
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్యలు విఫలమయ్యాయి. జెలెన్‌స్కీని ట్రంప్ బెదిరించే ప్రయత్నం చేశారు. జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చు అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య భేటీ వాగ్వాదానికి దారితీసింది. శాంతి చర్చలు కాస్తా రసాభాసగా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. దీంతో, ట్రంప్.. జెలెన్‌స్కీ ప్రవర్తన మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చు. బైడెన్ కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ మండిపడ్డారు.
ఇక, ఇదంతా జరుగుతున్న సమయంలో ఇరు దేశాల రాయబారులు అక్కడే ఉన్నారు. దీంతో, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ఇరువురి నేతల భేటీతో మంచి జరగుతుందని ఆశిస్తే ఇలా జరుగుతుందేంటీ? అన్నట్టుగా తల పట్టుకుని కూర్చున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టుగా ఆమె హావభావాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🇺🇦🇺🇸 Ukrainian Ambassador in the USA Oksana Markarova watches Zelensky in despair 🤷♂️🥹 pic.twitter.com/LUhjYc5vfb
— Roberto (@UniqueMongolia) February 28, 2025