
ప్రతీకాత్మక చిత్రం
వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లా చిత్తూరు మదనపల్లె బైపాస్ మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆలీమాబాద్ వీధికి చెందిన షేక్ అక్రమ్(16) అక్కడిక్కడే మృతి చెందాడు.
రాయుడు కాలనీకి చెందిన శ్రీను(50) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
చదవండి: ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత