
ముంబై : ‘ఓయ్ నిన్నే.. నీపై నాకు ప్రేమ అనంతం. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా అది ఎప్పటికీ చెరిగిపోదు’ అంటూ ఓ భర్త తన భార్యపై అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశాడు. అనంతరం, నా చావుకు నా భార్య, ఆమె అత్తే కారణమని ఆ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆత్మహత్యకు గల కారణాలేంటో మా అమ్మకు బాగా తెలుసు. నా మరణం తర్వాత.. మీరు (భార్యను,భార్య అత్తను ఉద్దేశిస్తూ) ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికే ఆమె మనసు విరిగిపోయింది. ఇకనైనా ఆమెను మనశాంతిగా ఉండనివ్వండి’ అంటూ విజ్ఞప్తి చేశాడు.
ముంబైలో యానిమేటర్‌గా పని చేస్తున్న నిషాంత్ త్రిపాఠి (Nishant Tripathi) గత శనివారం ముంబైలో సహారా హోటల్ (sahara hotel mumbai) రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, తమ హోటల్లో రూం బుక్ చేసి మూడురోజులవుతున్నా.. ఎప్పుడు వెళ్లినా ‘డు నాట్ డిస్ట్రబ్’ అనే బోర్డ్ తగిలించే ఉంది. దీంతో సహార హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చి నిషాంత్ త్రిపాఠి ఉన్న రూంను పరిశీలించింది. త్రిపాఠిని పిలిచే ప్రయత్నించింది. సిబ్బంది ఎంత సేపటికి పిలుస్తున్నా హోటల్ గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఉరికి వేలాడుతూ
సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్టర్ కీ సాయంతో హోటల్ రూంను ఓపెన్ చేసి చూడగా ఉరికి వేలాడుతూ త్రిపాఠి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి తల్లి,మహిళా హక్కుల కార్యకర్త నీలం చతుర్వేది ఫిర్యాదుతో బాధితుడి భార్య అపూర్వ పరేఖ్, భార్య అత్త ప్రార్థనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
‘భార్యకు ప్రేమతో’.. కంపెనీ సైట్‌లో సూసైడ్ నోట్
పోలీసుల దర్యాప్తులో బాధితుడు త్రిపాఠి కంపెనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో అతను తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. తన మరణానికి ఆమెను, ఆమె అత్తే కారణమన్నారు. అంతేకాదు, భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేనుండనేమో. నా చివరి క్షణాల్లో జరిగిన ప్రతిదానికీ నేను నిన్ను ద్వేషించేవాడినే. కానీ నేను అలా చేయను. చావు ముందు క్షణం వరకు నేను ప్రేమనే ఎంచుకుంటాను. అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ నేను నిన్నే ప్రేమిస్తుంటాను. ఇప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మాటిచ్చినట్లు నీపై నా ప్రేమ ఎప్పటికీ మసకబారదు’ అని రాశాడు.
నా తలకొరివి పెట్టాల్సింది పోయి
తన కుమారుడి మరణంపై త్రిపాఠి తల్లి నీల చతుర్వేది (neelam chaturvedi) ఫేస్‌బుక్ (meta)లో సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో నేను నా జీవితాన్ని మహిళల హక్కులు, లింగ సమానత్వం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఇప్పుడు నా జీవితం ఇప్పుడు ముగిసింది. నా కొడుకు నిషాంత్ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నన్ను జీవత్సవాన్ని చేశాడు. నాకు అంత్యక్రియలు చేయాల్సిన కొడుక్కే ఈరోజు ఈరోజు మార్చి 2న ముంబైలో ఈకో మోక్షాలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నా. నా కుమార్తె ప్రాచి తన అన్నయ్య అంత్యక్రియలు నిర్వహించింది. ఇంతటి విషాదంలో నా కుమార్తె ప్రాచిలో ధైర్యాన్ని నూరి పోయిండి అంటూ వేడుకుంది.
కాగా, భార్యల వేధింపుల కారణంగా ఆత్మహత్య కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మగవారికి అనుకూలంగా ఉండేలా చట్టాలు తేవాలనే డిమాండ్లు కొనసాగుతున్న ఆందోళనల మధ్య ఈ దుర్ఘటన జరగడంపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.