
రోమ్:ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రపంచ వామపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిది ద్వంద్వ విధానాలతని విమర్శించారు. తాను,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీలు ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు.
తామంతా తమ దేశాల ప్రయోజనాలను,సరిహద్దులను కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్నామని,కానీ తమ విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని లెఫ్ట్ పార్టీల నేతలు విమర్శిస్తున్నారన్నారు. ప్రపంచం ఇక ఎంత మాత్రం లెఫ్టిస్ట్ విధానాలను నమ్మబోదని మెలోని చెప్పారు.
తాను,ట్రంప్,మోదీ ప్రపంచవ్యాప్తంగా వరుస విజయాలు సాధిస్తుంటే లెఫ్ట్ లిబరల్స్‌లో ఆందోళన మొదలైందని ఎద్దేవా చేశారు. 90వ దశకంలో అమెరికాలో బిల్ క్లింటన్, బ్రిటన్‌లో టోనీ బ్లెయిర్‌లను లెఫ్ట్ నేతలు రాజనీతిజ్ఞులని కీర్తించారని, తమను మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నారని మెలోని మండిపడ్డారు.