
అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం ఒప్పుకోలు
వాషింగ్టన్: పెన్సిల్వేనియాలో జూలై 13వ తేదీన ఎన్నికల ర్యాలీ సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన తమ వైఫల్యమేనని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం పేర్కొంది. ఆయనకు భద్రత కల్పించడంలో వైఫల్యానికి తమదే బాధ్యతని తెలిపింది.
బట్లర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులకు పాల్పడటం తెల్సిందే. ఆ ఘటన నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఒక బుల్లెట్ మిల్లీమీటర్ దూరం నుంచి దూసుకెళ్లగా, మరో బుల్లెట్ ఆయన చెవిని గాయపర్చింది. అప్పటి ఘటనకు బాధ్యత వహిస్తూ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చియాటిల్ రాజీనామా చేయగా, ఆమె స్థానంలో రొనాల్డ్ రోవె తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.