ఒకే వేదికపై మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌! | SCO Samarkand summit Uzbekistan: Modi Jinping Putin May Attend | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత చైనా బయటకు జిన్‌పింగ్.. ఒకే వేదికపై ముగ్గురూ!

Published Tue, Sep 13 2022 7:15 AM | Last Updated on Tue, Sep 13 2022 7:15 AM

SCO Samarkand summit Uzbekistan: Modi Jinping Putin May Attend - Sakshi

పాత చిత్రం

కరోనా నుంచి చైనాను వీడని జింగ్‌పిన్‌, ఎట్టకేలకు దేశం బయట అడుగు పెట్టబోతున్నారు.

బీజింగ్‌: చైనా అధినేత జిన్‌పింగ్‌ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్‌ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా పాల్గొనే అవకాశముంది.  

జిన్‌పింగ్‌ 2020 జనవరిలో మయన్మార్‌ పర్యటన తర్వాత కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం మానుకున్నారు. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్‌ సభ్యదేశాలు. ఇరాన్‌ను సైతం చేర్చుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది.

ఇంకోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆగ్రహంతో ఉన్నాయి. ఈ తరుణంలో ఆంక్షల నడుమ ఉన్న రష్యా ఈ భేటీలో పాల్గొనడం, ఇంకోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరుపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. భారత్‌ తరపున ప్రధాని మోదీ సైతం పాల్గొనబోతుండడంతో.. జిన్‌పింగ్‌తో భేటీ అవుతారా? అనే విషయంపైనా ఓ సంగ్దిగ్ధత నెలకొంది.

ఇదీ చదవండి: ప్రజల్ని బెదిరిస్తారా? ఏం తమాషాగా ఉందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement