
పహల్గాం మృతులకు ఆస్ట్రేలియాలో నివాళి
జనగామ: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ ఘటనలో మృతి చెందిన వారికి ఆస్ట్రేలియా ఫెడరేషన్ స్క్వేర్‌లో భారతీయులు నివాళులర్పించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవా లని కోరారు. కార్యక్రమంలో మెల్బోర్న్ తెలుగు సంఘం ప్రతినిధి, జనగామవాసి చింతల శ్రీని వాస్, శివకుమార్, గురుప్రీత్ వర్మ, శ్రీదుర్గా టెంపుల్ అసోసియేషన్ కార్యదర్శి ప్రదీప్‌శర్మ, జోషి, హర్‌ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
29న జాబ్ మేళా
జనగామ రూరల్: కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యాన ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ మేళాకు అర్హత ఉన్న జనగామతోపాటు ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో హాజరు కావాలని జిల్లా ఉపాధికల్ప న అధికారి పి.సాహితి ఒక ప్రకటనలో తెలిపా రు. మరిన్ని వివరాలకు 7995430401 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
రాపాక శ్రీశైలానికి డాక్టరేట్
దేవరుప్పుల : సమాజ రుగ్మతలను మెరుగు పర్చడమే లక్ష్యంగా సేవలందించిన సింగరాజుపల్లికి చెందిన రాపాక శ్రీశైలంకు (నాటా యూ ఎస్‌ఏ) హైదరాబాద్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. దళిత సామాజిక కార్యకర్త శ్రీశైలం అనియత విద్యాకేంద్రంలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ మహిళా సాధి కారత దిశగా దేవరుప్పుల, చేర్యాల, ఘన్‌పూర్ మండలాల మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో మమేకమైన ఆయన కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. హెచ్‌ఎస్ సీయూ కార్యనిర్వాహకులు డాక్టర్ ఆనంద్, ప్రసాద్ చేతుల మీదుగా శనివారం డాక్టరేట్ అందుకున్న శ్రీశైలం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

పహల్గాం మృతులకు ఆస్ట్రేలియాలో నివాళి