
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి (Puri Jagannath temple) ఆలయంలో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీమందిర్ ఆలయ శిఖరంపై ఉన్న పవిత్రమైన జెండాను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని ఆకాశంలో ప్రదక్షిణ చేసింది. ఈ అసాధారణ ఘటన భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది అనర్థమా, శుభసూచికగా అనేక చర్చకు దారితీసింది ఇది భక్తులను విపరీతంగా ఆకర్షించడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్‌లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన
పూరీ ఆలయ శిఖరంపై ఉన్న (Neela Chakra) నీలచక్రంపైన ఎగిరే జెండాను ముక్కున కరుచుకుని ఓ గద్ద ఆకాశంలో చక్కర్లు కొట్టింది. పూరీకి వచ్చే భక్తులు పవిత్రంగా భావించే ఆ జెండాను దర్శనం చేసుకుని , తరించడం ఆనవాయితీ. అలాంటిది ఇపుడు శ్రీమహావిష్ణువు వాహనమైన గద్ద తన ముక్కుతో ఈ జెండాను జాగ్రత్తగా పట్టుకుని, ఆకాశంలో ప్రదక్షిణం చేయడం విశేషంగా మారింది. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. ఇది దైవిక సంకేతంగా భక్తులు భావించారు.
What is going to happen?
Eagle takes away flag from Jagannath Temple pic.twitter.com/0AzUZb1uDE— Woke Eminent (@WokePandemic) April 13, 2025
నెటిజన్లు స్పందన
ఆలయ జెండాను పోలి ఉన్నప్పటికీ, ఆ వస్త్రం నిజానికి జగన్నాథ ఆలయానికి చెందినదా లేదా కేవలం ఒక సాధారణ గుడ్డ ముక్కేనా అనేది ఇంకా నిర్ధారించలేదు. ఆన్‌లైన్‌లో చర్చలకు దారి తీసింది. "జగన్నాథ ఆలయం నుండి ఒక గద్ద పవిత్ర జెండాను తీసుకెళ్లినప్పుడు, అది దొంగతనం కాదనీ, అది స్వర్గపు సందేశం. జగన్నాథుని ఆశీర్వాదాలతో గరుడుడు స్వయంగా స్వర్గానికి ఎక్కినట్లుగా. దైవిక జోక్యం, పునరుద్ధరణ ,క్తివంతమైన మార్పుకు సంకేతమన్నవాదనలు వినిపించాయి. సోషల్ మీడియాలో వేలాదిమంది భక్తులు దీన్ని షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. “PuriJagannathEagle” హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది, ఈ ఘటన జగన్నాథుని అనుగ్రహంగా కొంతమంది భావించారు.‘జగన్నాథుని కృప’’, ‘‘గరుడ దర్శనం’’ వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఘటనను సహజమైనదని కామెంట్ చేశారు. దాన్ని ఆహారంగానో, మరేదో ఆసక్తికరమైన వస్తువుగా గద్ద భావించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ ఘటనతో ఒడిశాలోని భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి చర్చల్లో నిలిచింది. ఆలయ వైభవాన్ని, ఖ్యాతిని పలువురు గుర్తుచేసుకున్నారు.
చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్