ఇజ్రాయెల్‌కు ఖతర్‌ ప్రధాని హెచ్చరికలు | Qatar PM Warning Message For Israel over Gaza Strip | Sakshi
Sakshi News home page

‘గాజా లేదు.. అక్కడ పరిస్థితులు అస్సలు బాగాలేవు’

Published Tue, Jan 16 2024 7:29 PM | Last Updated on Tue, Jan 16 2024 8:24 PM

Qatar PM Warning Message For Israel over Gaza Strip - Sakshi

ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ప్రస్తుతం గాజా అనేది లేకుండా పోయిందన్నారు...

హమాస్‌ సాయుధులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి తీరుపై ఖతర్‌ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్‌ థానీ మండిపడ్డారు. గాజాలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి తిరస్కరించిన విషయం తెలిసిందే. దావోస్‌లోని మంగళవారం ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల గాజాలో తీవ్రమైన విధ్వంసం జరుగుతోందని.. అందుకే దాడులు ఆపేయాలని హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌పై చేస్తున్న దాడుల విషయంలో ఇజ్రాయెల్‌ సైన్యం, అంతర్జాతీయ సమాజంపై యాన విమర్శలు చేశారు. గాజా, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ఆగిపోవడానికి ఇరుదేశాల మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసరమని తెలిపారు. ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులు గాజాలో తిరిగి మళ్లీ మునుపటి పరిస్థితి తీసుకురావటం కష్టమని ‍పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ప్రస్తుతం గాజా అనేది లేకుండా పోయిందన్నారు. అంటే గాజాలో ఏం లేదని.. పలు చోట్ల ఇజ్రాయెల్‌ చేసిన భారీదాడులకు గాజా తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు.

వెస్ట్‌బ్యాంక్‌లో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతత నేపథ్యంలో పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో దాడులు ఆపేయాలని ఇజ్రాయెల్‌ కోరారు. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, రాజకీయ నేతల సహకారం లేకుండా ప్రస్తున్న నెలకొన్న ఇజ్రాయెల్‌, గాజాల సమస్యకు పరిష్కారం లభించదని అ‍న్నారు.​ అదే విధంగా ఇప్పడు జరుగుతున్న దాడులకు ముగింపు కూడా పలకలేమని తెలిపారు. ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై యెమెన్‌లోని హౌతీ దళాలు చేస్తున్న దాడులపై ఆయన మండిపడ్డారు.

చదవండి: చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు.. చిక్కుకుపోయిన వందల మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement