
మాస్కో:కజకిస్తాన్‌లో జరిగిన విమానప్రమాదానికి తామే కారణమని జరుగుతున్న ఊహాజనిత ప్రచారాన్ని రష్యా ఖండించింది. విమాన ప్రమాదంపై ఊహాగానాలు ఆపాలని కోరింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ పూర్తయ్యేదాకా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థే కారణమన అజర్‌బైజాన్ మీడియాలో కథనాలు ప్రచురితమవడంపై రష్యా స్పందించింది. బుధవారం(డిసెంబర్ 25) అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా తొలుత కజకిస్తాన్‌లోని అక్తౌకు మళ్లించారు.
ఇక్కడే విమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు విమానం కాస్పియన్ సముద్రంపై కాసేపు ఎగిరింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 67 మందిలో 29 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు.