Check Dam: ఇద్దరు చిన్నారులను మింగిన చెక్‌డ్యాం | Two Boys Dead Over Fall In Check Dam Water At Zaheerabad | Sakshi
Sakshi News home page

Check Dam: ఇద్దరు చిన్నారులను మింగిన చెక్‌డ్యాం

Published Thu, Oct 7 2021 8:44 AM | Last Updated on Thu, Oct 7 2021 8:44 AM

Two Boys Dead Over Fall In Check Dam Water At Zaheerabad - Sakshi

లోతుగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా నీట మునిగారు.

జహీరాబాద్‌: సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెక్‌డ్యాంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సజ్జారావుపేట తండాలో బుధవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వీర్‌శెట్టి పెద్ద కొడుకు అరవింద్‌(11), విజయ్‌పవార్‌ రెండో కొడుకు శ్రీనాథ్‌ (9) మధ్యాహ్నం ఈత కోసం తండా శివారులోని చెక్‌డ్యాంలోకి దిగారు.

లోతుగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా నీట మునిగారు. ఒడ్డుపై ఉన్న మరో బాలుడు ప్రేంసింగ్‌ విషయాన్ని గమనించి కేకలు వేయడంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు మునిగిన ఇద్దరినీ బయటకు తీశారు. వైద్యం కోసం జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలురిద్దరూ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement