తండ్రి స్నాప్‌చాట్‌ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్‌ | maharashtra Teen Hangs Self After Father Objects to downloading Snapchat | Sakshi

తండ్రి స్నాప్‌చాట్‌ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్‌

Published Mon, Jun 24 2024 2:29 PM | Last Updated on Mon, Jun 24 2024 2:29 PM

ప్రతీకాత్మ‌క చిత్రం

ఈ మ‌ధ్య‌ కాలంలో యువ‌త ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ ప‌రీక్ష‌లో ఫెయిల్ అయ్యామ‌ని, త‌ల్లిదండ్రులు మంద‌లించార‌ని, ఫోన్ కొనియ్య‌లేద‌ని, స్నేహితులు అల్ల‌రి చేశార‌ని.. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ స్నాన్‌చాట్‌ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన ఫోన్‌లో  స్నాప్‌చాట్‌  అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంది. ఇది చూసిన ఆమె తండ్రి ఆమెను సున్నితంగా  స్నాప్‌చాట్‌ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది.

ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్‌పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement