
ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి
మల్లాపూర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు సోమవారం రాత్రి మండల కేంద్రంలోని జామమజీద్ ఎదుట ముస్లిం మైనార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు ఆర్పించారు. కమిటీ మండల అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ పహల్గాం ఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ మండల సభ్యులు బషీర్, బాబాఫరీద్, తక్కియుద్దీన్, సల్మాన్, మహబుబ్, షబ్బీర్, మహమ్మద్ రఫీ, అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.