
ఈకాలం యువత ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇదివరకు 90ల యువత వంటపని, కుట్లు, అల్లికలు వంటి ఇతరత్ర కళలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంటర్‌నెట్, స్మార్ట్‌ఫోన్‌ల యుగం. ఏది గంటలకొద్దీ నేర్చుకునేందుకు ఇష్టపడరు. క్షణాల్లో పట్టేసి చకచక నేర్చేసే జెన్ జెడ్ తరం ఇది. వారి మెదుడు కూడా మహాచురుకు. ఇట్టే నేర్చుకునే అపార ప్రతిభాపాటవాలు వారి సొంతం. పైగా డిజిటల్ హవా కాబట్టి ఆ దిశగానే స్కిల్స్ పెంచుకుంటోంది యువత. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాంప్రదాయ హాబీలనే ఇష్టపడుతూ షాక్‌కి గురి చేస్తున్నారు. పరిగెడుతూ బిజీ లైఫ్‌లు, లక్షలు సంపాదనలు వద్దంటూ నిధానం, ప్రశాంతతే కావలంటూ..'గ్రాండ్‌మాకోర్'కి జై కొడుతున్నారు. అలసలేంటీ ట్రెండ్ అంటే..
గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జెన్ జెడ్ మిలీనియల్స్ అమ్మమ్మల నానమ్మల అభిరుచుల వైపుకి మొగ్గుచూపుతున్నారు. అలాంటి రెట్రో కార్యకలాపాలలోనే సౌకర్యం ఉందని నొక్కి చెబుతున్నారు.
గ్రాండ్‌మాకోర్ అంటే..
'గ్రానీ'ల జీవనశైలి. అంటే ఏంలేదు..ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్లు అనుసరించే అభిరుచులనే ఈతర యువత ఇష్టపడుతుండటం విశేషం. ఈ డిజిటల్ యుగంలో ఏ కోడింగ్, కంటెంట్ రైటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మ్యూజిక్ అంటూ ఇతరత్ర కళలను ఇష్టపడే యువత మైండ్‌సెట్ మార్చుకుంది. ఏకంగా బామ్మల కాలం నాటి జీవనశైలికే ఓటేస్తూ..ఇదే అత్యంత హాయిగా ఉంటుంది, మసుసుకు మంచి ప్రశాంతతనిస్తుందని అని చెబుతున్నారు. అంతేకాదండోయ్.. ఈ ట్రెండ్‌కి సంబంధించి.. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో గ్రాండ్‌మాకోర్ హ్యాష్‌ట్యాగ్‌లతో వాళ్ల బామ్మల అభిరుచులను డాక్యుమెంటు చేస్తున్నారు కూడా.
నిధానంగా ఓపికతో నేర్చుకునే ఈ హాబీలే మనకు సరైన దృక్పథాన్ని ఇవ్వగలవని అంటున్నారు. వాళ్లు పనిచేయాలనుకోవడం లేదట..పనిలో పొందే ఆనందాన్ని వెతుకుతున్నారట..మంచి అభిరుచితో కూడిన పని ఇచ్చే ఆనందం వెలకట్టలేనిదని నమ్మకంగా చెబుతోంది నేటి యువత. ఒకరకంగా ఇది వారికి తమ అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి వచ్చేలా చేయడమే గాక స్వాంతన చేకూరుతుందని ఈ ట్రెండ్‌ని స్వీకరించిన అమెరికాకు చెందిన గృహిణి హన్నా ఆర్నాల్డ్ అంటున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో కూడా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతామని అంటున్నారామె.
ఈ గ్రాండ్‌మాకోర్ భావోద్వేగాలకు సంబంధించింది, పైగా హానికరం కానీ సృజనాత్మకత మార్గాన్ని అందించే గొప్ప అభిరుచులట అవి. ఇంతకీ అవేంటో తెలుసా..ఏం లేదండీ..తోటను చూసుకోవడం, స్కార్ఫ్ అల్లడం, కుట్లు, ఆహారం వృధాకాకుండా కేర్ తీసుకుని చేసే చిరు వంటకాలు తదితరాలే..
నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ ట్రెండ్ వల్ల ఆందోళన కలిగించే విషయాల నుంచి కాసేపు ఆలోచనలు మళ్లించడం సాధ్యపడుతుందట. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మన చుట్టూ జరుగుతున్నదాన్ని ప్రశాంతంగా గమనించే అవకాశం ఏర్పడుతుందట. పైగా వీలైనంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పుడుతుందని చెబుతున్నారు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్త గాబ్రియెల్ వైడెమాన్. మరీ ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా మీ బామ్మల హాబీలను ట్రై చేసి చూడండి.
(చదవండి: సాహసం చేద్దాం బ్రదర్..! అడ్వెంచర్‌కే ప్రాధాన్యత ఇస్తున్న భాగ్యనగరవాసులు)