Wife Killed Husband Due To Extra Marital Affair With Another Man For Two Years In East Godavari - Sakshi
Sakshi News home page

దూరంగా భర్త.. మరో వ్యక్తితో రెండేళ్లుగా భార్య వివాహేతర సంబంధం..

Aug 8 2023 2:16 AM | Updated on Aug 8 2023 12:04 PM

- - Sakshi

తూర్పు గోదావరి: వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలికొంది. మండలంలోని కొంతంగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్తిపాడు సీఐ కె.కిషోర్‌బాబు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన పగడం దుర్గాప్రసాద్‌(21)కు, అదే గ్రామానికి చెందిన మహిళతో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది.

ఉపాధి నిమిత్తం భర్త దూర ప్రాంతంలో ఉండటంతో ఆ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కొంతంగిలోని పుట్టింటికి వచ్చింది. ప్రసాద్‌ కూడా రాచపల్లి నుంచి ఆదివారం రాత్రి కొంతంగి వచ్చాడు. వివాహేతర సంబంధం విషయంలో అతడు అల్లరి చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ను మేడ పైకి తీసుకువెళ్లి, కళ్లల్లో కారం కొట్టి, హతమార్చారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

సీఐ కిషోర్‌బాబు, అన్నవరం ఎస్సై వి.కిషోర్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రసాద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతుడికి తల్లి, పెళ్లి కావలసిన అన్న, చెల్లెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement