
ఒట్టవా: ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఫెస్టివల్ కాస్తా ఉన్నపళంగా విషాదంగా మారిపోయింది. కెనడాలోని వాంకోవర్ సిటిలో లపూ లపూ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కారు దూసుకొచ్చింది. ఇందులో 9 మంది దుర్మరణ పాలయ్యారు. కెనడా స్థానిక కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఫిలిపినో కమ్యూనిటీకి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై లపూ లపూ ఫెస్టివల్ వేడుకను చేసుకుంటుంగా ఈ దారుణం సంభవించింది. అయితే ఈ ఘటనలో 9 మంది వరకూ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. భారీ సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనకు కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు కెనడా పోలీసులు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన వీడియోలు ఆవేదన భరితంగా ఉన్నాయి.
Initial reports of several killed and over a dozen injured, after an SUV plowed into a closed-off street filled with people celebrating the Lapu Lapu Festival in Vancouver, Canada. pic.twitter.com/cLQQPfOMCq
— OSINTdefender (@sentdefender) April 27, 2025