గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ | Case Registered On Accused In Gandhi Hospital Molestation Case | Sakshi
Sakshi News home page

గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్

Published Tue, Aug 17 2021 5:28 PM | Last Updated on Tue, Aug 17 2021 6:17 PM

Case Registered On Accused In Gandhi Hospital Molestation Case - Sakshi

గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం కేసు నిందితులపై 342, 376 (d), 328 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమా మహేశ్వర్‌తో పాటు ఒక సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీసులు విచారిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం కేసు నిందితులపై 342, 376 (d), 328 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమా మహేశ్వర్‌తో పాటు ఒక సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీసులు విచారిస్తున్నారు. ఈ అత్యాచార ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈనెల 5న తన అక్క భర్తను బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసింది. అక్కతో కలిసి గాంధీ ఆస్పత్రిలోనే బాధితురాలు ఉండగా, పేషెంట్‌ దగ్గర ఒక్కరే ఉండాలంటూ అక్కాచెల్లెళ్లను ఉమామహేశ్వర్‌ వేరు చేసినట్లు తేలింది. (చదవండి: Gandhi Hospital: హే గాంధీ!)

బాధితురాలిని ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డు తమ వెంట తీసుకెళ్లి మత్తు కలిపిన మద్యం ఇచ్చినట్లు అంతా భావించారు. కానీ ఔట్‌ పేషెంట్ వార్డు దగ్గర సెక్యూరిటీ రూమ్‌లోకి తీసుకెళ్లిన ఉమామహేశ్వర్.. బాధితురాలి ముక్కుకు మత్తుమందు ఉన్న ఖర్చీఫ్ అడ్డుపెట్టి, మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో బాధితురాలు అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది. స్పృహలోకి వచ్చేసరికి తనపై అత్యాచారం జరిగినట్లు  బాధితురాలు గుర్తించింది. సోదరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. 

ఇవీ చదవండి:
కుప్పకూలిన విమానం: షాకింగ్‌ వీడియో 
భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement