
పలిమెలలో వాలీబాల్ టోర్నమెంట్
భూపాలపల్లి: ఈ నెల 28వ తేదీ నుంచి పలిమెల మండలంలో పోలీస్ ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు రాష్ట్ర సరిహద్దులో గల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ.25వేలు, రెండవ బహుమతి రూ.15వేలు, మూడవ బహుమతి రూ.10వేలతో పాటు ట్రోఫీలు బహుకరిస్తామన్నారు. టోర్నమెంట్‌కు ఎంట్రీ ఫీజు లేదన్నారు. క్రీడాకారులకు భోజన వసతి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 73961 47071, 73069 07549 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్పీ వెల్లడించారు.
ఎస్పీ కిరణ్ ఖరే