World Earth Day ఎంఎల్‌సీ విజయశాంతి ఇం‍ట్రస్టింగ్‌ ట్వీట్‌ | Actress,Congress MLC Vijayashanti tweets on World Earth Day | Sakshi
Sakshi News home page

World Earth Day ఎంఎల్‌సీ విజయశాంతి ఇం‍ట్రస్టింగ్‌ ట్వీట్‌

Published Tue, Apr 22 2025 5:23 PM | Last Updated on Tue, Apr 22 2025 5:45 PM

Actress,Congress MLC Vijayashanti tweets on World Earth Day

నేడు  (ఏప్రిల్‌ 22) ప్రపంచ ధరిత్రి దినోత్సవం(World Earth Day) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) విజయశాంతి(Vijayashanti) ఆసక్తికర  ట్వీట్‌ చేశారు.  సోషల్‌ మీడియాలో ముఖ్యంటా ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆమె   వరల్డ్‌  ఎర్త్‌డే సందర్భంగా ప్రకృతిని, ఈ భూమాతను రక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇకనైనా మారదాం వినాశనాన్ని ఆపుదాం అంటూ పిలుపునిచ్చారు. 

విజయశాంతి ట్వీట్‌  ఇలా..

‘‘ నేను ప్రపంచ ధరిత్రీ  దినోత్సవం..అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు. తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ విజయశాంతి ట్వీట్  చేయడం విశేషం. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement