
పంచాయతీ కార్యదర్శి కథ సుఖాంతం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ నాయకుల వేధింపులతో అదృశ్యమైన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక కథ సుఖాంతమైంది. మూడు రోజుల క్రితం లేఖరాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రియాంక ఆచూకీ కడప జిల్లాలో లభ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా గురువారం ఉదయం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ప్రియాంక తనగోడును పోలీసుల ఎదుట వెల్లబోసుకుంది. ఇప్పటికే సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుకాగా.. దర్యాప్తు జరుగుతోంది. ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు క్రీదాది మల్లేశ్‌బాబు, గుగ్గిళ్ల శ్రీకాంత్‌గౌడ్ మూలంగా తాను మానసిక క్షోభకు గురైనట్లు పేర్కొంది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి కారణంగా పంచాయతీ కార్యదర్శి అదృశ్యం అవడంపై స్టేట్ ఇంటలిజెన్స్ అధికారులు రిపోర్టు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అంధించినట్లు తెలుస్తోంది. సదురు కాంగ్రెస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సిరిసిల్లకు చేరిన కార్యదర్శి ప్రియాంక
టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరు