జెలెన్‌స్కీ యుద్ధాన్ని  పొడిగిస్తున్నారు: ట్రంప్‌ | Donald Trump accuses Zelensky of harming Ukraine peace negotiations | Sakshi
Sakshi News home page

జెలెన్‌స్కీ యుద్ధాన్ని  పొడిగిస్తున్నారు: ట్రంప్‌

Published Thu, Apr 24 2025 1:13 AM | Last Updated on Thu, Apr 24 2025 5:55 AM

Donald Trump accuses Zelensky of harming Ukraine peace negotiations

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను రష్యాకు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గకుండా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని జెలెన్‌స్కీ పొడిగిస్తున్నారని బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ఆలోచనను తోసిపుచ్చిన జెలెన్‌స్కీ ‘మాట్లాడటానికి ఏమీ లేదు. 

ఇది మా భూమి, ఉక్రేనియన్‌ ప్రజల భూమి’ అని మంగళవారం ఉద్ఘాటించారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్‌.. ఈ ప్రకటన రష్యాతో శాంతి చర్చలకు చాలా హానికరమన్నారు. ఇది చర్చనీయాంశం కూడా కాదని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో రాశారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌ క్రిమియాను కోల్పోయిందని, క్రిమియా కావాలనుకుంటే పదకొండేళ్ల కిందట రష్యాకు అప్పగించినప్పుడు వారు దాని కోసం ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement