి గదిలో మహిళ మృతదేహం పడి ఉండడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, క్లూస్‌టీమ్‌ను రప్పించారు. డీఎస్పీ గోవిందరాజు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూమ్ తీసుకున్నది అల్లూరి జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ మండలం పరిధి ఉరుముల గ్రామానికి చెందిన మాదల శ్రీరాములు ఈ నెల 24న పట్టణంలోని చందన్ ఎ.సి లాడ్జిలో రూమ్ నంబర్ 103ను బుక్ చేశాడు. 27 వరకూ ప్రతిరోజూ లాడ్జికి వచ్చి రోజువారీ అద్దె రూ.600 చెల్లించాడు. 29, 30 తేదీల అద్దె చెల్లించకపోవడంతో ఆదివారం ఉదయం 10.52గంటల సమయంలో కాల్చేస్తే ఫోన్‌పే చేస్తానని చెప్పినట్లు లాడ్జి సిబ్బంది తెలిపారు. లాడ్జిలో లేని సీసీ కెమెరాలు హత్య జరిగిన లాడ్జిలో ప్రవేశం వద్ద, రిసెప్షన్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల లాడ్జిలోకి వచ్చిన వారి వివరాలు నమోదు కాలేదు. హత్యలో ఎవరి ప్రమేయం ఉంది? ఎందరు ఉన్నారు? ఎప్పుడు జరిగింది? హత్యకు కారణం ఏమిటి? అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. హత్య జరిగి ఐదారు రోజులు హత్య ఘటనపై కొత్తవలస సీఐ చంద్రశేఖర్ వివరణ ఇస్తూ... లాడ్జిలోని రూమ్ నంబర్ 103లో దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేయడంతో వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసి మహిళ మృతదేహం ఉండడం గమనించాం. బహుశా హత్య జరిగి ఐదారు రోజులు కావచ్చని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. -
ఆ కిరాతకుడికి ఉరే సరి..
సాక్షి, మచిలీపట్నం/కోనేరుసెంటర్: రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనూహ్యపై ముంబైలో జరిగిన అత్యాచారం, దారుణ హత్య కేసు విషయంలో నిందితుడికి ఉరి శిక్షను సమర్థిస్తూ గురువారం బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. అత్యంత దారుణమైన ఈ కేసులో నిందితుడిపై ఎలాంటి కనికరం చూపించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నందున నిందితుడికి మరణ శిక్ష సరైందేనని పేర్కొంది. దీంతో న్యాయం కోసం నాలుగేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న అనూహ్య తండ్రి, కుటుంబ సభ్యులు తీర్పును స్వాగతించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేరు అనూహ్య (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. 2013 డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య నూతన సంవత్సర వేడుకలు సైతం తల్లితండ్రులు, చెల్లితో కలసి ఆనందంగా జరుపుకుంది. అనంతరం 2014 జనవరి 5న ఉద్యోగరీత్యా ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యింది. మరుసటి రోజు అనూహ్య ముంబైలోని తన హాస్టల్‌కు చేరుకోకపోవడంతో, విషయం తెలుసుకున్న తండ్రి అక్కడ తమ బంధువులకు విషయం చెప్పాడు. పలు చోట్ల బంధువులు గాలింపు చేపట్టినా, ఫలితం లేకపోవడంతో ముంబై పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగరం మొత్తం జల్లెడ పట్టారు. అనూహ్య సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలించడంతో జనవరి 16న ముంబై– పూణే హైవే పక్కన ఉన్న పొదల్లో కాలి బూడిదైన అనూహ్య మృతదేహం కనిపించింది. పట్టించిన సీసీ కెమెరాలు అనూహ్య హత్యకేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు.. రైల్వేస్టేçషన్లో లభ్యమైన సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య కేసులో ముంబైకి చెందిన పాత నేరçస్తుడు చంద్రభానుసనాప్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జాప్యం నెలకొనడంతో అనూహ్య తండ్రి జోనాథన్ ఢిల్లీ వెళ్లి ప్రత్యేక వినతిపై కేంద్ర హోం మంత్రిని ఆశ్రయించాడు. దీంతో స్పందించిన ఆయన మహారాష్ట్ర హోం మంత్రికి కేసును సిఫార్సు చేస్తూ లిఖితపూర్వకంగా లేఖ రాసి పంపారు. అక్కడి నుంచి అనూహ్య హత్య కేసు దర్యాప్తు వేగవంతమైంది. విచారణ పూర్తి చేసిన ముంబై పోలీసులు 2015 డిసెంబర్లో హంతకుడు చంద్రభాను సనాప్‌ను సెషన్స్ కోర్టులో పక్కా సాక్ష్యాధారాలతో హాజరుపరచగా కోర్టు ఉరి శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ.. హంతకుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. వాదోపవాదనలు విన్న హైకోర్టు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గురువారం చంద్రభాను సనాప్‌కు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
పక్కనే ఉంటూ ప్రాణాలు తీశారు
సిద్దిపేట పట్టణంలో ఇటీవల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. దుండగులు ఆ మహిళను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ జంటపై అనుమానం కలిగి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటికీ చెప్పారు. ఈ కే సుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. సిద్దిపేట మండలం నారాయణరావుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం (43)కు 20 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి నలుగురు కుమారులు కాగా, అందరూ కలిసి పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే సలీంకు ఎనిమిదేళ్ల క్రితం మండలంలోని ఇర్కోడ్ గ్రామానికి చెందిన మల్లవ్వతో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారి మల్లవ్వను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తున్న సలీంకు ఇద్దరు భార్యలతో పాటు పిల్లలను పోషించడం కష్టమైంది. ఈ విషయాన్ని రెండో భార్య మల్లవ్వతో చర్చించాడు. ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. సలీం ఒక రోజు న్యూస్ పేపర్లో చదువుతుండగా, గుర్తు తెలియని మహిళను కొందరు వ్యక్తులు హత్య చేసి కాల్చి బూడిద చేసిన వార్త కనిపించింది. ఈ కథనానికి ప్రభావితుడైన సలీం, ఇదే మార్గంలో డబ్బు సంపాదించాలని భావించాడు. ఈమేరకు బంగారం ధరించి ఉన్న మహిళలను టార్గెట్‌గా ఎంచుకుని వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను కాజేయాలని రెండోభార్య మల్లవ్వతో కలిసి పథకం పన్నాడు. 2008 జూలైలో తొలిహత్య పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉంటున్న సలీం, మల్లవ్వలు పొరుగింట్లో ఉంటున్న ఎర్రగుంట్ల రేణుక, తమ కుటుంబంలో ఉన్న గొడవలను మల్లవ్వకు చెప్పింది. అయితే ఎలాగైనా సరే రేణుక మెడలో ఉన్న బంగారం గొలుసును కాజేయాలని సలీం దంపతులు భావించారు. తమకు తెలిసిన వ్యక్తులను పురామాయించి నీ భర్తను చంపిస్తామని రేణుకను నమ్మించారు. ఈ క్రమంలోనే రేణుక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సలీం, మల్లవ్వలు ఆమెను ఓ బైక్‌పై ఎక్కించుకుని కరీంనగర్ జిల్లా పరిధిలో మల్లారం గుట్టల వద్ద తీసుకెళ్లారు. మల్లవ్వ, రేణుకలు మాట్లాడుతున్న సమయంలో సలీం తనతో పాటు తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో రేణుక తలపై బలంగా కొట్టి చంపేసి, ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకున్నాడు. అనంతరం రేణుకపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. రేణుక వద్ద తీసుకున్న బంగారం అమ్మగా వచ్చిన డబ్బులతో సలీం ఆటో కొనుగోలు చేశాడు. రెండో హత్య 2010 జూలైలో ఇలా.. అదే కాలనీకి చెందిన దేవమ్మ.. మల్లవ్వతో మాట్లాడేందుకు ఇంటికి రాగా, సలీం వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్‌తో దేవమ్మ తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం ఆమె మెడలోని పుస్తెల తాడు, చెవి కమ్మలు స్వాధీనం చేసుకుని అదే రోజు రాత్రి సలీం తన ఆటోలో సిద్దిపేట మండలం ఇర్కోడ్ శివారులోకి తీసుకెళ్లి డీజిల్ పోసి దేవమ్మ మృతదేహాన్ని తగలబెట్టారు. మూడో హత్య 2010 నవంబర్‌లో ఇలా.. సలీం భార్య మల్లవ్వకు బాగా తెలిసిన గుడిశెట్టి శోభ తరచూ ఇంటికి వస్తుండేది. ఈ క్రమంలో ఓ రోజు శోభ ఇంటికి రాగా, సలీం ఇంట్లో ఉన్న రోకలిబండతో శోభ తలపై కొట్టి హత్య చేసి, రెండు తులాల గొలుసు తీసుకుని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో కట్టేశాడు. అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ జిల్లా వేములవాడ దారిలో రోడ్డు పక్కన ఉన్న ఈత వనంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నాలుగో హత్య 2011 మార్చిలో.. పట్టణంలో నసర్పురాలో ఉంటున్న రాజవ్వ మార్కెట్లో పని చేసేది. అక్కడ లభించిన కందులు, ఉలువలను ఇంటింటికీ తిరుగుతూ అమ్ముకునేది. ఈ క్రమంలో రాజవ్వ వద్ద సలీం మల్లవ్వ దంపతులు ఉలవలు కొనేవారు. అయితే ఓసారి ఉలువల పైసలు కొన్ని బాకీ పడ్డారు. రాజవ్వ ఉలువల పైసల కోసం ఓ రోజు వీరి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సలీం ఆమెను టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు, డబ్బులు తీసుకున్నాడు. అనంతరం తన కుమారుడు నడుపుతున్న కారును తెచ్చి అర్ధరాత్రి కారులో మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని దగ్గరలో ఉన్న అడవిలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రాణాలు దక్కించుకున్న ఇంద్రమ్మ.. మార్చి నెలలోనే ఓ రోజు ఉదయం 5 గంటలకు ఇంద్రమ్మ మెదక్ రోడ్డుకు తన ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా సలీం రాడ్‌తో తలపై కొట్టాడు. మెడలో ఏం లేకపోవడంతో ఆమె చేతిలో ఉన్న సంచి వెతకగా బంగారు గొలుసు లభించింది. దీంతో గొలుసును తీసుకున్న సలీం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంద్రమ్మకు తలకు బలమైన గాయంకావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో చికిత్స చేయగా ప్రాణాలు దక్కాయి. ఐదో హత్య 2014 నవంబర్ 3న.. ఇర్కోడ్ గ్రామానికి చెందిన నాగభూషణం రెండో భార్య గౌరిశెట్టి పుష్ప సరస్వతి నగర్లో నివాసముంటోంది. ఈ క్రమంలో సలీం భార్య మల్లవ్వతో పుష్పకు స్నేహం ఏర్పడింది. పుష్ప తన తన ఇంట్లోని గొడవల గురించి మల్లవ్వ, సలీంలకు చెప్పేది. నీ భర్త నీ మాట వినేలా చేస్తామని పుష్పను సలీం, మల్లవ్వలు నమ్మించారు. ఓ రోజు ఇంటికి పిలిచి నీ బాధలు పోవాలంటే దీపానికి మొక్కాలని సూచించారు. దీపానికి మొక్కుతున్న పుష్పను సలీం రాాడ్తో కొట్టి హత్య చేశారు. ఎప్పటిలాగే అర్ధరాత్రి మృతదేహాన్ని కారులో నిజమాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. పుష్ప మిస్సింగ్‌పై నాగభూషణం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పుష్పకు సన్నిహితులుగా ఉన్నవారిపై నిఘా పెట్టారు. ఆ రోజు పుష్ప సలీం ఇంటికి వెళ్లినట్లు స్థానికుల ద్వారా తెలుసున్న పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా ఈ వరుస హత్యల బాగోతం బయటపడిందని డీఎస్పీ వెల్లడించారు. బంగారం.. వాహనాలు స్వాధీనం.. సలీం మల్లవ్వ దంపతులు వరుసుగా ఐదు హత్యలు, ఓ దోపిడీ చేశారు. వీరి వద్ద నుంచి 13.50 తులాల బంగారం, 12 తులాల వెండి నగలతో పాటు హత్యలకు ఉపయోగించిన రాడ్, రోకలి బండ, ఓ బైక్, ఓ కారు, ఓ ఆటోను సీజ్ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. సిబ్బందికి అభినందన.. రివార్డులు.. వరుస హత్యల మిస్టరీని ఛేదించిన వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది బాల్‌రెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, మల్లేశంలను సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ అభినందించారు. ఐడీ పార్టీ సిబ్బంది రివార్డులు అందజేశారు. -
మహిళ దారుణహత్య
మెదక్ రూరల్ : మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని భూర్గుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుమారుడు అరవింద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మైసన్నగారి కిష్టవ్వ (42), మైసయ్య దంపతులకు ఓ కుమార్తె స్వప్న, కుమారుడు అరవింద్ ఉన్నారు. మైసయ్య ఉపాధి పనుల నిమిత్తం కొన్నేళ్ల క్రితం ముంబ యికి వలస వెళ్లాడు. అయితే కుమార్తె స్వప్న కొద్ది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కిష్టవ్వ, కుమారుడు అరవింద్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. కాగా మృతురాలు కిష్టవ్వ మంగళవారం మెదక్‌కు వచ్చి కిరాణా సామగ్రిని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అరవింద్, అతని మిత్రుడు రవితేజలు ఇంట్లో టీవీ చూస్తూ తొమ్మిది గంటల ప్రాంతంలో మూత్ర విసర్జన నిమిత్తం బయటకు వచ్చారు. ఈ సమయంలో ఇంటి సమీపంలో ఓ వ్యక్తి సెల్‌ఫోన్ పట్టుకుని తచ్చాడుతూ కనిపించాడు. అయితే చీకట్లో సరిగా కనపడకపోవడంతో గ్రామానికే చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని భావించిన అరవింద్ మిత్రుడితో కలిసి ఇంటికి వచ్చి రాత్రి పది గంటల వరకు టీవీ చూసి పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి తల్లి నెత్తుటి మడుగులో ఉన్న విషయాన్ని చూసి అరవింద్ బోరుమన్నాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాజరత్నం, పట్టణ సీఐ కొమురయ్య, రూరల్ ఎస్ఐ వినాయక్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వివరాలను సేకరించింది. అదే విధంగా డాగ్‌స్క్వాడ్.. మృతురాలి ఇంటి నుంచి సమీపంలోని ఓ కల్లు దుకాణంలోకి వెళ్లి అక్కడ కూర్చుంది. అక్కడి నుంచి నేరుగా ఎస్సీ కాలనీలో గల పలువురు వ్యక్తుల ఇళ్ల ముందు నుంచి కాలనీలో తిరుగుతూ ప్రధాన సీసీ రోడ్డుకు వెళ్లింది. ఈ మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హంతకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ రాజరత్నం హత్యా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రాజరత్నం అనంతరం విలేకరులతో మాట్లాడారు. కిష్టమ్మను పరిచయస్తులే చంపినట్లు హత్యా స్థలాన్ని బట్టి తెలుస్తోందన్నారు. మృతురాలి ఒంటిపై ఉన్న కడియాలు, పట్టగొలుసులు, గుండ్లను హంతకుడు అపహరించినట్లు ఆయన అనుమానించారు. కాగా నిందితుడు హత్యను పక్కదారి పట్టించేందుకు పుస్తెలతాడు, చెవి కమ్మలను అలాగే వదలి పోయాడని డీఎస్పీ చెప్పారు. హంతకుడిని అతి త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.