Man Died By Jumping Under The Lorry, Unable To Bear The Death Of His Wife In Mancherial - Sakshi
Sakshi News home page

భార్య మరణాన్ని తట్టుకోలేక.. లారీ కిందకు దూకి భర్త సూసైడ్‌

Published Sun, Jul 16 2023 12:33 PM | Last Updated on Sun, Jul 16 2023 2:37 PM

Husband Who Jumped Under Lorry After His Wife Died In Mancherial - Sakshi

 లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో  విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సాక్షి, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో  విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం పక్కింటి వాళ్లతో  గొడవ పడిన భార్య శరణ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె చికిత్స పొందుతూ కరీంనగర్‌ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది.

భార్య శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మధ్య మార్గంలో లక్షిట్ పెట్ ఉత్కూర్ చౌరస్తాలో భర్త మల్లికార్జున్ మనస్తాపంతో లారీ కిందకి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. భార్య, భర్తలు ప్రాణాలు‌ కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ప్రాణాలు  కోల్పొవడంతో వారు తీవ్రంగా విలపిస్తున్నారు.
చదవండి: సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement