
రెండు కుటుంబాల ఘర్షణపై సీఐ విచారణ
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాలలో గత శనివారం రాత్రి జరిగిన రెండు కుటుంబాల ఘర్షణపై ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు సోమవారం విచారణ చేపట్టారు. ఘర్షణ పడిన బాధిత కుటుంబీకులను, ఘటనా స్థలం సమీపంలోని నివసిస్తున్న పలువురిని విచారించారు. ఇరువర్గాల వివాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు, వివాదాలు తలెత్తకుండా పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట రౌతులపూడి రైటర్ డీవీ రమణ ఉన్నారు.