
ప్రతీకాత్మక చిత్రం
అన్నానగర్(చెన్నై): తనకు ఇష్టం లేని కోర్సులో చేరలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆవడి, గోవర్ధనగిరికి చెందిన విజయన్, జయలక్ష్మి దంపతుల కుమారుడు బాలాజీ (17) ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం విజయన్ పొంగల్ పండుగకు దస్తులు కొనేందుకు భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఇంట్లో బాలాజీ, అతని చెల్లెలు ఉన్నారు. గదిలోకి వెళ్లిన బాలాజీ ఎంతసేపటికీ బయటకు రాలేదు.
అనుమానం వచ్చిన అతని చెల్లెలు లోపలికి వెళ్లి చూడగా బాలాజీ ఉరివేసుకుని కనిపించాడు. కేకలు వేయడంతో స్థానికులు అతన్ని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ పురుషోత్తమన్ విచారణ జరిపారు. బాలాజీ తల్లిదండ్రులకు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘‘ అమ్మా, నాన్న నన్న క్షమించండి. మీరు నన్ను బాగా చూసుకున్నారు. మీరు కోరుకున్న కోర్సు చదవడం నాకు ఇష్టం లేదు. నా జీవితం నా ఎంపిక కాదు. చెల్లెలి జీవితం ఆమె ఇష్ట ప్రకారమే జరగాలని’’ పేర్కొన్నాడు. బాలాజీ నీట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడని..అయితే తల్లిదండ్రులు వేరే కోర్సులో చేరేందుకు దరఖాస్తు ఫారం ఇచ్చి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజులుగా తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.
చదవండి: విమానంలో మందుబాబుల హల్‌చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా..