
వేల ఏళ్ల నాటి జంతువు ఎముక లభ్యం
జనగామ: జిల్లా కేంద్రం సమీప పొట్టిగుట్ట దిగువన క్రీస్తు పూర్వం 3వేల ఏళ్ల నాటి జంతువు దవడ ఎముకను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి సోమవారం గుర్తించారు. ఈ మేరకు వివరాలు వెల్ల డించారు. పొట్టిగుట్ట సమీపంలో ప్రస్తుతం పంట సాగు చేసే క్రమంలో దున్నకాలు చేస్తుండగా రెండు ఫీట్ల లోతున మట్టిగడ్డ కింద జంతువు దవడ ఎముక లభించిందని, ఎముకకు నాలుగు పళ్లు, చివరలో చిన్న రంధ్రం ఉన్నట్లు గుర్తించామన్నారు. దాని పొడవును బట్టి మేకకు చెందినదిగా ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. ఆవాస ప్రాంతంలో లభించిన నలుపు, ఎరుపు రంగు కలిగిన మృణ్మయ మట్టి పాత్రలో దొరిగిన ఈ ఎముక శిలాయుగంలో మానవులు ఆహారంగా తీసుకున్న జంతువుదిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ ఎముక తెల్లగా ఉన్నా.. ఏళ్లు గడిచేకొద్దీ రంగు మారుతూ కొంత తేలికగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోందని చెప్పారు. పురావస్తు శాస్త్రంలో జంతు అవశేషాలను గుర్తించే అధ్యయనం ప్రత్యేకంగా ఉంటుందని, బ్రిటన్, లండన్ వంటి దేశాల్లో మాత్రమే వీటిని బోధించే విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు వివరించారు. ఈ ఎముక ఏ జంతువు ది? ఎన్ని సంవత్సరాల క్రితం నాటిదో తెలియాలంటే కార్బన్ డేటింగ్ పరీక్ష అవసరమని అన్నారు. ఇది ఖర్చుతో కూడు కున్నదని, ఎముక ఏ జంతువుదో తెలుసుకోవాలంటే విదేశాలకు పంపాల్సి ఉంటుందని చెప్పారు. పురావస్తు శాఖ కోరితే వారికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
పొట్టిగుట్ట వద్ద గుర్తించిన డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి

వేల ఏళ్ల నాటి జంతువు ఎముక లభ్యం