
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కోసం బుధవారం లండన్‌లో జరగాల్సిన సమావేశం చివరి నిమిషంలో రద్దయ్యింది. మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపించకపోవడం, షెడ్యూల్ సమస్య కారణంగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆకస్మిక రద్దుతో చర్చల దిశపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించడంతో ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగింది. వెయ్యి కిలోమీటర్ల ఫ్రంట్ లైన్ వెంబడి ఇరు పక్షాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. శాంతి ఒప్పందంపై సమావేశం జరుగుతుందని భావించిన బుధవారం ఉదయం కూడా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో కార్మికులతో వెళ్తున్న బస్సుపై రష్యా చేసిన దాడిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు మరణించారు. 40 మందికి గాయపడ్డారు.