మామ చేతిలో మేనల్లుడి హతం | Uncle Who Assassinated Nephew In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మామ చేతిలో మేనల్లుడి హతం

Published Sat, Mar 20 2021 1:21 PM | Last Updated on Sat, Mar 20 2021 1:21 PM

Uncle Who Assassinated Nephew In Visakhapatnam - Sakshi

హత్యకు గురైన చిన్నా (ఫైల్‌ ఫొటో) 

ఈ వేడుకల్లో చిన్నాతో పాటు మామ కొల్లిపత్తి శంకర్, బావమరిది అశోక్‌ పూటుగా మద్యం సేవించారు. వీరి మధ్య పాత గొడవలు ఉండడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో శంకర్, అశోక్‌ కలిసి చిన్నా తలపై ఇనుపరాడ్‌తో బలంగా కొట్టారు.

పెందుర్తి(విశాఖపట్నం): తాగిన మత్తులో కుమారుడితో కలిసి మేనల్లుడినే (వరసకు అల్లుడు) మట్టుబెట్టాడు ఓ వ్యక్తి. పెందుర్తి సమీపం చినముషిడివాడలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కంచరపాలెం ప్రాంతానికి చెందిన కొత్తపల్లి చిన్నా(25) చినముషిడివాడ పాతూరులో నివాసం ఉంటున్న యమునని ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వృత్తిరీత్యా పెయింటర్‌ అయిన చిన్నా పనుల కోసం చినముషిడివాడ అత్తవారింటికి వచ్చేశాడు. కాగా.. గురువారం చిన్నా భార్య యమున పుట్టిన రోజు కావడంతో రాత్రి ఇంటి వద్ద వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో చిన్నాతో పాటు మామ కొల్లిపత్తి శంకర్, బావమరిది అశోక్‌ పూటుగా మద్యం సేవించారు. వీరి మధ్య పాత గొడవలు ఉండడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో శంకర్, అశోక్‌ కలిసి చిన్నా తలపై ఇనుపరాడ్‌తో బలంగా కొట్టారు. దీంతో చిన్నా కుప్పుకూలిపోయి అక్కడిడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. చిన్నా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.  

హత్యకు కారణం అదేనా.? 
అశోక్, యమున మధ్య అసహజ బంధం ఉన్నట్లు చిన్నా అనుమానించడమే హత్యకు కారణంగా తెలుస్తోంది. మృతుడు చిన్నా భార్య యమున తల్లి తులసి 18 ఏళ్ల కిందట భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి శంకర్‌తో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్‌ తన మేనల్లుడు అయిన చిన్నాకు తులసి కుమార్తె యమునకు పెళ్లి జరిపించాడు. వీరితో పాటే శంకర్‌ మొదటి భార్య కుమారుడు అశోక్‌ ఒకే ఇంట్లోని వేర్వేరు పోర్షన్‌లో ఉంటున్నాడు. శంకర్‌ మొదటి భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వరసకు సోదరి అయ్యే యమునతో అశోక్‌కు అసహజ బంధం ఉన్నట్లు చిన్నా తరచూ అనుమానించేవాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిత్యం గొడవలు జరిగేవి. అలా గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో మాటామాటా పెరిగి చిన్నా హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇతరత్రా కోణాల్లో కేసును విచారిస్తున్నారు.
చదవండి:
భర్త చేష్టలతో విసుగుచెంది...  
బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement