
సోషల్ మీడియా
పదహారు ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. యువతపై రకరకాల సైట్‌ల ప్రభావాన్ని ఆయన ‘విపత్తు’గా అభివర్ణించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లాంటి సైట్‌లలోకి లాగిన్ కావడానికి పిల్లల కనీస వయసు ఇంకా నిర్ణయించబడలేదు.
ఇది 14 నుండి 16 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ‘సోషల్ మీడియా వ్యసనంగా మారిన పిల్లలను ఆటస్థలాలు, ΄÷లాలు, స్విమ్మింగ్ పూల్స్‌లో చూడాలనుకుంటున్నాను’ అంటున్నారు ప్రధాని. ‘సామాజిక మాధ్యమాలు సామాజిక హాని కలిగిస్తున్నాయి. యువత మనసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సోషల్ మీడియా దాటి బాహ్య ప్రపంచంలోకి వస్తే వారికి ఎన్నో అనుభవాలు సొంతం అవుతాయి’ అంటున్నాడు ఆంథోనీ ఆల్బనిస్.
ప్రధాని నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు సైతం సమర్థించారు. ‘సోషల్ మీడియా సంస్థలు వయసు పరిమితి విధించాలి’ అని కోరుతున్నాడు ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్. ‘సోషల్ మీడియా సంస్థలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి’ అని ΄ాలక, ప్రతిపక్ష నేతలు కోరుకుంటున్నారు.
ఇవి చదవండి: రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి