
పుణె: గ్యాంగ్‌స్టర్ శరద్ మోహోల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. ఈ ఘటన పుణెలో శుక్రవారం చోటుచేసుకుంది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
వివరాలు.. గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ (40)కు, అతడి గ్యాంగ్ సభ్యులకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో శరద్ మోహోల్, అతని గ్యాంగ్ పుణెలోని కొత్రుడ్ రోడ్డుపై నడస్తూ వస్తున్నారు. చిన్న సందులోకి వెళ్లిన తర్వాత శరద్‌పై తన ముఠా సభ్యులు తుపాకీతో కాల్పులు జరిపారు. గఅతని ఛాతీకి ఒక బుల్లెట్, భుజానికి రెండు బుల్లెట్లు తగిలి కిందపడిపోయాడు. నిందితులు వెంటనే అతన్ని పక్కకు లాక్కెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శరద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు . కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, మూడు మ్యగజైన్లు, అయిదు రౌండ్ల బుల్లెట్లను ను స్వాధీనం చేసుకున్నారు.
శరద్ మోహల్‌పై ఎన్నో దోపీడి, హత్య కేసులు ఉన్నాయి. డబ్బు, భూ వివాదాల కారణంగానే అతడిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. .దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో స్పందిస్తూ.. మొహోల్‌ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదన్నారు.