young girl
-
గర్భవతిని చేశాడు.. బాలిక ఉసురు తీశాడు!
కాణిపాకం/పలమనేరు : బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది. చివరికి ప్రాణాల మీదికొచ్చింది. వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు విఫలయత్నం చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ.ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణీ అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త హీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి.. వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. పలమనేరు సీఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ మాయలేడిని నమ్మి.. ఇదిలా ఉండగా, పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఓ మాయలేడి ఆ బాలికను ఆవుల మేతకు తీసుకెళ్లేదని, అక్కడ ఓ కామాంధుడి చేతిలో పెట్టేదని తెలిసింది. పూర్తి వివరాలను రెండ్రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం
-
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువతి
తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి.. అదుపుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ప్రమాదం కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమదంలో 19 ఏళ్ల యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పుదుచ్చేరి-మంగళూరు వీక్లీ రైలులో ఇరిట్టికి చెందిన యువతి.. తలస్సేరి నుంచి మంగళూరుకు వెళుతోంది. అయితే.. మధ్యలో కన్నూర్ రైల్వే స్టేషన్లో రైలు కాసేపు ఆగటంతో.. సదరు యువతి స్టేషన్లో ఉన్న షాప్‌లో స్నాక్స్ కొనుగోలు చేయడానికి దిగారు. కొనుగోలు చేస్తున్న సమయంలోనే రైలు కదటం గమనించిన యువతి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా రైలు, ప్లాట్ఫారం మధ్య పడిపోయారు. ప్రయాణికులు, రైల్వే పోలీసులు, క్యాటరింగ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించడంతో ఆమెను రక్షించేందుకు రైలును నిలిపివేశారు. ఆ యువతికి స్వల్ప గాయాలకు అవ్వటంతో.. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే అధికారులు.. ఆమె మరోక రైలులో ఎక్కించి మంగళూరుకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.கேரளா, கண்ணூர் ரயில் நிலையத்தில் ஓடும் ரயிலில் ஏற முயன்றபோது தடுமாறி நடைமேடைக்கும் ரயிலுக்கும் இடையில் விழுந்த இளம் பெண். உடனடியாக ரயில் நிறுத்தப்பட்டு பத்திரமாக மீட்டனர். Platform க்கும் train க்கும் இடைவெளி அதிகமா இருந்ததால் சிறு காயங்களுடன் அந்த பெண் உயிர் தப்பினார் pic.twitter.com/Qb7bVUHOBb— admin media (@adminmedia1) November 4, 2024 -
‘బ్రిటిష్ హైకమిషనర్’గా 19 ఏళ్ల అమ్మాయి..!
19 సంవత్సరాల గౌతమ్ నిధి బ్రిటిష్ హైకమిషనర్ హోదాలో గంభీరంగా ఉపన్యసించింది. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. శాస్త్రవేత్తల నుంచి నవీన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఇది సరే, 19 సంవత్సరాల అమ్మాయి ‘బ్రిటిష్ హైకమిషనర్’ ఏమిటి! అని ఆశ్చర్య΄ోతున్నారా... అవును... ఇది అక్షరాల నిజం... అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ కోసం దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన అమ్మాయిల నుంచి 140 అప్లికేషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం కర్ణాటకకు చెందిన గౌతమ్ నిధి(19) ‘భారత్‌లో ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్’గా ఎంపికైంది. గౌతమ్ నిధి ఢిల్లీలోని మిరాండ హౌజ్ కాలేజీలో హిస్టరీ, జాగ్రఫీలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది. స్కెచ్చింగ్, పద సంపద, సాంస్కృతిక దౌత్యం, విదేశాంగ విధానాలపై గౌతమ్‌కు ఆసక్తి. బ్రిటిష్ హైకమిషనర్‌గా గౌతమ్ నిధి ఒకరోజంతా తీరికలేనంత కార్యక్రమాలతో గడిపింది.యూకే–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల వివరాల గురించి మాట్లాడడం ద్వారా ఆమె తొలి కార్యక్రమం మొదలైంది. దిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ని, సందర్శించిన గౌతమ్ దివ్యాంగులకు ఉపకరించే కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఆ తరువాత ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ’కి వెళ్లి మన దేశంలో వ్యాక్సిన్ల అభివృద్ధికి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంది. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో రోజాంతా అనేక సమావేశాలు నిర్వహించింది.‘బ్రిటిష్ హైకమిషనర్ ఫర్ ఏ డే’గా ఉండడం మరచిపోలేని అద్భుతమైన జ్ఞాపకం. సోలార్ ఎనర్జీ నుంచి బయోటెక్నాలజీ వరకు సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన చేసుకునే అదృష్టం దక్కింది. సామాజిక ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అంటుంది గౌతమ్ నిధి. ‘ఈరోజు నిధి నుండి నేర్చుకోవడం అద్భుతంగా ఉంది. యూకే–ఇండియాలలోని నవీన సాంకేతిక పరిజ్ఞానం నుంచి గ్లోబల్ చాలెంజ్‌లను స్వీకరించి దూసుకెళుతున్న యువతుల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం’ అంటుంది మన దేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్.(చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..) -
పారిస్ ఒలింపిక్స్‌లో.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్టు! ఎంతంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన స్కేట్ బోర్డర్ జెంగ్ హావోహావో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. జెంగ్ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడు సంవత్సరాల వయసులో స్కేట్ బోర్డింగ్ మొదలు పెట్టింది. 2022లో గ్వాంగ్డాంగ్ ్రపావిన్షియల్ గేమ్స్‌లో పార్క్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లో జెంగ్ విజేతగా నిలిచింది. ‘వేగంగా నేర్చుకొని తనదైన శైలిలో ప్రతిభ ప్రదర్శించడం జెంగ్ సొంతం’ అంటున్నాడు జెంగ్ కోచ్. సరదాగా మొదలు పెట్టిన స్కేట్బోర్డింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జెంగ్‌కు పేరు తీసుకువచ్చింది. -
తండ్రి స్నాప్‌చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
ఈ మధ్య కాలంలో యువత ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనియ్యలేదని, స్నేహితులు అల్లరి చేశారని.. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన ఫోన్లో స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంది. ఇది చూసిన ఆమె తండ్రి ఆమెను సున్నితంగా స్నాప్‌చాట్‌ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...!
పాన్‌గల్: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం చెందిన గడ్డం బాలపీరు(29) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఇంటి నుంచి విధుల నిమిత్తం బైక్‌పై వనపర్తికి బయలుదేరాడు. అన్నారంతండా సమీపంలో శివారెడ్డి వ్యవసాయ పొలం వద్ద వనపర్తి నుంచి పాన్‌గల్ వైపు వస్తున్నా వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి బాలపీరు రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాతిపై పడటంతో తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపి మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరిగెల కృష్ణయ్యపై తగు చర్యలు తీసుకొవాలని మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మందలించారనివిద్యార్థిని ఆత్మహత్య అమరచింత: స్నేహితుల ఎదుట మందలించారని మనస్థాపానికి గురైన విద్యార్థిని ప్రణవి(14) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన నరేష్ కుతూరు ప్రణవి 8వ తరగతి చదువుతుంది. గురువారం ప్రణవిని అవ్వ స్నేహితుల ఎదుట తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. ఇది చదవండి: షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.! -
‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్ యువతి బైక్ రైడ్ వీడియో వైరల్
శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక, కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL — Nusrat Fatima (@knusrata) August 4, 2023 మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB — Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023 ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి -
ప్లీజ్ మోదీజీ మా బాధ వినండి.. కథువా బాలిక ఆవేదన
ప్లీజ్ మోదీ జీ.. మా కోసం ఒక మంచి స్కూల్ భవనం కట్టించండి.. అంటూ ఓ చిన్నారి ప్రధానిని కోరింది. తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల సరిగా లేవని ఆవేదక వ్యక్తం చేసింది. తాము సరిగా చదువుకోలేకపోతున్నామని ఫేస్బుక్ ద్వారా తన విన్నపాన్ని ప్రధాని మోదీకి వినిపించింది. తన స్కూల్ దుస్థితిని వీడియోలో పంపించింది. వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు వీడియోలో తెలిపింది. ఆ తర్వాత తాను చదువుతున్న స్కూల్ కాంపౌండ్‌లో నడుస్తూ పాఠశాల పరిస్థితిని వివరించింది. ‘ప్లీజ్ మోదీ జీ’ మా కోసం కొత్త భవన్నాని నిర్మించండి అని వేడుకుంది. తన పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి అని కోరింది. అనంతరం, ఫోన్ కెమెరాను తలుపులు మూసివున్న ఓ గది ముందు ఉంచి..‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’ అని వివరించింది. ఇదే సమయంలో స్కూల్లోని ఫ్లోర్లింగ్ చూపిస్తూ చూడండి మోదీజీ.. ఎంత మురికిగా ఉందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపైనే మమ్మల్ని కూర్చోబెడతారు అంటూ తరగతి గదులను చూపించింది. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ మాసిపోతున్నాయి. మా డ్రెస్సులు మురికిగా ఉన్నాయని మా అమ్మలు తరచూ మమ్మల్ని తిడతారు. మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు అంటూ ఆవేదన చెందింది. ఇదే సమయంలో మా పాఠశాల భవవాన్ని చూపిస్తాను అంటూ ముందుకు సాగింది. గత ఐదేళ్లుగా భవనం ఎంత అపరిశుభ్రంగా ఉందో చూడండి అని కోరింది. మొదటి అంతస్తులోకి వెళ్లిన ఆ చిన్నారి.. అక్కడ పరిస్థితి వివరిస్తూ ప్లీజ్ మోదీజీ.. మా పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా కోరిక తీర్చండి అని కోరింది. అనంతరం కిందకు దిగి.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లి విరిగిపోయి ఉన్న టాయ్‌లెట్‌ను చూపించింది. అలాగే, పాఠశాలలో సౌకర్యాలను ప్రత్యక్షంగా చూపించింది. బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులు ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారో తెలిపింది. ఇక చివరగా మోదీజీ మీరు దేశం మొత్తం చెప్పేది వినండి.. దయచేసి నా మాట కూడా వినండి.. మాకు మంచి పాఠశాలను నిర్మించండి.. నేలపై కూర్చోవాల్సిన అవసరం లేని విధంగా పాఠశాల ఉండాలి. దీంతో, మేమంతా బాగా చదువుకుంటాం. దయచేసి మా కోసం ఒక చక్కని పాఠశాలను నిర్మించండి అని కోరింది. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
దోస్తులతో ఆడిపాడి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నిద్రలోకి వెళ్లి..
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. బోడతండాకు చెందిన బోడ లక్పతి–వసంత దంపతుల రెండోకూతురు స్రవంతి(13) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. శ్రీ రామనవమి సెలవు ఉండటంతో గురువారం సాయంత్రం వరకు ఇంటివద్ద తోటిపిల్లలతో కలిసి ఆటలాడుకుంది. తండాకు కొంతదూరంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి వద్ద రాత్రి నిద్రించేందుకు తల్లిదండ్రులు వెళ్లగా బాలిక తన నానమ్మతో కలిసి పాత ఇంటి వద్ద నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్రలేచి ఛాతీలో నొప్పి గా ఉందని నానమ్మకు చెప్పింది. తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళ్లి వచ్చి పడుకుంది. కొంతసేపటికి బాలిక బాగా ఆయాస పడుతున్నట్లుగా నానమ్మ గుర్తించింది. బాలిక బాబాయి వచ్చి సీపీఆర్ చేసి వెంటనే మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతిచెందినట్లు చెప్పారు. కూతురు బతుకుతుందన్న ఆశతో తల్లిదండ్రులు ఖమ్మంలోని మరో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చనిపోయిందని నిర్ధారించారు. స్రవంతి అకాలమృతితో బోడతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’
తన భవిష్యత్తు కలలను విధి చిదిమేసింది. తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నారిని ఛాతినొప్పి రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, చివరి నిమిషాల్లో ఆమె మాటలు అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి. వివరాల ప్రకారం.. జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత(13). ఆమె ప్రస్తుతం ఎనిమదో తరగతి చదువుతోంది. నవనీత పేరెంట్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన నవనీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. క్లాస్‌లో ఉన్న సమయంలోనే ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆమెను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డాక్టర్లు నవనీతకు ప్రాథమిక వైద్యం అందించారు. చికిత్స సందర్భంగా చిన్నారి గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు తమ కుమార్తెను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవనీత శనివారం రాత్రి చనిపోయింది. దీంతో, ఆమె పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామని ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నీలోఫర్‌లో నవనీత చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నవనీత మాట్లాడుతూ..‘నాన్న అమ్మని బాగా చూసుకో.. అమ్మను కొట్టకు.. తిట్టకు. నేనింక బ్రతకను.. చనిపోతున్నాను. నా గురించి మర్చిపోండి’ అని కన్నీరుపెట్టుకుంది. ఆమె మాటలకు తండ్రి ధైర్యం చెబుతూ.. నీకేం కాదమ్మా.. అలా అనొద్దు అని చెబుతూనే కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. -
నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్లో జరిమానా!
ఇటీవల కొంతమంది సోషల్‌మీడియా వినియోగదారులు మంచి మంచి వీడియోలతో రాత్రికి రాత్రి మంచి స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. ఆ క్రమంలో వాళ్లు చేసే పిచ్చి స్టంట్లు వారిని ఇబ్బందిపాలు చేయడం లేక కటకటాల పాలుచేయడమో! జరుగుతోంది. అచ్చం అలాంటి పనే ఇక్కడొక యువతి చేసి భారీ జరిమానాను ఎదుర్కొంటోంది. ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫేమ్ ఉన్న ఆ యువతి ఒక వీడియో కోసం అని ఒక పిచ్చి స్టంట్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియోని చూసిన పోలీసులు ఆమెకు భారీగా జరిమాన విధించడమే గాక లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఆమె కారుని హైవే మధ్యలో ఆపి హిరోయిన్ రేంజ్లో ఫోజులు కొడుతున్న ఓ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ చేసింది. ఐతే నెట్టింట వైరల్ అవుతున్న ఆవీడియోని చూసి ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పోలీసలు సదరు మహిళను ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫాలోవర్స్ ఉన్న వైశాలి చౌదరి ఖుటైల్గా గుర్తించారు. అంతేగాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా రూ. 17 వేలు జరిమానా విధిస్తూ గట్టి షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఈ మేరకు సాహిబాద్ ఏసీపీ ట్విట్టర్ వేదికగా ఠాణా సాహిబాద్ ప్రాంతంలో ఒక యువతి కారుని నడిరోడ్డుపై ఆపి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకుగానూ రూ.17 వేలు జరిమాన విధిస్తున్నట్లు చలానా పంపినట్లు తెలిపారు. అంతేగాదు ఇందుకు గాను ఆ యువతిపై తాము న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఏసిపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Vish ♥️ (@vaishali_chaudhary_khutail) (చదవండి: ఆ స్కూల్లో ఒకే ఒక్కడు స్టూడెంట్!) -
ఆదిభట్ల పీఎస్ పరిధిలో యువతి కిడ్నాప్ కలకలం
-
పెళ్ళి విషయమై ప్రేమికుల మధ్య ఘర్షణ.. యువకుడిపై బ్లేడుతో యువతి దాడి
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ యత్నాలు చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మీసౌమ్య కూడా అదే రోడ్డులోని ఓ మహిళా హాస్టల్లో ఉంటూ ఉద్యోగ వేటలోనే ఉంది. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న టీ స్టాల్ వద్ద మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఇక ఈమధ్యనే తాను ప్రేమిస్తున్నాను, వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పిన అశోక్ ఆమె ఖర్చులు కూడా భరిస్తూ వస్తున్నాడు. కాగా ఈ నెల 5వ తేదీన టీస్టాల్ వద్ద ఇద్దరూ కలిసిన సమయంలో అశోక్ పెళ్లి ప్రస్తావన తేగా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీ సౌమ్య తన దగ్గర ఉన్న బేడు (మినీ కట్టర్)తో అతనిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్ ఎడమ చెంప నుంచి చెవి వరకు తీవ్రగాయమైంది. పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదునైన బ్లేడ్ (మినీ కట్టర్)తో బలంగా దాడి చేయడంతో అశోక్ చెంపపై భాగంలో లోతైన గాయమైంది. 50 కుట్లు పడ్డాయి. నరాలు తెగిపోవడం వల్ల దవడ భాగంలో కొంతమేరకు పెరాలసిస్ వచ్చిందని, అధికంగా రక్తస్రావం కావడంతో రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. చదవండి: (కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు) -
హైదరాబాద్‌లో దారుణం.. రెచ్చిపోయిన మృగాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణం జరిగింది. కొందరు దుండగులు లెనిన్‌నగర్‌లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన నవంబర్ 5వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడియత్నం చేశారు. కాగా, లెనిన్‌నగర్‌కు చెందిన బాధితురాలు.. తన రాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం, బైక్‌పై ఎక్కించుకుని బడంగ్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాల వెనుకకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడియత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల రాకను గమినించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, లైంగికయత్నంలో నిందితులు.. బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. తమ గురించి ఎవరికైని చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఛీ ఏం మనుషులు! చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంటే ఫోటోలా!
లక్నో: ఒక యువతి తీవ్రగాయలపాలై నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్‌లో చోటు చేసుకుంది. ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన కొద్ది గంటల్లోనే తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఆ 13 ఏళ్ల బాధిత యువతికి తలతో సహ ఒంటిపై పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒకవైపు నుంచి సాయంచేయమంటూ అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుంది. కానీ అక్కడ ఉన్న స్థానికులంతా ఆమె చుట్టూ చేరి సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసే బిజీలో ఉన్నారు. ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ కున్వార్ అనుపమ్ సింగ్ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమెపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. (చదవండి: వాతావరణ కార్యకర్తకు షాక్..! ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా మొబైల్ కొట్టేసిన స్నాచర్) -
యూనివర్సిటీలో యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ స్ట్రాంగ్ వార్నింగ్
ఒక ప్రైవేట్ యునివర్సిటీ కార్యక్రమంలో యువతీ చేసిన నృత్యం వివాదాస్పదమైంది. దీంతో సదరు యూనివర్సిటీకి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాక్‌లో పెషావర్‌లోని ఎన్ఎస్ యూనివర్సిటీలో హునార్ మేళ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ వేడుకల్లో దాదాపు 13 కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఒక యువతి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటి కార్యక్రమాలకు దేశానికి అవసరమా అంటూ మండిపడతూ ట్వీట్ చేశారు. సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాక్ ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ(కేఎంయూ) ఈ విషయమై సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో సదరు యువతి బిగుతుగా ఉండే డ్రస్ వేసుకుని వేదికపై డ్యాన్స్‌లు చేయడం వల్లే వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు ఖైబర్ మెడికల్ యూనిర్సిటీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అనేతికం, అసాంఘీకం అంటూ మండిపడుతూ చివాట్లు పెట్టింది. అంతేగాదు ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు యూనివర్సిటి ఎన్ఎస్సీ డైరెక్టర్‌కి నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యక్రమాలను కేఎంయూ లోగో పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు నైతిక విలువలతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ పవిత్రతను కాపాడుకోవాలని మందలించింది. అవసరమనుకుంటే సదరు ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. pic.twitter.com/FhjROmiJbW — Sami (@Pediatric__OT) October 20, 2022 Pakistan: Khyber Medical University issues notice to NCS University System, Peshawar, warns of de-affiliation after this dance video from NCS goes viral 🤩 pic.twitter.com/MYd5P57gyN — Sonam Mahajan (@AsYouNotWish) October 21, 2022 (చదవండి: చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన...హఠాత్తుగా నిష్క్రమించిన జుంటావో) -
అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి.. ఫొటోలు, వీడియోలు తీసి..
కడప అర్బన్: బాలికపై సామూహిక అత్యాచారం చేసి వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గోపవరం మండలం రాచాయపేటకు చెందిన ఓ బాలిక మూడు నెలల క్రితం నేరేడుపళ్ల కోసం కొండ ప్రాంతానికి వెళ్లింది. అయితే అదే సమయంలో అక్కడున్న బాలురు ఆమెపై అత్యాచారం చేశారు. ఫొటోలు, వీడియో కూడా తీశారు. కాగా, మూడు రోజుల క్రితం ఈ ఫొటోలు, వీడియోలు బహిర్గతమయ్యాయి. దీంతో, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నలుగురు మైనర్లపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసును బద్వేల్ రూరల్ పోలీసులు నమోదు చేశారు. 14వ తేదీన నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కడపలోని జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఎవరైనా గుర్తిస్తే డయల్ 100 లేదా తన ఫోన్ నంబర్ 94407 96900 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సాక్షి, అమరావతి: మగపిల్లల నడవడికపై తల్లిదండ్రుల నిఘా లోపిస్తే విద్యార్థి దశలో నేరాలకు పాల్పడే ప్రమాదముందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. గోపవరం మండలం రాచాయపేటలో వెలుగుచూసిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై ఆమె శనివారం స్పందించారు. కడప జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో మైనర్లు నేరానికి పాల్పడటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం, అశ్లీల వీడియోలు బయట పెట్టడం తదితర అంశాలు తీవ్రంగా మనసును కలచివేశాయన్నారు. క్రమశిక్షణ కొరవడటం, సెల్ ఫోన్ల వినియోగంతో ఇష్టారీతిగా ప్రవర్తించడం జీవితాలపై ప్రభావం చూపుతుందని వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఇంటి వాతావరణంలో పిల్లలకు మంచి అలవాట్లు, సంస్కారాన్ని నేర్పే కౌన్సెలింగ్ అవసరమన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : మైనర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడటం విచారకరమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి అన్నారు. బాధితురాలి ఆరోగ్యంపై స్థానిక ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. బాలిక మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. -
Viral Video: భావోద్వేగ దృశ్యం.. రాహుల్‌ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి
-
భావోద్వేగ దృశ్యం.. రాహుల్‌ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే 18వ రోజు బుధవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ వందలాది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేరళలో పర్యటిస్తున్నారు. ఆయన పాదయాత్ర కేరళలోని పండిక్కాడ్ స్కూల్ పాడి నుంచి ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటలకు వండూరు జంక్షన్లో విరామం కోసం ఆగారు. సరిగ్గా ఆ పాదయాత్రలోని ఒక యువతి రాహుల్‌ని కలిసి ఆనందంతో చిన్నపిల్ల మాదిరిగా గెంతులేసింది. ఆమెకు రాహుల్‌ని కలిశానన్నా అవధులు లేని ఆనందం తోపాటు ఏడుపు కూడా వచ్చేసింది. ఆమె రాహుల్‌ని చూసి భావోద్వేగంతో ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఆ యాత్రలో పాల్గొన్న వాళ్లంతా ఆ యవతిని చర్యలను చూసి ఆశ్చర్యంతో నవ్వుతుండగా..రాహుల్ ఆ యువతని ఎగ్జాయిట్‌మెంట్‌ని కంట్రోల్ చేస్తూ.. దగ్గరకు తీసుకుని సముదాయించారు. వాస్తవానికి ఇలా పాప్ సింగర్స్ లేదా హిరో/ హిరోయిన్లు వచ్చినప్పుడూ అభిమానులు ఇలా ప్రవర్తిస్తుంటారు. కానీ అలాంటి క్రేజీ ఫీలింగ్ రాహుల్‌గాంధీకి ఈ పాదయాత్రలో ఎదురవ్వడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఆయన కేరళ పాదయాత్ర ఈ రోజు సాయంత్రాని కల్లా వాయనాడ్ నియోజకవర్గంలోకి ఎంట్రీ అవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ, కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ తెలిపారు. దాదాపు 3.750 కి.మీల సుదీర్ఘ 150 రోజుల పాదయాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమై జమ్ము కాశ్మీర్‌తో ముగియనుంది. అలాగే సెప్టంబర్ 10కి కేరళలో ప్రవేశించిన కాంగ్రెస్ జోడో పాదయాత్ర 450 కి.మీ దూరం సాగించి...సుమారు ఏడు రాష్ట్రాలను చుట్టి... అక్టోబర్ 1 కల్లా కర్ణాటకలోకి ఎంట్రీ ఇవ్వనుందని జై రాం రమేష్ తెలిపారు. (చదవండి: కాంగ్రెస్‌కు విజన్ లేదు.. గెలిచేంత సీన్ లేదు.. ‘హస్తం’ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్) -
రెచ్చగొడితే ఇలాగే ఉంటంది.. పట్టపగలే చుక్కలు చూపించింది
కొన్నిసార్లు మనుషులు చేసే చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో జంతువులను కవ్విస్తే అవి దాడి చేసిన వీడియోలు చూసే ఉంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా జూకు వెళ్తే.. కొన్ని జంతువులను దూరం నుంచి చూడాలని హెచ్చరిస్తుంటారు. అయినా కొంత మంది వినిపించుకోకుండా అతి చేస్తారు. దీంతో జంతువులు తిరగబడి గాయపరుస్తాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు సైతం పోయే పరిస్థితి రావచ్చు. తాజాగా ఓ యువతి.. బోనులో ఉన్న కోతిని రెచ్చిగొట్టింది. దీంతో తగిన మూల్యం చెల్లించుకుంది. వీడియోలో.. యువతి బోనులో ఉన్న కోతిని ఓ యువతి డిస్టర్బ్ చేస్తుంది. దీంతో, కోతి తీవ్ర ఆగ్రహంతో వెంటనే బోనులో జాలీ నుంచి తన చేతితో అమ్మాయి జుట్టును పట్టుకుంది. యువతి మోత్తుకున్న జుట్టుని మాత్రం వదల్లేదు. కోతి చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి అమ్మాయి ఎంతో శ్రమించింది. చివరకు పక్కనే ఉన్న కొంతమంది వచ్చి కోతిని భయపెట్టడంతో జట్టుని వదిలేసింది. దీంతో, ఆమె అక్కడి నుంచి జారుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
అనంతపురంలో యువతి కిడ్నాప్.. గంటలోనే ఛేదించిన పోలీసులు
-
మిస్టర్ క్రూయెల్.. 10 నుంచి 15 ఏళ్ల అమ్మాయిలు మాత్రమే టార్గెట్
ఉన్మాదపు కోరల్లో చిక్కి, అన్యాయంగా ముగిసిన జీవితాలను చదివినప్పుడు.. అప్రయత్నంగానే కళ్లు చెమరుస్తాయి. ఏళ్లు గడిచినా.. నాటి ఆక్రందనలు నేటికీ.. నిస్సహాయస్వరంతో స్పష్టంగా వినిపిస్తాయి. కొన్ని ఛాయాచిత్రాలు వాటిని కళ్లకు కడుతుంటాయి. ఆస్ట్రేలియన్ విషాదగాథల్లో ఒకటైన కార్మీన్ చాన్ అనే 13 ఏళ్ల అమ్మాయి కథ అలాంటిదే. అది 1991 ఏప్రిల్ 13. అర్ధరాత్రి కావస్తోంది.. రాత్రి అయితే చాలు.. పది నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలున్న కుటుంబానికి నిద్ర కరువయ్యే రోజులవి. ఆస్ట్రేలియా, టెంపుల్స్టోవ్లోని ఓ ఇంట్లో అలికిడి మొదలైంది. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ నుంచి లోపలికి చొరబడ్డాడు. ఆ రోజు ఆ ఇంట్లో జాన్ చాన్, ఫిలిస్ చాన్ దంపతులు.. వారి ముగ్గురు ఆడపిల్లలు నిద్రిస్తున్నారు. నిశబ్దంగా బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన ఆ ఆగంతుకుడు.. కావాలనే అలికిడి చేశాడు. ఉలిక్కిపడి లేచిన వాళ్లపై తుపాకీ గురిపెట్టాడు. క్షణాల్లో అందరినీ రాగి తీగలతో కట్టి బంధించాడు. ముగ్గురిలో ఒక బాలికను ఎత్తుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ అమ్మాయి పేరే కార్మీన్ చాన్. కార్మీన్ తల్లి, సోదరీమణులు రోజులు గడుస్తున్నాయి. కార్మీన్ చాన్ ఆచూకీ మాత్రం దొరకలేదు. కార్మీన్ ఫొటోలతో పోస్టర్లు, రివార్డులు అంటూ గాలింపు తీవ్రమైంది. బాలికని ఎత్తుకుని వెళ్లినవాడు మీడియాకి, పోలీసులకి ముసుగు వ్యక్తిగా, ఆస్ట్రేలియన్ బూగీమ్యాన్ (boogeyman)గా సుపరిచితుడే. అప్పటికే అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయి. పత్రికల్లో, టీవీల్లో.. అప్పటికే అతడిపై ఎన్నో కథనాలు వచ్చాయి. దాంతో ‘నా బిడ్డను దయచేసి విడిచిపెట్టు’ అంటూ మీడియా సమక్షంలో కార్మీన్ తల్లి ఫిలిస్ చాన్.. బూగీమ్యాన్ని ప్రాధేయపడింది. ఆ రోజు ఆ తల్లి ఏడ్చిన ఏడుపు చూస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. అప్పుడు ఆమెకు చాలా మంది ఒకే మాట చెప్పారు.. ‘బూగీమ్యాన్ తప్పకుండా నీ బిడ్డను విడిచిపెట్టేస్తాడు.. ఎందుకంటే గతంలో ఎంతో మంది పిల్లల్ని అలానే వదిలిపెట్టాడు కదా’ అంటూ జరిగిన కథలను గుర్తుచేశారు. సరిగ్గా ఏడాది తర్వాత.. 1992 ఏప్రిల్ 9న.. థామస్టౌన్, పల్లపు ప్రాంతంలోని డంపింగ్ యార్డులో కుళ్లిన దేహాన్ని కుక్కలు పీకుతుంటే.. కొందరు గుర్తించారు. అది కార్మీన్ మృతదేహమని పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు తేల్చాయి. ఫిలిస్ చాన్ రోదనలు మిన్నంటాయి. ఏ ఒక్కరూ ఆమెని ఓదార్చలేకపోయారు. కార్మీన్ సమాధి వద్ద మిగిలిన ఇద్దరు ఆడపిల్లలతో.. కూలబడి ఏడ్చే ఫొటో నాటి విషాదాన్ని కళ్లకు కడుతుంది. కార్మిన్ తలపై మూడుసార్లు కాల్చినట్లు తేలింది. కానీ ఆ క్రూరుడు మాత్రం దొరకలేదు. నాటి నుంచి ఆ ఆగంతుకుడికి మిస్టర్ క్రూయెల్ అని పేరు పెట్టింది మీడియా. మిస్టర్ క్రూయెల్పైన 1987 ఆగస్ట్ 22న మెల్బోర్న్ ఈశాన్య శివార్లలోని లోయర్ ప్లెంటీలోని ఒక ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి, లైంగికదాడి చేసినట్లు తొలిసారి కేసు నమోదైంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలికను విడిచిపెట్టేశాడు. అయితే అతడి చేతిలో కత్తితో పాటు, ముఖానికి నల్ల ముసుగు ఉందని ఆ బాధితురాలు చెప్పింది. దాంతో అప్పట్లో పోలీసులు అతడ్ని పట్టుకోలేకపోయారు. గతంలో అతడు వృద్ధ సన్యాసినులపై లైంగికదాడులకు పాల్పడినట్లూ పలు కేసులున్నాయి. కార్మీన్ తల్లిదండ్రులు 1988, డిసెంబర్లో ఈస్ట్ రింగ్వుడ్లో నివసిస్తున్న 10 ఏళ్ల బాలికను మిస్టర్ క్రూయెల్ అపహరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్లిన చిన్నారి చీకటిపడినా ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 18 గంటల తర్వాత ఆ చిన్నారి ఆచూకీ లభించింది. అయితే, నిందితుడు అప్పటికే జారుకున్నాడు. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది రోజుల్లోనే మిస్టర్ క్రూయెల్ మరో బాలికను అపహరించాడు. క్యాంట్బ్యరీలో నివసిస్తున్న 13 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన మిస్టర్ క్రూయెల్.. రెండు రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. సుమారు 50 గంటల తర్వాత ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టిన మిస్టర్ క్రూయెల్.. కార్మీన్ని చంపడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించి ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బహుశా కార్మీన్ అతడి ముఖం చూసి ఉంటుంది.. గుర్తు పడుతుందనే భయంతోనే కార్మీన్ని చంపేసి ఉంటాడు అనే అంచనాకు వచ్చారు చాలామంది. మొత్తానికి ఎందరో ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిన మిస్టర్ క్రూయెల్ ఎవరు అన్నది నేటికీ తేలలేదు. ఎందరో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు కానీ ఫలితం లేదు. అసలు ఈ మిస్టర్ క్రూయెల్ ఎవరు? అంత ధైర్యంగా ఇళ్లల్లోకి జొరబడి పిల్లల్ని ఎత్తుకుని వెళ్లే సాహసం ఎలా చేయగలిగాడు? అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అసలు ఆ ముసుగు మనిషి ఒక్కడేనా? లేక ఒక ముఠాసభ్యులంతా ఇలా ముసుగులేసుకుని నేరాలకు పాల్పడేవారా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
యువతి అదృశ్యం.. కుబుంబసభ్యుల ఆందోళన
సాక్షి, చిత్తూరు అర్బన్: యువతి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేటకు చెందిన హర్షిణి(19) బంగారుపాళ్యం వద్ద ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ చిత్తూరు గాంధీరోడ్డులోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. అయితే బుధవారం ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుబుంబసభ్యులు ఆందోళన చెందారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ తెలిస్తే డయల్ –100, 9491074517 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. చదవండి: (ఇంటి నుంచి బయటకెళ్లి.. ఇద్దరు వివాహితల అదృశ్యం) -
వాష్ రూమ్‌కని వెళ్లి బాలిక, యువతి పరార్
సాక్షి, వరంగల్: వరంగల్ కాశిబుగ్గలోని స్వధార్ హోం నుంచి వేర్వేరుగా ఒక బాలిక, ఒక యువతి పరారయ్యారు. ఈ ఘటనపై హోం నిర్వహకులు వనం బాలరాజు ఆదివారం ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలం గొల్లకొండకు చెందిన భూక్య భానుశ్రీ(15), హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం వంగపహడ్‌కు చెందిన ముస్కు మీనా(22) గత కొద్ది రోజులుగా కాశిబుగ్గలోని స్వధార్ హోంలో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భాను శ్రీ వాష్ రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి హోంలోని పై రూమ్‌కి వెళ్లింది. చదవండి: కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు.. ఎక్కడికక్కడ ఎత్తేస్తారిక! చాలా సేపయ్యినా కిందకు రాకపోవడంతో హోం వాచ్ ఉమెన్ పైకి వెళ్లి చూసినా కనిపించలేదు. అలాగే శనివారం రాత్రి ముస్కు మీనా కూడా వాష్ రూమ్‌కి వెళ్తున్నాని చెప్పి పైకి వెళ్లింది. తను కూడా తిరిగి రాకపోవడంతో వాచ్ ఉమెన్ వెళ్లి పరిశీలించగా.. ఆమె కనపడలేదు. హోమ్ నిర్వహకులు పరిసర ప్రాంతాలు వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. చదవండి: మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను -
టీడీపీ నేత వినోద్ జైన్ అఘాయిత్యానికి నిరసనగా ర్యాలీలు
సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అఘాయిత్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది.టీడీపీ నేత వినోద్ జైన్ అఘాయిత్యానికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మేయర్ భాగ్యలక్ష్మీ, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కొందరు.. బాలికలు, మహిళలపై టీడీపీ నాయకులు అరాచకాలు నశించాలని ప్లకార్డు పట్టుకుని తమ నిరసనను తెలియజేశారు. -
‘టీడీపీ నేతలు మహిళలపై అకృత్యాలు చేయడం మానలేదు’
సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య చాలా బాధాకరమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని మనం ఎన్ని చట్టాలు చేసినా, కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పడడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ఇటీవల సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దీనికి కారణమైన టీడీపీ కార్పొరేటర్ విజయ జైన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ నేతలు గతంలోనూ, ఇప్పుడు మహిళలపై అకృత్యాలు చేయడం మానలేదుని మండిపడ్డారు. మొన్న లోకేష్ అనుచరుడు, నేడు కేశినేని నాని అనుచరుడు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. స్త్రీని ఆట బొమ్మగా ఆడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం జగన్‌ని వేలెత్తి అర్హత లేదని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్త్రీల పట్ల అనేక చట్టాలు చేస్తూ మహిళా సంక్షేమం కోసం 1800 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. -
‘బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’
విజయవాడ: బాలిక ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత వినోద్ జైన్ పాపను ఇబ్బందులకు గురి చేసాడని, అతని వేధింపుల వల్లే పాప ఎంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. బాలిక మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంత వేదనకు గురైందో అర్ధం చేసుకోవచ్చని, పాప తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ ) నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. వినోద్ జైన్.. కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు , ఇప్పుడు ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాపకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రి మార్చురీకి చేరుకున్న మంత్రి వెల్లంపల్లి పోస్టుమార్టం ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. అనంతరం బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని ఒక అపార్ట్మెంట్ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంజి సర్కిల్ వద్దగల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దీక్షిత గౌరి టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో.. వినోద్ జైన్‌ను తనను ఎలా ఇబ్బంది పెట్టాడో బాలిక సూసైడ్ నోట్లో రాసింది. ఈ ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 37వ డివిజన్ కార్పొరేటర్‌గా టీడీపీ తరపున పోటీ చేసిన వినోద్ జైన్ చంద్రబాబు సహా పలువురు కీలక నేతలతో సత్ససంబంధాలు కలిగి ఉన్నారు. చదవండి: (మామను మందలించిన అల్లుడు.. నవ వధువు ఆత్మహత్య) -
కమర్షియల్ పైలట్‌గా ఎంపికైన కరీంనగర్ విద్యార్థిని.. రూ.4 లక్షల కోసం..
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పేదింటిలో పుట్టినా తన చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది.. డిగ్రీ పైనలియర్ చదువుతూనే పైలట్ కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది.. కాంపిటీటివ్ పరీక్ష రాసి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. కానీ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది కేశవాపూర్‌కు చెందిన పాతకాల స్పందన. వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల సదయ్య–రమ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన వరంగల్‌లోని సోషల్ వెల్ఫేర్ డీగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతూ ఎలాగైనా పైలట్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్ష రాసింది. అందులో సత్తా చాటి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. శిక్షణ కోసం బేగంపేటలోని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చేరింది. కానీ పూర్తి శిక్షణ కోసం రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి, కూలి పని చేసుకునే తన తల్లిదండ్రులకు అంత మొత్తం చెల్లించలేరని ఆవేదన చెందుతోంది. దాతలు స్పందించి, ఆర్థికసాయం చేస్తే పైలటవుతానని వేడుకుంటోంది. -
టైలరింగ్ ట్రైనింగ్కని వెళ్లింది.. కుష్బూ జాడేది..?
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌గంజ్ ఉస్మాన్‌షాహి ప్రాంతానికి చెందిన కుష్బూ కుమారి అశోక్ బజార్‌లోని టైలరింగ్ సెంటర్‌కు ట్రైనింగ్ నిమిత్తం వెళ్లేది. శుక్రవారం టైలరింగ్‌కు వెళ్లిన కుష్బూ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అమ్మమ్మ మందలించిందని..చెన్నైలో అదృశ్యం.. రేణిగుంటలో ప్రత్యక్షం
సాక్షి, రేణిగుంట: అమ్మమ్మ మందలించిందని ఓ మనవరాలు ఇంటి నుంచి అదృశ్యమైంది. ఎక్కడెక్కడో తిరిగి చివరికి రేణిగుంటకు చేరింది. అదృష్టవశాత్తు సీఐ అంజూయాదవ్ దృష్టికి రావడంతో వ్యవహారం సుఖాంతమైంది. కుటుంబ సభ్యుల దరికి చేరింది. శనివారం రాత్రి సీఐ తెలిపిన వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి(18) చెన్నైలో చదువుతోంది. అక్కడే అమ్మమ్మ ఇంటిలో ఉంటోంది. ఆమె తల్లి ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. చదువుల పరంగా వెనుకబడిపోతున్నావని అమ్మమ్మ ఇటీవల మందలించడంతో ఇంటి నుంచి పారిపోయింది. ఈమేరకు చెన్నైలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. చెన్నై నుంచి గుంటూరు ఇతర ప్రాంతాలకు వెళ్లిన యువతి శనివారం రేణిగుంటలో ప్రత్యక్షమైంది. ఆమె అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆటోడ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఆ యువతిని తన వెంట స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒకింత బెరుకు, భయంతో ఉన్న విద్యార్థినికి తొలుత అల్పాహారం తెప్పించి పెట్టారు. ఆ తర్వాత అనునయించి మాట్లాడితే విషయం చెప్పింది. ఇలా చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వచ్చేస్తే కుటుంబ సభ్యులు ఎంతగా టెన్షన్ పడతారో..ఆలోచించావా తల్లీ? అంటూ బుజ్జగించారు. చదవండి: (చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..) కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆ విద్యార్థి వద్ద ఉన్న ఐడీ కార్డును చూసి ఎక్కడ చదువుతోందో తెలుసుకున్నారు. ఆ విద్యార్థిని తల్లి, అమ్మమ్మతో తన ఫోన్ నుంచి మాట్లాడించారు. అంతే! ఉరుకులు పరుగులతో ఆ విద్యార్థిని తల్లి తన కుమారుడితో వచ్చి శనివారం రాత్రి సీఐను కలిసింది. కుమార్తెను చూడగానో భావోద్వేగంతో కదలిపోయింది. అప్పటివరకు పడిన టెన్షన్ ఎగిరిపోయిందేమో..! కళ్ల నుంచి రాలుతున్న ఆనందభాష్పాల నడుమ కుమార్తెను హత్తుకుంది. పోలీసుల మోముల్లో నవ్వులు పూశాయి. -
ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి
పటాన్చెరు టౌన్: విదేశాలకు వెళ్లేందుకు పరీక్ష రాసి డిస్క్వాలిఫై అయ్యింది. దీంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) తన సోదరుడు తేజతో కలసి అమీన్పూర్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీలో ఉంటోంది. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన క్లినికల్ అనాలసిస్ట్‌గా పని చేసే ఆమె కరోనా కారణంగా ఉండడంతో ఇంటివద్ద నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు మూడుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించలేక పోయింది. అప్పటి నుంచి తన స్నేహితులు విదేశాలకు వెళ్లారని, తాను వెళ్లలేకపోయానని సోదరుడికి చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలోనే సింధు బుధవారం తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సోదరుడు తేజ బెడ్‌పై నురగలు కక్కుకుంటూ సింధు పడి ఉండడాన్ని గమనించి వెంటనే చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్ -
బాయ్‌ఫ్రెండ్ కోసం షాపింగ్ మాల్లో తన్నుకున్న యువతులు
పాట్నా: ప్రేమికుడు ముగ్గురు యువతులు పోట్లాడుకున్నారు. ముగ్గురికి ముగ్గురు జట్లు పట్టుకుని కొట్లాడారు. వారి గొడవను వారి ప్రియుడు చూస్తూ నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తిరుగుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మోతిజిల్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో ముగ్గురు యువతులు ఎదురుపడ్డారు. ఆ సమయంలో వారి ప్రియుడు అక్కడే ఉన్నాడు. చదవండి: సీఎం జగన్‌కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్ ఏం జరిగిందో ఏమో గానీ వారు వచ్చి రాగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు చేస్తూ బాహాబాహీకి దిగారు. మరో యువతి వచ్చి కూడా వారిపై దాడి చేసింది. అయితే వారు కొట్టుకుంటున్నా అక్కడే నిలబడ్డ యువకుడు నివారించే ప్రయత్నం చేయలేదు. వారి సిగపట్ల వీడియోను మాల్‌కు వచ్చిన కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఆ అబ్బాయి చాలా లక్కీ!’, ‘మాకు ఒక్కరే దిక్కులేరు నీకు ముగ్గురా బ్రదరూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
రెండేళ్లుగా సంబంధాల కోసం ఎదురుచూపు.. ఎంతకీ కుదరకపోవడంతో
ఇచ్చోడ: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఫరీద్ తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన ఆశాబీ (22) రెండేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ రద్దవుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఆషాబీ మనస్తాపంతో దిగాలుగా ఉంటోంది. ఇక తనకు పెళ్లి కాదేమోనని బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆమెను వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి అబ్దుల్ జాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! చదవండి: కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి -
గుంటూరు దుర్ఘటన ఎంతో దురదృష్టకరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : గుంటూరులో యువతి హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ట్విటర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘ ఈరోజు గుంటూరుజిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈరోజు గుంటూరుజిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2021 -
ప్రేమ మైకంలో యువతి: జీవితానికి ‘దిశ’ చూపిన పోలీసులు
వైఎస్సార్ కడప అర్బన్: ప్రేమ వ్యవహారంలో పడి ఓ యువతి చదువును నిర్లక్ష్యం చేసింది. తాను ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేయాలని పట్టుపట్టింది. మూడు రోజులుగా పస్తులుంటూ మారం చేసింది. ఈ విషయమై ఆ యువతి ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ‘దిశ’ డీఎస్పీ కె. రవికుమార్, మహిళా ఎస్ఐ లక్ష్మీదేవి, సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ యువతికి నచ్చచెప్పి ఇప్పట్లో పెళ్లి ఆలోచన చేయకుండా విరమింపజేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే దిశ సిబ్బంది నేరుగా యువతి నివాసానికి వెళ్లారు. ఆమెతో ఆత్మీయంగా మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ వయసులో చదువుపై శ్రద్ద పెట్టాలని సూచించారు. ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లికి తామే చొరవ తీసుకుంటామని ఆ యువతికి పోలీసు సిబ్బంది హామీ ఇచ్చారు. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఆమెలో మార్పు వచ్చింది. ‘పెళ్లి ఇప్పుడు చేసుకోను.. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటా’ అని పోలీసులకు ఆ యువతి చెప్పింది. తనలో మార్పునకు దోహదం చేసిన ‘దిశ’ సిబ్బందికి, భవిష్యత్తుపై భరోసా కల్పించిన ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు ఫోన్లో ఆ యువతి కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసేలా ఎవరూ ప్రవర్తించరాదని ఈ సందర్భంగా యువతకు ఎస్పీ సూచించారు. ఏమన్న సమస్యలుంటే దిశ పోలీస్‌స్టేషన్ అండగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మహిళలకు తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా తన (94407 96900)కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
వైద్యశాస్త్రంలో వింత: ఓ యువతికి కుడి వైపున గుండె
Right Side Heart Girl: గుండె ఎటు వైపు ఉందని చిన్నపిల్లాడిని అడిగిన ఎడమ వైపు.. లేదా లెఫ్ట్ సైడ్ అని సమాధానం ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ సమాధానం మారేలా ఉంది. ఎందుకంటే ఓ యువతికి ఎడమ వైపున కాకుండా కుడి వైపు గుండె ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయమైనా ఇది వాస్తవం. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్‌కు గురయ్యింది. ఆమె చేసుకున్న పరీక్షల్లో గుండె కుడి వైపున ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన 19 ఏళ్ల యువతి క్లారీ మక్ విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. రెండు నెలల నుంచి దగ్గు వస్తుండడంతో పరీక్షించుకోవాలని ఆస్పత్రికి వెళ్లింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తుండడంతో జలుబు, దగ్గు సాధారణంగా భావించినట్లు క్లారీ తెలిపింది. జూన్‌లో ఆస్పత్రికి వెళ్లి మందులు వేయించుకున్నా తగ్గలేదు. ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య ఉండవచ్చని వైద్యులు భావించారు. తదుపరి వైద్యం కోసం ఎక్స్ రే చేయించుకోవాలని చెప్పారు. ఎక్స్ రే చేసుకున్న అనంతరం రిపోర్ట్‌ను పరిశీలించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. వైద్యులు వచ్చి ‘నీకు గుండె కుడి వైపున ఉంది’ అని చెప్పడంతో తాను గందరగోళానికి గురయ్యానని.. షాక్‌లో ఉన్నట్లు క్లెయిర్ మక్ తెలిపారు. నాకేమన్నా అవుతుందని వైద్యులను అడిగితే ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. గుండె కుడి వైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో ‘డెక్స్ట్రోకార్డియా’ అని అంటారు. ఈ వివరాలన్నీ క్లెయిర్ మక్ టిక్‌టాక్‌లో ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఆమె వీడియోను లక్షల్లో చూశారు. 4,33,00 మంది కామెంట్లు చేశారు. దేవుడి దయతో బాగున్నానని ఆ వీడియోలో తెలిపింది. -
దారుణం: 55 ఏళ్ల వ్యక్తి, ఏడేళ్ల బాలికను మాటల్లో దింపి.. ఆపై
సాక్షి, గీసుకొండ(వరంగల్) : ఏడేళ్ల బాలికపై తాత వయస్సు(55) ఉన్న ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విశ్వనాధపురంలోని సదరు బాలిక తండ్రి గతంలో మృతి చెందగా తల్లితో ఇంటివద్దే ఉంటోంది. సోమవారం సాయంత్రం తాగునీరు తేవడానికి సమీపాన ఉన్న వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లిన బాలికను పసునూరి ఐలయ్య మాటల్లో దింపి చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా.. ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు యువకులు గమనించి బెదిరిండంతో ఐలయ్య పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఐలయ్య ఇంటికి వెళ్లి అతడి కోసం వెతికారు. కనిపించకపోవడంతో ఇంటి తలుపులు పగులగొట్టారు. స్థానికులు 100 నంబర్‌కు డయల్ చేయడంతో మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, మామునూరు సీఐ రమేశ్, గీసుకొండ ఎస్సై బండారి రాజు సిబ్బందితో రాత్రి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గొడవలకు పాల్పడవద్దని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను శాంతింపజేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేశ్‌కుమార్ తెలిపారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చదవండి: Cyber Crime: నేరగాళ్లకు సింహస్వప్నం..కామాక్షిశర్మ.. -
నేరగాళ్లకు సింహస్వప్నం కామాక్షిశర్మ..
లక్నో: ప్రస్తుతం నడుస్తోంది టెక్నాలజీ యుగం. ఈ సాంకేతికతను కొంత మంది తమ అభివృద్దికి, ఆవిష్కరణలకు ఉపయోగిస్తే.. మరికొంత మంది వక్ర మార్గంతో మోసాలకు పాల్పడుతున్నారు. నాణానికి ఇరువైపులా ఉండే, బొమ్మ బొరుసు మాదిరిగానే.. ప్రతి దాంట్లో మంచి చెడులు ఉంటాయి. మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. ఈ మధ్య కొంత మంది కేటుగాళ్లు, సైబర్ క్రైమ్ నేరాలు, ఫోన్లో వేధింపులు, ఆన్లైన్ మోసాలు వంటివి పాల్పడుతున్న సంఘటనలు మనకు తెలిసిందే. అయితే, యూపీకి చెందిన ఒక యువతి ఇదే సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారింది. ఆమె తాజాగా సైబర్ నేరాల మీద 50 వేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చింది. దీంతో, ఆమెను ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చేర్చారు. దీంతో ప్రస్తుతం ఈమె వార్తల్లో నిలిచి అందరి ప్రశంసలను పొందుతోంది. వివరాలు.. ఘజియాబాద్ చెందిన కామాక్షి శర్మ యువతి బీటేక్ చదివింది. ఆమెకు చిన్నతనం నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. తాను బీటేక్ చదివే రోజుల్లో సరదాగా తన మిత్రుల ఫేస్బుక్ ఖాతాల ఐడీలను వారు చెప్పకపోయినా తెలుసుకునేది. అప్పట్లో సరదాగా చేసినప్పడికీ ఇప్పుడు అదే ఆమె వృత్తిగా ఎంచుకుంది. ఈ క్రమంలో ఆమె టెక్నాలజీలో మంచి నైపుణ్యం సాధించింది. 2017లో కళాశాలలో ఉన్నప్పుడు తన మిత్రులు ఎవరైనా.. హ్యాకింగ్ కు గురైనా, వేధింపులు ఎదుర్కొన్నా కామాక్షిని సంప్రదించేవారు. దీంతో ఆమె వెంటనే నేరగాళ్లను కనిపెట్టేసేది. ఈ క్రమంలో.. కామాక్షికి ఘజియాబాద్ పోలీసులతో పరిచయం ఏర్పడింది. ఘజియాబాద్ పోలీసు వారు కొన్ని సెల్‌ఫోన్ చోరీ కేసులలో, ఐపీ అడ్రస్‌ను కనుగొనడంలో కామాక్షి సహకారం అందించింది. దీంతో, పోలీసులు అనేక కేసులను తేలికగా ఛేదించారు. ఈక్రమంలో ఆమె 2019లో సైబర్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మిషన్‌తో ఇప్పటి వరకు జమ్ము-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 30 నగరాలలో సుమారు యూభైవేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. అనేక పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నానని.. భారత సైన్యం కోసం ఫ్రీలాన్సర్‌గా కూడా సేవలందిస్తున్నట్లు వివరించింది. కాగా, ఇప్పటికే తాను ‘ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదిచానని తెలిపింది. అయితే, ప్రపంచ దేశాల్లోని సైబర్ పోలీసులను ఒక ప్లాట్‌ఫాం పైకి తేవాలనేదే తన కోరిక అని చెప్పింది. ఈ ఆన్లైన్ మిషన్ లో ఢిల్లీ ఏసీపీ రాజ్‌పాల్ దాబస్, ఘజియాబాద్ ఇన్స్పెక్టర్ వినోద్ పాండెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపింది. తామంతా.. ఒక టీమ్‌గా ఏర్పడి పాఠశాల స్థాయి నుంచి సైబర్ మోసాల బారినపడకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది. చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
కీచక పోలీసు.. ప్రేమ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ..
సాక్షి, చెన్నై(తమిళనాడు): యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసును ఎస్పీ సస్పెండ్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడి కోసం మహిళా పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరుకు జాక్సన్ 2017లో పోలీసు విధుల్లో చేరాడు. అతనికి పోటీ పరీక్షల పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి తారస పడింది. ఆమె నెంబరు తీసుకుని మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం అతను డీఎంకే యువజన విభాగం నేతకు గన్ మెన్‌గా మారాడు. ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా తనకు ఉద్యోగం పోయిందని, కొంతకాలం వేచి ఉండాలని సూచించాడు. అతడి మోసాన్ని పసిగట్టిన యువతి తిరుచెందూరు మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. రాజకీయ పలుకుబడితో జాక్సన్ తప్పించుకునే యత్నం చేశాడు. ఆమె ఎస్పీ జయకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ జాక్సన్‌ను ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ సమాచారంతో జాక్సన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి కోసం తిరుచెందూరు మహిళా పోలీసులు గాలిస్తున్నారు. కొద్ది రోజులుగా అధిక సంఖ్యలో పోలీసులపై లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడం గమనార్హం. నాగరాజన్‌పై గూండా చట్టం క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన కేసులో అథ్లెటిక్ శిక్షకుడు నాగరాజన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన మీద ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. విదేశాల్లో ఉన్న పూర్వ క్రీడాకారాణులు సైతం ఆన్లైన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయనపై గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్ ఆదివారం ఆదేశించారు. చదవండి: ఏసీబీ వలలో ఎస్సై, కానిస్టేబుల్ -
15 రోజుల్లో పెళ్లి.. ఇంట్లోంచి పరారైన సింగర్ డైహార్డ్ ఫ్యాన్
లక్నో : ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక.. పెళ్లికి 15 రోజుల ముందు ఇంట్లోంచి పారిపోయిందో యువతి. పోతూపోతూ పెళ్లి ఖర్చుల కోసం దాచిన నగదును, విలువైన బంగారు నగలను పట్టుకుపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హంపీపూర్, బర్సార్ పోలీస్ స్టేషన్ పరిథికి చెందిన ఓ యువతికి కొన్ని నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. జులై నెలలో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబసభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. బంగారు నగలు కొని పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19న సదరు యువతి ఇంటినుంచి పారిపోయింది. పోతూపోతూ పెళ్లి కోసం దాచిన 50 వేల నగదు, విలువైన నగలు పట్టుకుపోయింది. ‘‘ నేను ఇళ్లు వదిలి పోతున్నా’’ అని చిన్న చీటీ రాసి పెట్టిపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురికి ప్రముఖ సింగర్ రందావా అంటే విపరీతమైన ఇష్టమని, ట్విటర్లో తరుచూ అతడి పోస్టులను రీట్వీట్ చేసేదని తెలిపారు. ఆమెకు రందావా ఫ్రెండ్ అని చెప్పుకుని ఓ వ్యక్తి పరిచమయ్యాడని చెప్పారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అతడే తమ కూతుర్ని నమ్మించి ఉంటాడని, ఇళ్లు వదిలి అతడి దగ్గరకే పారిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : వామ్మో.. కిలేడీ గ్యాంగ్.. బంగారం కొనేందుకు వచ్చి.. ఎంత పనిచేశారు! -
ఫాదర్స్ డే రోజున ఘోరం: చిన్నారి కూతురు ఆత్మహత్య.. ఆగిన తండ్రి గుండె
సాక్షి, మండ్య: ప్రపంచ తండ్రుల దినోత్సవంనాడు సంతోషంగా శుభాకాంక్షలు చెప్పాల్సిన కుమార్తె ఉరితాడుకు వేలాడడం చూసి తండ్రి గుండెపోటుతో తనువు చాలించాడు. ఈ ఘోరం మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలోని తళగవాది గ్రామంలో ఆదివారం జరిగింది. బాలిక బాంధవ్య (17), ఆమె తండ్రి కె.రాజు (65) మృతులు. రాజుకు నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు బాంధవ్య ఇంటర్ ఫస్టియర్ మైసూరులోని ఒక ప్రైవేట్ కళాశాల్లో చదువుతోంది. కరోనా ఇబ్బందుల నేపథ్యంలో సెకెండియర్ను ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలని తండ్రి సూచించగా కూతురు ససేమిరా అంది. ఏదైనా మంచి ప్రైవేటు కాలేజీలోనే చదువుకుంటానని చెప్పగా తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆవేదనకు లోనైంది. ఆదివారం ఉదయం 8 గంటలప్పుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి రాజు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఇరువురి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మళవళ్ళి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రీ, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య తండ్రుల దినోత్సవంనాడు మరో విషాదం సంభవించింది. ఓ తండ్రి, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా పోగత్యానట్టి గ్రామంలో ఆదివారం జరిగింది. కాడప్ప పి. రంగాపపురె (48), ఆయన కుమార్తెలు కీర్తి (18), స్ఫూర్తి (16) మృతులు. వారం రోజుల క్రితం కాడప్ప భార్య చెన్నవ్వ మృతి చెందారు. ఆమె మృతిని తట్టుకోలేక జీవితం విరక్తితో సామూహిక బలవన్మరణాలకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. -
ఫేస్బుక్ పరిచయం.. మోడలింగ్ చాన్స్ ఇప్పిస్తానని చెప్పి.. ఆపై
సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక): బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిల్వర్థహళ్లి గ్రామ పంచాయతీ సభ్యుడు అహ్మద్‌పాషా తనను గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. హెబ్బాళ సమీపంలో నివాసం ఉంటున్న యువతి మోడలింగ్ రంగంపై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో ఫేస్బుక్లో బిల్వర్థహళ్లి జీపీ సభ్యుడు అహ్మద్‌పాషా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. మోడలింగ్ రంగంలో ఆమెకు ఆసక్తి ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆ యువతి శ్యానబోగనహళ్లిలోని అహ్మద్ నివాసానికి వెళ్లగా మాటలు కలిపి అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించింది. అయితే నిందితుడు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతిని నగ్నంగా ఫొటోలు తీశాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అహ్మద్ పాషా కోసం గాలింపు చేపట్టారు. చదవండి: విషాదం: బతుకు దెరువు కోసం వచ్చి.. మున్నేరువాగులో గల్లంతు.. -
మతిస్థిమితం లేని యువతికి చిత్రహింసలు
సాక్షి, నెల్లూరు: మతిస్థిమితం లేని ఓ యువతిని బంధువులే చిత్రహింసలకు గురి చేస్తున్న హృదయ విదారక ఘటన బాలాయపల్లిలో వెలుగుచూసింది. ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం యార్లపూడి గ్రామానికి చెందిన పద్మకు చిన్న వయసు నుంచే మతిస్థిమితం లేదు. ఆమె చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా, తండ్రి ఎటో వెళ్లిపోయాడు. పద్మ తన మేనమామ గగనం మల్లికార్జున, ప్రసన్న దంపతుల సంరక్షణలో ఉంటుంది. ఏడాది క్రితం పద్మకు అక్క వరసయ్యే బాలాయపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సుమతి, బావ వెంకటయ్య వద్ద మేనమామ వదిలి వెళ్లిపోయాడు. అయితే కొంతకాలం నుంచి పద్మను వారు చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొడుతున్నారు. పద్మను ఇంట్లో నిర్బంధించి పైశాచికంగా ప్రవర్తించేవారు. ఈ విషయం వైఎస్సార్సీపీ నాయకురాలు రాయి దేవికాచౌదరి దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, ఎస్సై నరసింహారావు, నెల్లూరు దిశ పోలీసులు మంగళవారం పద్మ నివాసం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో ఉన్న పద్మను చూసి నివ్వెరపోయారు. వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి, పక్కనే ఉన్న సఖి కేంద్రానికి తరలించారు. పద్మకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛన్ వస్తున్న విషయం గమనార్హం. -
అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో!
మనలోఎవరికైనా.. పాము కనిపిస్తే ఏంచేస్తారని ఒకవేళ అడిగితే.. ‘ ఇంకేంచేస్తాం.. గట్టిగా అరుస్తూ.. అక్కడి నుంచి పారిపోతామని’ చెప్తాం. అయితే, మరికొందరు భయస్తులు, పామును చూడటం అటుంచి, ఒకవేళ దాని పేరు తలుచుకున్న కూడా భయంతో వణికి పోతారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒక యువతి మాత్రం కింగ్ కోబ్రాను చూసినా భయం లేకుండా ఒంటి చేత్తో పట్టేసుకుంది. అయితే, ఆ పామును పట్టేక్రమంలో ఆమె మొహంలో భయం కించెత్తైనా లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. నాగేశ్వరీ అనే యువతికి పాములను పట్టుకోవడం అంటే ఇష్టం. ఈ క్రమంలో ఎక్కడ పాములు కనిపించినా కూడా. వెంటనే సదరు స్థానికులు నాగేశ్వరీకి సమాచారం ఇస్తారు. దీంతో ఆమె అక్కడికి చేరుకొని ఆపాముని పట్టుకుంటుంది. అయితే, ఈ వీడియోలో కూడా నాగేశ్వరీ ఒక పామును పట్టుకోవడం కనిస్తోంది. దీనిలో ఒక పెద్ద నాగుపాము రాళ్ల వెనుక ఉండటాన్ని నాగేశ్వరీ గమనించింది. ఆమె వెంటనే, రాళ్లను పక్కకు జరిపి ఒంటి చేత్తోనే ఆ పాముని పట్టేసుకుంది. అయితే, ఆ యువతి మొహంలో ఏమాత్రం భయం కనిపించడంలేదు. ‘పాపం.. ఆ పాము మాత్రం, నాగేశ్వరీ చేతిలో నుంచి విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలన్ని చేస్తోంది’. ఆ యువతి అదేదో.. ఉడుము పట్టులా.. గట్టిగా పట్టుకొని, ఒక చేతిలో జారీపోతే.. మరో చేతిలో మార్చి మరీ పట్టుకుంటోంది. అంతటితో ఆగకుండా, పామును పట్టుకున్న సంతోషంలో ఆ యువతి నవ్వుతూ.. స్థానికులు తీస్తున్న ఫోటోలకు ఫోజిచ్చింది. ఆమె పాములను పట్టుకుని ‘నాగేశ్వరీ స్నేక్ లవర్..అనే ’తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇంత ధైర్యమా తల్లి నీది..’ పాము ఎంత పెద్దదిగా ఉందో.. పాపం.. పాము వదిలించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది..‘ ఇంతకీ పాముని ఏంచేశారో చెప్పలేదు..‘దాని ప్రాణాలు కాపాడిన మీకు హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: కరోనా భయంతో స్వీట్ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు -
ఔను, ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.!
చంఢీగఢ్: సాధారణంగా పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఇంకెవరు.. ఆడ, మగ చేసుకుంటారు. కానీ అంతటా ఇలా జరగదు. కొన్ని చోట్ల ఆడవారు ఆడవారిని, మగవారు మగవారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఓ వింత వివాహం హర్యానాలో జరిగింది. వివరాలు.. గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలిక మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా జాజర్ జిల్లాలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవాళ్లు కాదు. అలా 7 సంవత్సరాల స్నేహాం కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్నారు. దీంతో వీరి ప్రేమను వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఇదెక్కడి ఘోరమని వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాజంలో ఆమోద యోగ్యం కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతలికీ వారి మాటలను వినిపించుకోలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం చేసుకున్నారు. ఈ విషయం తెలియని జాజర్ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హజరుపర్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయి. ఆ యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు తెలిపారు. అయితే, ఆ యువతుల తల్లిదండ్రులు మాత్రం వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట కానీ వారు అస్సలు వినిపించుకోవడం లేదట. ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గుచూపుతున్నారని హెలినామ్డి పోలీసు అధికారి మహేష్ కుమార్ తెలిపారు. చదవండి: Odisha DGP: హిజ్రాలకు కూడా పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. -
బిహార్ : తొలిసారి డీఎస్పీగా ముస్లిం యువతి
పట్నా: బిహార్ రాష్ట్రం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనుకబడి ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, కొన్ని ముస్లిం కుటుంబాలలో మహిళల విద్యపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ముస్లిం యువతి గ్రూప్1 సర్వీస్‌లో అత్యున్నత హోదా అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తానా అనే యువతి చరిత్రను సృష్టించింది. ఆమె తాజాగా, ప్రకటించిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికైంది. అయితే, బిహార్ రాష్ట్రంలో, ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి ఈ సర్వీస్‌ను సాధించిన తొలి యువతి కూడా రజియానే. దీంతో ఇప్పుడిమే వార్తల్లో నిలిచింది. కాగా, రజియాతో పాటు మరో 40 మంది కూడా డీఎస్పీ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె హతూవా నగరంలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. రజియా తండ్రి మహమ్మద్ అస్లామ్ అన్సారీ బొకారోలోని ఒక ఫ్యాక్టరీలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అన్సారీకి 7 గురు సంతానం. వీరిలో రజియా అందరికన్నావయసులో చిన్నది. ఆమెకు ఒక అన్నయ్య .. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ప్రాథమిక విద్యను బొకారోలో, బీటెక్‌ను జోధ్‌పూర్‌లో పూర్తి చేసుకుంది. అయితే రజియా తండ్రి 2016లోనే చనిపోయాడు. దీంతో ఆమె కష్టపడి విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించింది. తన తల్లితో కలిసి ఉంటుంది. ఎలాగైన ప్రభుత్వ సర్వీస్ సాధించాలనే తపనతో 2017 నుంచి తన ప్రిపరేషన్‌ను ప్రారంభించింది. ఉద్యోగం చేస్తునే మిగతా సమయంలో ప్రిపరేషన్ సాగించేది. ఈ క్రమంలో, మొత్తానికి తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రజియా మాట్లాడుతూ... ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. మానాన్న గారికి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉండేదని తెలిపింది. దీంతో నేను ఆయను కలను, నా ఆశయాన్ని పూర్తిచేశానని తెలిపింది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధిత మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ప్రధానంగా, కొన్ని ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఇప్పటికీ విద్యపట్ల వివక్షతకు గురౌతున్నారని బాధపడింది. అలాంటి కుటుంబాలలో విద్యపట్ల అవగాహన పెంచుతానని చెప్పింది. అయితే, ఇప్పటికే తాను, కోవిడ్ బారిన పడి కోలుకున్నానని చెప్పింది. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని దానిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించింది. చదవండి: Shocking: స్టోర్‌లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ.. -
బీప్: ప్రియుడికి పంపాల్సిన మెసెజ్ లెక్చరర్‌కు..
వాషింగ్టన్ : ప్రియుడికి పంపాల్సిన ప్రైవేట్ మెసెజ్‌ను పొరపాటున కాలేజ్ లెక్చరర్‌కు పంపిందో యువతి. కొద్ది సేపటి తర్వాత తన పొరపాటు తెలుసుకున్న ఆమె సిగ్గుతో తల దించుకుంది. సదరు లెక్చరర్‌కు క్షమాపణ చెప్పుకుంది. తన ఈ ఇబ్బందికర పరిస్థితిని పేరు వెల్లడించకుండా రెడ్డిట్ అనే సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. ‘‘ ప్రతీ మంగళవారం కాలేజీ ముగిసిన తర్వాత దగ్గరలోని బుక్ స్టోర్‌కు వెళ్లటం నాకు అలవాటు. గత కొద్దిరోజులనుంచి నేనక్కడ గూగుల్ ప్లేలో ఓ రొమాంటిక్ పుస్తకం చదువుతున్నాను. అన్ని రొమాంటిక్ పుస్తకాల కవర్ పేజీలాగే దాని కవర్ పేజీ కూడా షర్టులేని అబ్బాయి.. బికినీతో ఉన్న అమ్మాయితో ఉంది. నేను ఆ పుస్తకాన్ని చదువుతుండగా నా బాయ్ ఫ్రెండ్ చూశాడు. దాన్ని అప్పటికే చదవటం పూర్తి చేసిన అతడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఆ స్టోరీలో హీరో హీరోయిన్‌కు మధ్య జరిగే రొమాంటిక్ సీన్లో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌ను నేను గుర్తుపెట్టుకున్నాను. మరుసటి రోజు షాపింగ్‌కు వెళ్లిన నేను ఓ బుక్ స్టోర్‌లో.. ఆన్లైన్లో చదువుతున్న ఆ పుస్తకాన్ని చూశాను. ఆ వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకుని సెల్ఫీ దిగాను. నేను గుర్తుపెట్టుకున్న స్టోరీలోని రొమాంటిక్ సీన్లోని డైలాగ్‌ను జత చేసి.. సెల్ఫీ ఫొటోను నా బాయ్‌ఫ్రెండ్‌కు పంపాను. అయితే, ఇక్కడే ఓ పెద్ద పొరపాటు జరిగింది. నేను నా బాయ్ ఫ్రెండ్‌కు పంపాల్సిన మెసెజ్‌ను అదే పేరుతో ఉన్న నా సైకాలజీ లెక్చరర్‌కు పంపాను. దీంతో సిగ్గుతో చచ్చిపోయాను. ఆయన మాత్రం ఏమీ స్పందించలేదు. నేను ఆయనకు క్షమాపణ చెబుతూ మెసెజ్ పెట్టాను. మరుసటి రోజు సమాధానం ఇచ్చాడు. నాపై చాలా సీరియస్ అయ్యాడు. ఆ తర్వాతి నుంచి ఆయన మా క్లాసులోకి వస్తే ఇబ్బందిగా ఫీలవుతున్నాను’’ అని వివరించింది. చదవండి : Alzheimer: అల్జీమర్సా ..ఈ వీడియో చూస్తే.. -
ఎవరితోనైనా లేచిపో లేదంటే.. వదిన అసభ్యంగా దూషించడంతో..
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): వదిన, మేనత్త వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది. ఎస్సై నందిగామ నాగ్నాథ్ కథనం ప్రకారం.. హర్కపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అరవింద్, శ్రీదేవి (21) అన్నా చెల్లెలు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి చెల్లి బాధ్యతలను అరవిందే చూసుకుంటున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామానికి చెందిన తన మేనత్త జాదవ్ సెవంతబాయి కూతురు మంజులను అరవింద్ పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను ఉపాధి కోసం 2018లో దుబాయ్ వెళ్లాడు. అక్కడ పనిచేసుకుంటూ భార్యా బిడ్డలతోపాటు చెల్లి శ్రీదేవి బాగోగులు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. కాగా, భార్యా పిల్లలకు తోడుకోసం అరవింద్ తన మేనత్తను కూడా హర్కపూర్‌లో తన ఇంట్లో ఉండమని చెప్పాడు. చెల్లి పెళ్లి విషయంలో గొడవ.. ఇదిలా ఉండగా శ్రీదేవిని తమతోపాటు ఉంచుకుని పోషించడం అరవింద్ భార్య మంజుల, ఆమె తల్లి సెవంతబాయికి నచ్చేదికాదు. శ్రీదేవి పెళ్లి విషయంలో వారిద్దరూ దుబాయ్‌లో ఉన్న అరవింద్‌తో తరచూ ఫోన్లో గొడవ పడుతుండేవారు. ఆమె పెళ్లికి కట్నం ఇవ్వడంతోపాటు వివాహ ఖర్చులకు లక్షల రూపాయలు కావాల్సి వస్తుందని ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో శ్రీదేవికి వేధింపులు ఎక్కువయ్యాయి. తాము పెళ్లి చేయలేమని, పెళ్లి చేస్తే తమకు ఖర్చు తప్ప లాభం లేదని, అందుకే ఎవరితోనైనా లేచిపోవాలని మానసికంగా శ్రీదేవిని హింసించేవారు. ఏడాదిగా వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక బాధితురాలు విషయాన్ని తన అన్నకు చెప్పింది. జనవరిలో స్వగ్రామానికి అరవింద్.. దుబాయ్‌లో కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడిన అరవింద్ ఈ ఏడాది జనవరిలో స్వగ్రామానికి వచ్చాడు. తన చెల్లిని వేధించిన విషయమై భార్య, మేనత్తతో గొడవ పడ్డాడు. దీంతో భార్య మంజుల, మేనత్త సెవంతబాయి అదే నెలలో తమ ఊరికి వెళ్లిపోయారు. అయినా తరచుగా శ్రీదేవికి ఫోన్ చేస్తూ ఆమె కారణంగానే తాము విడిపోయామని వేధించేవారు. శనివారం రాత్రి కూడా శ్రీదేవికి మంజుల ఫోన్ చేసింది. ‘నీ కారణంగా నేను పుట్టింటికి వచ్చాను. ఐదు నెలలైనా మీ అన్న నన్ను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఇక మీ అన్నతో నువ్వే సంసారం చేయ్’అని సూటిపోటి మాటలు అన్నది. మేనత్త కూడా తీవ్రంగా దూషించడంతో మనస్తాపం చెందిన శ్రీదేవి క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. ఎస్సై నాగ్నాథ్ ఆదివారం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అరవింద్ ఫిర్యాదు మేరకు మంజుల, సెవంతబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రకాశం జిల్లా బాలికకు ఎమ్మెల్సీ కవిత చేయూత
సాక్షి, హైదరాబాద్: వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శస్త్రచికిత్సకు సాయం అందించి వారి కుటుంబా నికి చేయూతనిచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండేళ్ల బాలిక చిమ్మల జ్ఞాపిక వెన్నెముక సంబంధిత వ్యాధితో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. చికిత్సలో భాగంగా న్యూరో సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా, దిక్కుతోచని స్థితిలో బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ట్విట్టర్ ద్వారా కవిత దృష్టికి తెచ్చారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి భరోసాను ఇచ్చిన కవిత.. నిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూశారు. ఎమ్మెల్సీ చొరవతో నిమ్స్‌లో సర్జరీ అనంతరం కోలుకుని మంగళవారం ఆస్పత్రి నుంచి బాలిక డిశ్చార్జి అయింది. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. -
సరైన దుస్తులు లేవు, ఒంటిపై గాయాలు: యువతిని ఆదుకున్న డాక్టర్
సాక్షి, హిమాయత్‌నగర్: తల్లిదండ్రులు లేరు. అయిన వాళ్లెవరో కూడా తెలీదు. కొద్దిరోజుల క్రితం నగరంలోని పలు రోడ్లపై తిరుగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఓ యువతి(25)ని అక్కడి స్థానికులు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఉస్మానియా వైద్యులు కింగ్‌కోఠి హాస్పిటల్‌కు పంపారు. ఈ నెల 12న యువతిని కింగ్‌కోఠి హాస్పిటల్‌కు తీసుకురాగా.. ఒంటిపై గాయాలు, ఒంటిపై బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆమె వద్దకు వెళ్లాలంటేనే సిబ్బంది హడలెత్తారు. ఓ పక్క కోవిడ్ వార్డులోని బెడ్‌పై పడుకోబెడితే అక్కడున్న వారు ఇక్కడ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో యువతిని అక్కున చేర్చుకున్న ఆస్పత్రి అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా తన సిబ్బంది సాయంతో యువతికి వైద్యం అందించి శుభ్రంగా తీర్చిదిద్దారు. అనంతరం రెండుసార్లు కోవిడ్ టెస్టు చేయగా.. నెగిటివ్ వచ్చింది. యువతికి ఎవరూ లేకపోవడంతో ఆమె స్వచ్ఛంద సంస్థల వారికి అప్పగించే యత్నంలో డాక్టర్ జలజ వెరోనికా ఉన్నారు. అభాగ్యురాలికి అండగా నిలిచిన డాక్టర్ జలజ వెరోనికా, సిబ్బంది, కోవిడ్ ఇన్చార్జి డాక్టర్ మల్లిఖార్జున్ తదితరులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. -
తన కల కోసం కూలీగా మారింది!
తల్లే కూలి పనిచేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. అమ్మే పక్కన నిలబడితే ఏ కూతురి కలైనా తీరకుండా ఉంటుందా?! ఒక కలగంటోంది అనూరాధ. కేయేఎస్ ఆఫీసర్ అవాలి తను! ‘నో’ నువ్వు ఆ కల కనేందుకు లేదు. నీ పెళ్లి గురించి కలగను’ ఆనేశాయి ఆమె ఇంటి పరిస్థితులు. అయితే పరిస్థితుల్నే మార్చుకోవాలని నిశ్చయించుకుంది అనూరాధ. ‘‘ఉద్యోగం లేనిదే పెళ్లి చేసుకోకూడదు’’ అని తీర్మానించుకుంది. ఆమె కంటున్న కేయేఎస్ (కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) కలకు పేదరికం మరో అవాంతరం అయింది. తనూ సంపాదిస్తేనే ఇంటికి ఇన్ని తిండి గింజలు. కలను పండించుకోడానికి పొలానికి వెళ్లింది. వ్యవసాయ కూలీగా నాలుగు రాళ్లు సంపాదిస్తూ, మిగతా సమయంలో కేయేఎస్ కు ప్రిపేర్ అవుతోంది. ఇరవై రెండేళ్ల అనూరాధ పోస్ట్ గ్రాడ్యుయేట్. పీజీ చేసి, కూలి పనికి వెళ్లేందుకు ఆమె ఏమీ సిగ్గుపడటం లేదు. పొలం నుంచి తిండి గింజలకు మాత్రమే అనూరాధ సంపాదించుకు రావడం లేదు. కొన్ని బుక్స్ కొనాలి. ఖరీదైనవి. కోచింగ్ కూడా అవసరం. ఆ ఖర్చుల కోసం కూడా పొలం పనులు చేస్తోంది. తలపై ఎర్రటి ఎండ. కనురెప్పల మాటున తను కంటున్న కల. కలే ఆమెకు ఆ ఎండలో చల్లదనం, శక్తీ! అడవి అంచుల్లో ఉంది ఆమె గ్రామం. మైసూరు జిల్లా, హెమ్డి కోటె తాలూకాలోని తిమ్మనహోతలహళ్లి. గ్రామంలా ఉండదు. గిరిజన గూడెంలా ఉంటుంది. అక్కడొక చదువుల పువ్వు పూసిందంటే ఏ అండా, ఆశా లేకుండా తనకై తను వికసించిందనే! అలాంటి విద్యాకుసుమం అనూరాధ. తండ్రి లేడు. ఆమె చిన్నతనంలోనే చనిపోయాడు. ఆస్తి లేదు. డబ్బు లేదు. తల్లే కూలి పని చేసి కూతుర్ని పీజీ వరకు చదివించింది. ఏనాడూ ఆమె కూతుర్ని పెళ్లి కోసం తొందరపెట్టలేదు. గూడెంలోని వాళ్లు అంటున్నా, వాళ్లనూ అననివ్వలేదు. ‘‘ఉద్యోగం వచ్చాకే చేసుకుంటుందిలే..’’ అని కూతురి వైపు నిలబడింది. తల్లి మద్దతుతో కేయేఎస్ ప్రిలిమ్స్ పాసైనంతగా సంబరపడింది అనూరాధ. అయితే ఆ అమ్మాయి కేయేఎస్ ఆఫీసర్ అవాలని అనుకుంటున్నది తన కోసమో, తల్లి కోసమో కాదు. గిరిజన గూడేల్లో తనలాంటి ఆడపిల్లలు, ఇంటి బరువు బాధ్యతల్ని తమరొక్కరే మోస్తున్న తల్లులు ఇంకా ఉన్నారు. వారికోసం ఏమైనా చేయాలని అనుకుంది. పేదరికంలో ఉన్న ఆడపిల్లల్ని చదివించే ఆఫీసర్‌గా, వారి తల్లిదండ్రులకు నమ్మకమైన ఒక ఉపాధిని కల్పించగల అధికారిగా తను ఎదగాలని అనుకుంది. ఆ అనుకోవడం లోనే, ఆ లక్ష్యాన్ని సాధించడానికి పొలం పనులకు వెళ్లి రావడంలోనే పి.ఇ.టి.సి.కి దరఖాస్తు చేసే గడువు తేదీ దాటిపోయాక గానీ ఆమెకు తెలియలేదు! ఐయ్యేఎస్, కేయేఎస్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమమే పి.ఇ.టి.సి. ప్రీ–ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రోగ్రామ్. సాంఘిక సంక్షేమ శాఖ ఉచితంగా ఈ శిక్షణను ఇస్తుంది. ఆన్లైన్లో ప్రాసెస్ అంతా నడవడంతో దరఖాస్తు సమాచారాన్ని సమయానికి చూడలేకపోయింది అనూరాధ. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు బస వసతి కాకుండా, కేవలం శిక్షణకే 60 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంత మొత్తం కూలి పనితో కూడబెట్టగలిగింది కాదు. ఇంకో పని కూడా వెతుక్కోవాలని అనూరాధ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేయేఎస్ ఆఫీసర్ అయ్యేందుకు అనూరాధ కష్టపడటం అసాధారణమైన విషయమే అయినప్పటికీ అనూరాధ వంటి ఒక నిరుపేద గిరిజన యువతి అసలు పీజీ చేయడం కూడా కేయేఎస్ ఆఫీసర్ అయినంత ఘన విజయమేనని శైలేంద్ర కుమార్ అంటున్నారు. గిరిజన సామాజిక కార్యకర్త అయిన శైలేంద్ర ప్రస్తుతం అనురాధ కోచింగ్ కోసం ఆర్థిక వనరుల్ని సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి చేసుకున్నారు. అనంతరం కలిసి ఉందామంటే అతడు నిరాకరించడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. యువతి తాను ఉంటున్న వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో దుగ్యాల ఐశ్వర్య (20) నివసిస్తుండేది. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేట్ సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండేది. అయితే కొంతకాలం కిందట మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆశిర్ గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన ఐశ్వర్యను హైదరాబాద్ శివారులోని సంఘీ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులు కలిసి ఉన్నారు. అయితే ఈ పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఏ పనీ చేయని ఆశిర్ రెడ్డి నిన్ను పోషించలేడు అని ఐశ్వర్యను ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు. తన భర్తను దూరం చేశారని ఐశ్యర్య అప్పటినుంచి తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. దీంతో హైదరాబాద్‌కు వచ్చి వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే తాను కుటుంబసభ్యులను ఒప్పిస్తానని నమ్మ బలికిన ఆశిర్ ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్య గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆశిర్‌కు చెప్పి కలిసి ఉందామని విషయాన్ని ప్రస్తావించింది. ఈ విషయం ఆశిర్ దాటవేస్తూ వస్తున్నాడు. ఆమె ఒత్తిడి చేస్తుండడంతో ‘నాకు కొంత సమయం కావాలి’ అని ఆశిర్ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే ఆమెకు గర్భం తీసి వేయించాడు (అబార్షన్). ఆశిర్‌తో ఎలాగైనా తేల్చుకోవాలని ఐశ్వర్య వారి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆ కుటుంబసభ్యులు ఐశ్వర్యను దారుణంగా అవమానించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. కొన్ని రోజులుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్- 3లోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో నివసిస్తోంది. ఆ మనస్తాపంతోనే మంగళవారం తెల్లవారుజామున ఐశ్వర్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు కొన్ని సెల్ఫీ వీడియోలను ఐశ్వర్య తీసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆశిర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్ చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
ఛాతిపై వెంట్రుకలు.. చావాలనుకుంది..చివరకు..
కెనడా : మన ఆలోచనలు మనల్ని బాధ పెట్టినంతగా వేరేవీ బాధపెట్టలేవు. జుట్టు తెల్లబడుతోందని, బట్టతల వచ్చిందని, బరువు పెరుగుతున్నామని ఇలా ప్రతి విషయానికి ప్రతిరోజూ బాధపడిపోయేవారు లెక్కలేనంతమంది. అశాశ్వతమైన సమస్యలకు శాశ్వతమైన పరిష్కారాలు ఉండొచ్చు..లేకపోవచ్చు. అయినంత మాత్రాన జీవితమేమీ ఆగిపోదు. పెద్ద పెద్ద సమస్యలతో బాధపడుతూ.. సంతోషంగా బతికేవాళ్లు ఈ ప్రపంచంలో లేకపోలేదు. అంతా వాస్తవాన్ని గ్రహించటంలోనే ఉంది. అమెరికాకు చెందిన 24 ఏళ్ల ఓ అమ్మాయి కూడా తన సమస్యతో కొన్నేళ్లపాటు ఇబ్బందిపడింది. చావాలనుకుంది. చివరకు వాస్తవాన్ని గ్రహించి తన సమస్యతో ఓ కొత్త ట్రెండ్‌కు తెరతీసింది. వివరాల్లోకి వెళితే.. కెనడా, మాన్ట్రియల్కు చెందిన ఈస్టర్ కాలిక్ట్సే బియా అనే యువతికి 19 ఏళ్లు ఉన్నప్పటినుంచి ఛాతిపై వెంట్రుకలు మొలవటం ప్రారంభమైంది. దీంతో ఆ వెంట్రుకలను తొలగించుకోవటానికి చాలా ఇబ్బందిపడేది. ఎంతో నొప్పిని భరించేది. అయితే 2019లో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. వెంట్రుకలను తీసేసుకునే పనికి స్వప్తి పలికింది. వెంట్రుకలతో ఉన్న తనను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టింది. దీనిపై బియా మాట్లాడుతూ.. ‘‘ నా ఛాతిపై మొలిచిన వెంట్రుకలను తీసేసుకోవటానికి చాలా ఇబ్బందులు పడేదాన్ని. చాలా నొప్పిని భరించేదాన్ని. వెంట్రుకల కారణంగా నా మీద నాకే అసహ్యం వేసింది. సిగ్గుపడేదాన్ని. చివరకు డిప్రెషన్‌కు గురై చనిపోదామనుకున్నాను. నాలో ఆలోచనలు మొదలయ్యాయి. వాస్తవాలను గ్రహించాను. తర్వాత వెంట్రుకలను తొలగించుకునే పనికి గుడ్‌బై చెప్పాను. ( కొత్త టిక్‌టాక్ ఛాలెంజ్: తోలు పీకేసుకుంటున్నారు! ) నా జీవితంలో నేను చేసిన ఓ గొప్ప పని ఛాతిపై ఉన్న వెంట్రుకలను తీసేయకుండా ఉండటం. నా చర్మంతో నేనిప్పుడు చాలా సెక్సీగా, కంఫర్ట్‌బుల్‌గా అనిపిస్తున్నాను. మా నాన్న బంధువుల్లోని మహిళలకు ఇలా ఛాతిపై వెంట్రుకలు ఉండటం సహజమని తెలిసింది. నేను బయటకు వెళ్లినపుడు ప్రజలు నన్ను వింతగా చూసేవారు. కొంతమంది వీడియోలు కూడా తీసేవారు. వింతగా అనిపించేది’’ అని పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బియా ఫొటోలు వైరల్‌గా మారాయి. 90 శాతం మంది ఆమెపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. -
ఘోరం : విశ్వాసం లేని కుక్క!...
లండన్ : విశ్వాసం లేని ఓ పెంపుడు కుక్క తన యజమానిని దారుణంగా కొరికి చంపేసింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బర్మింగ్‌హామ్‌లోని కిట్స్ గ్రీన్ ఏరియాకు చెందిన కైరా లాడ్లో కుటుంబం ఓ పిట్‌బుల్ డాగ్‌ను పెంచుకుంటోంది. శుక్రవారం కైరా ఒక్కత్తే ఇంట్లో ఉంది. ఆమె తన గదిలోని బెడ్‌పై నిద్రపోతున్న సమయంలో పిట్‌బుల్ దాడి చేసింది. ఆమె చేతిని కొరికి, చీల్చిపడేసింది. ప్రాణాల కోసం ఆమె ఎంత అరుస్తున్నా అది విడిచిపెట్టలేదు. ఆ అరుపులు విన్న పొరుగింటి వారికి ఆ ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ( యజమానికి గుండెపోటు.. కుక్క ఏం చేసిందంటే? ) కైరా పెంపుడు పిట్బుల్డాగ్ కైరాకు ఫోన్ చేసిన ఆమె బంధువు ఒకరు ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో మధ్యాహ్నం సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలతో పడి ఉన్న ఆమెను గుర్తించారు. కైరాను పరీక్షించి చనిపోయినట్లుగా తేల్చారు. సంఘటనా స్థలంలో ఉన్న పిట్‌బుల్ డాగ్ కారణంగా ఆమె మరణించిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులపై యువతుల వీరంగం
సాక్షి, బెంగళూరు : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఫైన్ వేసిన పోలీసులతో యువతులు అసభ్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడిన సంఘటన దొడ్డబళ్లాపురం నందికొండ చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం నలుగురు యువతులు బెంగళూరు నుండి స్కూటీలపై హెల్మెట్ కూడా ధరించకుండా నందికొండకు వచ్చారు. కొండకు వెళ్లే మార్గంలో చెక్‌పోస్టు వద్ద చెకింగ్ చేస్తున్న పోలీసులు యువతులను నిలిపి హెల్మెట్ ధరించనందుకు ఫైన్ వేశారు. దీంతో ఆగ్రహించిన యువతులు పోలీసులతో వాద్వాదానికి దిగి దుర్భాషలాడారు. ఫైన్లు కట్టమంటూ మొండికేసారు. పోలీసులు మాత్రం సహనం కోల్పోకుండా ఫైన్లకు సంబంధించి రసీదులు ఇచ్చి పంపించారు. -
ఫుట్‌పాత్ సౌందర్యం
కెమెరా ముందు నిలుచునే మోడల్స్ కొంతమంది. ఎప్పటికీ కెమెరా తెలియక ఫుట్‌పాత్ మీదే జీవితాలను వెళ్లమార్చే మోడల్స్ కొంతమంది. కానరాని ఈ ముఖాలను కనిపించేలాచేయొచ్చు కదా అనుకున్నాడు కేరళ ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి. కొచ్చి ఫుట్‌పాత్ మీద చిన్న చిన్న వస్తువులు అమ్మేఅస్మాన్ అనే 21 ఏళ్ల అమ్మాయిని ఫొటోలు తీశాడు.‘స్ట్రీట్ టు స్టూడియో’ పేరుతో ఆస్మాన్కు తీసిన ఫొటోలు ఇప్పుడు అతనికీ, ఆమెకు కూడా ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. అజ్ఞాత సౌందర్యం గురించి సంభాషిస్తున్నాయి. ఫ్లవర్ ఎగ్జిబిషన్లో పెట్టేవి మాత్రమే పూలు కాదు. ఒక సందు చివర ఏదో ఒక పూరిగుడిసె మట్టికుండలో ఒక పువ్వు పూస్తుంది. ఏదో మధ్యతరగతి ఇంటి పెరడులో ఉదయపు వెలుతురు రాక మునుపు ఒక పూవు పూస్తుంది. పొలాలకు వెళ్లే బాట అంచున ఒక పూవు పూస్తుంది. అడవిలో ఎవరి కంటా పడనివ్వని గుబురు వెనుక ఒక పువ్వు పూస్తుంది. వాటిని ఎవరు చూస్తారు. స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లు, లైఫ్‌స్టైల్ ఫొటోగ్రాఫర్లు తమ దారిలో అదాటున కనిపించిన ముఖాలను ఫొటోలు తీస్తుంటారు. వాటిని పత్రికలలో వేసినప్పుడు ఆ ఫొటోలలోని వ్యక్తుల సౌందర్యం ఎంత బాగుందో అనిపిస్తుంది. ముఖ్యంగా రాజస్తాన్, కశ్మీర్ ప్రాంత స్త్రీలను గిరిజన ప్రాంతాల మహిళలను తీసినప్పుడు వారి స్వచ్ఛమైన సౌందర్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అయితే అలాంటి వారిని తీసుకొచ్చి వారి చేత ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎవరూ చేయరు. ఎందుకంటే అందుకు వారు ఒప్పుకోరు. కాని కేరళకు చెందిన సినిమాటోగ్రాఫర్ కమ్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అయిన మహదేవన్ థంపి ఇటీవల చేసిన ఆ ప్రయోగం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఫుట్‌పాత్ సౌందర్యానికి సలామ్ కొచ్చికి చెందిన ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి భిన్నమైన ప్రయోగాలు చేస్తాడన్న పేరు సంపాదించాడు. అతని ఫొటోసెషన్స్ అన్నీ నిర్భయంగా, మొహమాటాలు లేకుండా సాగుతాయి. ఆ విధంగా అతడు కొచ్చి వాసులకు తెలుసు. అలాగే కొచ్చిలో ఎడప్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ మీదుగా వెళ్లేవారికి ఆస్మాన్ తెలుసు. ఆ ట్రాఫిక్ పాయింట్ దగ్గర చాలా రోజులుగా ఆస్మాన్ సీజనల్ వస్తువులు అమ్ముతూ ఉంటుంది. వానొస్తే గొడుగు, ఎండొస్తే విండ్‌షీల్డ్... ఇలా. ‘ఒక రోజు ఆమెను చూశాను. ఆమె నవ్వు చాలా బాగుందనిపించింది. అదొక్కటే కాదు.. ఆమె రూపం.. చర్మం కూడా ఒక ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి బాగా పనికొస్తాయని అనిపించింది. వెంటనే ఆమెతో ఫొటో షూట్ చేయాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు థంపి. ‘ ఫుట్‌పాత్ మీద జీవించేవారిని మనం సాధారణంగా గౌరవించం. వారి శ్రమలో ఏం తక్కువ ఉంది. ముఖ్యంగా ఆ ఎండకు వానకు తడిచి స్త్రీలు ఎంత కష్టం చేస్తారు పొట్టకూటి కోసం. అలాంటి మహిళా స్ట్రీట్ వెండర్స్‌ను గౌరవించమని చెప్పడానికి కూడా నేను ఈ ఫొటో షూట్ చేయాలని అనుకున్నాను. నా మిత్రుడు మేకప్‌మేన్ అయిన ప్రబిన్కు ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానేమో అనుకున్నాడు. కాని నేను నిజమే చెబుతున్నానని అర్థమయ్యాక చాలా ఉత్సాహంగా పనిలో దిగాడు’ అన్నాడు థంపి.రాజస్తాన్‌కు చెందిన దేశ దిమ్మరి జాతికి చెందిన ఆస్మాన్ కుటుంబం కొచ్చిలోనే కలమాస్సెరిలో మిగిలిన తమలాంటి కుటుంబాలతో ఉంటోంది. ‘నేను వాళ్లను కలిశాను. ఆస్మాన్ కుటుంబంతో మాట్లాడాను. వాళ్లు ఇవన్నీ పట్టని ప్రాథమిక జీవనాన్ని కోరుకునేవారు. చాలా చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. మొత్తం మూడు కాస్టూమ్ సెషన్స్ అనుకున్నాం. నా మిత్రురాలు షెరీన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. క్లాప్ మీడియా ఈ ఫొటోషూట్‌ను ప్రొడ్యూస్ చేసింది’ అని తెలిపాడు థంపి. మెరిసిన ముత్యం ఫొటోషూట్ రోజున ఆస్మాన్ వచ్చింది. వచ్చాక కూడా ఇది నిజం కాదనే భావించింది. ‘ఆమెకు మేము ఎక్కువ మేకప్ వద్దనుకున్నాం. మొదటి ఫొటోషూట్ ముగిసే వరకూ ఆస్మాన్ ఇదంతా ఉత్తుత్తికే ఏమో అనుకుంది. కాని ఆ సెషన్ ఫొటోలు చూశాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి మిగిలిన సెషన్స్‌లో స్వేచ్ఛగా ఫోజులిచ్చింది’ అన్నాడు థంపి. ఈయన తీసిన ఫొటోలు బయటకు వచ్చాక అందరూ థంపీని మెచ్చుకున్నారు. ఆస్మాన్కు అభినందనలు తెలిపారు. ‘సాధారణంగా ఇలాంటి ప్రయోగాలకు విమర్శలు కూడా వస్తాయి. స్ట్రీట్ వెండర్స్‌ను ఉద్ధరించినట్టు ఫోజులు కొడుతున్నాం అని కూడా అనవచ్చు. కాని ఎవరూ అనలేదు. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. నేను చేసిన పని మరికొంతమందికి స్ఫూర్తినిచ్చి ఇలాంటి ప్రయోగాలు చేయనిస్తే అంతే చాలు’ అన్నాడు థంపి.ఈ ఫొటోలు వచ్చాక ఆస్మాన్ కొచ్చిన్‌లో ఇంకా ఫేమస్ అయ్యింది. కాని ఆమెకు ఈ రంగం ఏమీ ఇష్టం లేదు. మరునాడు యధావిధిగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు చేరింది. గుప్పెడు మెతుకుల కోసం జీవితం అనే కెమెరా ముందు ఆమె అహర్నిశలు పోజులు ఇవ్వక తప్పదు కదా. – సాక్షి ఫ్యామిలీ -
ఖతర్నాక్ యువతి.. సహాయం చేయమంటే..
న్యూఢిల్లీ : సహాయం కోరిన ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేసిందో యువతి. నమ్మకంగా ఉంటూ ఆమె వద్దనుంచి లక్షల రూపాయలు దోచేసింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని నెహ్రూ విహార్‌కు చెందిన ఓ వృద్ధురాలికి తన ఫోన్లో నగదు లావాదేవీలు చేయటం తెలియదు. దీంతో నగదు లావాదేవీల కోసం ఇంటి పక్కనే ఉండే కాలేజీ అమ్మాయి సహాయం తీసుకుంది. నవంబర్ నెలలో మొదటిసారి కొత్త ఏటీఎం కార్డు పొందిన వృద్ధురాలు పిన్ నెంబర్ జెనరేషన్ కోసం యువతి సహాయం కోరింది. పిన్ జెనరేషన్లో సహాయపడ్డ ఆ యువతి, డెబిట్ కార్డు వివరాలతో ఈ వ్యాలెట్‌కు దాన్ని జతచేయటంలోనూ సహాయపడింది. ( పీహెచ్డీ చదివి ఈజీ మనీ కోసం..) ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న ఆమె వృద్ధురాలి బ్యాంకు ఖాతాలోని నగదును కొద్దికొద్దిగా తన ఖాతాకు బదిలీ చేసుకునేది. ఓటీపీని, డబ్బులు విత్‌డ్రా చేసుకున్నారని వచ్చే మెసేజీలను ఫోన్ నుంచి తొలగించేది. అలా దోచుకున్న నగదుతో బట్టలు, ఇంటి అవసరమైన సామాన్లు, మొబైల్ రీచార్జులు చేసుకునేది. నవంబర్ 2019 నుంచి మార్చి 2020 వరకు 2,38,00 రూపాయలు కొట్టేసింది. తల్లి ఖాతాలోంచి నగదు పోతోందని గుర్తించిన ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలేజీ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. -
చీమల్ని చంపబోయి అగ్నికి ఆహుతైన యువతి!
సాక్షి, చెన్నై: చీమల్ని చంపేందుకు అగ్గితో చేసిన ప్రయత్నం ఓ యువతిని ఆహుతి చేసింది. ఆదివారం అమింజికరైలో ఈ ఘటన వెలుగు చూసింది. చెన్నై అమింజికరై పెరుమాల్ ఆలయం వీధికి చెందిన సత్యమూర్తికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె సంగీత(27) ఉన్నారు. షోళింగనల్లూరులోని ఓ సంస్థలో సంగీత ఐటీ ఇంజినీర్. వీరి నివాసం కూవం నదీ తీరంలో ఉంది. శనివారం చీమల్ని చంపేందుకు సంగీత చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చీమలు ఉన్న చోట్ల కిరోసిన్ పోసి నిప్పుపెట్టింది. (42 ఏళ్ల క్రితం చెన్నైలో చోరీ.. లండన్‌లో దొరికాయి!) అదే సమయంలో తన చేతిలో ఉన్న బాటిల్ నుంచి కిరోసిన్‌ను మంటలపై పోసి ప్రమాదాన్ని ఆమె కొని తెచ్చుకుంది. చేతిలో ఉన్న కిరోసిన్ బాటిల్‌సహా మంటలు చుట్టుముట్టడంతో అగ్నికి ఆహుతి అవుతున్న సంగీతను రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులు, సోదరుడు గాయపడ్డారు. ఇరుగు పొరుగు అతికష్టంపై కొన ఊపిరితో ఉన్న సంగీతను చికిత్స నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం సంగీత విగతజీవి గా మారింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. (పేద విద్యార్థి కల నెరవేర్చిన శివకార్తికేయన్) -
16 గంటలు నరకం చూసిన యువతి
ముంబై : ప్రియుడి చేతిలో యాసిడ్, పెట్రోల్ దాడికి గురైన యువతి 16 గంటల పాటు నరకం అనుభవించింది. సహాయం చేసే వారు లేక రోడ్డు ప్రక్కన ప్రాణాల కోసం అల్లాడిపోయింది. చివరకు ఆసుపత్రిలో చేరి కన్నుమూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాంధేడ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అవినాష్ ఆర్ రాజురే.. సావిత్ర డి. అన్కుల్కర్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసే ఉంటుంన్నారు. శుక్రవారం దీపావళి పండుగ జరుపుకోవటానికి పూనేనుంచి నాంధేడ్ జిల్లాలోని సొంత ఊరు సెల్గాన్ గ్రామానికి బైకుపై బయలుదేరారు. మార్గం మధ్యలో నిర్మానుష ప్రాంతంలో వాహానాన్ని నిలిపిన రాజురే సావిత్రపై దాడికి దిగాడు. ఆమె గొంతునులిమి చంపాలని చూశాడు. ( చెరువులో శవమైన నాలుగేళ్ల చిన్నారి) ప్రతిదాడి చేయటంతో సావిత్రపై యాసిడ్ పోశాడు. భరించలేని నొప్పితో సహాయం కోసం అరుస్తూ.. కిందపడి కొట్టుకుంటున్నా దయలేకుండా బైకులోని పెట్రోల్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఓ గొర్రెల కాపరి కాలిన గాయాలతో ఉన్న ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 16 గంటల సుధీర్ఘ నరకం తర్వాత అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత..
సాక్షి, గుంటూరు : రెండు సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న ఓ యువతి హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పాత గుంటూరు ఆలీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత గుంటూరుకు చెందిన నజిమా అనే యువతి 2018లో ఓ పెళ్లికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ దొరక్కపోయే సరికి కొద్దిరోజులు గాలించి వదిలేశారు. ( ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి ) అయితే తాజాగా యువతి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో నజిమా తల్లిదండ్రులు ఐజీని కలిసి నాగూర్ అనే యువకుడిపై ఫిర్యాదు చేశారు. ఐజీ ఆదేశాలతో నాగూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. ప్రేమ పేరుతో నజిమాను మోసం చేసి, హత్య చేసినట్లు నాగూర్ ఒప్పుకున్నాడు. -
యువతి బద్ధకం ఎంత పని చేసింది!
లండన్ : జిమ్‌కు వెళ్లి కొవ్వు కరిగించుకోవటానికి బద్ధకించిన ఓ యువతి కష్టాలను కొని తెచ్చుకుంది. కొవ్వును కరిగించే ఆపరేషన్‌ను ఆశ్రయించి ఇబ్బందులకు గురైంది. ఈ సంఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్, స్ట్రాట్‌ఫోర్డ్‌కు చెందిన 24 ఏళ్ల రీనీ డొనాల్డ్సన్ ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోంది. ఆమెకు 1,38,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. లావుగా ఉన్న రీనీ జిమ్‌కు వెళ్లి బరువు తగ్గటానికి బద్ధకించింది. సర్జరీ ద్వారా సన్న బడాలనుకుంది. ఇందుకు కోసం టర్కీ వెళ్లి బ్రెజీలియన్ బట్ లిఫ్ట్ సర్జరీ చేయించుకుంది. అనంతరం తాను చేయించుకున్న సర్జరీ గురించి తన యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసింది. అయితే కొద్దిరోజుల తర్వాత సర్జరీ వికటించి తొడ భాగంలో వాపు మొదలైంది. దీంతో మళ్లీ మూడు సార్లు టర్కీ వెళ్లింది. అయినప్పటికీ లాభం లేకపోయింది. ( చనిపోయిన బాలిక బ్రతికింది: గంట తర్వాత..) దీనిపై స్పందించిన రీనీ.. ‘‘ తొడ భాగంలో భరించలేని నొప్పి కలుగుతోంది. కొన్ని రోజులు నడవలేకపోయాను. నొప్పిగా ఉందని వైద్యులకు చెబితే ‘నొప్పి సహజమే’ అని సమాధానం ఇచ్చారు. దయచేసి సర్జరీలకు స్వప్తి పలకండి. చావు బ్రతుకుల సమస్య అన్నప్పుడు మాత్రమే సర్జరీలను ఆశ్రయించండి. జిమ్‌కు పోయి సన్నబడటం ఉత్తమం. నా వీడియోలతో ప్రభావితమై సర్జరీలు చేయించుకున్న వారిని క్షమాపణ కోరుతున్నాను’’ అని తెలిపింది. -
మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ హ్యాక్!
మామూలుగా మనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు, ఫేస్బుక్ లేదా ఇతర మూవీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్‌లకు చెందిన అకౌంట్ల వివరాలు బాగా దగ్గరైన వారితోనే పంచుకుంటాం. వారు మన అకౌంట్లను వాడుతారని మనకు తెలుసు. కానీ, మనుషుల మధ్య దూరం పెరిగినా కూడా కొంతమంది మాత్రం మన అకౌంట్లను హ్యాక్ చేసి మరీ వాడుకుంటుంటారు. ఈ కోవకు చెందిందే ఈ యువతి. అయితే మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేయటానికి సదరు యువతి చేసిన పనిని ఇంటర్నెట్ మొత్తం ఆశ్చర్యపోయి చూసింది. వివరాల్లోకి వెళితే.. బ్రూ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌కు సంబంధించిన హోమ్ పేజ్ స్ర్కీన్ షాట్‌ను ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘‘ నా సోదరుడి మాజీ ప్రియురాలు మా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను రెండు నెలలుగా దొంగిలిస్తోంది. ( మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ ఈ వ్యక్తి! ) హోమ్ పేజీలో తన అకౌంట్ పేరును ‘‘సెట్టింగ్స్’’ అని పెట్టుకుంది. నేను కూడా అవి నెట్‌ఫ్లిక్స్ సెట్టింగ్స్ అనుకున్నాను. తీరా అది ఓ అకౌంట్ అని తెలిసి చాలా నిరాశ చెందాను’’ అని పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు హ్యాకర్ అమ్మాయి తెలివికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘‘ హ్యాకింగ్ యువరాణి.. ఇంతకీ ఆ యాడ్ ప్రొఫైల్ ఎవరు?.. ఆమెను అకౌంట్ వాడుకోనివ్వండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఆస్పత్రిలో ఒక్కటైన డాక్టర్, నర్స్ ) -
‘‘అమ్మా! అక్క పిల్లలను చూడాలని ఉంది’’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మణికొండలో దారుణం చోటుచేసుకుంది. లాక్డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేక మనస్తాపానికి గురైన ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన ఈర వల్లిక అనే 20ఏళ్ల యువతి గత రెండు నెలలుగా ల్యాంకో హిల్స్‌లోని ఓ ఇంటిలో పని చేస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేకపోవటంతో గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోంది. ( 33 ఏళ్ల క్రితం తల్లిని చంపి: ఇప్పుడు కొడుకును.. ) ఈ నేపథ్యంలో ఊర్లో ఉన్న తల్లికి ఫోన్ చేసిన వల్లిక ‘‘అమ్మా! అక్క పిల్లలను చూడాలని ఉంది’’ అని అడిగింది. లాక్డౌన్ వల్ల ఇంటికి రావటానికి కుదరదు అని ఆమె చెప్పడంతో మనస్తాపం చెందింది. ఉదయం పనికి వెళ్లిన తర్వాత ల్యాంకో హిల్స్ 15వ అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. చదవండి : మిత్ర ద్రోహి.. స్నేహితుడి సోదరిని.. -
అవ్వా! మాస్కు ధరించు: నా తల్లే..
సాక్షి, హైదరాబాద్ : ఇటు నాగరికత నేర్చిన అమ్మాయి.. అటు ఆధునికత తెలియని అవ్వ.. ఇద్దరూ కలిశారు.. ఆ తర్వాత ఏమైంది? ‘అవ్వా.. బాగున్నావా?’ అంటూ ఆప్యాయంగా ఆమె చేతుల్లో పండ్లు, కాసింత డబ్బు పెట్టిందా యువతి. పట్టించుకునే వారు లేక దీనంగా కూర్చున్న ఆ పండుటాకు ముఖంలో ఆనందం.. అక్కడితో ఇది ముగిసిపోయి ఉంటే ఇది రొటీన్ ‘చిత్రమే’ అయ్యేది. ఆ తరువాతే అసలు విషయం మొదలైంది.. ‘అవ్వా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించాలి. చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.. ఇవి తప్పనిసరి’ అంటూ వాటిని వృద్ధురాలికిస్తూ జాగ్రత్తలు చెప్పిందా యువతి. ‘నా.. తల్లే’ అంటూ మురిసిపోయిందా వృద్ధురాలు. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు అద్దం పట్టిన ఈ ‘చిత్రం’ ఆదివారం రాయదుర్గం రోడ్డులో ‘సాక్షి’ కంటపడింది. చదవండి : రోజు విడిచి రోజు స్కూలుకు.. -
తరచూ తలనొప్పి: యువతి మెదడులో..
బీజింగ్ : 23 ఏళ్ల యువతి మెదడులో 10 సెంటీమీటర్ల పొడవైన నులిపురుగు బయటపడింది. ఈ సంఘటన చైనాలోని నింజియాంగ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నింజియాంగ్కు చెందిన క్షియావో ఇ అనే యువతి గత కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతోంది. ఈ మధ్య ఎపిలిప్సీ( న్యూరలాజికల్ డిజార్డర్) అటాక్ చేసింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. క్షియావోకు పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె మెదడులో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. ఆ వెంటనే శస్త్ర చికిత్స మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె మెదడులో ఉంటున్న 10 సెంటీమీటర్ల నులిపురుగు వారు గుర్తించి, దాన్ని బయటకు తీశారు. సరిగా ఉడకని మాంసం తిన్నందు వల్లే నులిపురుగు ఆమెలోకి చేరిందని వైద్యులు తెలిపారు. ( చైనా: స్కూళ్లకు పిల్లలు.. వాళ్ల తలపై..) ప్రస్తుతం క్షియావో పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. గత సంవత్సరం గాంఝౌకు చెందిన వాంగ్ అనే వ్యక్తి మెదడులోనూ 11 సెంటీమీటర్ల నులిపురుగు బయటపడింది. నత్తలు ఇష్టంగా తినటం వల్ల పురుగు అతడి మెదడులో చేరింది. 15 సంవత్సరాల పాటు అతడి మెదడును తింటూ బ్రతికింది. తల నొప్పితో ఆసుపత్రిలో చేరటంలో వైద్యులు నులి పురుగును గుర్తించి, శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు. ( బెస్ట్ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడిన శునకం ) -
72 గంటల్లో యువతి ఆచూకీ లభ్యం
సాక్షి, మామునూరు(వరంగల్): తల్లి మందలించిందని ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన యువతిని 72గంటల్లోగా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ఆమె సికింద్రాబాద్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లగా అక్కడి నుంచి రైలు ఎక్కినట్లు తెలిసింది. దీంతో రైల్వే పోలీసుల సాయంతో యువతిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఇది. ఈ మేరకు ఏసీపీ శ్యాంసుందర్, మామునూరు ఇన్స్పెక్టర్ సార్ల రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీటెక్ చదువుతూ... వరంగల్ లక్ష్మీపురం కాలనీకి చెందిన యువతి బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటేక్ చదువుతోంది. గత నెల 29న ఉదయం ఆమెను తల్లి మందలించడంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఈ మేరకు ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఈనెల 1వ తేదీ ఆదివారం సాయంత్రం మామునూరు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించగా స్కూటీపై ఆమె హన్మకొండ వెళ్లి ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఎస్బీఐ ఏటీఏం నుంచి రూ.40వేలు డబ్బు డ్రా చేసినట్లు తేలింది. ఆ తర్వాత పుటేజీలు పరిశీలించగా ఆటోలో హన్మకొండ బస్టాండ్‌కి చేరుకుని సికింద్రాబాద్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో సికింద్రాబాద్ వెళ్లిన పోలీసులు అక్కడి హోటల్లో ఆరా తీయగా అప్పటికే గది ఖాళీ చేసి సికింద్రాబాద్ రైల్వే స్ట్రేషన్‌లో ఢిల్లీ వెళ్లేందుకు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు తేలింది. ఆ వెంటనే సికింద్రాబాద్ కంట్రోల్ రూం నుంచి నాగపూర్ కంట్రోల్ రూంకు తెలియచేసి నాగపూర్ పోలీసులు సాయంతో యువతిని అదుపులోకి తీసుకుని బుధవారం తల్లిదండ్రులకు ఆప్పగించారు. కేసును 72 గంటల్లో పరిష్కరించిన ఇన్స్పెక్టర్ సార్ల రాజు, సిబ్బందిని ఏసీపీ శ్యాంసుందర్ అభినందించారు. -
పెళ్లి చేసుకోకుంటే చంపేస్తా..
జనగామ: ఇద్దరు యువతులపై అత్యాచారం, హత్య ఘటనల నుంచి ఇంకా తేరుకోక ముందే.. జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతిని యువకుడు వేధించిన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బస్సులో యువతిని వెంబడిస్తూ పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా 20 నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఓ యువతి(19) హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు సంపత్ ఆమెతో కలిసి చదువుకోవడంతో పరిచయం ఉంది. ఆమె స్వగ్రామానికి వచ్చేందుకు శుక్రవారం సికింద్రాబాద్‌లో బస్సు ఎక్కుతున్న క్రమంలో సంపత్ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. తాను కూడా బస్కెక్కి జనగామ వరకు వెంబడించి, బస్టాండ్‌లో దిగాక ఆమె ఫోన్ లాక్కుని పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ బెదిరించాడు. దీంతో కేకలు వేస్తూ బాధితురాలు సంపత్ నుంచి తప్పించుకుని నేరుగా డీసీపీ కార్యాలయానికి చేరుకుంది. ఆమె వాంగ్మూలం తీసుకున్న సీఐ మల్లేశ్.. 20 నిమిషాల్లోనే సంపత్‌ను పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువతిని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా వెంటనే 100 డయల్‌కు ఫోన్ చేయాలని సూచించారు. -
నీ స్కర్టు పొట్టిగా ఉంది.. ఇంటికి వెళ్లిపో..
లండన్ : కంపెనీలలో డ్రెస్ కోడ్ పేరిట మహిళలపై వేధింపులు ఆగటంలేదు. పొట్టి దుస్తులు వేసుకుందన్న కారణంతో ఓ యువతిని ఆఫీసు నుంచి ఇంటికి పంపేసిన ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హాడ్డెస్‌డన్ హార్ట్‌ఫోర్డ్‌షెర్‌కు చెందిన లిల్లి క్యాటెల్ అనే యువతి గత కొద్ది నెలలుగా వార్విక్ ఎస్టేట్స్ అనే కంపెనీలో జూనియర్ క్రెడిట్ కార్డ్ కంట్రోలర్‌గా పనిచేస్తోంది. రోజూలానే గత బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లింది. కార్యాలయంలో పనిచేసుకుంటుండగా హెచ్ఆర్ టీమ్ సభ్యురాలు ఒకరు ఆమెను పిలిచి ‘‘నీ స్కర్టు చాలా పొట్టిగా ఉంది. బాస్ నిన్ను ఇంటికి పంపమన్నారు. ఇంటికి పోయి డ్రెస్ మార్చుకుని రా’’ అని చెప్పి ఇంటికి పంపేసింది. అంతవరకు చక్కగా పనిచేసుకుంటున్న ఆమె మొదటిసారి ఇబ్బంది పడింది. అవమానకర పరిస్థితిలో ఇంటికి బయలుదేరింది. దీనిపై లిల్లి మాట్లాడుతూ.. ‘ఆ రోజు నేను మాట్లాడటానికి ఓ రెండు నిమిషాలు సమయం ఇచ్చుంటే బాగుండేది. నన్నో చిన్నపిల్లలా భావించటం నాకేం నచ్చలేదు. అప్పుడే నిశ్చయించుకున్నాను! నాకు మాట్లాడే అవకాశం వచ్చే వరకు వెనక్కు తిరిగి వెళ్లేది లేదని. ఆ సంఘటన జరిగినప్పుడు నేనెంతో బాధపడ్డాను. ఆఫీసు బయట ఉన్న కారు దగ్గరకు చేరుకోగానే నాకు విపరీతమైన ఏడుపు వచ్చింది. కారులో కూర్చున్నప్పటికి ఏడుపు ఆపుకోలేకపోయాను. దారుణమైన విషయం ఏంటంటే.. అదే స్కర్టును నేను చాలా సార్లు వేసుకెళ్లాను. అన్ని రోజులు ఏమీ అనని వారు ఆ రోజే ఎందుకు నన్ను అవమానించారు. నాకు చాలా కోపం వచ్చింది. నా మీద కాస్త కూడా కనికరం చూపలేదు. చివరకు ఆ కార్యాలయంలో పనిచేయలేనని అనిపించింది. ఆఫీసుకు రావటంలేదని వాళ్లు నాకు నోటీసులు పంపిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. యువతులు 40-50 ఏళ్ల మహిళల్లా దుస్తులు వేసుకోలేరు. ఆఫీసుల్లో డ్రెస్ కోడ్ పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇదే విషయమై ఆ కంపెనీ వాళ్లతో పోట్లాడాను కూడా’ అని తెలిపింది. -
మావోలకు వెరవని గిరిజన యువతి
రాయ్‌పూర్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పైగా అక్కడి ప్రభుత్వానికి కూడా అధికారాలు తక్కువ. మావోల ప్రభావం కలిగిన ఛత్తీస్‌గఢ్‌లోని అబూజాబాద్ ప్రాంతంలో కీర్టా డోప్రా అనే గిరిజన యువతి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. వీరికి ప్రాథమిక సదుపాయాలు, రోడ్డు మార్గాలు లేవు. రోజు మొత్తమ్మీద నాలుగు బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తాయి. ప్రతి బుధవారం ఇక్కడ కూరగాయల సంత జరుగుతుంది. మావోయిస్టుల తిరుగుబాటు నేపథ్యంలో జన్ ఔషధీ కేంద్రం మాత్రమే ఔషధాలను అందజేస్తోంది. ఇక్కడ ఈ వెసులుబాటు లేకపోతే ఔషధాలకోసం 70 కిలో మీటర్లు వెళ్లక తప్పదు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా మరియా తెగకు చెందిన కీర్టా చదువు ఇంటర్‌తోనే ఆగిపోయింది. ఒక రోజు ఈ గ్రామంలో యూనిసెఫ్ సంస్థ పోషకాహారలోపంపై కార్యక్రమం నిర్వహించగా కీర్టా అందులో పాల్గొని అందరికీ అవగాహన కల్పించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంత సమస్యలను యూనిసెఫ్ సంస్థ దృష్టికి తీసుకుపోయింది. వారి సహకారంతో మలేరియా, డయేరియాతోపాటు అన్నిరకాల మందులను గ్రామస్థులకు అందుబాటులో ఉంచుతోంది. అలా ఆమె రోజుకు 12 గంటలు పనిచేసి నెలకు రూ.2,000పైగా సంపాదిస్తోంది. కీర్టా తెగువను గుర్తించిన యూనిసెఫ్ సంస్థ 2014లో సాహసి అవార్డుతో సన్మానించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ‘‘ మావోయిస్టులు ఏ క్షణంలోనైనా ఆ షాపుపై దాడి చేయవచ్చు. ధ్వంసం కూడా చేయొచ్చు. అయితే కీర్టా అవేవీ పట్టించుకోలేదు. ఆమె ధైర్యం అందరికీ ఆదర్శం. ఇటువంటివారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని అన్నారు. -
కాటేసిన కామాంధులు..!
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లాలో కామాంధులు బరితెగించారు. అమాయక యువతులను టార్గెట్ చేసుకుని అఘాయిత్యాలకు ఒడి గట్టిన సంఘటనలు ఒకేరోజు రెండు చోట్ల వెలుగు చూశాయి. జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ మతిస్థిమితం లేని వికలాంగురాలిపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడగా ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మరో సంఘటనలో సదాశివనగర్ మండల లింగంపల్లి వద్ద ఓ యువతి అపస్మారక స్థితిక చేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జరిగిన సంఘటనలపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు. విశ్వసనీయ, పోలీసుల సమచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ రోడ్డులో.. జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులో ఓ మతి స్థిమితం సరిగా లేని ఓ దివ్యాంగ మహిళ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. శనివారం రాత్రి భోజనం చేసి రోడ్డు పక్కనే నిద్ర పోతున్న ఆమెను మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పక్కనే ఉన్న వర్క్‌షాపులోకి బలవంతంగా ఎత్తుకెళ్లి దాడి చేసి లైంగికదాడి చేసినట్లు తెలిసింది. స్థానికులు గమనించి ఒకరిని పట్టుకోగా మరొకరు పరారయ్యారు. పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. లింగంపల్లి వద్ద... సదాశివనగర్ మండలం లింగంపల్లి వద్ద మరో ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తమ పంట పొలం వద్దకు వెళ్తున్నట్లుగా కొందరు పశువుల కాపరులు గమనించారు. అ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. యువతి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పశువుల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో గాలించారు. కాళేశ్వరం కాలువ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం వేకువజామున సదురు యువతి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించి ఆమెను వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిగాని, లైంగికదాడి చేసిగాని ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విషయమై సదాశివనగర్ పోలీసులను సంప్రదించగా అపస్మారక స్థితిలో యువతిని గుర్తించినట్లుగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వివరాలు తెలుస్తాయన్నారు. -
జెంయింట్‌వీల్ నుంచి జారిపడి యువతి మృతి
-
మృత్యువుతో పోరాడి ఓడిన శృతి
పొదలకూరు: ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలోని సోమశిల ఏజీ పాలిటెక్నిక్ విద్యార్థిని ఎన్.శృతి శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఇక్కడి కళాశాలలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శృతికి కామెర్ల వ్యాధి ముదరడంతో ఆరోగ్యం విషమించింది. ఫలితంగా ఈనెల 7న ఆమె సొంతూరుకు వెళ్లి నెల్లూరు, ఒంగోలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయితే డాక్టర్లు మెరుగైన చికిత్స అవసరమని సూచించడంతో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తరలించారు. కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో కాలేయమార్పిడి చేయాలని, అందుకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యనిపుణులు శృతి తండ్రి కొండరావుకు వివరించారు. ఆయన అంతస్తోమత లేక దాతల సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో శృతి ఆరోగ్యం మరింత విషమించి తుదిశ్వాస విడిచింది. ఈ నెల 5వతేదీ వరకు ఆమె కళాశాల్లో సెమిస్టర్ పరీక్షలు రాసి వెళ్లింది. శృతికి వచ్చిన కామెర్ల వ్యాధి గుర్తించకపోవడం, అందరు విద్యార్థులతో పాటు సాధారణంగా ఉంటూ, వ్యవసాయ పనులు చేయడం వల్లనే వ్యాధి ముదిరినట్టుగా తెలుస్తోంది. కడసారి చూపులకు వెళ్లిన విద్యార్థులు శృతి మరణాన్ని జీర్ణించుకోలేని సహచర విద్యార్థులు తమ స్నేహితురాలిని కడసారి చూసి నివాళులర్పించేందుకు ఏజీ పాలిటెక్నిక్ విద్యార్థులు శనివారం కనిగిరి వెళ్లారు. విద్యార్థులు వెళ్లేందుకు ప్రిన్స్‌పల్ ప్రత్యేకవాహనం ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ముందుగా అనుమతి లేదని కాలేజీ నిర్వాహకులు వెల్లడించడంతో విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో యూనివర్సీటీ అనుమతి పొంది విద్యార్థులను శృతి భౌతికకాయం వద్దకు తీసుకుని వెళ్లారు. -
ఒంటరి జీవితం భరించలేక బలవన్మరణం
సాక్షి, రాయదుర్గంటౌన్: ఒంటరి జీవితం భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బళ్లారి జిల్లా రూపనగుడి గ్రామానికి చెందిన లింగన్న, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. స్వగ్రామం నుంచి 25 ఏళ్ల క్రితమే రాయదుర్గం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. కోతిగుట్ట కాలనీలో నివాసముంటున్నారు. జ్యోతి తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మృతి చెందారు. ఇద్దరు అక్కలకు వివాహం కాగా.. సోదరుడు స్వగ్రామానికి వెళ్లి పొలం పనులు చేసుకుంటున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న జ్యోతి స్వగ్రామానికి వెళ్లలేక రాయదుర్గంలోనే ఓ కంప్యూటర్ ఇన్స్టిట్ట్యూట్లో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవిస్తోంది. నెల రోజుల నుంచి పనికి కూడా వెళ్లడం లేదు. అక్కలు, సోదరుడు ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై.. ఒంటరి జీవితం భరించలేక మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మద్యం కావాలంటూ మహిళ వీరంగం
సాక్షి, హైదరాబాద్: లండన్ నుంచి ముంబై వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తనకు మరింత మద్యం కావాలంటూ క్యాబిన్ సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలో నానా హంగామా సృష్టించడంతో సిబ్బంది ఈ విషయాన్ని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు తెలియజేశారు. ముంబై రాగానే ఆ యువతిని పోలీసులకు అప్పగించారు. విమానంలో హంగామా చేసిన ఆ యువతి ఐర్లాండ్ దేశస్తురాలిగా గుర్తించారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
చింతకాని ఖమ్మం : మండలంలోని గాంధీనగర్‌కాలనీలో అనుమానాస్పద స్థితిలో మహ్మద్ సోఫియా(13) బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు... కాలనీకి చెందిన హస్నుజమా, నస్రీన్ దంపతుల చిన్న కుమార్తె సోఫియా, ఖమ్మం నగరంలోని పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ప్రతి రోజు ఇంటి నుంచి పాఠశాలకు బస్సులో ఖమ్మం వెళ్లి వస్తోంది. అనారోగ్యం కారణంగా సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. తమ ఇంట్లోని బాత్రూంలో రేకుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కన్పించకపోవటంతో బాత్రూం వద్దకు వెళ్లి చూసింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కిందకు దించి, స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మృతిచెందినట్టుగా ఆ ఆర్ఎంపీ తెలిపారు. బాత్రూంలో రేకుల కోసం అమర్చిన ఇనుప రాడ్ ఎత్తు ఆరు అడుగులు ఉంది. రాడ్‌కు కట్టిన చున్నీ నాలుగున్నర అడుగుల కిందకు వేలాడి ఉంది. దీంతో, బాలిక మృతిపై (ఆత్మహత్యపై) స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తకు దూరంగా నస్రీన్ ఉంటోంది. ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గతంలో రెండవ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నస్రీన్ ఫిర్యా దుతో ఎస్సై మొగిలి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి...
సియోని : తనపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవడం లేదనే కోపంతో ఓ కిరాతకుడు దళిత యువతిని హత్య చేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని సియోనిలో సోమవారం చోటుచేసుకుంది. నిందితుడు అనిల్‌మిశ్రా (38) కేసు ఉపసంహరించుకోవాలని కొంతకాలంగా యువతి (23)ని వేధిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్తుండగా అకస్మాత్తుగా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెపై దాడి చేశాడు. అనంతరం యువతి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి రాయితో తలపై మోది చంపేశాడు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
మల్కన్‌గిరి : జిల్లాలోని ఎంవీ 29 గ్రామంలో గల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అంజని సర్కార్(15) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంతో ధర్నాకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి ఆశ్రమ పాఠశాల పిల్లలందరూ భోజనాలకు వెళ్లగా అంజని సర్కార్ మాత్రం రాలేదు. అది గమనించిన వార్డెన్ ఆమె ఎందుకు రాలేదని అడగ్గా తమకు తెలియదని మిగతా విద్యార్థులు సమాధానమిచ్చారు. దీంతో వార్డెన్ అంతా వెతుకుతుండగా చివరికి కంప్యూటర్ ల్యాబ్ రూమ్‌లో అంజని సర్కార్ రక్తపు మడుగులో పడి ఉంది. ఈ దృశ్యం చూసి హతాశురాలైన వార్డెన్ అంజని సర్కార్‌ను వెంటనే మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం తెల్లవారు జామున మృతిచెందింది. బాలిక బ్లేడ్‌తో చేతిని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై మృతిచెందిన అంజని తల్లిదండ్రులు, బంధువులు సుమారు రెండు వందల మంది ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకుని పాఠశాల యాజమాన్యాన్ని నమ్మి తమ బిడ్డను అప్పగిస్తే వారి నిర్లక్ష్యంతోనే చనిపోయిందంటూ ఆగ్రహంతో ఊగిపోతూ మృతదేహంతో కలెక్టరేట్‌కు వెళ్లి ధర్నా చేశారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ మనీష్ అగర్వాల్ బాధితులతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
సంతోష్‌నగర్ : ప్రేమ విఫలం కావడంతో ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. సంతోష్‌నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. సంతోష్‌నగర్ రవీంద్రభారతి పాఠశాల సమీపంలో ఉంటున్న రమేశ్ కూతురు సుష్మా (25), మాదన్నపేట్ ఉప్పరిగూడ ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ యాదవ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల సుష్మాకు ఇంట్లో సంబంధాలు చూడటం ప్రారంభించారు. దీంతో సుష్మా సంతోష్ కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని కోరింది. తనకు కొంత సమయం కావాలని ఇప్పుడే కుదరని తెలిపాడు. వీరిద్దరి ప్రేమ విషయం సుష్మా తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో సుష్మా తల్లిదండ్రులు సంతోష్ కుమార్‌పై షీ టీమ్‌కు ఫిర్యాదు చేశారు. షీ టీమ్ పోలీసులు సంతోష్ కుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.తరువాత కూడా సంతోష్ రావడంతో సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శనివారం ఇంట్లో నిశ్చితార్థం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో సిలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి స్పందించకపోవడంతో పాటు తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందని... నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని సూసైడ్ నోట్లో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుష్మా మృతికి కారణమైన సంతోష్ కుమార్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
యువతిని స్నేహం పేరుతో నమ్మించి...
న్యూఢిల్లీ : డబ్బుకోసం ఓ యువతిని స్నేహమంటూ నమ్మించి ఆపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శుక్రవారం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు... న్యూఢిల్లీకి చెందిన 28ఏళ్ల వస్త్రాల వ్యాపారి జూదం కారణంగా దాదాపు రూ.50లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులకు తోడు ఓ ఖరీదైన కారును లోన్‌లో తీసుకున్నాడు. దీంతో ఎలాగైనా అప్పులు మొత్తం తీర్చేయ్యాలన్న కసితో ఓ పన్నాగం పన్నాడు. అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల సంపన్న యువతితో స్నేహం పెంచుకున్నాడు. యువతి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించిన ఆ వ్యాపారి.. ఆ ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నపుడు వెళ్లి ఆమెను చంపి డబ్బుతో చెక్కేయాలనుకున్నాడు. పథకం ప్రకారం బ్యాగులో కత్తి, సుత్తె, పెనాయిల్తో వేలి ముద్రలు పడకుండా ఉండటానికి చేతులకు సాక్సులు ధరించి స్కూటర్లో యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు కొట్టగానే యువతి బయటకు వచ్చింది. అతడు వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని మూడు సార్లు పొడిచాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో వేరే వ్యక్తులు ఉన్నారని గ్రహించి అక్కడినుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వటంతో నిందితున్ని తొందరగానే పట్టుకోగలిగారు. -
దారుణం: కుక్కలకు అన్నం వేసిందని..
సాక్షి, బెంగళూరు(యశ్వంతపూర్) : విశ్వాసం లేని మనుషులు.. విశ్వాసం చూపించే కుక్కులకు అన్నం వేసిందని ఓ యువతిని చితకబాదారు. ఈ ఘటన మహాలక్ష్మీ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేకుంది. వివరాల్లోకి వెళితే.. తారిణి అనే యువతి రోజు తన ఇంటి ముందుకు వస్తున్న కుక్కలను అన్నం వేసేది. దీంతో కుక్కలు వీధిలోకి రావటంవల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నట్లు స్థానికులు అనేక సార్లు హెచ్చరించారు. వీధి కుక్కలకు అన్నం వేస్తే వీకేందుకు ఇబ్బందులంటూ బుధవారం తారిణితో స్థానికులు గోడవ పడ్డారు. కుక్కలకు అన్నం వేసిన్నందుకు తనపై దాడి చేయటంను తారిణి తీవ్రంగా ఖండించారు. దీనితో పాటు అన్నం వేసిన పాపానికి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తారణిపై మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేస్తున్న సమయంలో వీడియో తీయాలని ప్రయత్నించగా ఫోన్‌ను కూడ లాక్కోని కోట్టిన్నట్లు తారిణి పోలీసుల వద్ద వాపోయ్యారు. దీనిపై స్వచ్చంద సంస్థలు తారిణి అభినందిస్తుండగా కేసు నమోదు చేసిన పోలీసులు గుక్కమింగటం కష్టం మారింది. -
బాలికపై వేధింపులు.. పోలీస్ స్టేషన్లో.. విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : వేధింపులకు గురైన ఓ బాలిక ఇంటికి వెళ్లటం ఇష్టంలేక పోలీస్ స్టేషన్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన న్యూఢిల్లీలోని తిలక్ విహార్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీకి చెందిన ఓ బాలికను పొరుగింటి వారు వేధింపులకు గురి చేయటంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న సమయంలో వారు గొడవ పడ్డారు. తన వల్లే గొడవలు జరుగుతున్నాయని మనోవేదనకు గురైన బాలిక పోలీస్ స్టేషన్‌లోని ఓ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసు అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. విచారణ కోసం ఇరుకుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించామన్నారు. వారు గొడవ పడుతున్న సమయంలో బాలిక ఇంటికి పోవటానికి ఇష్టపడలేదన్నారు. దీంతో ఆమెను నారీ నికేతన్‌కు పంపించాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలిపారు. బాలిక తల్లి మాట్లాడుతూ.. తన కూతురిని పొరుగింటి వాళ్లు అపహరించి వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. వారి కొడుకుతో తన కూతురి పెళ్లి చేయటానికే ఇలా చేశారని తెలిపింది. -
ప్రేమన్నాడు.. ప్రాణంతీశాడు
చౌటుప్పల్ : ఆ యువతికి అప్పటికే వివాహ నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా రోజూ వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే మరింతగా బరితెగించిన ఆ యువకుడు ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నాడు. తనవెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనంపై యువతిని బలవంతంగా ఎత్తుకెళ్తుండగా.. తప్పించుకునేందుకు యువతి విశ్వప్రయత్నం చేసింది. బైక్ పైనుంచి కిందకు దూకి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బోదనపు మదుసూధన్‌రెడ్డి కుమార్తె శ్వేత చౌటుప్పల్ మండలంలోని నేతాజీ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతోంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన తన స్నేహితురాలి ద్వారా పరిచయమైన అదే గ్రామానికి చెందిన భరత్ శ్వేతను నిత్యం ప్రేమ, పెండ్లి పేరుతో వేధించేవాడు. తనకు ఇష్టంలేదని చెప్పినా వినిపించుకోలేదు. శ్వేతకు గత నెల 15వ వివాహ నిశ్చితార్ధం జరిగింది. కాగా గత నెల 30న ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకోసం చౌటుప్పల్ మండలంలోని అశోకా ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం సాయంత్రం బయటకు వచ్చింది. అప్పటికే భరత్ అక్కడ వేచిఉన్నాడు. తనను పెండ్లి చేసుకోవాలని, లేదంటే ఏం చేస్తానో తెలియదంటూ శ్వేతను బలవంతంగా బైక్‌పై ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో వేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి జారీ శ్వేత రోడ్డుపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌కు తీసుకురాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్ఐ నవీన్‌బాబు కేసు నమోదు చేసుకొని యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
లైంగిక దాడి.. మేడపై నుంచి తోసి
ముంబై : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడు అనంతరం ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేశాడు. ఈ సంఘటన గురువారం ముంబైలోని ఎమ్ఐడీసీ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైలోని ఎమ్ఐడీసీకి చెందిన 17 ఏళ్ల యువతి అత్తమామలతో కలిసి ఓ అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో నివాసముంటోంది. అదే అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో నివాసముంటున్న 21 ఏళ్ల యువకుడు ఆ యువతి పని మీద బయటకు వెళుతున్న సమయంలో ఇంటిలోపలికి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి చాలా సేపటినుంచి కనిపించకపోవటంతో ఆమె మామ వెతకటం మొదలుపెట్టాడు. యువతిని రెండో ఫ్లోర్‌లోని యువకుడు ఇంటి లోపలికి లాక్కెళ్లాడన్న విషయం తెలుసుకుని అతడి ఇంటి తలుపు తట్టాడు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఆమెను రెండో అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో అంతస్తు మీద నుంచి కిందపడ్డ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఇది గమనించిన కొంతమంది ఆమె మామకు సమాచారమివ్వటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గొంతు నులిమి.. కళ్లు పొడిచి.. దారుణం
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని నందలూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం ఆడపూరు గ్రామానికి చెందిన కొప్పలి వెంటసుబ్బయ్య(65)ను అరీఫా అనే యువతి పాశవికంగా హత్య చేసింది. అతని నోట్లో పురుగుల మందు పోసి, గొంతు నులిమి, కళ్లను పొడిచి అతి దారుణంగా చంపేసింది. సమాచారం అందుకున్న నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేయడానికి ప్రేరేపించిన కారణాలను విచారిస్తున్నారు. -
వేధింపులు తాళలేక.. విష గుళికలు మింగి!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రేమ వేధింపులు తాళ్లలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మొయిళ్ళ కాల్వం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మి (19) ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సమరసింహారెడ్డి అనే యువకుడు ప్రేమ పేరిట వరలక్ష్మిని వేధిస్తున్నాడు. తాజాగా అతని వేధింపులు ఎక్కువ కావడంతో.. అతని వల్ల తన కుటుంబానికి ఏమైనా హాని జరుగుతుందని వరలక్ష్మి భయపడినట్టు తెలుస్తోంది. ఆ భయంతోనే విషగుళికలు తిని వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరలక్ష్మి భౌతికకాయాన్ని కడపలోని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
పెళ్లికి నిరాకరించాడని..
కేతేపల్లి (నకిరేకల్) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కేతేపల్లి మండలంలోని కొండకిందిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మంద మౌనిక ఇదే మండలంలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక చంటి ఇంటి ఎదుట మహిళా మండలి సభ్యులతో కలసి రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన విషయం తెలిసి ఇంటికి తాళం వేసి మొదటి రోజే పరారైన చంటి కుటుంబ సభ్యులు రెండ్రోజులైన ఇంటికి చేరుకోలేదు. తనను పెళ్లి చేసుకోవాలని చంటి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నా అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మనస్తాపం చెందిన మౌనిక శనివారం తాను ఆందోళన చేస్తున్న శిబిరం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను వెంట ఉన్న మహిళలు గమనించి నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మౌనికను నల్లగొండ డీఎస్పీ సుదాకర్ కలసి వివరాలు సేకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
ట్రక్కు సైలెన్సర్‌లో యువతి తల..
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఓ యువతి చేసిన పిచ్చి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలెన్సర్ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేకపోయింది. అలా కొద్ది గంటల పాటు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైట్లీన్ స్ట్రోం(19) అనే యువతి విన్స్టక్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లి అక్కడ పూటుగా మద్యం సేవించింది. తాగిన మైకంలో ఉన్న ఆమె అక్కడున్న ట్రక్కు సైలెన్సర్‌ను చూసింది. పెద్దగా ఉన్న ఆ సైలెన్సర్‌లో తలను దూర్చితే ఎలా ఉంటుందని ఆలోచించి.. అనుకున్నదే తడువుగా అందులోకి తలను దూర్చింది. కొద్దిసేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా కుదరలేదు. ఇది గమనించిన అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆమె తలను సురక్షితంగా బయటకు తీశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది ఆ యువతి పరిస్థితి. ఇది ఇలా ఉంటే చిన్న వయస్సులో మద్యం సేవించినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైలెన్సర్‌లో తల ఇరుక్కున్నప్పటి దృశ్యాలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో కైట్లీన్ స్ట్రోం స్పందిస్తూ.. తాను చేసిన పనికి ఏమాత్రం బాధపడటం లేదని ట్రక్కు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయిన యువతి తానేనంటూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతోంది. -
టాక్సీలో మేకప్ వేసుకుంటుండగా.. విషాదం
బ్యాంకాక్ : టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ యువతి కంటికి ‘ఐలైనర్ పెన్సిల్’ సహాయంతో మెరుగులు దిద్దుతుండగా.. ఐలైనర్ పెన్సిల్ కాస్తా కంటిలో గుచ్చుకుంది. సగానికి పైగా పెన్సిల్ కంటిలోకి చొరబడటంతో భరించలేని నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురైందా యువతి. ఈ సంఘటన సోమవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన 20 ఏళ్ల యువతి టాక్సీలో ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం నిదానంగా కదులుతోంది. స్నేహితులను కలవాలన్న తొందరలో ఉన్న ఆమె బ్యాగులో ఉన్న ఐలైనర్‌ను తీసి కంటికి మెరుగులు దిద్దుకోవటం ప్రారంభించింది. ఇంతలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ కాస్తా ముందున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ముందున్న సీటుకు తగిలి ఐలైనర్ పెన్సిల్ కంటిలోకి చొచ్చుకెళ్లింది. పెన్సిల్ కంట్లో గుచ్చుకోవటంతో భరించలేని నొప్పి కారణంగా ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి గమనించిన టాక్సీ డ్రైవర్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్‌లో ఆమెను దగ్గరలోని ‘రాజవితి’ హాస్పిటల్‌కు తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు యువతి కంటి నుంచి పెన్సిల్‌ను తొలగించారు. ‘రాజవతి’ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. కంటిలోని ముఖ్యమైన భాగాలకు ఎలాంటి నష్టం కలుగకపోవటంతో ఆమె కంటిచూపుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నపుడు మేకప్ వేసుకునే వాళ్లకు ఇదొక గుణపాఠమని, కదులుతున్న కారులో ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు ఊహించనివని, అన్నింటికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. -
యువతి అదృశ్యం
మిరుదొడ్డి(దుబ్బాక): ఓ యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని మల్లుపల్లిలో చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్ఐ విజయభాస్కర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మచ్చ ఎల్లవ్వ, స్వామి కూతురు కల్యాణి ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బొప్పాపూర్‌లోని తన చిన్నమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. నాటి నుంచి ఆమె ఆచూకీ ఎక్కడా లభించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేదు. యువతి తల్లి ఎల్లవ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆడిషన్స్ పేరుతో అసభ్య ఫొటోలు తీసి..
-
సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ..
తిరుపతి : క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి చిన్న నగరాలకు కూడా పాకుతోంది. సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని యువతులను మోసగిస్తూ, వారిని అసభ్యంగా ఫోటోలు తీసి, అనంతరం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముఠా ఆగడాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. ఇందుకు సంబంధించి సురేష్ అనే యువకుడితో పాటు అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన సురేష్ స్థానికంగా ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా స్నేహితులతో కలిసి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఆడిషన్స్ పేరుతో అమ్మాయిల అసభ్య ఫొటోలను తీసి, బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన మాట వినని, వ్యతిరేకించిన వారి ఫొటోలను ఫేస్బుక్లో పెడుతూ అసభ్య పదాలతో సురేష్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇందుకు సంబంధించి ఓ యువతి ధైర్యం చేసి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిర్భయ కేసు నమోదు
ములకలపల్లి : బాలికపై లైంగిక దాడి చేసి, ఆపై బలవంతంగా తాళి కట్టాడన్న ఫిర్యాదుతో ఓ యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్టు పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన బాలికను, ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన కొనపాకుల నవీన్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. తాము పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడి పద్ధతి మారలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న బాలికను బెదిరించి, మోటార్ సైకిల్‌పై కల్లూరు శివారుకు తీసుకెళ్లి లైంగికంగా దాడి చేసినట్టు తెలిపారు. ఆ బాలిక ఏడుస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా మెడలో తాళి కట్టాడని ఆమె బంధువులు తమ ఫిర్యాదులో తెలిపారు. వారి ఫిర్యాదుతో నిందితుడిపై నిర్భయ కేసు నమోదైంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద నిందితుడు నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌కు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. సమావేశంలో ఎస్సై ఉదయ్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్లో ఉరేసుకుని యువతి మృతి
నెల్లూరు జిల్లా : విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి వద్ద లభించిన డైరీ ఆధారంగా పోలీసులు వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. యువతి తన వద్ద ఉన్న డైరీలో పేరున్న పేజీని చింపివేయడంతో ఆమె ఎవరో కనుక్కోవడానికి పోలీసులకు కష్టతరంగా మారింది. మృతి చెందిన యువతి వయసు 20 నుంచి 24 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు వచ్చిన సమయంలో యువతి ఒంటరిగా ఉండటం గమనించి యువతిని తలుపు వేసుకోమని టీసీ సూచించినట్లుగా తెలిసింది. కావలి రైల్వేస్టేషన్‌కి వచ్చేసరికి రైల్లోనే ఉరి వేసుకుని మృతిచెందింది. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారనే అనుమానం కలుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతోన్నారు. -
మద్యం మత్తులో యువతి హాల్చల్
-
ఫిల్మ్ నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్.. యువతి హాల్చల్..
సాక్షి, హైదరాబాద్: ఫిల్మ్ నగర్లో ఓ యువతి మద్యం మత్తులో హాల్చల్ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాక ఆ యువతి కారు దిగి పోలీసులు, మీడియాపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకుంది. వివరాలివి.. నగరంలో ఫిల్మ్‌నగర్ సహా ఏడు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి డ్రైవింగ్ చేస్తున్న మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు. దాదాపుగా 80 కేసులు నమోదు అయినట్లు ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. యువతి, ఆమె స్నేహితుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ యువతి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. మహిళా పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుకు దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పింది..
రోహ్తక్ : తనను వేధించిన పోలీసును ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ రెండు చెంపలు వాయించేసింది ఓ అమ్మాయి. ఈ ఘటన హరియాణాలోని రోహ్తక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన నేహా జాంగ్రా నేషనల్ లెవల్ కరాటే ప్లేయర్‌గా గోల్డ్ మెడల్ సాధించింది. శుక్రవారం సాయంత్రం కరాటే క్లాసులు ముగించుకుని ఇంటికి బయల్దేరింది. షేర్ ఆటోలో ప్రయాణిస్తుండగా పక్కనే కూర్చున్న ఓ ట్రాఫిక్ పోలీసు ఆమెను ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడిగాడు. తనతో స్నేహం చేయాలంటూ బలవంతం చేశాడు. దీంతో వేధింపులకు విసుగెత్తిన నేహా ఆటో డ్రైవర్ సాయంతో ఆ పోలీసును లాక్కెళ్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతటితో వదిలిపెట్టకుండా మహిళా పోలీసుల ముందే అతడి రెండు చెంపలూ చెళ్లుమనిపించింది. అయితే ట్రాఫిక్ పోలీసుపై చర్యలు తీసుకోవద్దంటూ మహిళా పోలీసుకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు బాధితురాలు ఆరోపించింది. కాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఇప్పటికే సస్పెండ్ చేశామనీ.. రాతపూర్వక ఫిర్యాదు అందిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రోహ్తక్ డీఎస్పీ రవీంద్ర పేర్కొన్నారు. అంతేకాక దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని డీఎస్పీ అన్నారు. -
యువతి ఆత్మహత్య
తూప్రాన్: అనుమానాస్పద స్థితిలో యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తూప్రాన్ డివిజన్ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగార్జునగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సోమన్నగారి భిక్షపతిగౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె నాగరాణి(18) మనోహరాబాద్ మండలం లింగరెడ్డిపేట గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనలియర్ చదువుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలోఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాణి మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఎస్ఐ నాగార్జునగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణచేపట్టారు. మృతురాలి తండ్రి భిక్షపతిగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్యతో పెళ్లికి 70 వేల దరఖాస్తులు
పెరంబూరు(చెన్నై): తమిళ నటుడు ఆర్య ఇటీవల వధువు కావలెను అని ఇంటర్నెట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఏకంగా 70 వేల మంది యువతులు దరఖాస్తులు చేసుకుంటే, వారిలో ఆరు వేల మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరిని షార్ట్‌లిస్ట్ చేసి 18 మందిని ఎంపిక చేశారు. వయాకామ్ 18 అనే పారిశ్రామిక సంస్థ తమిళనాడులో కలర్స్ తమిళ్ ఎంటర్టైన్మెంట్ చానల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చానల్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖరన్ విలేకరులతో మాట్లాడుతూ.. గేమ్ షో లాంటి మంచి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌లో ‘ఇంగవీట్లు మాప్పిళ్లై’ అనే స్వయంవరం కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరుడిగా పాల్గొనాలని కోరగా, ఆర్య సమ్మతించారని తెలిపారు. -
నవ కిశోరం
హుస్నాబాద్‌రూరల్: బాలికల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కిశోర బాలికలు ఎంత మంది ఉన్నారు? ఎంత వరకు చదువుకున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? చదువు ఎందుకు మానేశారు? కుటుంబ నేపథ్యం, ఆరోగ్య సమాచారంపై సర్వే చేస్తున్నారు. బాలికలకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి.. పురుషులకు సమానంగా నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. బాలికలకు మహిళా సంక్షేమం, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 57,615 మంది కిషోర బాలికలు సిద్దిపేట జిల్లాలోని 399 గ్రామాల్లో 57,615 మంది కిశోర బాలికలు ఉన్నట్టు ఐసీడీఎస్ అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 25 మంది బాలికలను ఎంపిక చేసి.. వీరికి కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక ప్రాజెక్టులో బాలికలు శిక్షణ పొందుతున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో బాలికలు, స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చేలా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే సమన్వయకర్తలను నియమించనున్నారు. పల్లెకు చేరి కిశోర బాలికలకు మహిళల హక్కులపై అవగాహన కల్పించడం, మహిళా సంక్షేమ పథకాలు, దగా పడ్డ మహిళలకు న్యాయ సలహాలు ఎక్కడ అందుతాయి? అనే విషయాలపై అవగహన కల్పించేలా సమన్వయకర్తలు పనిచేయనున్నారు. కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణ సరైన వసతులు లేక గ్రామీణ ప్రాంతాలకు చెందిన కిశోర బాలికలు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. అంతేకాదు కూలి పనులు సైతం చేస్తున్నారు. కాగా, అభద్రతా భావంతో కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలను దూర ప్రాంతాల్లో చదువుకునేందుకు పంపించడం లేదు. ఫలితంగా చాలమంది బాలికల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఇంటర్మీడియట్ చేయడం లేదు. అదే ఇంటర్ చేసిన వారు డిగ్రీలో చేరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కిశోర బాలికల సర్వే చేసి.. వారికి జీవన నైపుణ్యాల కల్పన చేపట్టనుంది. జీవన నైపుణ్యాల కల్పన ప్రభుత్వ ఆదేశాల మేరకు కిశోర బాలికల సర్వే చేపట్టి.. వారి వివరాలను అన్లైన్లో నమోదు చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువులు మానేసిన బాలికలను చేరదీసి.. వారికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం గజ్వేల్, సిద్దిపేటలో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాం. త్వరలో హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల ఐసీడీఎస్ పరిధిలోని బాలికలకు కంప్యూటర్ శిక్షణ ఇస్తాం. చదువు మానేసిన బాలికలను గుర్తించి.. వారికి మహిళా హక్కులపై అవగాహన కల్పిస్తాం. అంతేకాదు బాలికల ఆరోగ్య పరిరక్షణకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. – జరీనాబేగం, ఐసీడీఎస్ పీడీ త్వరలో కంప్యూటర్ శిక్షణ గ్రామీణ బాలికలకు స్వయం ఉపాధి కోసం కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో కిశోర బాలికలపై సర్వే పూర్తి చేశాం. ప్రాజెక్టు పరిధిలో 6,450 మంది కిశోర బాలికలు ఉన్నారు. 20 మందికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు బ్యాచ్ తయారు చేశాం. త్వరలో హుస్నాబాద్‌లో ప్రారంభిస్తాం. మహిళల హక్కులపై అవగహన కల్పించి.. బాలికలను శక్తిగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తున్నాం. – ఫ్లోరెన్స్, సీడీపీఓ, హుస్నాబాద్ -
గుడికి వెళ్లింది.. అదృశ్యమైంది..!
సాక్షి, హైదరాబాద్: దేవాలయానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎల్బీ నగర్ మజీద్‌గల్లీలో ఉండే ఆమని(22) ఈ నెల 7న బాలాజీ గుడికి పోతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రియుడితో జల్సాలు చేసేందుకు చోరీలు..
సాక్షి, బనశంకరి: విద్యావంతురాలైన ఓ యువతి ప్రియుడితో జల్సాలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం చోరీలను వృత్తిగా ఎంచుకొని చివరకు కటకటాలపాలైంది. పీజీ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లను తస్కరిస్తున్న యువతిని శనివారం మైకోలేఔట్ పోలీసులు అరెస్ట్ చేసి రూ.4 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణవిభాగ డీసీపీ బోరలింగయ్య శనివారం వివరాలు వెల్లడించారు. చింతామణి తాలూకా చిలకలనేర్పుకు చెందిన శోభ(23) డిప్లొమా పూర్తిచేసి బెంగళూరులోని మైకోలేఔట్‌కు చేరుకుంది. నగరంలోని మహిళా పీజీ హస్టళ్లను సందర్శించి యజమానులను పరిచయం చేసుకొని తనకు వసతి కల్పించాలని విన్నవించేది. యజమానులు గదులు చూపించే సమయంలో అక్కడి ల్యాప్‌టాప్‌లను తస్కరించి ఉడాయించేది. ల్యాప్‌టాప్‌లు చోరీకి గురైన ఘటనలు అధికం కావడంతో సీఐ అజయ్ తన సిబ్బందితో కలిసి విస్తృతంగా గాలింపు చేపట్టి సదరు కిలేడీని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండా సదరు కిలేడీ చోరీలకు పాల్పడటం ప్రియుడికి తెలియదని పోలీసులు తెలిపారు. -
క్షమించు జానకీ!
సీతమ్మ పేరు పెట్టుకున్న నిన్ను అంత పవిత్రంగా చూడలేకపోయాడు వాడు. నిత్యం కష్టపడే నాన్నకు సాయపడాలన్న మంచి మనసున్న నిన్ను రక్షించుకోలేకపోయాం మేము. జనారణ్యంలో మృగాళ్లు నడి రోడ్డుపై సంచరిస్తున్నారని తెలుసు.. ప్రాణాలను తోడేస్తూ ఉన్మాదంగా వికటాట్టహాసం చేస్తున్నారనీ తెలుసు. ఈ విపత్కర పరిస్థితుల్లో నీవు కేవలం ఓ గాజు బొమ్మవని తెలిసినా నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాం. టీచర్ కావాలని ఆశ పడి ఇష్టంగా పుస్తకాలు చదివే నీకు.. నీ చుట్టూనే రాక్షసులు ఉన్నారని చెప్పలేకపోయాం. జానకీ క్షమించు..రాజాం మండలం శ్యాంపురం పంచాయతీ గుయ్యానవలసకు చెందిన బోను జానకి (24) హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సాక్షి, రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం శ్యాంపురం పంచాయతీ గుయ్యానవలసకు చెందిన బోను జానకి హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం అలముకుంది. బోను సూరప్పడు, జయమ్మలకు ఆరుగురు కుమార్తెలు. అయిదుగురికి వివాహాలయ్యాయి. ఆరో కుమార్తె జానకి (24) డిగ్రీ వరకూ చదువుకుంది. టీచర్ కావాలనే ఆశతో నిత్యం పుస్తకాలు చదువుతూ ఉండేది. అయితే కష్టపడితేగాని పూటగడవని కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం అక్క భారతి సహాయంతో హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో డీమార్ట్ సూపర్మార్కెట్లో పనికి కుదిరింది. అక్కడ అక్క ఇంట్లోనే కొన్నాళ్లు ఉండేది. కొద్ది నెలల క్రితం డిమార్ట్ సమీపంలోనే గదిని అద్దెకు తీసుకొని స్నేహితురాలితో కలసి ఉంటుంది. కొన్నాళ్లుగా ఆనంద్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని జానకి వెంటపడుతుండేవాడు. ఈ విషయాన్ని స్నేహితురాలితో చెప్పి జానకి బాధపడేది. ఆనంద్ వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, పనికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నానని రోదిస్తూ చెప్పింది. సంక్రాంతి పండుగకు వచ్చేస్తానని, పెళ్లి ప్రయత్నాలు చేయమని కోరింది. అయితే ఇంతలోనే మంగళవారం రాత్రి ఆమె ప్రేమోన్మాది ఆనంద్ చేతిలో హత్యకు గురైంది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తండ్రి సూరప్పడుతోపాటు కొంతమంది బంధువులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విద్యావంతురాలైన తమ కుమార్తెను పొట్టనపెట్టుకున్న ఆనంద్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న కుమార్తె హత్యకు గురికావడంతో తమను ఎవరు ఆదుకుంటారని జానకి తల్లి జయమ్మ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
చనిపోతానంటూ లేఖ రాసి..
బంజారాహిల్స్: ‘జీవితంపై విరక్తి చెందాను..బతకాలని లేదు.. చావడానికే వెళ్తున్నాను’... అంటూ ఓ యువతి లేఖరాసి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని వ్యాపారి రాజు కుమార్తె శ్రీలత(23) పీజీ పూర్తి చేసింది. ఆదివారం ఉదయం స్నేహితు రాలి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. తల్లిదండ్రులు ఆమె గదిలో గాలించగా అద్దం కింద ఓ లేఖ కనిపించింది. అందులో తాను జీవితంపై విరక్తి చెందానని చనిపోవడానికే వెళుతున్నట్లు ఉండటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెప్పినా వినలేదు.. చివరికి శవమైంది..!
సాక్షి, తిరువొత్తియూరు : ఉన్నత చదువుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విరక్తి చెందిన ఓ విద్యార్థిని బంధువైన మహిళా ఎస్ఐ ఇంట్లో మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరూర్, పశుపతి పాళయంలో సాయుధ దళం పోలీసు క్వార్టర్స్ ఉంది. ఈ క్వార్టర్సులో ఎస్ఐ రాజేశ్వరి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరి ఇంటిలో ఆమె బంధువు అరవంకురిచ్చి మేట్టుపుదూర్ ప్రాంతానికి చెందిన రామలింగం కుమార్తె నవీనా (22) ఉంటుంది. అక్కడే ప్రైవేటు కళాశాలలో బీఏ చదువుతోంది. నవీన ఉన్నత చదువులు చదవాలని కోరుతున్నట్టు తెలిసింది. ఆమె తండ్రి ఇందుకు తిరస్కరించి వివాహం చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో ఆవేదన చెందిన విద్యార్థిని మంగళవారం రాత్రి ఎస్ఐ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పశుపతి పాళయం పోలీసులు కేసు నమోదు చేసి నవీనా మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. -
కుక్కకాటుతో కాలేజీ విద్యార్థిని మృతి
చోడవరం: మగపిల్లలతో సమానంగా ఆటల్లో, చదువులోనూ రాణిస్తున్న కుమార్తెపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. కుక్కకాటుకు కూతురు మృతిచెందడం ఆ కుటుంబం లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదం అలముకుంది. పంచాయతీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన శనివారం గోవాడ గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలో గోవాడ గ్రామానికి చెందిన పైడిశెట్టి సన్యాసిరావు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిది నిరుపేద కుటుంబం. పెద్ద కుమార్తె మేఘన (16) చోడవరంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 6న కాలేజీ ముగిసిన తరువాత గోవాడలో తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడనే ఉన్న వీధి కుక్కలు మీదపడ్డాయి. కరిచి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు ఆ కుక్కలను చెదరగొట్టి, చోడవరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి, ఇంటికి పంపించారు. మధ్యమధ్యలో జ్వరం వస్తుండడంతో అదే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. శనివారం ఉదయం జ్వరం తీవ్రంగా రావడంతో మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే విశాఖపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. తల్లిదండ్రులు హుటాహుటిన కారులో విశాఖపట్నం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నోట్లోంచి నురగలుకక్కుకొని మేఘన మృతి చెందింది. కళ్లముందే కన్నకూతురు మృతిచెందడంతోఅంతాభోరున విలపించారు. నిర్లక్ష్యంగా పంచాయతీ అధికారులు ఇటీవల అన్ని గ్రామాల్లోనూ కుక్కులు వివరీతంగా పెరిగిపోయాయని జనం గంగగ్గోలు పెట్టగా కొన్ని పంచాయతీల్లో కుక్కలు నిర్మూల చర్యలు చేపట్టారు. కానీ గోవాడ పంచాయతీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. రెండు నెలలుగా ఈ గ్రామంలో కుక్కలు మరింత పెరిగిపోయాయి. గంపులుగుంపులుగా వీధుల్లో సంచరిస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మృతిచెందిన బాలిక మేఘనను కుక్క కరిచిన, రెండ్రోజుల్లో ఇదేగ్రామంలో ఆమె పెదనాన్నను కూడా కుక్క కరవడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కూడా పలువురిపై కుక్కలు దాడి చేశాయి. అయినా సర్పంచ్, అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. మేఘన మృతికి పంచాయతీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కుక్కలను నిర్మూలించకపోతే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వారు భయాందోళన చెందుతున్నారు. -
యువతి అదృశ్యం
తూప్రాన్: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాకు చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్సై పరుశురాంగౌడ్ ఆదివారం తెలిపారు. ఇస్లాంపూర్ తండాకు చెందిన లంబాడి రవీందర్ పెద్ద కూతురు సోని(16) తూప్రాన్ డివిజన్ కేంద్రంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం తండాకు చెందిన స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన సోని సాయంత్రం ఇంటికి తిరిగిరాలేదన్నారు. తోటి స్నేహితులు సినిమా చూస్తున్న సమయంలోనే సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారన్నారు. దీంతో సోని ఆచూకి కోసం చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల వద్ద ఆరాతీసినా ఎలాంటి ఆచూకీ లభించలేదన్నారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
ఇద్దరు యువతుల అనుమానాస్పద మృతి
నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ మండలం మస్కపూర్ కుంటలో ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతిచెందారు. వీరి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. మృతులు ఖానాపుర్ ఇందిరానగర్ కాలనీవాసులు సరిత, హరిషగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువతులను ఎవరైనా చంపేసి కుంటలో పడేశారా.. లేకుంటే ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
ప్రాణాలు తీసిన హోర్డింగ్..
కాకినాడలో యువతి దుర్మరణం కాకినాడ క్రైం : రోడ్డుపై నడచుకుంటూ వెళుతున్న ఓ యువతిపై అకస్మాత్తుగా భవనంపై నుంచి ఫ్లెక్సీ కూలిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పిల్లకాలువ వీధికి చెందిన వాసంశెట్టి శాంతి(21) శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తండ్రి చంద్రనారాయణ, అక్క మహేశ్వరి, బావ కేవీవీ నరసింహారావుతో కలసి అక్కకూతురు ఫస్ట్ బర్త్‌డే కోసం షాపింగ్ చేసేందుకు కాకినాడ మార్కెట్‌కి బయలుదేరి వెళ్లింది. కల్యాణి జ్యూయలర్ దుకాణంలో బంగారం కొనుగోలు చేశారు. అనంతరం సంతమార్కెట్లో బట్టలు కొనుగోలుకు వెళ్లారు. మధ్యాహ్నం రెండు కావడంతో ఆకలివేసి అంతా జ్యూస్ తాగారు. సమోసా తింటానంటూ కొనుక్కునేందుకు శాంతి వెళుతుండగా సంతమార్కెట్ ఎస్ఆర్కే సెంటర్లోని ఓ భవనం రెండో అంతస్తుపై నుంచి ఫ్లెక్సీ కూలి ఆమెపై పడింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయం కావడంతో కొన ఊపిరితో ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు తండ్రి, స్థానికులు చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. రెండు రోజుల క్రితమే ఇంద్రపాలెం వచ్చింది.. శాంతి పటవల పైడా కళాశాల్లో బీఫార్మసీ పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితం ఇంద్రపాలెం వచ్చింది. ఇంతలో షాపింగ్‌కి వెళ్లి ఫ్లెక్సీ కూలిన ఘటనలో దుర్మరణం చెందడంపై తండ్రి, అక్క కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమార్తెను ఒడిలోకి తీసుకుని ఆ తండ్రి హృదయ విధారంగా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ప్రమాద విషయం తెలియగానే సంఘటన స్థలానికి త్రీటౌ¯ŒS సీఐ దుర్గారావు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన భవన యాజమాని, యాడ్ ఏజెన్సీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
ఆర్మీ అధికారిపై అత్యాచరం కేసు
-
తల్లిని చేసి పరారైన యువకుడు
అమలాపురం టౌన్ (అమలాపురం) : అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. కల్లబొల్లి కబుర్లు చెప్పి వెంట వచ్చేలా చేసుకున్నాడు. చివరకు ఆమెను గర్భవతిని చేసి పరారయ్యాడు. చివరికి ఆ అమాయకురాలు.. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏమైందని అడుగుతుంటే.. ఓ కుర్రాడు వచ్చాడు.. తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడని ఆమె పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని అమాయకంగా చెబుతోంది. అమలాపురం రూరల్ మండలంలో మిక్చర్ కాలనీకి చెందిన 23 ఏళ్ల ఆమె అమలాపురం పట్టణంలో ఒక షాపులో పనిచేసేది. తండ్రి చనిపోయాడు. తల్లి కూలి పనికి వెళుతుంది. అక్కకు పెళైంది. ఇద్దరు తమ్ముళ్లు వడ్రంగి మేస్త్రుల వద్ద హెల్పర్లు. ఎనిమిది నెలల క్రితం భీమవరానికి చెందిన ఓ యువకుడు కూలీ పనికి అమలాపురం వచ్చాడు. ఆమెకు మాయ మాటలు లైంగికదాడి చేశాడు. ఆమె గర్భం దాల్చ డంతో అతడు పరారయ్యాడు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పతిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు.. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆస్పత్రిలో బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని... లేకుంటే బిడ్డను మాయం చేసేవారు ఉంటారని ఆమెకు పోలీసులు జాగ్రత్తలు చెప్పారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు ఈ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రాజీ చేసే ప్రయత్నాలు చేస్తుండటం అనుమానాలకు తావు ఇస్తోంది. ఈ విషయంపై రూరల్ సీఐ జి.దేవకుమార్ను వివరణ కోరినప్పుడు ‘బాధితురాలు, ఆమె కుటుంబం నుంచి ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతానికి ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశామని చెప్పారు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేసేలా ప్రయత్నిస్తానని అన్నారు. ఐసీడీఎస్ లేదా స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులు స్పందించి ఈ తల్లీబిడ్డకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
మద్యం మత్తులో యువతి వీరంగం
-
ఆ యువతుల వలలో పడ్డారో.. ఇక అంతే
తియ్యటి మాటలతో కవ్విస్తారు ఆపై మీ సొమ్మును ఖాళీ చేయిస్తారు గుర్తుతెలియని ఎస్ఎంఎస్లతో జాగ్రత్త వలలో పడ్డారో.. జీవితం సర్వనాశనం ముచ్చటగా మిస్డ్ కాల్ ఇస్తారు. ఆ పై కొందరు యువతులు తియ్యని మాటలతో ముగ్గులోకి దింపుతారు. మనసు దోచుకునేలా కబురులు చెబుతారు. మీ దగ్గర ఉన్న సొమ్మునంతా ఖాళీ చేయిస్తారు. ఆపై చెప్పాపెట్టకుండా హుడాయిస్తారు.. ఆ వలలో పడ్డారో.. ఇక అంతే.. జీవితం సర్వనాశనం.. గుర్తుతెలియని ఎస్‌ఎంఎస్‌లతోనూ జాగ్రత్త సుమా..! తిరుపతి తుడా: ఇటీవల యువత సామాజిక మాధ్యమాలపై మోజు పెంచుకుంటోంది. యువతీ, యువకులు ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నారు. వాటి యావలోనే బతుకు వెళ్లదీస్తున్నారు. అవికాస్త వికటించడంతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి నగరంతోపాటు జిల్లాలోనూ పెచ్చుమీరుతున్నారు. తిరుపతిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న యువకుడికి పది రోజుల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. మొదట పట్టించుకోలేదు. మరుసటి రోజు మళ్లీ అదే నంబర్ నుంచి మిస్డ్ కాల్ రావడంతో తెలిసిన వాళ్లెవరైనా ఉంటారేమోనని తిరిగి కాల్ చేశాడు. అటుపక్క నుంచి ఓ యువతి హలో.. పవనే కదా.. అంటూ మాటలు కలిపింది. ఆపై ఇద్దరూ రోజూ చాటింగ్‌లో హాయ్.. బాయ్‌లు చెప్పడం మొదలు పెట్టారు. వారం తర్వాత సార్ ఏమీ అనుకోవద్దు.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.. డబ్బులు అవసరం ..ఏడుపొస్తోంది.. అనగానే కరిగిపోయిన అతను ఎంత అవసరమని అడిగాడు. రూ.10 వేలు.. సాయంత్రం కల్లా ఇవ్వకుంటే పెద్ద సమస్య వచ్చి పడుతుందని చెప్పడంతో అతను నమ్మి ఆ మొత్తాన్ని ఆ యువతి చేతిలో పెట్టాడు. ఆపై మాటలు కట్.. నంబర్ స్విచ్చాప్.. ఖంగుతిన్న ఆ యువకుడు డబ్బుల కోసమే ఇదంతా జరిగిందని తెలుసుకుని బాధపడ్డాడు. తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన ఓ యువకుడికి నాలుగు రోజుల క్రితం వాట్సాప్‌కు హయ్ అని ఓ మెస్సేజ్ వచ్చింది. రాత్రి 9 దాటితే అలా ప్రతిరోజూ హాయ్.. హలో అంటూ మెసేజ్‌లు రావడంతో తిరిగి హౌ ఆర్ యూ అని మెసేజ్ పెట్టాడు. ట్రూ కాలర్ ద్వారా అప్పటికే అతని పేరు తెలుసుకున్న ఓ యువతి మీరు నాకు తెలుసు.. నేను ఎవరినో కనుక్కోండి చూద్దాం అంది. అర్థంగాక అతను జుట్టు పీక్కున్నాడు. మీరు ఎవరు అని అడగడం మొదలు పెట్టాడు. ఆ యువతి బాలాజీ కాలనీలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటానని చెప్పింది. నేను ఇంత చెప్పాను మరి మీ గురించి చెప్పవచ్చు కదా.. అంటూ అతని డేటా లాగుతూ రోజూ తియ్యని మాటలు చెప్పడం మొదలు పెట్టింది. రెండు రోజుల క్రితం కాల్ చేసి.. నా ఫ్రెండ్‌ను ఆస్పత్రిలో చేర్పించాము.. అర్జెంట్‌గా రూ.18 వేలు కట్టమంటున్నారు.. హాస్టల్లో ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు.. వాళ్ల అమ్మానాన్మలు రావడానికి ఒక రోజు పడుతుంది. మనీ అడ్జస్ట్ చెయ్యి.. వాళ్లు రాగానే తీసి ఇస్తాను అని చెప్పడంతో అతను నిజమే అని నమ్మాడు. తన వద్ద రూ.12,000 ఉందని చెప్పడంతో చాల్లే మిగతా నా దగ్గర ఉంది అని చెప్పి ఆ యువతి స్కూటీలో మాస్క్‌తో వచ్చి తీసుకెళ్లింది. ఆపై ఆ యువతి అడ్రస్ మాయమయ్యింది. ఇప్పటికీ అడ్రస్ లేదు. -
బాలికను వేధిస్తున్న యువకుడిపై కేసు
హైదరాబాద్: ప్రేమించమంటూ బాలికను బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ ఎస్ఐ అబ్దుల్ అలీ తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ కృషి నగర్‌కు చెందిన బాలిక(17)ను అజయ్‌నగర్ కాలనీకి చెందిన డేరింగుల మల్లికార్జున్ (20) కొంతకాలంగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి వచ్చి యువతి అన్న ఇమ్రాన్‌ను బెదిరించాడు. దీంతో బాధితులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మల్లికార్జున్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నృత్యం.. అద్భుతః
-
సీటు బెల్టు కాపాడింది..!
కొలనుకొండ (తాడేపల్లి రూరల్): జాతీయ రహదారిపై తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ పల్టీ కొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే సీటు బెల్టులు పెట్టుకున్న కారణంగా వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న మారుతి ఆల్టో కారులో ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్నారు. అతి వేగంగా కారు నడపడంతో, కారు అదుపు తప్పి ముందు వెళుతున్న మరో కారును ఢీకొట్టి, జాతీయ రహదారి నుంచి 30 అడుగుల దూరంలో పంట పొలాల్లో పడిపోయింది. మూడు పల్టీలు కొట్టి, వెనుక, ముందు అద్దాలు పగలడంతోపాటు కారు క్యాబిన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఓ యువతికి స్వల్ప గాయాలు కాగా, మరో యువతి తలకు గాయమైంది. ఇద్దరూ సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే పెద్దగా గాయపడలేదని వారు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువతులు బస్సులో విజయవాడ వెళ్లిపోయారు. -
ప్రేమికులను విడదీసిన మృత్యువు
అప్పటి వరకూ ఊసులాడుకున్నారు.. ఊహలలోకంలో విహరించారు.. బైక్‌పై షికారుకు బయలుదేరారు. అయితే ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఆ ప్రేమికుల్లో ఒకరిని అనంతలోకాలకు తీసుకెళ్లింది. ప్రియురాలు విగతజీవిగా పడి ఉండగా ప్రియుడు గుండెలవిసేలా రోదించాడు. చూపరులకు కన్నీళ్లు తెప్పించాడు. పెనుమాక (తాడేపల్లి రూరల్) : తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక గ్రామంలో శనివారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు ప్రేమికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న యువకుడు గాయాలపాలు కాగా, ప్రియురాలు మృత్యువాత పడింది.వివరాలు.. విశాఖపట్నం మద్దెలపాలేనికి చెందిన హరిశివాజి విజయవాడలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ ఒక ప్రైవేటు కళాశాలలో ప్రైవేటుగా డిగ్రీతో పాటు సీఏ చదువుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కురగల్లు గ్రామానికి చెందిన పెద్ది దుర్గారాణి విజయవాడలోని నక్షత్ర హాస్టల్లో ఉంటూ సీఏ చదువుతోంది. వీరిద్దరూ కానూరులోని ఓ కళాశాలలో సీఏ చదువుతున్నారు. మూడున్నరేళ్ల క్రితం వీరిమధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. శనివారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి విజయవాడ నుంచి ద్విచక్ర వాహనంపై అమరావతి బయలుదేరారు. పెనుమాక బొడ్రాయి సమీపంలో ఉన్న మలుపు వద్ద హరిశివాజి ద్విచక్ర వాహనాన్ని నిలపగా, వీరిని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఎడమ వైపుకు వచ్చి బైక్‌కు తగలటంతో దుర్గారాణి ద్విచక్ర వాహనంపై నుంచి బస్సు వెనుక చక్రం కింద పడింది. బస్సు దుర్గారాణి నడుంపైకి ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హరిశివాజి నుంచి వివరాలు సేకరించి, బైక్‌ని, శివాజిని పోలీస్‌స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఏ పూర్తయిన వెంటనే ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్న తరుణంలో వీరిపై విధి కక్షకట్టింది. దుర్గారాణి మృతి చెందడంతో హరిశివాజి కన్నీరుమున్నీరుగా విలపించాడు. దుర్గారాణి తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పాలని, కలిసి జీవించాల్సిన తమ ఇద్దరిలో ఒకరిని దేవుడు తీసుకువెళ్లాడని, ఇద్దరినీ తన వద్దకు తీసుకెళితే బాగుండేదని హరిశివాజి రోదన చూపరులకు కంటతడి పెట్టించింది. -
చెడు అనకు.. కనకు.. వినకు
సీతానగరం (తాడేపల్లి రూరల్): సీతానగరం పుష్కర ఘాట్‌లో ముగ్గురు యువతులు మూడు కోతుల సామెత చందంగా చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు.. సంకేతాలు చూపుతూ కనిపించారు. పుష్కరాల్లో భాగంగా సీతానగరం ఘాట్‌లో శనివారం పలువురు యువతులు తమ ఫోటోలను సెల్ఫీల్లో బంధిస్తూ, కష్ణమ్మ జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్నారు. -
హత్యా.. ఆత్మహత్యా?
యువతి అనుమానాస్పద మృతి అత్యాచారయత్నం చేసి హతమార్చారంటూ ఇద్దరు యువకులను చితకబాదిన స్థానికులు వారిలో ఒక యువకుడు మృతి మహ్మదీయపాలెంలో ఘటన.. ఉద్రిక్తత నిజాంపట్నం/రేపల్లెరూరల్: ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా...ఆ యువతిపై అత్యాచారయత్నం చేసి హత్యచేశారంటూ స్థానికులు ఇద్దరు యువకులను చితకబాదడంతో వారిలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయ పాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... మహ్మదీయపాలెంకు చెందిన షేక్ జాస్మిన్ (19) తన తల్లి మెహరునిసా, సోదరులు ఇద్దరూ పొరుగు ఇంటివారి శుభకార్యానికి మట్లపూడి వెళ్లగా ఆదివారం ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ సమయంలో అడవులదీవి గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్‌కుమార్ ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతో నడుముకు ఉన్న బెల్టును తీసి మెడకు చుట్టి దారుణంగా హతమార్చారని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జాస్మిన్ ఉరివేసుకుంటానంటోందటూ పక్కింట్లో ఉన్న పలువురు వృద్ధులకు శ్రీసాయి,పవన్‌కుమార్ తెలపడంతో స్థానికులు వచ్చి చూసేటప్పటికీ జాస్మిన్ కిందపడి మృతి చెంది ఉందని తెలిపారు. ఉరివేసుకోకుండా ఎలా మతిచెందిందంటూ వీరిద్దరినీ ప్రశ్నించడంతో ఉరివేసుకుని మృతి చెందిందని, తామే తీశామన్నారని తెలిపారు. వంటగదిలో ఉరివేసున్నట్లు వీరిద్దరూ ఆరోపిస్తుంటే బెడ్రూమ్లోని మంచంపై నెత్తుటి మరకలు, తెగిపడిన బెల్టు ఎలా ఉన్నాయంటూ స్థానికులు వారిద్దరినీ చితకబాది చెట్టుకు కట్టివేశారు. వేముల శ్రీసాయి గతంలో పలుసార్లు ఇంటిముందుగా ద్విచక్రవాహనంపై తిరుగుతుండేవాడని, ఇళ్లలోని దారుల్లో తిరిగే పని మీకు ఏమిటంటూ పలుమార్లు పలు సార్లు హెచ్చరించడం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు లేని సమయం చూసి ఇంట్లోనికి చొరబడి బలత్కారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వేముల శ్రీసాయి బాపట్లలో బీటెక్ చదువుతున్నాడు. జొన్నా పవన్‌కుమార్ రేపల్లెలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. పోలీసుకులకు స్థానికులకు తోపులాట.. సంఘటనా స్థలాన్ని అడవులదీవి ఎస్ఐ కాటూరి శ్రీనివాసరావు పరిశీలించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరినీ స్టేషన్‌కు తరలించేందుకు వీలులేదంటూ మృతురాలి బంధువులు, స్థానికులు అడ్డుపడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో రేపల్లె సీఐ మల్లికార్జునరావు, నగరం ఎస్ఐ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని, బాధితులకు న్యాయం జరిగేలా దోషులకు శిక్షపడేలా చూస్తామని హామీ నిచ్చారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో కేసును తప్పు దోవ పట్టిస్తారని, ఇక్కడినుంచి వారిద్దరినీ తీసుకు వెళితే తమకు న్యాయం జరగదని కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాము న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి పోలీసులు వేముల శ్రీసాయిని, జొన్నా పవన్‌కుమార్‌ను తీసుకు వెళుతుండటంతో బంధువులు, స్థానికులు అడ్డగించారు. ఈసందర్భంగా పోలీసులకు, స్థానికులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండునెలల్లో వివాహం.. ఇంతలోనే.. జాస్మిన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాస్మిన్ తండ్రి జిలానీ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో తల్లి మెహరునిసా కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు లారీ డ్రైవర్, చిన్న కుమారుడు ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. జాస్మిన్ 10వ తరగతి చదివి రెండు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు ఇటీవల నగరం మండలం పెదపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగితో వివాహం కుదిరింది. మరో రెండు నెలల్లో వివాహం జరగనున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని రేపల్లె సీఐ మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు జాస్మిన్ హత్యకు గురైందని ఆరోపిస్తున్నారని, సంఘటనా స్థలాన్ని తాము పరిశీలించి హత్యగానే అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగతా విషయాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. నిందితుల్లో ఒకరి మృతి జాస్మిన్ మృతి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో వేముల శ్రీసాయి(18) మతిచెందాడు. జాస్మిన్ మృతి చెందిన ప్రదేశం నుంచి పోలీసులు వేముల శ్రీసాయి, జొన్న పవన్‌ను తీసుకుని భట్టిప్రోలు వెళ్లగా వేముల శ్రీసాయి ఆరోగ్య పరిస్థితి విషమించిందని , రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా వైద్యశాల సమీపంలో మృతి చెందినట్లు రేపల్లె పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు చెప్పారు. మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. బంధువుల ఆందోళన వేముల శ్రీసాయి మృతి విషయం తెలుసుకున్న అతని బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. వేముల శ్రీసాయిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ వీరు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని వేముల శ్రీసాయి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
చెట్టుకు వేలాడుతూ రెండు మృతదేహాలు!
జగదేవపూర్: ఎప్పటిలాగే ఓ గొర్రెల కాపరి తన గొర్రెల మందతో అడవికి వెళ్లాడు. ఆ ప్రాంతమంతా గుట్టలమయం. ఎటూ చూసినా గంభీరంగా కనిపించే ప్రాంతం. రోజూ అదే ప్రాంతానికి వెళుతుండటంతో తనకు అంతగా భయమనించలేదు కాబోలు.. కానీ అనుకోకుండా తనకు చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలు కనిపించాయి. అందులోనూ యువతుల మృతదేహాలు కుళ్లిపోయి ఉండటంతో గొర్రెల కాపరి బెదిరిపోయాడు. ఈ ఘటన ఎక్కడో కాదు... మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం కొండపోచమ్మ గుట్టల్లో సోమవారం వెలుగుచూసింది. గుర్తు తెలియని ఇద్దరు యువతుల మృతదేహాలు క్షీణించిన స్థితికి చేరాయి. గొర్రెల కాపరి గౌస్ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వడంతో బయటకు వచ్చింది. డీఎస్పీ శ్రీధర్ సహా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు యవతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని సమాచారం. కేవలం వస్త్రాలు, లోపల అస్తిపంజరాలు మాత్రమే మిగలడంతో మృతి చెంది చాలా రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిపై సామూహిక అత్యాచారం, హత్య
నల్గొండ: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పట్టణ సమీపంలోని మర్రిగూడ రహదారిలో గుర్తుతెలియని యువతి(23)పై దుండగులు సామూహిక అత్యాచారం చేసి పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన ఆదివారం వేకువజామున జరిగింది. కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. యువతి మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది. పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. శవం పక్కన మద్యం, వాటర్ బాటిల్ పడి ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని గుడిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతురాలి వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రియుడి ఇంటిఎదుట యువతి బైఠాయింపు
సిరిసిల్ల టౌన్ : ప్రేమించానన్నాడు.. జీవితాంతం తోడుంటానని బాసలు చేశాడు. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసు కుంటానని మాటిచ్చాడు. ఇంతలోనే ఏమైందో ఏమో పెళ్లి చేసుకుందామని ప్రియురాలు కోరగా.. కుదరదని ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోరాటానికి దిగింది. ఈ సంఘటన సిరిసిల్లలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. సిరిసిల్ల మండలం తాడూరుకు చెందిన కొత్వాల శిరీష(23) ఇంటర్ పూర్తిచేసి బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన బైరి చందు(25) మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఫోన్లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు. శిరీషను చందు కుటుంబ సభ్యులకు చూపించాడు. ఏడాది క్రితం ప్రియురాలి ఇంటికి వెళ్లి పెళ్లి చేయమని అడిగాడు. కులాలు వేరని చెప్పినా వినకుండా పెళ్లికి ఒప్పించాడు. తన చెల్లెకు పది తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలుపగా...శిరీష తండ్రి హన్మాండ్లు తాను కూడా కూతురుకు అంతే మొత్తంలో కట్నకానుకలు ముట్టజెబుతానన్నాడు. ఇక పెళ్లికి సిద్ధమవుతుండగా వారం రోజులుగా చందు పెళ్లి చేసుకోవడం కుదరదని ముఖం చాటేస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన శిరీష తనతో ప్రేమాయణం జరిపిన సాక్ష్యాలతోపాటు ప్రగతినగర్‌లోని చందు ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం పెరిగి పెద్దదవుతుందన్న భావనతో చందు ఇంట్లోవారు తాళం వేసుకుని వెళ్లిపోయారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనని శిరీష భీష్మించుకుని కూర్చుంది. ఆమెకు మహిళ, కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. -
అత్యాచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
-
యువతి అదృశ్యంపై కేసు నమోదు
మాదాపూర్: హైదరాబాద్‌లో యువతి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జైపూర్‌కి చెందిన సస్రీ నిర్లిప్త(24) నిరుద్యోగురాలు. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేట సైబర్‌హిల్స్‌లో తన అన్నయ్య ఇంట్లో నివాసముంటుంది. ఈ నెల 10వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన సస్రీ నిర్లిప్త తిరిగి రాకపోవడంతో ఆమె అన్నయ్య పరంజిత్ దాస్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో యువతి మృతి
నాగోలు: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటనలో ఆ యువతిని కాపాడబోయిన మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మపల్లికి చెందిన నైనిషా (23) ఎల్బీనగర్ శివగంగకాలనీలో మేనమామ నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో దుస్తులు ఉతికి బాల్కనీలోని జీఐ వైరుపై ఆరవేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. వెంటనే కింద నుంచి పైకి వచ్చిన గీతావాణి విద్యుత్ షాక్‌కు గురైన నైనిషాను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా షాక్‌కు గురైంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. నైనిషా చికత్స పొందుతూ మృతి చెందింది. -
బాలికపై సామూహిక అత్యాచారం
శివ్వంపేట (మెదక్): బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన బాలిక (16) శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలోని తన సోదరి ఇంటికి మూడు రోజుల క్రితం వచ్చింది. సోమవారం గ్రామ శివారుకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన యువకులు చింతగారి బాల్‌రాజ్, తలారి ప్రభాకర్ ఆమెను అటకాయించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం గ్రామంలోకి వచ్చిన బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. పాంబండ గ్రామ పెద్దలు సదరు యువకులను గుర్తించి పిలిపించారు. ఒకే కులానికి చెందినందున బాలికను పెళ్లి చేసుకుంటానని ఇద్దరు యువకుల్లో ఒకరు అంగీకరించారు. అలా చెప్పిన యువకుడు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి చెప్పా పెట్టకుండా గ్రామం నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు బుధవారం శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ సీఐ రమేష్‌బాబు తెలిపారు. -
రూ.88 వేలకు బాలిక అమ్మకం
బిహార్‌లో సర్వసాధారణంగా మారిన దురాచారం పట్టించుకోని అధికార యంత్రాంగం పట్నా: బాలికలను అంగట్లో పెట్టి బహిరంగంగా వేలం వేస్తున్నార ని, మూడు వేల రూపాయలు పెడితే ఎవరైనా కొనుక్కోవచ్చంటూ ప్రత్యక్ష ఉదాహరణతో 1980 దశకంలో వచ్చిన వార్తాకథనాలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దేశ రాజకీయాలను కూడా కుదుపు కుదిపేశాయి. అప్పుడే కాదు ఇప్పటికి కూడా అమ్మాయిలను అంగట్లో పెట్టి అమ్ముతున్నా, సంబంధిత ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. బీహార్‌కు చెందిన ఓ 14 ఏళ్ల అమ్మాయిని బహిరంగ వేలంలో పంజాబ్‌కు చెందిన రాజేష్ అనే ఓ యువకుడు 88 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ యువకుడి కబంద హస్తాల నుంచి ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటు పట్నా, ఆగ్రాలలో అమ్మాయిలను బహిరంగంగానే వేలం వేస్తున్నారని, తనతోపాటు తీసుకొచ్చిన ఓ ఐదుగురు అమ్మాయిలను కూడా అలాగే వేలం వేశారని ఆ బాలిక పోలీసులకు వివరించింది. 'మూడు నెలల క్రితం పట్నాలోని ఓ చోట నాతో సహా ఆరుగురు బాలికలను పెళ్లి కూతుళ్ల పేరిట వేలం వేశారు. అందులో నన్ను రఘువీర్ అనే మరో యువకుడి సహాయంతో పంజాబ్‌లోని అబోహర్ పట్టణానికి చెందిన రాజేశ్ అనే యువకుడు 88 వేల రూపాయలకు కొన్నాడు. నన్ను తీసుకొని ఆగ్రాకు వెళ్లి అక్కడ ఓ అంగట్లో నన్ను ఎక్కువ రేటుకు అమ్మేందుకు ప్రయత్నించాడు. నేను అంత అందంగా లేకపోవడంతో ధర ఎక్కువ పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నన్ను పంజాబ్ తీసుకెళ్లి ఓ ఇంటిలోని ఓ గదిలో బంధించాడు. మూడు నెలలుగా సరైన తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెడుతూ వచ్చాడు. ఆ హింసలను తట్టుకోలేక ఓ రోజు గట్టిగా ఏడిస్తూ కేకలు వేశా....ఆ కేకలు విన్న పొరుగింటివారు 'సేవా నారాయణ్ సేవా సొసైటీ' అనే ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. వారు పోలీసుల సహాయంతో వచ్చి నన్ను విడిపించారు' అని ఆ బాలిక తన గాథను మీడియాకు వివరించారు. పోలీసులు రాజేశ్‌ను, రఘువీర్‌లను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్నా అంగట్లో అమ్మిన ఇతర ఐదుగురు బాలికలు విషయమై ఆచూకి తీస్తున్నారు. -
ఫేస్బుక్ ప్రేమ విఫలమై..
కోవూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించిన యువకుడు ఆమె ఇంటిముందే ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పవన్‌కుమార్‌కు ఫేస్బుక్ ద్వారా కోవూరుకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. పవన్‌కుమార్ కోవూరు వచ్చి ఆ యువతిని కలసివెళ్లేవాడు. ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో పెళ్లికి ససేమిరా అన్నారు. మరో యువకుడితో ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న పవన్‌కుమార్ రెండు రోజుల కిందట తన తల్లి, సోదరితో కలసి కోవూరు వచ్చి ఆ యువతి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశాడు. వారు నిరాకరించడంతో పాటు ఆ యువతి కూడా తనను మరిచిపోవాలని సూచించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆమె ఇంటి ముందే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధిత కుటుంబసభ్యులు వెంటనే పవన్‌కుమార్‌ను నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
యువతుల అక్రమ రవాణాలో స్త్రీలదే కీలకపాత్ర!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో యువతులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపే ముఠాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ వ్యవహారాల్లో మహిళలే కీలక పాత్ర పోషిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ప్రత్యేక బృందాలు చేసిన దాడుల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రానికి చెందిన యువతులతోపాటు పొరుగు రాష్ట్రాల యువతులను చంద్రాపూర్‌కు తరలించి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపినట్లు సమాచారం అందుకున్న సీఐడీ ఎస్పీ కె.వేణుగోపాలరావు నేతృత్వంలోని బృందం ఈనెల 22న అక్కడకు చేరుకుంది. చంద్రాపూర్ పోలీసుల సహకారంతో పలు వ్యభిచార గృహాలపై దాడులు చేసి మొత్తం 39 మంది యువతులను కాపాడింది. బాధితుల్లో తెలంగాణకు చెందిన 18 మంది యువతులు, ఆరుగురు మైనర్లు, మహారాష్ట్రకు చెందిన 11 మంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన చెరొకరు ఉన్నట్లు గుర్తించింది. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన 46 మంది నిందితులను గుర్తించి వారిలో 44 మందిని అరెస్టు చేసింది. వీరిలో 30 మంది మహిళలే ఉండటంతో అధికారులు సైతం ముక్కున వేలేసుకున్నారు. నిందితుల్ని అక్కడి కోర్టులో హాజరుపరిచిన అధికారులు పీటీ వారంట్‌పై గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాధిత యువతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆయా అధికారులకు అప్పగించిన సీఐడీ బృందం తెలంగాణ, ఏపీలకు చెందిన వారిని రెస్క్యూ హోంలకు తరలించి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్స్... యువతుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కేంద్రాల్లో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యభిచార కేంద్రాలకు యువతులను తరలించే ముఠాల ఆటకట్టించేందుకు జిల్లాల స్థాయి నుంచి కృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు 423 కేసులు నమోదయ్యాయని, సీఐడీ దాడుల్లో 646 మంది బాధితులకు విముక్తి కలిగిందని ఆయన వివరించారు. 715 మంది నిందితులు, 325 మంది విటులను అరెస్టు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో ఐజీ బాలనాగదేవి పాల్గొన్నారు. -
శిథిలాల కింద చిక్కుకున్న యువతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ శిథిలాల కింద ఓ యువతి, యజమాని చిక్కుకుపోయారు. శనివారం రాత్రి పశ్చిమ విష్ణు గార్డెన్ ఏరియాలో భవనం కుప్పకూలింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కొంత మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద మరికొంతమంది ఉంటారని భావిస్తున్నట్టు పశ్చిమ ఢిల్లీ డీసీపీ పుష్పేంద్ర కుమార్ చెప్పారు. ప్రమాద స్థలానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. -
ఫోర్న్ వీడియోల సూత్రధారి ఒక్కడే
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అభ్యంతరకర వీడియో పోస్టు చేసిన కేసులో బెంగళూరుకు చెందిన యువకుడే ప్రధాన సూత్రధారిగా సీబీఐ నిర్ధారించింది. కొద్దిరోజుల కింద ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియోను దుండగులు సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేశారు. వాట్సాప్‌లో ఈ వీడియో బాగా సర్క్యూలేట్ అవడంతో హైదరాబాద్ కు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెల్ ఎల్ దత్తుకు లేఖ రాసింది. సుమోటోగా విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం నిందితులను అరెస్ట్ చేయాలని సీబీఐను ఆదేశించింది. లైంగిక చర్యలు చిత్రీకరిస్తున్న ఆరోపణల పై కౌశక్ కౌనర్పై మేలో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది. బెంగళూరులోని సంపన్నకుటుంబానికి చెందిన కౌశక్ కౌనర్(20) పోర్న్ సైట్ల నుంచి భారతీయ మహిళలు, అమ్మాయిల అభ్యంతరకర వీడియోలని డౌన్లోడ్ చేసి వాటిని ఎడిట్ చేసి తిరిగి ఇంటర్నెట్లో(వీడియోని చూడడానికి ఎవరైనా క్లిక్ చేస్తే తన ఖాతాలోకి డబ్బు రావడానికి) పోస్ట్ చేసేవాడని సీబీఐ విచారణలో తేలింది. అతని నుంచి 470 పోర్న్ వీడియో క్లిప్‌లతో పాటూ అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్ వేర్, హార్డ్ డిస్క్, రహస్యకెమరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. సీబీఐ అధునాతన ఫోరెన్సిక్ సాప్ట్ వేర్‌ను ఉపయోగించి ఈ అభ్యంతరకర వీడియోల మూలాలని కనుగొన్నారు. -
మిస్డ్ కాల్ ఇచ్చి ముగ్గులోకి దించుతారు
వరంగల్ : మీడియా ముసుగులో నలుగురు వ్యక్తులు బృందంగా ఏర్పడి పలువురిని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఎప్పుడూ వినని టీవీ చానళ్ల పేర్లు చెబుతూ ఈ ముఠా సమాజంలో పేరున్న వ్యక్తులను టార్గెట్ చేస్తుంది. ముఠా వ్యక్తి ఒకరు సదరు టార్గెట్ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ ఇస్తారు. తిరిగి వారు ఫోన్ చేయగానే.. ఇటు వైపు నుంచి ఓ యువతి మాట్లాడుతుంది. ఒకసారి పరిచయం అయిన తర్వాత వారికి పదే పదే ఆమె ఫోన్ చేస్తుంటుంది. మాటలతో సదరు వ్యక్తులను ట్రాప్ చేయడం ఆమె పని. అయితే ఆమె వెనుక సిండికేట్ సభ్యులు ఉండి ఈ తతంగం నడిపిస్తారు. మొదట బేకరీలు, స్టార్ హోటళ్లలో పరిచయం పెంచుకోవడం.. చివరకు సదరు వ్యక్తి యువతిని సీక్రెట్‌గా కలిసే విధంగా రంగం సిద్ధం చేస్తారు. ఇద్దరు కలిసి ఇల్లు లేదా లాడ్జికి వెళ్లగానే క్షణాల్లో ఈ నలుగురు రంగంలోకి దిగుతారు. ఆ ఇద్దరు లోపలికి వెళ్లి గడియ వేసుకోగానే.. వీరు బయటి నుంచి తలుపు కొడతారు. వారు తలుపులు తీయగానే ఇద్దరినీ కెమెరాలో చిత్రీకరిస్తారు. ఇక్కడ కెమెరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ముందుగా తాము ఎంచుకున్న గదికి సదరు వ్యక్తి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. గదిలోనే సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి, ఇద్దరు లోనికి వెళ్లగానే తలుపు కొడతారు. కెమెరాల్లో రికార్డు అయిన అంశాన్ని చూపెట్టి భయపెడతారు. ఇక రెండవ విధానంలో.. సదరు వ్యక్తి చెప్పిన చోటికి యువతి రావాల్సి వస్తే మాత్రం కెమెరాలతో సిద్ధంగా ఉండి వారు గదిలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే వీరు ఎంట్రీ ఇస్తారు. ఇలా చిత్రీకరించిన తర్వాత తమ చానళ్లలో ప్రసారం చేస్తామని బెదిరిస్తారు. బేరసారాలకు దిగుతారు. లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి గుంజుతారు. గతంలో వీరి చేతికి కేయూకు చెందిన ఓ ప్రొఫెసర్ చిక్కి రూ. లక్షలు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇలా సమాజంలో మహిళల వ్యసనం ఉన్న కొందరు ప్రొఫెషనల్స్‌ను, పెద్ద మనుషులను కూడా మభ్యపెట్టి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తారు. బయటపడిందిలా... తాజాగా వీరు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ట్రాప్ చేశారు. యధాతథంగా ఫోన్‌కాల్ వెళ్లడం.. మిగిలిన తతంగమంతా పూర్తై... చివరకు ఆ ఉపాధ్యాయుడు వారి కెమెరాలకు చిక్కాడు. దీంతో ఈ బృందంలోని వారు రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు ఒప్పందానికి వచ్చినా.. ఒక చానల్లో స్క్రోలింగ్ వచ్చింది. అయితే వీరు తనతో మాట్లాడిన మాటలను సదరు ఉపాధ్యాయుడు ముందుగా రికార్డు చేసి పెట్టుకున్నాడు. స్క్రోలింగ్ రావడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. -
పిడుగుపాటుతో యువతి మృతి
-మరో ఇద్దరి పరిస్థితి విషమం ఆదిలాబాద్(కాగజ్‌నగర్): పిడుగుపాటుతో ఒక యువతి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని మాలిని పంచాయతీ పరిధిలోని ఆలీగూడలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ముగ్గురు యువతులు పొలం పనులకు వెళ్లారు. ఇంతలో వర్షం రావడంతో సమీపంలోని చింతచెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో గిరుజాబాయి(18), అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన గ్రామస్తులు ఇద్దరు యువతులను ఆస్పత్రికి తరలించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆస్పత్రికి తరలించడానికి కొంత ఆలస్యం అయినట్లు సమాచారం. -
ప్రియుడే కిడ్నాపర్.. తేల్చిన పోలీసులు
భాగ్యనగర్ కాలనీ(హైదరాబాద్): కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరణకు గురైనట్లు భావిస్తున్న ఓ యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యువతిని అపహరించుకుపోయినట్లు ఫిర్యాదును అందుకున్న కూకట్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా యువతిని అపహరించింది ఆమె ప్రియుడేనని తేల్చారు. ఇద్దరూ కలసి గుంటూరులో ప్రేమ వివాహం చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. వివేకానందనగర్ కాలనీలోని తన బంధువుల ఇంటికి వేసవి సెలవుల్లో వచ్చిన మంజుషా పిన్ని పద్మావతితో కలిసి సోమవారం మార్కెట్‌కు వెళ్లి వస్తోంది. వారు ఇంటి ముందుకు రాగానే అదే సమయంలో మంజుషాపై దాడి చేసి కారులో ఎక్కించుకొని పరారయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సదరు యువతి శ్రీరాం అనే యువకుడితో 2010 నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు శ్రీరాం బంధువులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంజుషాను శ్రీరాం తన స్నేహితులతో కలిసి పథకం ప్రకారం.. కారులో అపహరించుకు వెళ్లి గుంటూరులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. బంధువుల ద్వారా యువతిని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ పురుషోత్తం తెలిపారు. -
హైదరాబాద్ లో యువతి కిడ్నాప్
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ఓ యువతిని కొందరు దుండగులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన మంజూష(22) అనే యువతి కూకట్‌పల్లిలోని సోదరి ఇంటికి 15 రోజుల కిందట వచ్చింది. అయితే సోమవారం రాత్రి మార్కెట్‌కు వెళ్లిన మంజూషను కారులో వచ్చిన కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్(అబిడ్స్): నగరంలోని జియాగూడలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. జియాగూడక చెందిన ప్రియాంక(19) సమర్ధనారయణ ఆశ్రమంలోని చెట్ల పొదల్లో విగతజివిగా కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియురాలు కోసం వెళితే.. ప్రాణాలు తీశారు
-
ప్రియురాలిపై కత్తితో దాడి.. ప్రియుడి హత్య
కూకట్పల్లి(హైదరాబాద్): నగరంలో ఒక ప్రేమోన్మాది యువతికి పెళ్లి కుదరడంతో ఇంటికి వెళ్లి ఆమెపై, అడ్డమొచ్చిన తల్లి, తమ్ముడిపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని కూకట్పల్లి ప్రశాంతినగర్‌లో జరిగింది. వివరాలు. .ప్రశాంతినగర్‌కు చెందిన వల్లభారావు తన కుమార్తెకు పెళ్లి సంబంధం కాయం చేశారు. అయితే, రాజు(వివరాలు తెలియాల్సిఉంది) అనే యువకుడు శుక్రవారం ఉదయం వల్లభారావు ఇంటికి వచ్చి తన కుమార్తెను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెపై కత్తితో దాడికి యత్నం చేశాడు. అదే సమయంలో పక్కనే ఉన్న యువతి తల్లి అడ్డురావడంతో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకున్న యువతి తమ్ముడిపై సైతం కత్తితో దాడి చేశాడు. అనంతరం యువతిని కత్తితో నరికాడు. ఇది చూసి ఆగ్రహించిన యువతి తండ్రి, రాజు వద్ద ఉన్న కత్తిని లాక్కొని అతన్ని హతమార్చాడు. గాయపడ్డ ముగ్గరిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందింస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతికి కత్తిపోట్లు.. ఆస్పత్రిలో పెళ్లాడిన ప్రేమికుడు
చెన్నై: ప్రేమించిన యువతి కత్తి పోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ప్రేమికుడు ఆమెకు ఆస్పత్రిలోనే తాళి కట్టాడు. తమిళనాడులోని తిరువారూరు జిల్లా వవుసినగర్కు చెందిన కలెసైల్వి అనే యువతి... అదే ప్రాంతానికి చెందిన ఇళయారాజా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను కలెసైల్వి బంధువులు వ్యతిరేకించారు. దీంతో కలెసైల్వి ప్రేమికుని ఇంట్లో ఆశ్రయం పొందింది. వివాహానికి తాళి, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు గురువారం రాత్రి ఇళయరాజా అమ్మాపేటకు వెళ్లాడు. ఆ సమయంలో కలెసైల్వి చిన్నాన్నలు కలియపెరుమాల్, రఘుపతి, అతని కుమారుడు ఆనంద్, కలెసైల్వి తమ్ముడు మణికంఠన్ అక్కడికి వచ్చారు. ఆగ్రహించిన వారు కలెసైల్విపై కత్తితో దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన కలెసైల్విని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇళయరాజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కలెసైల్వి మెడలో శుక్రవారం ఉదయం తాళికట్టి తన అర్ధాంగిగా చేసుకున్నాడు. కాగా, దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదుచేసి రఘుపతిని అరెస్టుచేశారు. అతన్ని నీడామంగళం కోర్టులో హాజరుపరచి కస్టడీకి తరలించారు. -
మరొకరితో నిశ్చితార్ధం.. ప్రియుడితో యువతి బలవన్మరణం
తూప్రాన్(మెదక్): మరో నెలలో పెళ్లి జరగాల్సిన ఆ ఇంటిలో విషాదం ఆలుముకుంది. మంచి చదువులు చదివించి ఓ ఇంటిదాన్ని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పడాల్‌పల్లి గ్రామానికి చెందిన శినంగారం రాజు యాదవ్, లలిత దంపతుల కుమార్తె మౌనిక(20) తూప్రాన్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ప్రస్తుతం పరీక్షలు రాస్తోంది. అయితే, మౌనిక అదే గ్రామానికి చెందిన బత్తుల లింగాయ్యయాదవ్ కుమారుడు నగేష్(24)తో ఆమె ప్రేమలో పడింది. అతడు రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో వారికి తెలియదు. అయితే మౌనికకు రంగారెడ్డి జిల్లా బోయిన్‌పల్లికి చెందిన యువకునితో ఇటీవల నిశ్చితార్థం అయింది. మే నెల 1వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఈ సమయంలో తమ ప్రేమ సంగతి చెబితే రెండు కుటుంబాల్లో గొడవలు జరుగుతాయని భయపడిన నగేష్, మౌనిక గ్రామ సమీపంలోని రైలు పట్టాలపైకి బుధవారం ఉదయం వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఇంటిపై దాడి.. ఆపై యువతిపై అత్యాచారయత్నం
తిరుపతి: ఓ ఇంటిపై దాడి చేసిన యువకులు.. ఆ ఇంట్లో ఉన్న ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తిరుపతిలోని సత్యనారాయణపురంలో శుక్రవారం వెలుగుచూసింది. దాంతో బాధితురాలు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
38ఏళ్ల మహిళపై అత్యాచారం, నిందితుల అరెస్ట్
హైదరాబాద్: కీచకల పరంపర కొనసాగుతోంది. మహిళలపై అత్యాచార సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన గురువారం కేపీహెచ్‌బీలోని వెంకటేశ్వరాకాలనీలో జరిగింది. వివరాలు.. వెంకటేశ్వర కాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్, వెంకటేశ్, అత్యాచారం చేశారు. బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
ప్రేమజంటపై దుండగుడి దాడి
యువకుడి మృతి, యువతికి తీవ్రగాయాలు నరసరావుపేట/వెల్దుర్తి/చిలకలూరిపేట: గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తున్న ప్రేమికుల జంటపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి యువకుడిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన బాణావత్ అంజినాయక్ నరసరావుపేట పట్టణంలోని పీఎన్‌సీకేఆర్ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగుంటపాలెం మండలం పిచ్చిరాజుపురంతండాకు చెందిన రామవత్ స్వాతి గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని సాదినేని చౌదరయ్య పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లమో చదువుతోంది. వీరు బుధవారం కోటప్పకొండ వచ్చిత్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని మెట్లమార్గంలో కిందకు బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి వీరిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటనలో అంజినాయక్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్వాతి పెద్దగా అరవడంతో మెట్లమార్గంలో పనులు చేస్తున్న కూలీలు అక్కడకు చేరుకోవడంతో దుండగుడు పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ వారివద్ద ఉన్న సెల్‌ఫోన్, రోల్డ్‌గోల్డ్ గొలుసు దోచుకెళ్లాడు. గాయపడిన స్వాతిని 108లో పట్టణంలోని ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం గుంటూరు తరలించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.సి.వెంకటయ్య, సీఐలు వీరయ్యచౌదరి, ఎం.నాగేశ్వరరావు, ఎస్సైలు మహ్మద్ నాసర్‌బాషా, జేసీహెచ్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాగా, ఇది కచ్చితంగా స్వాతి తరఫు బంధువుల పనేనని మృతుడి తండ్రి బాలునాయక్ ఆరోపిస్తున్నారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
కరీంనగర్ : ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరిచాడంటూ ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. వివరాలివీ... రామగుండం ఐదో డివిజన్లో ఉండే బూర్ల సతీష్(27), గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన మాధవి(27) ఒకే కంప్యూటర్ ఇని స్టిట్యూట్‌కు వెళ్లేవారు. ఆ సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని సతీష్ మాటిచ్చాడు. కానీ ఇటీవల అతడు మాధవిని పట్టించుకోవటం మానేశాడు. దీంతో ఆమె మంగళవారం ఉదయం సతీష్ ఇంటి వద్ద ధర్నాకు దిగింది. దీంతో సతీష్ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. (రామగుండం) -
మహిళపై కత్తితో దాడి.. మృతి
హైదరాబాద్: చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటిరిగా మహిళలు కనిపిస్తే చాలు.. వారిపై దాడిచేసి మహిళల మెడనుంచి అభరణాలు అపహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా చైతన్యపురి మారుతీనగర్‌లో గురువారం ఓ మహిళపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మహిళ మెడ నుంచి చైన్ స్నాచింగ్‌కు యత్నించాడు. ఈ క్రమంలో మహిళ ప్రతిఘటించడంతో దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రగాయాల పాలైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడు మోసగించాడని యువతి ధర్నా
నేలకొండపల్లి: ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె తెలిపిన ప్రకారం...నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన జి.వసంత, రాజేశ్వరపురంలోని దేవాలయంలో దైవ దర్శనం కోసం వస్తున్న క్రమంలో అదే దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న పురాణం శివ మధ్య పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను అతడు నమ్మించాడు. నాలుగేళ్లపాటు కలిసి తిరిగారు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరకు ఫోన్ నంబర్ కూడా మార్చి, ఆమెను వదిలించుకునేందుకు గ్రామం విడిచి వెళ్లాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుని మంగళవారం అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించింది. ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. శివ గతంలో రాజేశ్వరపురం గ్రామానికి చెందిన ఓ యువతిని కూడా ఇదే విధంగా నమ్మించి మోసగించినట్టుగా కేసు నమోదైంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని వసంత చెప్పింది.. దేహశుద్ధి శివకు వసంత కుటుంబీకులు, బంధువులు దేహశుద్ధి చేశారు. మంగళవారం ఓ పార్టీ కార్యాలయంలో పంచారుుతీకి వచ్చిన అతడు.. వసంతను దూషించాడు. దీంతో వారు తీవ్ర ఆగ్రహావేశంతో అతనిని పట్టుకుని కొట్టారు. -
వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
ఆదిలాబాద్: పోకిరీ వేధింపులు తట్టుకోలేక కృష్ణవేణి(18) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ పట్టణంలోని టైలర్స్కాలని లో కలకలం సృష్టించింది. స్థానిక కళాశాలలో కృష్ణవేణి ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. అదే కాలనీకి చెందిన వెంకట్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ యువతి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. -
యువతి కిడ్నాప్‌కు యత్నించిన క్యాబ్ డ్రైవర్
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్‌లో గురువారం యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం కోసం ఇంటర్య్వూకు వచ్చిన యువతిపై కిడ్నాప్ యత్నం జరిగింది. క్యాబ్ డ్రైవర్ తనను కిడ్నాప్‌కు యత్నించాడంటూ యువతి ఆరోపిస్తోంది. ఆ సమయంలో తనను తాను రక్షించుకునే యత్నంలో డయల్ 100కు సమాచారం అందించినట్టు తెలిపింది. దాంతో అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ అప్పా జంక్షన్ వద్ద తనను విడిచిపెట్టినట్టు చెప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేపాల్‌లో భారత యువతిపై గ్యాంగ్ రేప్
కఠ్మాండు: నేపాల్‌లో భారత యవతి గ్యాంగ్‌రేప్‌కు గురైంది. నేపాల్‌లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బిహార్ నుంచి వెళ్లిన 20 ఏళ్ల భారతీయ భక్తురాలిని మంగళవారం అక్కడి స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అక్కడే గస్తీలో ఉన్న పోలీసులు ఆ మహిళ అరుపులు విని, ఆమెను రక్షించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఏడుగురిని అక్కడికక్కడే అరెస్ట్ చేశామన్నారు. నేపాల్, భారత్‌ల నుంచి 25 లక్షల మంది భక్తులు ఐదేళ్లకోసారి జరిగే ఆ గాధిమాయి ఉత్సవానికి హాజరయ్యారు.