తిరువళ్లూరు: ప్రత్యర్థులు పెట్టిన ప్రాణభిక్షతో తాను బతకలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వాయిస్ మెసేజ్‌ను పంపించి రైలు కింద పడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని గురువరాజుపేట గ్రామానికి చెందిన మణివన్నన్ కుమారుడు కుమార్(19). ఇతను చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. మంగళవారం కళాశాల ముగించుకుని రైలులో ఇంటికి బయలుదేరాడు.
తిరునిండ్రవూర్ సమీపంలో వస్తుండగా పచ్చప్ప కళాశాలకు చెందిన విద్యార్థులు కొందరు కుమార్‌ను రైలు నుంచి కిందకు దింపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి రాత్రి 10 గంటలకు వదిలిపెట్టారు. దీంతో పాటు కుమార్‌ను చిత్రహింసలకు గురి చేసిన వీడియో, ఆడియోను రికార్డ్ చేసి వైరల్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన కుమార్ ప్రత్యర్థు«లు పెట్టిన ప్రాణభిక్షతో తాను బతకాల్సిన అవసరం లేదు.
చదవండి: (రాజేంద్రనగర్‌లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం)
అందుకే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తల్లిదండ్రులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరునిండ్రవూర్ వద్ద విద్యార్థి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన క్షణాల్లో సహచర విద్యార్థులకు చేరడంతో భారీగా తిరువళ్లూరుకు చేరుకున్నారు. కుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని స్పష్టం చేశారు. దీంతో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని శాంతింపజేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment