A Married Woman Committed Suicide After Her Husband Had an Illicit Relationship With Another Girl - Sakshi
Sakshi News home page

భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం

Published Fri, Jul 7 2023 10:02 AM | Last Updated on Tue, Aug 1 2023 8:47 PM

- - Sakshi

కామారెడ్డి: ప్రియురాలి మోజులో పడి భర్త తనను పట్టించుకోకపోవడం.. ప్రశ్నిస్తే వరకట్నం కోసం వేధించడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నవీపేటలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను నిజామాబాద్‌ ఏసీపీ కిరణ్‌కుమార్‌ గురువారం వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన రాజేందర్‌ కూతురు కావ్యరశ్రీ(26)కి నవీపేటకు చెందిన ఎర్ర మహేష్‌, అరుణల కుమారుడు ఎర్ర మనోజ్‌తో 2020లో వివాహం జరిగింది.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే మనోజ్‌కు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో కావ్యశ్రీని పట్టించుకోలేదు. కావ్యశ్రీ మానసికంగా కుంగిపోయి తన బాధను పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇరువురికి సర్దిచెప్పారు. మనోజ్‌కు అప్పులు ఉండడంతో కావ్యశ్రీని అదనపు కట్నం కోసం మరింత వేధించాడు. భర్తతో పాటు అత్తమామలు అరుణ, మహేష్‌ కూడా కావ్యశ్రీని వేధించారు.

మానసిక వేధనను భరించలేని కావ్యశ్రీ బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురును అదనపు కట్నం కోసం వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాజేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కిరణ్‌కుమార్‌, ఎస్సై రాజారెడ్డి ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త మనోజ్‌, అత్తమామలు అరుణ, మహేష్‌పై కేసు నమోదు చేశామని ఏసీపీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement