బందీల కాల్చివేత.. సమర్థించుకున్న ఇజ్రాయెల్‌ ఆర్మీ | Israeli Troops Shot Hostages Mistook For Help Hamas Ambush | Sakshi
Sakshi News home page

Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే: ఇజ్రాయెల్‌ ఆర్మీ

Published Fri, Dec 29 2023 9:40 AM | Last Updated on Fri, Dec 29 2023 12:42 PM

Israeli Troops Shot Hostages Mistook For Help Hamas Ambush - Sakshi

ఉగ్రవాదులుగా భావించి హమాస్ చెరలో ఉన్న ముగ్గురు బందీలపై కాల్పులు

టెల్ అవీవ్: బందీల కాల్చివేత ఘటనలో సైనికులు తమ అవగాహన మేరకు సరైన పనిచేశారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ కాల్పుల్లో ఎలాంటి దురద్దేశం లేదని స్పష్టం చేసింది. కాల్పుల్లో సైనిక విధానాలకు కట్టుబడి ఉండటం తప్పనిసరని అన్నారు. ముప్పు లేని సందర్భాల్లో శత్రువుపై సందిగ్దత నెలకొన్నప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరమని ఆర్మీ చీఫ్ జనరల్ హెర్జి హలేవి తెలిపారు. బందీల కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం నివేదికను వెల్లడించింది. 

హమాస్ చెరలో బందీలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉగ్రవాదులుగా భావించి డిసెంబర్ 15న ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) కాల్చి చంపింది. షజయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలు సహాయం కోసం అరిచారు. కానీ అది హమాస్ కుట్రగా భావించిన ఇజ్రాయెల్ సేనలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో బందీలు అక్కడిక్కడే మృతి చెందారు.

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరోమారు ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. బందీలను రక్షించడంలో విఫలమయ్యామని పేర్కొంది. అటు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా విచారం వ్యక్తం చేశారు. బందీల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. దాదాపు 240 మంది ఇజ్రాయెల్‌కు చెందిన వ్యక్తులను హమాస్‌ బందించింది. నాటి నుంచి ఇరువైపుల నుంచి యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో నష్టం జరిగింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1200 మంది బలయ్యారు. అటు.. హమాస్ వైపు 20,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.  

ఇదీ చదవండి: Donald Trump: ప్చ్‌.. మరో బ్రేక్‌: ట్రంప్‌కి మూసుకుపోతున్న దారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement