Kakinada District News
-
ఎవ్వరికీ అందడం లేదు
ప్రతి నెలా రేషన్ తీసుకునే ఎండీయూ వాహనం, రేషన్ షాపు వద్ద ఈ నెల కందిపప్పు రాలేదనే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనప్పటికీ ఎవ్వరికీ కందిపప్పు సక్రమంగా అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా రేషన్ బియ్యంతో పాటు, కందిపప్పు, పంచదార ఇచ్చేవారు. ఇప్పుడు ఇవి రెండూ అప్పుడప్పుడు మాత్రమే ఇస్తున్నారు. – నల్ల రాణి, వాకలపూడి, కాకినాడ రూరల్ ఒక్కసారి కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలైంది. ఒక్క నెలలో కూడా నాకు కందిపప్పు ఇవ్వలేదు. పేదలమైన మాపై కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోంది. ఇప్పుడేమో ఈ–కేవైసీ సాకుతో రేషన్‌లో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికై నా పేదలకు ఇచ్చే రేషన్‌లో కోత పెట్టకుండా ప్రతి నెలా బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర నిత్యావసర సరకులు ఇవ్వాలి. – పోకనాటి ప్రభాకరమూర్తి, కాకినాడ -
క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం
ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రబోధించిన దైవ కుమారుడైన ఏసు క్రీస్తు సిలువ మరణం పొందిన రోజును పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో సిలువ యాత్రలు నిర్వహించారు. అలనాడు క్రీస్తును ముళ్ల కొరడాలతో కొట్టి, రక్తం చిందింపజేసి.. సిలువ వేసిన సన్నివేశాలను కళ్లకు కట్టేలా ఈ యాత్రలు సాగాయి. నాడు క్రీస్తు అనుభవించిన బాధలను, శ్రమలను వీక్షకుల గుండెలు బరువెక్కే రీతిలో ప్రదర్శించారు. యాత్రల అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్లు, పాస్టర్లు మాట్లాడుతూ, పాప మార్గంలో పయనిస్తున్న సమస్త మానవాళినీ రక్షించేందుకే.. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు సిలువపై ప్రాణ త్యాగం చేశారని అన్నారు. ఆయన త్యాగం ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరుణ, ప్రేమ, క్షమ, సహనం వంటి సద్గుణాలను అలవరచుకోవాలన్నదే క్రీస్తు సందేశమని తెలిపారు. – కాకినాడ రూరల్/కరప -
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిక్కిరిసిపోయింది, సెలవు రోజు కావడంతో సత్యదేవుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీనికితోడు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. ఆలయంలో ఎక్కడ చూసినా నవదంపతులే దర్శనమిచ్చారు. వీరందరూ సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత, విశ్రాంత మండపాలన్నీ నవదంపతులు, వారి బంధుమిత్రులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించి, పూజలు చేశారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట సమయం పట్టింది.అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని 5 వేల మంది భక్తులు స్వీకరించారు. పరిశ్రమల్లో వాటిల్లే ప్రమాదాలపై అవగాహన కాకినాడ క్రైం: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శుక్రవారం పరిశ్రమల్లో వాటిల్లే ప్రమాదాలపై ఆ శాఖ అవగాహన కల్పించింది. జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి ఉద్దండురావు సుబ్బారావు ఆధ్వర్యాన వాకలపూడిలోని ఓ చమురు కంపెనీలో అవగాహన ప్రదర్శన చేపట్టారు. ప్రమాదవశాత్తూ వాటిల్లే అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాదాల నుంచి బయటపడే మెళకువలను సిబ్బందికి వివరించారు. పై అంతస్తుల్లో ఉన్న వారిని రక్షించి, తరలించే ప్రక్రియను డెమో ద్వారా చూపించారు. ఫైర్ ఎక్ట్సింగ్విషర్లను వినియోగించే విధానాన్ని తెలియజేశారు. పరిశ్రమల్లో వెలువడే రసాయన వ్యర్థాల నిర్వహణతో పాటు, వాటి వలన ముప్పు వాటిల్లకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం గ్యాస్ ప్రమాదాల నివారణపై కూడా డెమో ఇచ్చారు. రసాయన వాయువులు వెలువడితే తమతో పాటు సహోద్యోగులను కాపాడే సాహసోపేత ప్రక్రియలను వివరించారు. ‘సీతమ్మను రాముడు ఎన్నడూ శంకించలేదు’ ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రామాయణాన్ని చదవని వారు, రామతత్త్వాన్ని అర్థం చేసుకోని వారు సీతమ్మను రాముడు పరిత్యజించడాన్ని విమర్శిస్తారు. రాముడు ఎన్నడూ సీతమ్మను శంకించలేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై నాలుగో రోజు ప్రవచనాన్ని స్థానిక టి.నగర్ హిందూ సమాజంలో శుక్రవారం ఆయన కొనసాగించారు. ‘భర్తృ ధర్మం వేరు, రాజధర్మం వేరు. రాముడు రాజధర్మానికి కట్టుబడిన పాలకుడు. భద్రునితో తనను గురించి ప్రజలు మాట్లాడుకుంటున్న శుభాశుభాలు రెండూ తెలుసుకోవాలని రాముడు స్పష్టం చేశాడు. మన రాముడు సాగరంపై సేతువు నిర్మించి, రావణుని వధించి, దుష్కరమైన పని చేశాడు. కానీ, రావణుని స్పర్శ తగిలిన సీతమ్మను రాముడు ఎలా ఏలుకుంటున్నాడని ప్రజలు అనుకుంటున్నారని భద్రుడు చెబుతాడు. ఆదర్శవంతమైన పాలకుడు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి’ అని సామవేదం వివరించారు. ‘ఒక వ్యక్తి కీర్తి ఎంత కాలం ఈ లోకంలో ఉంటుందో, అంత కాలం ఆ వ్యక్తి ఉన్నత లోకాల్లో ఉంటాడు. ప్రతి ఒక్కరూ అపకీర్తి సోకకుండా తమను తాము రక్షించుకోవాలి. లోకాపవాదు అత్యంత బాధాకరమైనది. కానీ లోకాపవాదాన్ని తొలగించుకోవాలి. రాముడు 11 వేల సంవత్సరాలు పరిపాలిస్తే, అప్పటికే 9 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి వారు సీతమ్మ అగ్నిప్రవేశాన్ని నమ్మకపోయి ఉండవచ్చు. అపవాదు పట్ల రాముడు ఎంతగానో దుఃఖించాడు. సీతాపరిత్యాగమే తన కర్తవ్యమన్న నిర్ణయానికి వచ్చాడు. ఎవరో ఒక అనామకుడు చెబితే సీతమ్మను ఆయన పరిత్యజించలేదు. ఈ సందర్భంగా మనకు లవకుశ సినిమా గుర్తు రావచ్చు. ఆ సినిమా ప్రారంభంలోనే పద్మ పురాణాంతర్గతమైన కథను అనుసరించి సినిమాను రూపొందించినట్టు పేర్కొన్నారు. వివిధ కల్పాల్లో రామాయణ గాథ జరిగింది. వైవస్వత మన్వంతరంలోని కథను వాల్మీకి మహర్షి మనకు ప్రసాదించారు. స్థూల ధర్మం వేరు, సూక్ష్మ ధర్మం వేరు’ అని సామవేదం వివరించారు. -
బయట కొనాల్సిన దుస్థితి
అధికారంలోకి అన్నీ డబుల్ చేసి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ప్రతి నెలా ఇచ్చిన కందిపప్పు రేషన్ వాహనాల్లో ఇవ్వడం లేదు. దీంతో కందిపప్పు బయట కొనుగోలు చేసుకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది. పేదలకు పౌష్టికాహారంగా ఉపయోగపడే కందిపప్పును రేషన్ ద్వారా ఇవ్వకపోవడం దారుణం. – కర్రి వెంకటలక్ష్మి, టిడ్కో గృహ సముదాయం, సామర్లకోట స్టాక్ రావడం లేదంటున్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా రేషన్ వాహనం ద్వారా బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు అందజేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో బియ్యం ఇస్తున్నారు. పంచదార అరకొరగా ఇస్తూండగా, కందిపప్పు అప్పుడప్పుడు కనిపిస్తోంది. గత నెల పంచదార కూడా ఇవ్వలేదు. కందిపప్పు ఊసే లేదు. డీలర్లను, రేషన్ వాహనదారులను అడిగితే పై నుంచి స్టాక్ రావడం లేదని చెబుతున్నారు. చేసేది లేక బియ్యం మాత్రమే తీసుకుని వెళ్తున్నాం. – ఎస్ఎస్ రామ్‌కుమార్, కిర్లంపూడి -
వేట నిషేధ భృతికి మత్స్యకారుల గుర్తింపు
కాకినాడ రూరల్: ఈ నెల 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం అమలులోకి రావడంతో వేట నిషేధ భృతి అందజేసేందుకు మత్స్యకారుల గుర్తింపు ప్రక్రియను అధికారులు శుక్రవారం చేపట్టారు. ఈ ప్రక్రియను దాదాపు ఒకే రోజులో పూర్తి చేసే లక్ష్యంతో ఉదయమే ఎన్యూమరేషన్ మొదలు పెట్టారు. జిల్లాలో సుమారు 4,600 బోట్లు ఉండగా సుమారు 24 వేల మంది గంగపుత్రులు లబ్ధి పొందనున్నారు. బోటు యజమాని తన బోటుపై వేట సాగించే మత్స్యకారులు జాబితాను, వారి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను మత్స్యశాఖ అధికారులకు అందజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకే 3,725 బోట్లకు సంబంధించిన మత్స్యకారులు గుర్తింపు పూర్తి చేశారు. మిగిలిన వారిని శనివారం గుర్తిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేసి, 21న సోషల్ ఆడిట్ వివరాలు వెల్లడించనున్నారు. 22న అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం, సవరణలు చేసి 23న మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయానికి జాబితా అందజేస్తారు. ఈ నెల 26న వేట నిషేధ భృతిని మత్స్యకారుల ఖాతాలకు జమ చేయనున్నారు. దీనిని అర్హులైన అందరికీ వర్తింపజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
కానరాని పెళ్లి సందడి
అన్నవరం: దేవుని పెళ్లంటే ఊరంతా సంబరమే. ఎక్కడ చూసినా సందడే. చిన్నపాటి ఆలయమే అయినా.. దేవుని కల్యాణానికి నెల రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. అటువంటిది రాష్ట్రంలోని అతి గొప్ప క్షేత్రాల్లో ఒకటైన అన్నవరం సత్యదేవుని కల్యాణమంటే ఇంకెంత సందడి ఉండాలి..! సన్నాహాలు ఎంత జోరుగా సాగాలి..! కానీ, సత్యదేవుని కల్యాణోత్సవానికి గడువు సమీపిస్తున్నా.. దేవస్థానంలో అటువంటి సందడే కనిపించడం లేదు. కనీసం సమీక్ష కూడా లేదు అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు వచ్చే నెల 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. దీనికి ఇక 17 రోజులు మాత్రమే గడువుంది. ఈ ఉత్సవాల నిర్వహణపై ఈపాటికే సన్నాహాలు మొదలైపోవాలి. గతంలో నెల రోజుల ముందే సమన్వయ శాఖల సమావేశాలు, వరుస సమీక్షలు నిర్వహించే వారు. రత్నగిరిపై కల్యాణోత్సవ పనులు జోరుగా జరిగేవి. ఎందుకో కానీ, కల్యాణ ఘడియలు సమీపిస్తున్నా ఈ ఏడాది అసలు ఉత్సవ ఏర్పాట్లే ఆరంభం కాలేదు. ఆలయ ప్రాంగణంలో రంగులు మాత్రమే వేస్తున్నారు. ఈ నెల 30న జరగనున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై దేవదాయ శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ తదితరులు గత బుధవారం సమీక్షించారు. కానీ, ఈ చందనోత్సవానికి వారం రోజుల తరువాత జరిగే సత్యదేవుని కల్యాణోత్సవాలపై ఇప్పటి వరకూ ఎటువంటి సమీక్షా నిర్వహించలేదు. దేవస్థానం సిబ్బందితో ఈఓ వీర్ల సుబ్బారావు కేవలం ఒక్కసారి సమావేశమయ్యారు. శ్రీరామ నవమి నాడు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కల్యాణోత్సవాల నిర్వహణలో దేవస్థానంతో పాటు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య, జిల్లా ప్రజా రవాణా (ఆర్టీసీ) తదితర శాఖలు పాలు పంచుకుంటాయి. ఆయా అధికారులతో ఈపాటికే సమన్వయ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. చీఫ్ ఫెస్టివల్ అధికారి అవసరం రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గమ్మవారి దసరా ఉత్సవాలు, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం, శ్రీశైలంలో మహాశివరాత్రి, కార్తిక మాసం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఉత్సవాల సందర్భంగా దేవదాయ శాఖలో అనుభవజ్ఞులైన అధికారులను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో ఇప్పటి వరకూ అనుభవజ్ఞులైన అధికారులే ఈఓలుగా ఉండటంతో ప్రత్యేకాధికారులను నియమించడం లేదు. ప్రస్తుత ఈఓకు దేవస్థానం వ్యవహారాలు, ఉత్సవాల నిర్వహణలో అంత అనుభవం లేదు. ఈ ఏడాది కల్యాణోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. అలాగే, రథోత్సవానికి కూడా గిరి ప్రదక్షిణ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లుగా దేవస్థానంలో జరుగుతున్న వివాదాస్పద పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకాధికారిని నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ·˘ Ð]l^óla ¯ðlÌS 7 ¯]l$…_ çÜ™èlŧólÐ]l#° ¨Ð]lÅMýSÌêÅ׿ Ð]l$çßZ™èlÞÐéË$ ·˘ VýSyýl$Ð]l# çÜÒ$í³çÜ$¢¯é² M>¯]lÆ>° HÆ>µr$Ï ·˘ ´ùçÜtÆŠ‡ BÑçÙPÆý‡×æ™ø çÜÇ ·˘ çÜÐ]l$¯]lÓĶæ$ MýSÑ$sîæ çÜÐ]l*ÐólÔèæ… FõÜ Ìôæ§ýl$ ముసుగు వీడని రథం సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల సందర్భంగా మే 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీని కోసం గత ఏడాది రూ.1.08 కోట్లతో భారీ టేకు రథం నిర్మించారు. గతంలో సత్యదేవుని ఊరేగింపు వాహనాల్లో అత్యంత పెద్దది రావణబ్రహ్మ వాహనమే అతి పెద్దదిగా ఉండేది. ఇది సుమారు 20 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పున ఉంటుంది. ఈ వాహనంపై సత్యదేవుని ఊరేగింపును వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూంటారు. ఈ రావణబ్రహ్మ వాహనం కన్నా టేకు రథం దాదాపుగా రెట్టింపు సైజులో ఉంటుంది. దీని ఎత్తు 35.8 అడుగులు. వెడల్పు 14.6 అడుగులు. పొడవు 21 అడుగులు. ఈ రథానికి ఆరడుగుల ఎత్తున ఆరు చక్రాలున్నాయి. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం ఎత్తు 38 అడుగులు కాగా, దీని కంటే సత్యదేవుని టేకు రథం 2.4 అడుగులు మాత్రమే చిన్నది. ఈ రథానికి ఆకర్షణీయమైన రంగులు, ముందు భాగంలో గుర్రాల బొమ్మలు, చక్రాలకు హైడ్రాలిక్ బ్రేకులు ఏర్పాటు చేశారు. గత ఏడాది కల్యాణోత్సవాల సందర్భంగా ఈ రథం ట్రయల్ రన్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇంత ఎత్తు రథాన్ని మిట్టపల్లాలుగా ఉండే అన్నవరం మెయిన్ రోడ్డులో లాగడం చాలా కష్టం. ఏ ఇబ్బంది వచ్చినా అదుపు చేయడానికి జేసీబీ రక్షణగా ఉండాలి. గత ఏడాది అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ నిపుణులు, ఇంజనీరింగ్, ఇతర సిబ్బంది సహకారంతో ట్రయల్ రన్, తరువాత రథోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఈ రథాన్ని పంపా సత్రంలో ముసుగు కప్పి ఉంచారు. అప్పటి నుంచీ ఆ రథం ఎలా ఉందో ఏ ఒక్కరూ పట్టించుకోనే లేదు. ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా రథం ముసుగు తీయలేదు. ప్రస్తుతం కల్యాణోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఈ రథానికి ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంది. దీని ఫిట్నెస్ను నిపుణులతో పరీక్షించాలి. అటువంటి పనులు ఇంత వరకూ మొదలు కాలేదు. రథాన్ని నేల పైనే ఉంచడంతో దాని చక్రాలకు చెదలేమైనా పట్టాయా.. పడితే ఏం చేయాలనేది కూడా పరిశీలించలేదు. -
మద్యం తాగి రత్నగిరి ఉద్యోగి సస్పెన్షన్
అన్నవరం: రత్నగిరిపై రవాణా విభాగం ఉద్యోగి ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్న విషయం మరువక ముందే తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కౌంటర్లో ఉద్యోగి పసుపులేటి సుబ్బారావు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నట్టు బ్రీత్ అనలైజర్ పరీక్షలో దొరికిపోయాడు. దీంతో ఈఓ వీర్ల సుబ్బారావు అతడిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి పది గంటల సమయంలో ఒక భక్తురాలు స్వామివారి ప్రసాదం కొనుగోలు చేయడానికి ఆ కౌంటర్ వద్దకు వచ్చారు. రూ.200 ఇచ్చి ఐదు ప్యాకెట్లు ఇవ్వాలని ఆ మేరకు టోకెన్లు ఇచ్చారు. ఐదు ప్యాకెట్ల విలువ రూ.వంద పోను మిగిలిన రూ.వంద ఇవ్వాల్సి ఉండగా సదరు ఉద్యోగి ఆమెకు దురుసుగా సమాధానం ఇచ్చారు. అతని మాటతీరు, ప్రవర్తనపై ఆమె ఈఓకు ఫిర్యాదు చేశారు. ఆయన సెక్యూరిటీ గార్డులతో కలసి వచ్చి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసి మద్యం తాగినట్టు గుర్తించి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. -
ధాన్యపురాశిని ఢీకొని యువకుడి మృతి
దేవరపల్లి: రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం రాసులను ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కధనం ప్రకారం మండలంలోని కొత్తగూడేనికి చెందిన పుట్టా వీరవెంకటరమణ(30) గురువారం సాయంత్రం యర్నగూడెంలోని తన తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రితో మాట్లాడి అర్ధరాత్రి సమయంలో తిరిగి గుండుగొలను–కొవ్వూరు 16వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో బైక్‌పై వస్తుండగా, రోడ్డుపై ఆరబెట్టి ఉన్న ధాన్యం రాశులను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో వీర వెంకటరమణ రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. అయితే అర్ధరాత్రి సమయం కావడం, ఆ సమయంలో అటు వైపు ఎవరూ వెళ్లకపోవడంతో రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న వీరవెంకటరమణను ఎవరూ చూడలేదు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది గమనించి స్థానిక పోలీసుల సహకారంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరవెంకటరమణను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సత్యనారాయణ తల్లి ఏడాది క్రితం మృతి చెందగా, తండ్రి ఉన్నారు. తండ్రి యర్నగూడెంలో ఉంటుండగా, వెంకటరమణ కొత్తగూడెంలో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి. సుబ్రహ్మణ్యం తెలిపారు. రాత్రి వేళ రాకపోకలు లేక ఎవరూ గుర్తించని పరిస్థితి తెల్లవారు జాము 3 గంటల వరకు రోడ్డుపైనే పడిఉన్న వైనం హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలింపు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఫీల్డ్ అసిస్టెంట్ల పోరుబాట
● అధికారులకు సమ్మె నోటీసు ● పది రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● లేకుంటే విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం పిఠాపురం: అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక వాటిని కూటమి సర్కార్ నెరవేర్చకపోవడంతో వివిధ వర్గాలు ఇప్పటికే ఆందోళన బాట పడుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా వచ్చి చేరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామని జిల్లావ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న 385 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ ఆందోళనలో భాగంగా గురువారం నుంచి నిరసన కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ సమస్యలను కూటమి సర్కార్ పరిష్కరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి చేపట్టినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 28వ తేదీలోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి, సమ్మె బాట పడతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఇవీ డిమాండ్లు ● 19 ఏళ్ల సర్వీసును గుర్తించి, ఫీల్లు అసిస్టెంట్లందరినీ గ్రామ పంచాయతీ ఉద్యోగులుగా గుర్తించి, విధులు క్రమబద్ధీకరించాలి. ● అందరికీ ఎఫ్‌టీఈ ఇచ్చి, పూర్తి స్థాయి హెచ్ఆర్ పాలసీ, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, గ్రాట్యుటీ వంటివి అమలు చేయాలి. ● విధి నిర్వహణలో మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి. మరణ పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలి. ● 2016–19 మధ్య ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు జీతాలు పెంచారు. కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెంచలేదు. అదే నిష్పత్తిలో మాకూ పెంచాలి. ● విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు ఇచ్చి, అర్హతలున్న వారిని కంప్యూటర్ ఆపరేటర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా నియమించాలి. ఇదీ ఉద్యమ కార్యాచరణ తొలుత నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతారు. సమ్మె నోటీసు ఇస్తారు. ఈ నెల 21న ఒక రోజు పనులు పూర్తిగా ఆపేసి, పెన్‌డౌన్ చేస్తారు. సమ్మె విషయం తెలియజేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తారు. ఈ నెల 28 నుంచి విధులు పూర్తిగా బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తారు. ఫీల్డు అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా సంఘం ఈ మేరకు నిర్ణయించింది. ఇప్పటికే వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన ప్రారంభించారు.సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం దీర్ఘ కాలంగా ఉన్న మా సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాడతాం. మాకు న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కానీ మాకు నిరాశే మిగిలింది. అందుకే వేరే దారి లేక ఉద్యమానికి వెళ్తున్నాం. మేము ఇచ్చిన గడువులోగా డిమాండ్లు నెరవేరకపోతే నిరవధిక సమ్మె చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికై నా మా సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలి. – కడమటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం డిమాండ్లు నెవేర్చాలి న్యాయబద్ధంగా రావాల్సిన వాటినే మేము అడుగుతున్నాం. వాటిని ప్రభుత్వం నెరవేర్చాలి. లేకుంటే సమ్మె తప్ప మాకు వేరే మార్గం లేదు. మా సమస్యలు పరిష్కరిస్తారని ఇప్పటి వరకూ వేచి చూశాం. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు పిలుపునిచ్చాం. ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కరించి, సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. – గుబ్బల సత్యవేణి, జిల్లా కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం -
నీ కొలువుకు సెలవు స్వామీ..!
● రత్నగిరిపై ఇద్దరు ఉద్యోగుల వీఆర్ఎస్ ● దీర్ఘకాలిక సెలవులో మరో ఇద్దరు ● సెలవు ఇస్తే తామూ సిద్ధమేనంటున్న మరికొందరు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని దుస్థితి నెలకొంది. ఈఓ వీర్ల సుబ్బారావుకు, దేవస్థానం ఉద్యోగులకు మధ్య అంతర్గతంగా ఏవైనా సమస్యలున్నాయో లేక ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నారో కానీ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ఉద్యోగులు వీఆర్ఎస్ బాట పడుతున్నారు. మరికొంత మంది దీర్ఘకాలిక సెలవులో వెళ్తున్నారు. పలుకుబడి ఉన్న ఉద్యోగులు ఇతర దేవస్థానాలకు బదిలీ చేయించుకుంటున్నారు. మిగిలిన ఉద్యోగులు తమకు వారాంతపు సెలవు కూడా సెలవు ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న సీహెచ్ రామ్మోహన్రావు కొన్ని రోజుల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్)కు దరఖాస్తు చేశారు. అన్నవరం దేవస్థానం ఉద్యోగిగా విధుల్లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి, అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం ఈఓగా పని చేశారు. ఆ తరువాత అన్నవరం దేవస్థానంలోనే ఉద్యోగ విరమణ చేయాలనే కోరికతో ఇక్కడకు బదిలీపై వచ్చారు. మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు సమర్పించారు. ● దేవస్థానంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వేంకటేశ్వరరావు కూడా వ్యక్తిగత కారణాలంటూ గురువారం వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ● ఒక ఏఈఓ అనారోగ్య కారణాలతో గత నెలలో నెల రోజులు సెలవు పెట్టారు. ● మరో సూపరింటెండెంట్ తన తల్లికి అనారోగ్యం అని పేర్కొంటూ సింహాచలం దేవస్థానానికి బదిలీ చేయించుకున్నారు. ● మరోవైపు ఏ పనీ లేకపోయినా వారాంతపు సెలవు దినమైన మంగళవారం కూడా దేవస్థానానికి రావాల్సి వస్తోందని చాలా మంది సిబ్బంది అసంతృప్తి చెందుతున్నారు. ● దగ్గరి బంధువు పెళ్లికి ఒక పూట సెలవు కోరగా నిరాకరించడంతో దేవస్థానంలో కీలక విభాగంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ సేవ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఓ కేంద్ర మంత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తొమ్మిది గంటలకు రత్నగిరికి వచ్చారు. గతంలో అయితే ఆ మంత్రికి ఈఓ స్వాగతం పలికి, ఎవరో ఒక దేవస్థానం అధికారికి ఆయన బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయేవారు. అయితే ఈ కేంద్ర మంత్రికి మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దేవస్థానం అధికారులందరూ సేవలందించాల్సి వచ్చింది. మళ్లీ మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకే వారందరూ విధులకు హాజరు కావాల్సి వచ్చింది. దీనిపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 62 ఏళ్లకు పెంచాలని కోర్టుకు వెళ్లి.. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. అలాగే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ రెండు సందర్భాల్లోనూ తమకు కూడా ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని కోరుతూ దేవస్థానం ఉద్యోగులు కోర్టులో కేసులు వేసి, విజయం సాధించారు. అటువంటిది ఇప్పుడు ఇంకా ఉద్యోగ విరమణకు సమయం ఉన్నప్పటికీ వీఆర్ఎస్కు దరఖాస్తు చేస్తూండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అన్నవరం దేవస్థానంలో ఉద్యోగుల అసంతృప్తికి కారణమేమిటనే దానిపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులు, మౌలిక వసతుల విషయంలో రోజు రోజుకూ అసంతృప్తి పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో.. దీనిని ఇలాగే వదిలేస్తే దేవస్థానం మరింత అప్రతిష్ట మూటకట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. కొండకు చినబాబు దూరం ‘చినబాబు వచ్చారు.. బహుపరాక్’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం కథనం ప్రచురించిన నేపథ్యంలో రెండు రోజులుగా ఆయన రత్నగిరిపై కనిపించడం లేదు. దీంతో దేవస్థానం ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పటికే కావల్సినంత నష్టం జరిగిపోయిందని సిబ్బంది అంటున్నారు. -
గిట్టుబాటు ధర కల్పనలోప్రభుత్వం విఫలం
● రైతు పరిస్థితి దయనీయం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకోటనందూరు: రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. కోటనందూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతుల నుంచి 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో మే నెలాఖరు వరకూ ధాన్యం కొనుగోలు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం మార్చి నెలాఖరుకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆపేసిందని అన్నారు. మెట్ట ప్రాంతంలో ఇప్పటికీ 50 శాతం దిగుబడి కళ్లాల్లో కుప్పల పైనే ఉందని చెప్పారు. దళారులను అడ్డం పెట్టుకొని నేరుగా ప్రభుత్వ పెద్దలే దోచుకుంటూంటే రైతుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ఈ ప్రభుత్వంతో రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రైతులపై అక్రమ కేసులు తొండంగి మండలంలో కనీస మద్దతు ధరపై ప్రశ్నించిన రైతులపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయించి, వారిని రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2,200 ఉన్నప్పుడు రూ.2 వేలకు తగ్గకుండా కొనుగోలు చేశామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.1,500కు మాత్రమే కొనుగోలు చేస్తోందని, దీనివలన రైతులు దారుణంగా నష్టపోతున్నారని అన్నారు. ఆక్వా రైతులను ముంచేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉందని రాజా అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా జగన్ ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి, ఆక్వా రైతులను ఆదుకోగా.. నేడు వారిని కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప మరో గత్యంతరం లేదంటూ ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నిజమైన రైతుల స్టోరేజీ యూనిట్లన్నింటినీ మూయించి, చంద్రబాబు అనుయాయుల స్టోరేజీ యూనిట్లను తెరిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఆక్వా రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా ట్రంపు, అమెరికా పరిస్థితులు అంటూ ప్రభుత్వ పెద్దలు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్లి రామచంద్రరావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, వాణిజ్య విభాగం తుని నియోజకవర్గ అధ్యక్షుడు వెలగా వెంకట కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ అడ్డా.. మురికి గడ్డ
మంగయ్యమ్మరావుపేటలో వర్షం వస్తే రోడ్డు చెరువవుతుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడ్డాగా చెప్పుకొంటున్న పిఠాపురం మున్సిపాలిటీ ‘మురికిపాలిటీ’గా మారి పోయింది. ఎక్కడ చూసినా పట్టణంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. డ్రైన్లు పొంగి పొర్లుతూండటంతో రోడ్లు మురికికూపాలను తలపిస్తున్నాయి. స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన మున్సిపల్ కుళాయిల నుంచి మురుగు నీరే వస్తోంది. మంచి నీరు కావాలంటే మురికి కాలువలోకి దిగి తెచ్చుకోవాల్సి దుస్థితి నెలకొంది. పట్టణంలో పందుల వీరవిహారం గురించి చెప్పనవసరమే లేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. దీంతో, ‘పవన్ కల్యాణ్ ఇలాకాలో మా దుస్థితి ఇదీ’ అంటూ జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ చల్లా లక్ష్మి స్వయంగా మురికి కాలువలను శుభ్రం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రజలు తమను తిడుతున్నారని ఆవేదన చేశారు. ఓట్లు వేసి, ఎమ్మెల్యేగా గెలిపించి, ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా చేసిన పవన్ కల్యాణ్ ఒక్కసారైనా వచ్చి చూసి, తమ కష్టాలను గట్టెక్కిస్తారేమోనని పట్టణ ప్రజ లు ఆశ పడుతున్నారు. – పిఠాపురం మురికి కాలువలను శుభ్రం చేస్తున్న జనసేన నేత చల్లా లక్ష్మి -
కుంటుబడ్డ ఇంటి ప్రణాళికలు
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌పై తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 20ని ఆయా పట్టణాల్లోని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు (ఎల్టీపీ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో ద్వారా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ స్వీయ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్సీఎస్) విధానంతో ఆ బాధ్యతలను ఎల్టీపీలకు అప్పగించింది. అయితే ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ భవన యాజమాని ప్లాన్ అతిక్రమిస్తే ఎల్‌టీపీలను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలన్న నిబంధనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎల్టీపీలు జీవో వచ్చిన గత రెండు నెలల నుంచి 300 చదరపు మీటర్ల స్థలంలోపులో ఒక్క ప్లాన్ కూడా ఇవ్వకుండా నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఏడున్నర సెంట్ల లోపు ముఖ్యంగా రెసిడెన్షియల్ బిల్డింగ్‌లకు ప్లాన్ల అప్రూవల్‌లు చేయకపోవడంతో ప్లానులన్నీ నిలిచిపోయాయి. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఇచ్చే విధానంలో లోపాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఆ బాధ్యతను ఎల్టీపీలకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఏదైనా బిల్డింగ్ ప్లాన్‌కు అనుమతి ఇస్తే 10 శాతం వరకూ అతిక్రమణ (డీవియేషన్)కు మినహాయింపు ఉంటుంది. అంతకుమించి అతిక్రమణ జరిగితే భవన నిర్మాణాన్ని నిలిపివేస్తారు. అయితే ప్లాన్ ఇచ్చిన ఎల్‌టీపీని బాధ్యుణ్ణి చేయడం, సంబంధిత ఎల్టీపీ లైసెన్స్‌ను అయిదేళ్ల పాటు రద్దు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా ఉంటాయన్న జీవో నిబంధననే వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మున్సిపాల్టీల ఆదాయాలకు గండి ఎల్టీపీలు బిల్డింగ్ ప్లానులు ఇవ్వకపోవడంతో నిలిచిన భవన నిర్మాణాలతో ఆయా మున్సిపాలిటీలకు ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీలో గత ఏడాది 300 చదరపు మీటర్ల లోపు భవనాలకు 170 వరకూ ప్లాన్లు ఇస్తే జీవో వచ్చిన నాటి నుంచి ఒక్క ప్లాన్ కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అంచనా వేయవచ్చు, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి. జిల్లా మొత్తం మీద మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ జీవో అభ్యంతరాలు లేకపోతే ఈ రెండు నెలల్లో 100కి పైగా ప్లాన్లు మంజూరు చేసే అవకాశం ఉండేది. ప్లాన్లు ఇవ్వకపోవడంతో దాదాపు రూ.1.20 కోట్ల వరకూ ఆదాయానికి గండి పడింది. ప్లాన్లను ఎల్టీపీలు అనుమతించని పరిస్థితుల్లో కొత్తగా 300 చదరపు మీటర్ల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారు సైతం ఈ కొత్త జీవో, నిబంధనలపై పెదవి విరిస్తున్నారు. జీవోను వ్యతిరేకిస్తూ ప్లాన్లు ఇవ్వని ఎల్టీపీల నిరసన ఓ పక్క సాగుతుంటే కొందరైతే ప్లాన్ అప్రూవల్ లేకుండానే సొంత ప్లాన్లతో ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపాలిటీ పరంగా ఏదైనా అభ్యంతరం ఎదురైతే అప్పుడే చూద్దామన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారు. మాపై చర్యలను మినహాయిస్తే జీవోను స్వాగతిస్తాం భవన యాజమానులు ప్లాన్‌ను అతిక్రమిస్తే తమను బాధ్యులను చేయని పక్షంలో జీవోను స్వాగతిస్తామని ఎల్టీపీలు అంటున్నారు. లేదా 300 చదరపు మీటర్లు దాటిన స్థలాలకు ప్లాన్‌ను అనుమతి ఇచ్చే బాధ్యతలు తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జీవో నంబర్20ని సవరించి ప్లాన్ అతిక్రమణ అయితే తమ లైసెన్ప్ రద్దు చేయడం, క్రిమినల్ కేసు వంటి ఆంక్షలు తొలగించాలని సూచిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో అతిక్రమణ జరిగితే భవన యాజమానిని బాధ్యులను చేయాలే తప్ప తమను బాధ్యులను చేయడమేమిటని ఎల్టీపీలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ప్లాన్ కూడా అమలు కాలేదు జీవో నంబర్ 20 వచ్చినప్పటి నుంచి అమలాపురం మున్పిపాలిటీలో 300 మీటర్ల లోపు ఇంటి స్థలాల్లో ప్లాన్ అప్రూవల్ అవ్వలేదు. 300 మీటర్లు దాటిన స్థలాల్లో పెద్ద భవనాలు, కమర్షియల్ భవనాలకు అనుమతులు ఇచ్చాం. – రాణి సంయుక్త, టౌన్ ప్లానింగ్ అధికారి, అమలాపురం జీవో నంబర్ 20ని సవరించాలి మా ఎల్టీపీల ఉనికిని ఇబ్బంది పెట్టేలా ఉన్న జీవో నంబర్ 20ని ప్రభుత్వం సవరించాలి. జీవోలో ఆంక్షలు విధిండం మేం వ్యతిరేకిస్తున్నాం. జీవోను సవరించే వరకూ బిల్డింగ్‌లకు ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చేది లేదు. – యేడిద దొరబాబు, అధ్యక్షుడు, ఎల్టీపీల అసోసియేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పట్టణాల్లో పట్టించుకోని ఎల్టీపీలు జీవో నంబర్ 20ని వ్యతిరేకిస్తూ నిరసన ఎల్‌టీపీలను బాధ్యులను చేస్తున్న ఎస్సీఎస్ విధానం నిలిచిన ప్లాన్ అప్రూవల్స్... తగ్గిన ఆదాయం -
నాన్ స్టాప్ కీబోర్డు ప్లేయర్‌గా విద్యశ్రీ గిన్నిస్ రికార్డు
రాయవరం: మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన విద్యశ్రీ కీబోర్డు ప్లే చేయడంలో గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని విద్యశ్రీ తల్లిదండ్రులు సురేష్, సుధారాణి గురువారం స్థానిక విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం విద్యశ్రీ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కీబోర్డుపై ఉన్న ఆసక్తితో విజయవాడకు చెందిన హల్లెలూయ మ్యూజిక్ స్కూల్లో ఆన్లైన్ తరగతులకు హాజరై కీబోర్డు ప్లే చేయడంతో పాటు, మెళకువలను నేర్చుకుంది. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్సిస్ రికార్డు ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు వారు తెలిపారు. గతేడాది డిసెంబరు 1న ఇన్‌స్ర్ట్రాగామ్ వేదికగా ఆన్లైన్లో గంట పాటు నిర్వహించిన పోటీలో విద్యశ్రీ పాల్గొంది. ఇదే పోటీలో 1,046 మంది ఒకే సమయంలో పాల్గొని గంట పాటు నిర్విరామంగా కీబోర్డు ప్లే చేశారు. గిన్నిస్ రికార్డులో భాగస్వామిగా ఉన్న విద్యశ్రీని గిన్సిస్ రికార్డు ఆఫ్ ఇండియా సంస్థ సర్టిఫికేట్, మెడల్‌ను ప్రదానం చేసింది. ఇంతకుముందు విద్యశ్రీ కీబోర్డు ప్లేయర్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇన్జనియస్ వరల్డ్ రికార్డును సాధించిందన్నారు. కీబోర్డు ప్లేయర్‌తో పాటుగా, చిత్రలేఖనంలో విద్యశ్రీ రాణిస్తున్నట్లు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడిగా రమేష్
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల జోనల్ అధ్యక్షుడిగా అమలాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకుడు జిల్లెళ్ల రమేష్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. రమేష్ గతంలో పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి విద్యార్థి విభాగంలో పనిచేసిన అనుభవంతో రమేష్‌ను ఉభయ గోదావరి జిల్లాల జోనల్ అధ్యక్షునిగా పార్టీ నియమించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు కాకినాడ రూరల్: స్థానిక సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో తాగి వాహనం నడుపుతున్న వారిని గుర్తించి 12 కేసులను పోలీసులు నమోదు చేశారు. వాహన తనిఖీలలో భాగంగా, తాగి వాహనం నడిపిన వాహనదారులకు 3వ జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి జి.శ్రీదేవి శిక్ష విధించారు. 12 మందిలో 8 మందికి ఒకొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.80వేల రూపాయల జరిమానా, నలుగురికి ఒకొక్కరికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై పరిశీలన
కొత్తపల్లి: కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో జరుగుతున్న పనులపై అధికారులు పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టాలని జాతీయ వాష్ నిపుణుడు ఆనంద్ టి పీటర్ అన్నారు. మండలంలోని నాగులాపల్లి, కొత్తఇసుకపల్లి, గోర్స, రమణక్కపేట గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు పూర్తి స్ధాయిలో తాగునీరు అందుతోందా.. లేదా, అంగన్ వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారో లేదో ఆరా తీశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. తాగునీటికి సంబంఽధించి పూర్తి సయిలో గ్రామాల్లో నీటి పరిక్షలు అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతుందా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతీ ఇంటికి కుళాయిని ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్చమైన తాగునీటిని అందించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ జేఈ రమణ, సచివాలయ సిబ్బంది ఉన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): నగరంలోని ఆవ పరిసర ప్రాంతాల్లో ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి కబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు. ‘ఇంటి స్థలం కోసం పేదల గోడు’ పేరిట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన స్థానిక 16వ డివిజన్ ఆవ ప్రాంతం నుంచి సుమారు 4 వేల మందితో ప్రదర్శన గురువారం నిర్వహించారు. ఎస్టీపీ వద్ద మేకల కబేళాను ఆనుకుని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం 16 ఎకరాల స్థలంలో ఎరజ్రెండా పాతి, కొబ్బరికాయ కొట్టి, దీనిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇంటి స్థలాల హామీని మంగళగిరి మినహా ఇప్పటి వరకూ ఎక్కడా నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం 8 నెలలుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదల ఇళ్ల స్థలాలుగా పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని రామకృష్ణ అన్నారు. ఇళ్ల స్థలాల సమస్యను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, ఆవకు ఆనుకుని ఉన్న 16 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని, సుదూర ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే వారు ఇబ్బందులు పడతారని అన్నారు. ఇళ్ల స్థలాలపై తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. తాము రాస్తున్న ప్రతి దరఖాస్తుదారుకు ఇక్కడే ఇంటి స్థలం మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి త్వరలో ఇక్కడ పాకలు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ కోనసీమ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ భూమి కబ్జాలను నిరోధించాలి ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ ఫ నగరంలో భూ పరిరక్షణ పోరాటం -
ఫొటో స్టూడియోలో చోరీ
దేవరపల్లి: స్థానిక ఆర్కే డిజిట్ ఫొటో స్టూడియోలో గురువారం తెల్లవారు జామున చోరీ జరిగింది. గుండుగొలను–కొవ్వూరు రాష్ట్ర ప్రధాన రహదారి(పాత) పక్కన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి సమీపంలో గల డిజిటల్ స్టూడియోలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు కారులో వచ్చి స్టూడియో షట్టర్ తాళం బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించినట్టు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజ్‌లో నమోదైంది. స్టూడియో యజమాని కె.రామకృష్ణ కథనం ప్రకారం బుధవారం రాత్రి పెళ్లి ఫొటోలు తీసి 2.30 గంటలకు స్టూడియోకు వచ్చి కెమెరాలు, హెచ్‌పీ ల్యాప్‌టాప్ స్టూడియోలో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఉదయం 9 గంటల సమయంలో స్టూడియోకి వచ్చి చూడగా తాళం బద్దలు కొట్టి ఉంది. షట్టర్ తీసి లోపలకు వెళ్లి చూడగా రెండు కెమెరాలు, హెచ్‌పీ ల్యాప్‌టాప్, రెండు హార్డ్ డిస్క్‌లు దొంగిలించుకుపోయినట్టు గుర్తించారు. హార్డ్ డిస్క్‌ల్లో సుమారు 30 పెళ్లిళ్ల ఫొటోలు ఉన్నట్టు ఆయన చెప్పారు. 3 గంటల సమయంలో చోరీ జరిగి ఉంటుందని ఆయన తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై వి.సుబ్రహమణ్యం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కారుకు నంబరు ప్లేట్‌కు స్టిక్కర్ అతికించి దొంగలు జాగ్రత్త పడ్డారు. కూ్‌ల్స్ టీం వేలిముద్రలను సేకరించింది. బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహమణ్యం తెలిపారు. చోరీ జరిగిన వస్తువుల విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని చెప్పారు. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారిలోని మూడు రోడ్లు కూడలి ప్రదేశంలో ఇటు వంటి చోరీలు జరగడం పట్ల వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. రెండు కెమెరాలు, లాప్టాప్ దొంగల పాలు చోరీ సొత్తు విలువ రూ.1.80 లక్షలు -
వర్గపోరులో ఢీసీసీబీ
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు పందేరం పుణ్యమా అని సామాజికవర్గాలు, పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పొడచూపుతోంది. తొలుత ఒక పేరు ప్రచారంలో ఉంచడం, చివరకు మరొకరికి పదవి కేటాయించడం టీడీపీలో కొత్త వ్యూహంగా మారింది. ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్)లకు త్రీమెన్ కమిటీ పదవుల నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి వరకు ఇదే పంథా అవలంబిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులకు పేర్లను ఖరారు చేసే పనిలో టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. దీనిలో డీసీసీబీ చైర్మన్ పదవి కీలకమైంది. తొలి నుంచి ఈ పదవికి అమలాపురానికి చెందిన పార్టీ నాయకుడు మెట్ల రమణబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డీసీసీబీకి నిర్వహించిన ఎన్నికల్లో రమణబాబు టీడీపీ తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత వరుపుల జోగిరాజు (రాజా)పై పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి రమణబాబు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ రమణబాబుకు ఈ పదవి కేటాయించలేదు. కేవలం గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ పదవితో సరిపెట్టారు. ఈసారి తనకు ఈ పదవి వస్తుందని రమణబాబు బలంగా నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలో సైతం అతని పేరు ప్రముఖంగా వినిపించింది. కాని వారం రోజులుగా పరిస్థితి తల్లకిందులైంది. డీసీసీబీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని, అందునా శెట్టిబలిజ సామాజికవర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీనిలో భాగంగా కొత్తపేటకు చెందిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్) పేరు ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆర్ఎస్ను పార్టీ అధిష్టానం సంప్రదించిన విషయం తెలిసిందే. క్యాబినెట్ ర్యాంకు పదవి చేసిన తాను డీసీసీబీ చైర్మన్ పదవి చేయలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తెరపైకి పిల్లి సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవిని ఆర్ఎస్ తిరస్కరించడంతో కాకినాడ రూరల్‌కు చెందిన పిల్లి సత్తిబాబు పేరు తెరపైకి తీసుకువచ్చారు. సత్తిబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా పనిచేసిన విషయం తెలిసిందే. కూటమి పార్టీల మధ్య కుదిరిన పొత్తులలో భాగంగా కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పంతం నానాజీ విజయం సాధించారు. జనసేనకు ఆ సీట్టు ఇవ్వడంతో అవకాశం కోల్పోయిన సత్తిబాబుకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనితో సత్తిబాబు ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నారు. పిఠాపురం నుంచి ఈ పదవి ఆశిస్తున్న ఎస్.వి.ఎస్.ఎన్.వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఎన్నికల పూర్తయిన తరువాత పక్కన బెట్టడం చూసిన సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చినా చాలన్నట్టుగా చూస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇందుకు సముఖంగా ఉన్నట్టు తెలిసిందే. రమణబాబు చివరి యత్నాలు డీసీసీబీ చైర్మన్ పదవి చేజారిపోతోందని తెలియడంతో రమణబాబు చివరి యత్నాలు ప్రారంభించారు. పార్టీ అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. దీనిలో భాగంగా ఆయన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలవనున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి తనకు కేటాయించాలని ఆయన పట్టుబట్టనున్నారు. అయితే రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశం టీడీపీ అధిష్టానానికి లేదని పార్టీలో కొంతమంది ప్రముఖులు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో రమణబాబు పట్టుబట్టడంతోనే అమలాపురం అసెంబ్లీ స్థానం ఆనందరావుకు కేటాయించారు. గతంలో ఒకసారి రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు కలిశారు. ‘రమణబాబు కోటాలోనే ఆనందరావుకు సీటు ఇచ్చామని, ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి’ అని అప్పుడు లోకేష్ అన్న మాటలను పార్టీ క్యాడర్ గుర్తు చేసుకుంటోంది. పదవిపై హామీ ఇవ్వకుండా పరోక్షంగా రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చేది లేదని తేల్చినట్టుగా క్యాడర్ భావిస్తోంది. దీనికితోడు గత ప్రభుత్వంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో అమలాపురం మున్సిపాలిటీ ఓసీ మహిళ రిజర్వ్ అయ్యింది. ఆ సమయంలో రమణబాబు సతీమణిని పోటీలో పెట్టాల్సిందిగా లోకేష్ సూచించారని, ఇందుకు రమణబాబు అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో పట్టణంలో పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. దీనిపై లోకేష్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే తూర్పు డీసీసీబీ చైర్మన్ పదవి తొలి నుంచి కాపు సామాజికవర్గానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సైతం అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు), ఆకుల వీర్రాజుకు ఇచ్చిన విషయాన్ని రమణబాబు వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఈ ఆనవాయితీని కాదని బీసీలకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న వారు.. ఇదే విషయాన్ని లోకేష్ వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీసీఎస్ చైర్మన్ పదవుల కోసం తూర్పు డీసీసీబీ పరిధిలో 198 సహకార సంఘాలున్నాయి. వీటికి సంబంధించి త్రీమెన్ కమిటీల నియామకం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి పంపించారు. ఒకటి, రెండు చోట్ల తప్ప పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. గత ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం నుంచి జీవో విడుదల అవుతుందనుకున్న సమయంలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏఏసీఎస్ పదవుల పందేరానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసినా పదవులకు సంబంధించిన ప్రకటన మాత్రం విడుదల కాకపోవడంతో పదవులు దక్కినవారు ఆశగా ఎదురుతెన్నులు చూస్తున్నారు. చైర్మన్ పీఠం కోసం నేనంటే నేను బీసీలకే అంటున్న టీడీపీ అధిష్టానం రేసులో పిల్లి సత్తిబాబు... మెట్ల వర్గంలో ఉలికిపాటు చివరి యత్నంగా చినబాబు దగ్గరకు జిల్లాలో పదవుల కోసం ఎదురుచూపులు -
‘బహుపరాక్’ కథనంపై ఆరా
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అధికారి కుమార రత్నం అధికార కార్యకలాపాల్లో యథేచ్ఛగా పాల్గొంటూ సిబ్బందిని, దిగువ స్థాయి అధికారులను హడలెత్తిస్తున్న వైనంపై బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘చిన్నబాబు వచ్చారు ...బహుపరాక్ ’ వార్త తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ వార్తపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు చినబాబు ఎవరనే దానిపై ఆరా తీయడంతో బాటు ఆయన వ్యవహార శైలిపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. డ్రోన్ కొనుగోలుపై అధికారిక సమావేశంలో ఆ అధికారితో బాటు ఆ పుత్రరత్నం పాల్గొనడం, ఆ ఫొటోలు, వీడియోలలో పుత్రరత్నాన్ని డిలీట్ చేయడం వంటి వాటిపై కూడా ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం సింహాచలం దేవస్థానంలో జరిగిన చందనోత్సవం సమీక్ష సమావేశంలో రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కె.రామచంద్రమోహన్ పాల్గొన్నారు. ఆ సమావేశం అనంతరం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఈ కథనంపై సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు అందజేశారు. నివేదిక పంపిన ఇంటెలిజెన్స్ అధికారులు -
వక్ఫ్ చట్ట సవరణలపై నిరసన
కాకినాడ సిటీ: ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా కాకినాడలో బుధవారం ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ చట్టంను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వక్ఫ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వ్యతిరేకిస్తూ ముస్లిం వక్ఫ్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మొయిన్‌రోడ్డులోని జమియా మసీద్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వక్ఫ్‌ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వక్ఫ్‌బోర్డు మాజీ డైరెక్టర్ బషీరుద్దీన్, మాజీ కార్పొరేటర్ తెహర ఖతూన్, జవహర్ అలీ, తాజువుద్దీన్, అబ్దుల్ బషీరుద్దీన్, రెహమాన్, రహీం, కుతుబుద్దీన్, జిలాని దురాని, అబ్దుల్ రజాక్ రిజ్వీ, గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు. ఆందోళనకారులు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభీష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావన్నారు. శంఖవరం ఘటనలో దోషులను శిక్షించాలి రౌతులపూడి: శంఖవరంలో రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డా.బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండవేసి అవమాన పరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు అంగూరి లక్ష్మీశివకుమారి డిమాండ్ చేశారు. బుధవారం తన స్వగ్రామం ఎ.మల్లవరంలో ఆమె విలేకర్లుతో మాట్లాడుతూ శంఖవరంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడిని ఇంత దారుణంగా అవమానించడం అమానుషం అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు ఎక్కడోచోట నిత్యం జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టకుండా అణగారిన వర్గాల ప్రజలను అణగదొక్కాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సీసీ ఫుటేజీలు బయటపెట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత కాకినాడ సిటీ: ఈవీఎం, వీవీప్యాట్ల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల)కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ షణ్మోహన్ రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం, వీవీప్యాట్ గోదామును తనిఖీ చేసి నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వీ జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. అన్నవరం భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ దేవస్థానంలో రెండో రోజు ఐవీఆర్ఎస్ టీం పర్యటన అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలపై ఎందుకు భక్తుల్లో అసంతృప్తి నెలకొని ఉందనే దానిపై ఇద్దరు ప్రయివేట్ వ్యక్తులతో కూడిన ఐవీఆర్ఎస్ బృందం రెండో రోజు బుధవారం కూడా అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రధానంగా అన్నదానం పథకంలో ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను ఆ బృందం ప్రశ్నించింది. బాగున్నాయని చాలామంది భక్తులు చెప్పినట్టు సమాచారం. అయితే ఒకరిద్దరు మంచినీరు ఆలస్యమవుతోందని తెలిపారు. నిత్యాన్నదానం హాలు ఫ్లోరింగ్ శుభ్రతపై ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. -
శత శాతం అక్షరాస్యతకు ఉల్లాస్
కాకినాడ సిటీ: వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అడల్డ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా ఉల్లాస్ పథకాన్ని రూపొందించిందన్నారు. దేశంలో 100 శాతం అక్షరాస్యతను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉండి చదువు ఆపేసి లేదా చదువుకోని పెద్దలను గుర్తించి అక్షరాస్యతను అందించి వారికి ప్రాథమిక విద్య, డిజిటల్ విద్య, ఆర్థిక విద్యను వలంటీర్ టీచర్ ద్వారా అందించడమే ఉల్లాస్ పథక లక్ష్యమని డీఆర్వో వెంకటరావు అన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను గుర్తించడానికి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో 26014 మంది నిరక్షరాస్యులను గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, అంగన్వాడీ ఆయాలు, హెల్పర్స్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే నైట్ వాచ్మెన్లు తదితరులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 24వ తేదీ వరకు డీఆర్డీఏ, మెప్మా క్లస్టర్ కోఆర్డినేటర్, విలేజ్ ఆర్గనైజేషన్, రిసోర్స్ పర్సన్ల ఆధ్వర్యంలో నిరక్ష్యరాసుల సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా గుర్తించిన నిరక్షరాస్యులకు మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 18 వరకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, జీవన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు, ప్రాథమిక విద్య, నిరంతర విద్య వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని డీఆర్వో వివరించారు. ఈ పథకానికి జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారని చెప్పారు. మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మన్‌గా ఇతర సభ్యులు ఉంటారన్నారు. అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా నోడల్ అధికారి వెంకటేశ్వరరావురెడ్డి, డీపీవో వి రవికుమార్, ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి, సమాచార పౌరసంబంధాల శాఖ డిడీ డి నాగార్జున, డీఆర్డీఏ ఏపీడీ వి జిలాని, జెడ్పీ ఏవో ఎం బుజ్జిబాబు పాల్గొన్నారు. -
కొంటారా... రోడ్డెక్కమంటారా?
● కూటమి ప్రభుత్వంపై కర్షకుల కన్నెర్ర ● పిఠాపురంలో ఆందోళన పిఠాపురం: అధికారంలోకి రాకముందు అండగా ఉంటామంటూ వాగ్దానాలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురానికి చెందిన పలువురు రైతులు బుధవారం తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండించిన ధాన్యం కొనేవారు లేక ఎక్కడ దాచుకోవాలో తెలియక తాము తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నామని అయినప్పటికి పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క వర్షాలతో,మరోపక్క ధాన్యానికి గిట్టుబాటు ధర, కొనుగోళ్ళు లేక రైతులు భోరున ఏడుస్తున్నారని, ఈ ప్రభుత్వం తక్షణం రైతులను ఆదుకోకపోతే రైతుల ఆగ్రహావేశాలకు బలికాక తప్పదని బుధవారం పిఠాపురం రైతులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి పరిసర ప్రాంతంలో సుమారు రెండువేల ఎకరాలు సాగుచేసి పండించిన పంటకు కొనుగోళ్లు లేక, గిట్టుబాటు ధర అసలే లేక కళ్లాల్లోనే ఉండిపోయాయి. కొద్దిరోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులతో కష్టించి పండించిన పంటకు సరైన ధర లేక, కొనుగోలు చేసేవారు లేక,రైతులు భయాందోళనలు చెందుతూ లబోదిబోమంటున్నారని రైతు యనమండ్ర సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టక పోతే తామంతా రోడ్డెక్కి ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొనుగోళ్లు ప్రారంభించేశామని కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారని, ఇక్కడ పరిస్థితి వేరేగా ఉందని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ధాన్యం రాశుల వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ధాన్యం ఏం చేసుకోమంటారు అంటూ నినాదాలు చేసి నిరసన తెలిపారు. -
అంబేద్కర్‌కు ఘన సత్కారం
కాకినాడ క్రైం: అనాథ శవాలను తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తూ, సేవలో తరిస్తున్న కాకినాడకు చెందిన కూపర్ భాను అంబేద్కర్‌ను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఘనంగా సత్కరించారు. కలెక్టర్ ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా అంబేద్కర్ మంగళవారం కలెక్టరేట్‌కు వెళ్లి సత్కారాన్ని అందుకున్నాడు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న అంబేద్కర్ మానవత్వాన్ని వివరిస్తూ ‘అతడే ఆ నలుగురు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 13న ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్.. అంబేద్కర్ మానవత్వానికి చలించిపోయారు. ఆయనను నేరుగా చూడాలని సంకల్పించానని చెప్పారు. ఈ తరహా సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో అంబేద్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అంబేద్కర్‌కు సొంత ఇల్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంబేద్కర్‌ను సత్కరించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలెక్టర్ తన కార్యాలయానికి పిలిపించారు. వారి సమక్షంలో అంబేద్కర్‌ను ఘనంగా సత్కరించారు. ఏ అవసరం వచ్చినా అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు ఆర్థిక సాయం అందించారు. -
చిన్నబాబు వచ్చారు.. బహుపరాక్!
అన్నవరం: కలెక్ట్రేట్లో జరిగే అధికారిక సమావేశాల్లో కలెక్టర్‌తో కలిసి ఆయన పుత్రరత్నం పాల్గొంటే ఎలా ఉంటుంది? ఓ ఎస్పీ కుమారుడు పోలీస్ స్టేషన్లు తనిఖీ చేస్తానంటే..! పోనీ ఒక అధికారి ఉపయోగించాల్సిన వాహనాన్ని ఆయన కుమారుడు యథేచ్ఛగా ఉపయోగిస్తూంటే..! డ్యూటీకి రాకుండా ఎక్కడకు వెళ్లావంటూ సిబ్బందిపై ఆ అధికారి కొడుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూంటే..? మరోచోటైతే ఇవి సాధ్యం కాకపోవచ్చునేమో! కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం ఇటువంటి తంతు నాలుగు నెలలుగా యథేచ్ఛగా సాగిపోతోంది. సత్యదేవుని సన్నిధిలో ఓ అధికారి పుత్రరత్నం తమపై ఎక్కడా లేని పెత్తనం చేస్తున్నారంటూ సిబ్బంది, ఇతర అధికారులు వాపోతున్నారు. ప్రతి రోజూ ఆ అధికారి విధులకు వచ్చారా అని కాకుండా.. ఆయన గారి కొడుకు.. చినబాబు వచ్చాడా.. వస్తే ఎక్కడున్నాడంటూ సిబ్బంది ఆరా తీస్తున్నారు. తమ సెక్షన్‌కు వస్తే ఏమంటాడో.. అసలు వచ్చేలా ఉన్నాడా అంటూ ఆ పుత్రరత్నానికి సహాయకుడిగా ఉండే అటెండర్‌ను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఎదురుపడితే ఏమంటాడో అని హడలెత్తుతున్నారు. అధికారిక సమావేశంలో.. దేవస్థానం భద్రతకు ఉపయోగించే డ్రోన్ కెమెరాల కొనుగోలు విషయమై ఆ కంపెనీ ప్రతినిధులతో రత్నగిరిపై ఆ అధికారి కార్యాలయంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఇందులో ఆ అధికారితో పాటు ఈఈ లు, డీఈలు ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సెక్యూరిటీ అధికారి పాల్గొన్నారు. అదే సమావేశంలో ఆ అధికారి పుత్రరత్నం చినబాబు కూడా పాల్గొనడం చూసి వారందరూ కంగు తిన్నారు. డ్రోన్ కెమెరాల గురించి ఆ అధికారికి బదులు చినబాబే ప్రశ్నించడం మరో విడ్డూరం. ఏ హోదా ఉందని అతడిని ఇలా అనుమతిస్తున్నారంటూ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఇటువంటి సమావేశాల్లో చినబాబు పాల్గొన్నప్పుడు ఎవ్వరినీ ఫొటోలు, వీడియోలు తీయనివ్వరు. ఆ అధికారి సీసీ మాత్రమే ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఫొటోల్లో ఆ చినబాబోరిని కట్ చేసి, మిగిలిన ఫొటోలను దేవస్థానం సెక్షన్ హెడ్స్ గ్రూపులో పెడుతున్నారు. చినబాబు పాల్గొన్న ఫొటో బయటకు వస్తే అసలుకే ఎసరొస్తుందనే ఉద్దేశంతో ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు. చినబాబుగారి పెత్తనం ఇలా.. ఫ దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలించే అధికారం, సంబంధిత లింక్ దేవస్థానంలో కీలకమైన నలుగురికి మాత్రమే ఉంటుంది. కానీ, ఆ అధికారి పుత్రరత్నానికి కూడా ఆ లింక్ ఇచ్చారు. దీంతో ఆయన వాటిని చూసి, సిబ్బందికి డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం అందరికీ తెలియడంతో ఆ అధికారికి, మరో కీలక వ్యక్తికి తప్ప అందరికీ ఆ లింక్ తొలగించారు. పాస్వర్డ్ కూడా మార్చేశారు. ఫ దేవస్థానానికి వచ్చిన ప్రతిసారీ చినబాబు సీసీ టీవీలుండే కమాండ్ కంట్రోల్ రూముకు వెళ్లి కొంతసేపు ఆ టీవీలు పరిశీలిస్తారు. ఆ సమయంలో ఎవ్వరూ లోపలకు రాకుండా బయట ఒకరు కాపలాగా ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలను అక్కడి సిబ్బంది పాటించాలి. ఫ పీఆర్ఓ కార్యాలయాన్ని చినబాబు సందర్శించినప్పుడు అక్కడ సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అవమానంగా భావించారు. దీంతో, అక్కడ అర్జెంట్‌గా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో మర్నాడే అక్కడ ఆ ఏర్పాటు చేశారు. ఫ ఒక రోజు స్వామివారి నిత్యకల్యాణం, ఆన్లైన్ వ్రతం జరిగే కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఫ ఆ అధికారి గత నెలలో రెండు రోజుల సమావేశానికి విజయవాడవెళ్లినపుడు ఆయన అధికారిక వాహనంలోనే చినబాబు నేరుగా దేవస్థానానికి వచ్చారు. దర్జాగా ఆ అధికారి కూర్చునే ముందు సీటులో కూర్చుని పెత్తనం చేశారు. ఈ విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. వాస్తవానికి అధికారి లేనపుడూ ఆ కారును వేరొకరు ఉపయోగించకూడదు. కుటుంబ సభ్యులైనా సరే ఆ అధికారితో పాటు ప్రయాణించినప్పుడే ఆ వాహనం ఎక్కాలి. కానీ, ఆ నియమాలన్నీ ఇక్కడ గాల్లో కలుస్తున్నాయి. ఫ దేవస్థానానికి మరో వాహనం కూడా ఉంది. చిన్నబాబు కొన్నిసార్లు ఆ వాహనంలో కొండ పైకి వచ్చి, అనధికారిక పర్యవేక్షణ అనంతరం తిరిగి కొండ దిగువకు అదే వాహనంలో వెళ్తున్నారు. ఫ దేవస్థానానికి వచ్చినపుడు పర్యవేక్షణ అనంతరం ఆ అధికారి కార్యాలయానికి ఎదురుగా ఉన్న వీఐపీ గదిలో చినబాబు సేద తీరుతారు. అప్పుడు ఆ అధికారి మాదిరిగానే ఆ పుత్రరత్నానికి కూడా మర్యాదలు చేయాల్సిందే. ఫ గతంలో ఎంతో మంది అధికారులు వచ్చినా వారి పిల్లలు ఎలా ఉంటారో కూడా సిబ్బందికి తెలియదు. ఉత్సవాల సమయంలో వచ్చి వెళ్లిపోవడం తప్ప ఎప్పుడూ ఇలాంటి వ్యవహారం చూడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఫ ఆ పుత్రరత్నం ఓవర్ యాక్షన్ దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఎందుకనో కానీ మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, సరైన ఆధారాల కోసం ఎదురు చూస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలిస్తే చినబాబు కదలికలు తెలిసిపోతాయని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు చినబాబు అజమాయిషీకే కత్తెర వేస్తారో లేక ఆ అధికారికే ఉద్వాసన పలుకుతారో వేచి చూడాల్సిందే. అన్నవరం దేవస్థానం·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l…ÌZ ఓ అధికారి పుత్రరత్నం నిర్వాకం ·˘ BĶæ$¯]l Úëyø Ķæ*MýSÛ¯ŒS™ø హడలెత్తుతున్న సిబ్బంది ·˘ A°²…sê BĶæ$¯]l ò³™èl¢¯]lÐól$.. అమ్మగారి పెత్తనం కూడా.. దేవస్థానంలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించే సహస్ర దీపాలంకార సేవకు టికెట్ రూ.200. దీనికి అవసరమైన సామగ్రి, మండప నిర్మాణాన్ని పెద్దాపురానికి చెందిన దాత మట్టే సత్యప్రసాద్ విరాళంతో చేయించారు. ఈ సేవకు టికెట్టు కొనుగోలు చేసే భక్తులు తక్కువే అయినా, దీనిని దేవస్థానం ప్రతి రోజూ నిర్వహిస్తోంది. ఈ సేవలో టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు ముందు వరుసలో కూర్చుంటారు. వారి గోత్ర నామాలతో పూజ చేస్తారు. ఇతర భక్తులు కొంచెం దూరంగా కూర్చుని ఆ సేవ చూస్తూంటారు. అయితే టికెట్ ఉన్నవారే ఈ సేవ చూడాలని, కొనని వారు చూడరాదని ఆ అధికారి భార్య హుకుం జారీ చేశారు. దీంతో ఆ సేవ జరిగే మండపంలోకి టికెట్లు లేని వాళ్లు వెళ్లకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పది రోజుల్లో ఇది కాస్తా వివాదాస్పదమవడంతో ఆలయ సిబ్బందిపై దేవస్థానం చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసి, ఆ పద్ధతికి స్వస్తి చెప్పారు. -
ఫ సంద్రం వీడి.. తీరం చేరి..
ఉవ్వెత్తున ఎగసి పడే అలలను చీల్చుకుంటూ.. సాగరంతో సయ్యాటలాడుతూ.. రేయింబవళ్లు నడిసంద్రంలో జీవన పోరాటం చేసే మత్స్యకారులకు రెండు నెలల పాటు విశ్రాంతి లభించింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు బంగాళాఖాతంలో చేపల వేటపై బుధవారం నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 14వ తేదీ వరకూ ఈ నిషేధం అమలు కానుంది. దీంతో, పది నెలలుగా సముద్రంలో చేపలు వేటాడుతూ జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులు వేటను నిలిపి వేశారు. చాలా వరకూ బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకున్నాయి. సముద్రం మధ్యన.. సుదూర ప్రాంతంలో ఉన్న బోట్లు మాత్రం తీరం చేరేందుకు ఒకటి రెండు రోజులు పట్టే అవకాశముంది. కాకినాడ ఫిషింగ్ హార్బర్, కుంభాభిషేకం, జగన్నాథపురం ఏటిమొగ వద్దకు భారీగా బోట్లు చేరుకున్నాయి. వాటిని యజమానులు భద్రంగా కాపాడుకుంటున్నారు. అవసరమైన వాటికి మరమ్మతులు నిర్వహించుకోనున్నారు. – కాకినాడ రూరల్ -
పట్టు వదిలేస్తున్నారు
రైతులతో మాట్లాడుతున్నాం పట్టు సాగులో నష్టాలు వస్తున్నాయంటూ రైతులు మల్బరీ తోటలను దున్నేస్తున్న వైనంపై ఆరా తీస్తున్నాం. వారితో మాట్లాడి, నష్టాల నివారణకు చర్యలు తీసుకుంటాం. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పంట సాగు ఆపకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చిస్తాం. – మోసయ్య, పట్టు పరిశ్రమ శాఖాధికారి, చేబ్రోలుపిఠాపురం: ‘పట్టు’కుంటే బంగారం.. ఇది ఒకప్పటి మాట. ‘ముట్టుకుంటే మట్టే’.. ఇది ఇప్పటి మాట. రైతులను అపర కుబేరులుగా చేసిన పట్టు సాగు ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతోంది. స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలో కీలక పాత్ర వహించిన గొల్లప్రోలు మండలంలో పట్టు పంటకు గడ్డుకాలం మొదలైంది. ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో సరైన ధర రాక, పంట కొనే వారు లేక, పెట్టుబడి దక్కక, కనీసం కౌలుకు తీసుకునే వారు కూడా ఉత్సాహం చూపకపోవడంతో పట్టు రైతులు పంటకు విరామం ప్రకటిస్తున్నారు. దీనిలో భాగంగా గొల్లప్రోలు మండలంలో మల్బరీ తోటలను కొన్ని రోజులుగా దున్నేస్తున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 400 ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతూండగా.. ప్రస్తుతం వందల ఎకరాల్లో రైతులు పంటను దున్నేసి, వేరే పంటలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ‘మీకు అండగా ఉంటా. పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా. సిల్క్ సిటీ నిర్మిస్తా’ అంటు వాగ్దానాలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ఇలాకా పిఠాపురం నియోజకవర్గంలోనే రాష్ట్రానికే వన్నె తెచ్చిన పట్టు పరిశ్రమ మూత పడే పరిస్థితులు ఎదురయ్యాయని రైతులు వాపోతున్నారు. కానరాని ప్రభుత్వ తోడ్పాటు రాష్ట్రంలో పలమనేరు, హిందుపురంతో పాటు జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, జిల్లాలోని పెద్దాపురం డివిజన్లో 12, కాకినాడ డివిజన్లోని 2 మండలాల్లో 4,500 ఎకరాల విస్తీర్ణంలో 1,150 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో మల్బరీ సాగుకు రూ.లక్ష పెట్టుబడి అవుతోంది. అలాగే, పట్టు పురుగుల పెంపకానికి 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున షెడ్ నిర్మాణానికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతోంది. దీని నిర్వహణకు రూ.50 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. గతంలో ఇక్కడ పండించిన పట్టుగూళ్లకు కేజీకి రూ.550 వరకూ ధర వచ్చేది. ప్రస్తుతం రూ.250కి కూడా కొనేవారు లేకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం మల్బరీ రైతులకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సి ఉండగా రూ.లక్షల్లో బకాయి పెట్టింది. పైగా షెడ్ల నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం లేదు. ఫలితంగా కొత్తగా పట్టు సాగు చేయడానికి ఏ ఒక్క రైతూ ముందుకు రావడం లేదు. తెగుళ్ల దాడి ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడంతో పాటు ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తెగుళ్లు మల్బరీ పంటను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది ఊజీ ఈగ దాడితో పాటు వివిధ రకాల తెగుళ్లతో పట్టు పురుగులు గూళ్లు కట్టలేదు. ఫలితంగా పట్టు సాగు తీవ్రంగా దెబ్బ తింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేయగా శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు. మల్బరీ తోటలకు పక్కన ఉన్న పంటలకు పురుగు మందులు వాడటం వలన పట్టు పురుగులు చనిపోతున్నాయని చెప్పి చేతులు దులిపేసుకున్నారని రైతులు విమర్శిస్తున్నారు. పంట నష్టాలకు కారణమైన అసలు తెగులును గుర్తించి, నివారణ చర్యలను అధికారులు ఇప్పటికీ చెప్పలేకపోయారని అంటున్నారు. ఫలితంగా పంట నష్టాల పాలై, సాగు మానేసే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రోత్సాహం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పట్టు సాగుకు ప్రోత్సాహం ఇచ్చేవారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు రూ.3 కోట్ల వరకూ విడుదల చేసి, రైతులకు పంపిణీ చేశారు. నాటి ప్రభుత్వం ప్రోత్సాహం పెంచడంతో రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపారు. గతంలో మల్బరీ సాగుకు, షెడ్ల నిర్మాణానికి యూనిట్ విలువ రూ.7 లక్షల వరకూ ఉండగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యూనిట్ విలువను రూ.10 లక్షలకు పెంచింది. దీనిలో పట్టు పరిశ్రమ ద్వారా రూ.3 లక్షలు, రైతు వాటా రూ.లక్ష, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.6 లక్షల మేర ఆర్థిక సహాయం అందజేశారు. అంటే రైతు కేవలం రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రభుత్వం రూ.9 లక్షలు ఇచ్చేది. బయోల్టిన్ (తెలుపు) రకం పట్టు గూళ్లు కేజీకి రూ.50, సీబీ(ఎల్లో కలర్)కి రూ.20 చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చేది. పలమనేరు, హిందూపురం, హనుమాన్ జంక్షన్ వంటి ప్రాంతాలకు కాకుండా, చేబ్రోలు మార్కెట్లోనే కొనుగోళ్లు జరిపేవారు. గత ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహించడంతో అప్పట్లో కేజీ పట్టు గూళ్లు రూ.900 వరకూ అమ్ముడైన సందర్భాలున్నాయి. జిల్లాలో పట్టు సాగు వివరాలు సాగు చేస్తున్న మండలాలు 19 పట్టు సాగు జరుగుతున్న గ్రామాలు 155 రైతులు 1,150 సాగు విస్తీర్ణం 4,500 ఎకరాలు రోజుకు పట్టుగూళ్ల దిగుబడి 5 టన్నులు ·˘ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు ·˘ నష్టాల బాటలో పరిశ్రమ ·˘ పవన్ ఇలాకాలో పంటకు విరామం ·˘ పట్టు పరిశ్రమ చరిత్రలోనే తొలిసారి.. ·˘ సిల్క్ సిటీ కట్టాక పంట వేస్తామంటున్న రైతులు ఆదుకుంటానన్న పవన్.. పట్టించుకోవడం లేదు ఎన్నికల్లో మా గ్రామం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. పదవి వచ్చాక మాకు అండగా ఉంటానన్నారు. సిల్క్ సిటీ కడతానన్నారు. కానీ, పెద్దగా ఏమీ పట్టించుకున్నది లేదు. నేను రెండెకరాల్లో పంట సాగు చేశాను. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు. రావాల్సిన ఇన్సెంటివ్లూ రావడం లేదు. మరోపక్క తెగుళ్లు తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. షెడ్ నిర్వహణ భారంగా మారింది. పెట్టుబడులు పెరిగిపోయాయి. దిగుబడీ లేదు. ధర దారుణంగా పడిపోయింది. ఎవరూ కొనేవారు లేరు. రూ.లక్షల్లో నష్టం వచ్చే పరిస్థితి ఉండటంతో పంట తీసేస్తున్నాం. మల్బరీ సాగు ఆపేసి వేరే పంటలు వేసేందుకు నాతో పాటు చాలా మంది రైతులు సిద్ధమవుతున్నారు. – ఓరుగంటి శ్రీను, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం అందుకే తోట తొలగిస్తున్నా.. పట్టు పురుగుల పెంపకం 15 సంవత్సరాలుగా చేపడుతున్నాను. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చాలా ఒడుదొడుకులు, నష్టాలు చవి చూశాం. చేతికందే దశలో ఉన్న పంటలు అంతు చిక్కని తెగుళ్లతో దెబ్బ తిన్నాయి. పండిన కొద్దిపాటి పంటకు ధర లేక, రాబడి కూలి ఖర్చులకు కూడా సరిపోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇన్సెంటివ్ ఇస్తానని హామీ ఇచ్చారు. నేటి వరకూ పట్టించుకోలేదు. అప్పుల పాలై పట్టు పురుగుల పెంపకం విరమించుకోవాలనుకుంటున్నాను. అందుకే మూడెకరాల్లో మల్బరీ తోటను తొలగిస్తున్నాను. – ఓరుగంటి గణపతి, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం -
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు
కాకినాడ సిటీ: రైతుల నుంచి మద్దతు ధరకే రబీ ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు. ‘రైతు కంట కన్నీరు’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలో ఇప్పటికే 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల వద్ద మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం ఆరబెట్టిన చోట గాని, కొనుగోలు కేంద్రంలో గాని సాంకేతిక సిబ్బంది పరిశీలించి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసి, వెహికల్ మూమెంట్ జీపీఎఫ్ ట్రాక్ చేసి మిల్లుకు పంపిస్తామని వివరించారు. అలా చేసిన రైతులకు మద్దతు ధర లభిస్తుందని, సరైన సమయంలో వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. పండించిన ధాన్యం నేరుగా మిల్లులకు అమ్మి, తిరిగి రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బందిని ఆన్లైన్ చేయాలంటూ అడుగుతున్నారని, అటువంటి వారికి డబ్బులు సక్రమంగా పడకపోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యాన్ని దళారులు, రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 2,570.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 207 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమయ్యే గోనె సంచులను, హమాలీలను, రవాణా వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 225 మంది సాంకేతిక నిపుణులను, 225 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను, 225 మంది హెల్పర్లతో పాటు వెహికల్ మూమెంట్ అధికారులను, కస్టోడియన్ అధికారులను నియమించామని వివరించారు. సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,300, 75 కిలోలకు రూ.1,725, గ్రేడ్–ఎ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320, 75 కిలోలకు రూ.1,740 చొప్పున మద్దతు ధర అందిస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు రూపొందించాలి రాజానగరం: యూనివర్సిటీ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నూతన ఆలోచనలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మంగళవారం నిర్వహించిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీఓ అడ్వాన్స్డ్ సిస్టమ్ లేబొరేటరీ సైంటిస్టు కె.వీరబ్రహ్మం మాట్లాడుతూ, సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వివిధ సంస్థల నుంచి యూనివర్సిటీకి సీఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నూకాలమ్మ తల్లికి రూ.5.78 లక్షల ఆదాయం బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్యారావుపేటలో వెలసిన నూకాలమ్మ అమ్మవారి హుండీల ఆదాయాన్ని మంగళవారం దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. 33 రోజులకు గాను రూ.5.78 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు. కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారన్నారు. 25న జాబ్ ఫెస్ట్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సహకారంతో స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 25న జాబ్ ఫెస్ట్–2025 నిర్వహించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. డిగ్రీ, పీజీ ఫైనలియర్ చదువుతున్న, పాసైన విద్యార్థులకు 40 కంపెనీలతో ఈ జాబ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జాబ్ ఫెస్ట్ ఏర్పాట్లపై సంబంధిత ప్రిన్సిపాళ్లు, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది తదితరులతో చర్చించారు. జాబ్ ఫెస్ట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రతి కళాశాల నుంచి విద్యార్థులందరూ హాజరై, జాబ్ ఫెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
శంఖవరం: మండల కేంద్రమైన శంఖవరంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో దళిత సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం దళితవాడలో అంబేడ్కర్ విగ్రహం మెడలో చెప్పుల దండ చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న దళిత సంఘాల నేతలు శంఖవరం చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనతో ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కత్తిపూడి – శంఖవరం ప్రధాన రహదారిని దిగ్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరగడం అంటే యావత్తు భారతజాతికి అవమానం జరిగినట్లు అని తెలిపారు. ఈ ఘటనకు కారకులైనవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. ఎస్పీ హామీ మేరకు దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాయి. అడిషినల్ ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని సీఐ చెన్నకేశవరావు ఎస్పీ వెంట ఉన్నారు. దళిత సంఘాల నాయకులు శెట్టిబత్తుల కుమార్‌రాజా, టి.కిరణ్‌కుమార్, సోనిహుడ్, వెంకటరత్నం, చరమర్ల మదు, గోళ్ల శేఖర్, పులి సుధాకర్, పి.భరత్ పాల్గొన్నారు. నిందితులను శిక్షించాలి : ముద్రగడ గిరిబాబు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపన కోసం చిరస్మరణీయ కృషిచేసిన అంబేడ్కర్‌ను అవమానించడం దారుణమన్నారు. చెప్పుల దండ వేసిన దుండగులు ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు శంఖవరంలో రహదారి దిగ్బంధం నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ ఎస్పీ హామీతో ఆందోళన విరమణ -
ఏపీఎస్పీలో క్రీడా సంబరాలు
కాకినాడ రూరల్: విధులతో నిత్యం టెన్షన్‌గా గడిపే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసులు(ఏపీఎస్పీ) ఉపశమనం పొందేలా, వారిలోని క్రీడాస్ఫూర్తిని తేటతెల్లం చేసేలా స్పోర్ట్స్ మీట్ – 2025 కాకినాడలో ఘనంగా ప్రారంభమైంది. మూడురోజుల పాటు రేంజ్ – 1 పరిధిలో జరగనున్న క్రీడా పోటీలకు 3వ బెటాలియన్ ఆతిథ్యం ఇచ్చింది. రమణయ్యపేటలో ఏపీఎస్పీ 3వ బెటాలియన్ పరేడ్‌లో క్రీడా పోటీలను కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు మంగళవారం ఉదయం శాంతి కపోతాలు, బెలూన్లు గాలిలో ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. విజయనగరం నుంచి 5వ, విశాఖపట్నం నుంచి 16వ, కాకినాడ నుంచి 3వ, మంగళగిరి నుంచి 6వ బెటాలియన్లకు చెందిన పోలీసు సిబ్బంది క్రీడా సంబరాలకు ఉత్సాహంగా హాజరయ్యారు. తమలోని ప్రతిభను చాటేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీ పడ్డారు. తొలుత క్రీడాకారులు కవాతు, బ్యాండ్‌తో ఆకట్టుకున్నారు. కవాతు ద్వారా క్రీడాకారుల గౌరవ వందనాన్ని కమాండెంట్ నాగేంద్రరావు స్వీకరించారు. బెటాలియన్ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎందరో ఎదిగారని, ముఖ్యంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచారన్నారు. స్టోర్ట్స్ మీట్లో భాగంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్, షాట్‌ఫుట్, క్రికెట్, హై జంప్ వంటి పోటీలను తొలి రోజు నిర్వహించారు. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, మన్మఽథరావు, ఆర్ఐలు అజయ్‌కుమార్, రవిశంకరరావు, విఠలేశ్వరరావు, ప్రసాద్, బెటాలియన్ ఇంగ్లిషు మీడియం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేంజ్ – 1 పరిధిలోని నాలుగు బెటాలియన్ల క్రీడాకారుల హాజరు మూడు రోజుల పాటు సందడి స్పోర్ట్స్‌మీట్‌ను లాంఛనంగా ప్రారంభించిన కమాండెంట్ నాగేంద్రరావు -
పోషక విలువల లక్ష్మణ ఫలం
పిఠాపురం: మన పురాణ పురుషులు అయిన రాముడు, సీత, లక్ష్మణుల పేర్లతో సీతాఫలం, రామఫలంతో పాటు ఇప్పుడు లక్ష్మణ ఫలం స్థానికంగా పండుతున్నాయి. పలువురు రైతులు తమ ఇళ్ల వద్ద, పొలాల్లోను వీటిని పండిస్తున్నారు. దీనిని తింటే క్యాన్సర్ తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న తరుణంలో వీటి పెంపకం చాలాచోట్ల పెరిగింది. దీనిని ఆంగ్లంలో సోర్సో గ్రావియోలా అని పిలుస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, తయామిన్, రెబోఫ్లోవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్సు వంటి ఎన్నో పోషక విలువలు ఉంటాయి. దీని జ్యూస్ తాగితే దానిలోని పోషక విలువలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. 12 రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం ఈ లక్ష్మణ ఫలానికి ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే లక్ష్మణ ఫలాన్ని తింటే మంచినిద్ర పట్టడంతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. రక్తహీనతను తగ్గించే గుణం దీనిలో ఉంది. ఎముకలను ధృడంగా మార్చి కీళ్ల నొప్పులను నివారిస్తుంది. చెడు కొలస్ట్రాల్ కరిగి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. నీరసం, అలసట దూరమై శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో బాధ పడే వారికి ఇది ఒక మెడిసిన్‌లా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలలో ఈ పండ్లు అందుబాటులోకి వస్తాయి. పోర్చుగీసు నుంచి ఈ పండ్లు దిగుమతి అయినట్లు చెబుతుంటారు. వీటిని పండుగా తినడంతో పాటు స్వీట్లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీంలు, జామ్‌ల తయారీలో వినియోగిస్తారు. ధర కిలో రూ.1,400 వరకు పలుకుతోందంటే దీని విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
ఈదుకుంటూ మృత్యుఒడికి..
ప్రమాదాల వివరాలు.. సంవత్సరం కేసులు మృతులు 2021 54 59 2022 63 67 2023 71 78 2024 78 80 2025 (ఇప్పటి వరకూ) 23 24 291 308 ● ఈ నెలలోనే ఆరు ప్రమాదాలు– తొమ్మిది మంది మృతి ● ఐదేళ్లలో 291 ప్రమాదాలు, 308 మంది మృత్యువాత ● స్వీయరక్షణ, భద్రత చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు ఆలమూరు: వేసవికాలం వచ్చేసింది..విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి.. యువకులు, పర్యాటకులు సముద్ర, నదీ పరివాహక ప్రాంతాల్లోని అనువుగా ఉండే ప్రదేశాల్లో స్నానాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే గోదావరిలో స్నానం చేసే సమయంలో కాని ఈత కొట్టే సమయంలో కాని ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా మృత్యువాత పడతామని, తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తామని మాత్రం ఊహించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల వెంబడి గౌతమీ, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు 289 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటాయి. స్థానికులతో పాటు వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులు నదీ తీరానికి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడతారు. ఇదే క్రమంలో గోదావరిలోను, పంట కాలువల్లోను స్నానాలు చేస్తూ ఈత సరదాను తీర్చుకునే క్రమంలో అనేకమంది ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో అనేక చోట్ల లోతులు, ఊబిలు ఉన్న సంగతి తెలియని పర్యాటకులు స్నానాలకు దిగి మృత్యువాత పడుతున్నారు. చర్యలు చేపడుతున్నా... ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, కె.గంగవరం, అయినవిల్లి, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లోని పలు గ్రామాలతో పాటు కొవ్వూరు మండలంలోని మద్దూరులంక. సీతంపేట, విజ్జేశ్వరం లాకుల సమీపంలోని నదీ తీరాలు అత్యంత ప్రమాదకరంగా పేరుగాంచాయి. దీంతో పాటు అంతర్వేది, ఓడలరేవు, కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోంది. గోదావరి తీర ప్రాంతాల్లో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా ప్రయోజనం కన్పించడం లేదు. గత ఐదేళ్లలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 291 ప్రమాదాలు జరగ్గా 302 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెలలోనే ఇప్పటి వరకూ ఆరు ప్రమాదాలు జరగ్గా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నివారణకు చర్యలు ● ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్, హెడ్వర్క్స్శాఖ పోలీసుశాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. ● గోదావరి పరీవాహక ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. ● వేసవిలో గోదావరి తీరంలోకి ఇతర ప్రాంతాల వారు వస్తే ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది కౌన్సెలింగ్‌ను అందించాలి. ● ప్రమాదకరమైన అన్ని రేవుల వద్ద లోతు వివరాలు తెలియజేసే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి. ● స్నానానికి అనుమతి లేని ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ● స్నానాలు చేసేటప్పుడు, ఈత కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించి సేఫ్టీ డ్రస్‌ను ధరించాలి. అనుమతి లేని ప్రదేశాల్లో స్నానాలు వద్దు గోదావరి తీరం వెంబడి అనుమతి లేని ప్రదేశాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దు. ఇప్పటికే తీరం వెంబడి గుర్తించిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానికుల సహకారంతో ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాం. రద్దీ ప్రదేశాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశాం. పర్యాటక ప్రాంతాల్లో నిరంతరం పోలీసులను పహరాగా ఉంచుతున్నాం. –సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం నదీ తీర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. ధవళేశ్వరం దిగువ ప్రాంతాల్లో ఊబులు ఎక్కువగా ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఆ మేరకు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఇటీవల వాడపల్లి తీర్థానికి వెళ్లే భక్తులను గోదావరి మీద నుంచి వెళ్లకుండా పోలీసుల సాయంతో కట్టడి చేసి ప్రమాదాలను ఆపగలిగాం. – ఆర్.విశ్వనాథరాజు, హెడ్‌వర్క్స్ జేఈ, ధవళేశ్వరం తూర్పుగోదావరిజిల్లా -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తుని రూరల్: తుని మండలం కె.సీతయ్యపేట గ్రామానికి చెందిన వివాహిత సూరాడ నూకరత్నం (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. సోమవారం రాత్రి కడుపు నొప్పితో బాధపడుతున్న నూకరత్నాన్ని కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉందన్నారు. నూకరత్నం, శివ (భార్యాభర్తలు) మధ్య ఏర్పడిన తగాదాలపై గతంలో రెండుసార్లు ఫిర్యాదులు అందగా ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్టు ఎస్సై వివరించారు. మృతురాలికి భర్తే హతమార్చాడని ఫిర్యాదు తన కుమార్తెను భర్త సూరాడ శివ హతమార్చాడని మృతురాలు నూకరత్నం తల్లి యజ్జన వెంకటలక్ష్మి ఆరోపించింది. ఒకే గ్రామానికి చెందిన నూకరత్నం, శివలకు ఎనిమిదేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరిద్దరికి వైష్ణవి, హర్షిత, ధనుష్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన కుమార్తెను అల్లుడు తరచూ వేధించేవాడని, రూరల్ పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఆరోపించింది. దీంతో సూరాడ శివ విషం కలిపిన ఆహారంతో నూకరత్నాన్ని హతమార్చినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పుడు కేసులు నమోదు చేసి శిక్షిస్తే నా కుమార్తె బతికేదని తల్లి వెంకటలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పింది. హంతకుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. -
ఇసుక లారీ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి
మరొకరికి తీవ్ర గాయాలుకాజులూరు: కాకినాడ – కోటిపల్లి రహదారిలో కాజులూరు మండలం జగన్నాథగిరి వద్ద సోమవారం ఇసుక లారీ చెట్టును ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గొల్లపాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కరప మండలం నడకుదురుకు చెందిన రావుల శ్రీనివాసరావు లారీపై రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శివారు వేగాయమ్మపేటకు చెందిన పిల్లి శ్రీనివాసు డ్రైవరుగానూ, మరో యువకుడు క్లీనర్‌గానూ పనిచేస్తున్నారు. వీరు తరచూ కొటిపల్లి, కపిలేశ్వరపురం తదితర ఇసుకర్యాంపుల నుంచి కాకినాడకు ఇసుక తరలిస్తుంటారు. సోమవారం క్లీనర్ సెలవు పెట్టడంతో ఓనరైన రావుల శ్రీనివాసరావు లారీ ఎక్కాడు. ఈ క్రమంలో డ్రైవరైన పిల్లి శ్రీనివాసును క్లీనరు సీటులో కుర్చోబెట్టి తాను డ్రైవింగ్ చేస్తున్నాడు. జగన్నాథగిరి కెనాల్ రోడ్డుకు వచ్చేసరికి డ్రైవింగ్ అదుపు తప్పి వేగంగా వెళుతున్న లారీ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో చెట్టు వేర్లతో సహా పైకి వచ్చి పడిపోగా లారీ ముక్కలు,ముక్కలుగా విరిగి పల్టీ కొట్టింది. డ్రైవరు సీటులో ఉన్న రావుల శ్రీనివాసర్రావు, క్లీనరు సీటులో ఉన్న పిల్లి శ్రీనివాసు లారీ శకలాలు కింద ఇరుక్కున్నారు. స్థానికులు గమనించి గొల్లపాలెం పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు వచ్చి జేసీబీ సహాయంతో లారీ శకలాల కింద ఉన్న ఇద్దరిని బయటకు తీశారు. అయితే అప్పటికే లారీ ఓనరు రావుల శ్రీనివాసరావు (50) మృతి చెందగా డ్రైవరు పిల్లి శ్రీనివాసు తీవ్ర గాయాలపాలయ్యాడు. 108 అంబులెన్సులో స్థానికులు అతనిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొల్లపాలెం ఎస్సై ఎం మోహన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో.. కొత్తపల్లి: ఉప్పాడ– కోనసాపపేట రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో నలుగురు వ్యక్తులకు గాయాలైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు. అనకాపల్లి జిల్లా కొత్తకోట గ్రామానికి చెందిన ఎద్దు దుర్గా ప్రసాద్(25) కేఎస్‌ఈజడ్‌లో ఉన్న సంధ్య రొయ్య శుద్ధి పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న నవదీప్, నవీన్‌లతో కలిసి మెస్ నుంచి మోటారు సైకిల్‌పై వస్తున్నాడు. ఉప్పాడ వైపు నుంచి మోటారు సైకిల్‌పై మరో ఇద్దరు బీచ్‌రోడ్డులో కోనపాపపేట వైపు వెళుతూ కేఎస్‌ఈజడ్ సమీపంలో పరిశ్రమలకు వెళ్లే రోడ్డులో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి. వారిని కాకినాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.వెంకటేష్ తెలిపారు. రైల్వే గేటు వద్ద..అన్నవరం: గొల్లప్రోలు మండలం మల్లవరం రైల్వే గేటు వద్ద పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తుని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్టు అన్నవరం రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యాం త్రినాథ్‌రావు తెలిపారు. రైలు ఢీ కొట్టడం లేదా, ప్రయాణిస్తున రైలులో నుంచి జారి పడిపోవడం వలన మృతి చెందినట్టు భావిస్తున్నామని తెలిపారు. మృతుని వయసు 45 సంవత్సరాలు ఉంటుందని శరీరంపై దుస్తులు లేవని తెలిపారు. కుడి చేతికి కడియం, ఎడమచేతి మీద పెద్ద పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిపినవారు తుని రైల్వే ఎస్ఐ జీ శ్రీనివాసరావును సంప్రదించాలని కోరారు. విద్యుదాఘాతానికి..రౌతులపూడి: మండలంలోని గిడజాం గ్రామానికి చెందిన ఎర్రా నాగేశ్వరరావు(38) విద్యుదాఘాతానికి గురై సోమవారం మృతిచెందాడు. ఎప్పటిలాగే గిడజాం శివారు ఒక ప్రయివేటు వ్యవసాయ క్షేత్రంలో పనికోసం వెళ్లిన ఎర్రయ్య చెట్ల కొమ్మలు నరుకుతుండగా వాటికి వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న రౌతులపూడి ఎస్.ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం
ఆలమూరు: వేసవి తాపాన్ని అధిగమించేందుకు, శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు ఐస్ యాపిల్‌గా విశేష ప్రాచుర్యం పొందాయి. ఈ తాటిముంజల సీజన్ ఇప్పుడే ప్రారంభం కావడంతో, వీటికి విపరీతమైన డిమాండు ఏర్పడింది. తాటికాయలు ముంజల దశలో జెల్లీ మాదిరిగా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. మరో మూడు నెలల్లో తాటిముంజలు తాటిపండ్లుగా మారడంతో పాటు, ఆరోగ్యకరమైన తేగలనూ ఇస్తాయి. ఈ తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగి ఉన్నందున వీటికి విపరీతమైన డిమాండు ఉంటుంది. కాలక్రమంలో.. గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లు అధికంగా ఉండేవి. తాటిముంజల లభ్యత ఎక్కువగా ఉన్నా.. చెట్లు ఎక్కి ముంజకాయలు దింపే కార్మికుల కొరత ఏర్పడడంతో వీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఎలుకల బెడద కారణంగా పొలాల్లో, రియల్ ఎస్టేట్ కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం తాటిచెట్లను నరికేస్తుండటంతో భవిష్యత్తులో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఉంది. ఆరోగ్య ప్రదాయినిగా.. ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే ఈ తాటిముంజలు కల్తీ లేని, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తుంటారు. జిల్లాలో తాటిముంజలు సేకరించే వారు కరవయ్యారు. దీంతో మైదాన ప్రాంతాల్లో ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకుని కొందరు మెట్ట, చాగల్నాడు ప్రాంతాలకు చెందిన రైతు కూలీలు తాటిముంజలను పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాటిముంజల సీజన్ ప్రారంభమైంది. తాటిముంజుల పరిమాణాన్ని బట్టి డజను రూ.80 నుంచి రూ.120 వరకూ విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా తాటిముంజల ప్రియులు దీనిని లెక్కచేయడం లేదు. లేలేతగా ఉండే తాటిముంజలు అద్భుత రుచితో నోరూరిస్తున్నాయి. ఆరోగ్య రక్షణకు దోహదం వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకూ లభ్యమయ్యే తాటిముంజలను తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్య రక్షణ లభిస్తుంది. పోషకాలు అధికంగా ఉండటంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. సీజన్ సమయంలో ప్రతి ఒక్కరూ భుజించాల్సిన అవసరం ఉంది. – ఏవీవీ రాజా అక్కుల, హెల్త్ ఎడ్యుకేటర్, పెదపళ్ల, ఆలమూరు మండలం చక్కని ఆరోగ్యం లభిస్తుంది తాటిముంజలు తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది. ఐస్ యాపిల్‌గా పిలిచే తాటిముంజలను ఏడాదికి ఒకసారైనా తినాలని కోరిక ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే లభ్యమవుతుండటం వల్ల తాటిముంజలను కొనుగోలు చేయకతప్పడం లేదు, – ఎ.రామసీత, గృహిణి, ఆలమూరు ప్రయోజనాలివే.. ● తాటిముంజల్లో విటమిన్లు, ఫాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు, సోలెబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవితాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది. ● తాటిముంజలను తినడం వల్ల శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ● వేసవిలో ఏటా సీజన్లో క్రమం తప్పకుండా తాటిముంజలను తినడం ద్వారా చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించుకుని, మంచి కొలస్ట్రాల్‌ను వృద్ధి చేసుకోవచ్చు. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ● వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో పోషకాలుండటం వల్ల అలసట, నిర్జలీకరణం నుంచి ఉపశమనం కలిగించి, శరీర బరువు పెరగకుండా చేస్తుంది. ● వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. ● ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది. ● మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ● తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పూతలా వేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ● చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమటకాయల్ని నివారిస్తుంది. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది. తాటిముంజలతో శరీరానికి విటమిన్లు పుష్కలం ప్రస్తుత సీజన్లో విపరీతమైన డిమాండ్ ఐస్ యాపిల్‌గా ప్రాచుర్యం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
సరదా తెచ్చిన తంటా
కొవ్వూరు: విజ్జేశ్వరం లాకులకు దిగువన చిగుర్లంక వద్ద సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరొకరిని స్థానికులు కాపాడారు. సోమవారం సాయంత్రం నిడదవోలు చర్చిపేటకి చెందిన మర్తి ప్రకాష్‌కుమార్ (15), రాజమహేంద్రవరానికి చెందిన గంధం హర్ష(18), మరో యువకుడు స్నానం చేసేందుకు చిగుర్లంక వద్ద గోదావరి పాయ వద్దకు వచ్చారు. స్నానాలు ఆచరిస్తున్న ప్రదేశంలో లోతు తక్కువగా ఉందని భావించి నదిలోకి దిగారు. వారు దిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగారు. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అక్కడే సమీపంలో ఉన్న ఆరుగురు యువకులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రకాష్‌కుమార్, హర్ష నదిలో గల్లంతయ్యారు. మరో యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు, తహసీల్దార్ ఎం.దుర్గాప్రసాద్ జాలర్లు, గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇదే ప్రదేశంలో రెండేళ్ల క్రితం స్నానాలకు దిగి పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. హర్ష తండ్రి మూడు నెలల క్రితమే మృతి గోదావరిలో గల్లంతైన హర్ష ప్రస్తుతం వైజాగ్‌లో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. తండ్రి మూడు నెలల క్రితమే మృతి చెందారు. తల్లి ౖశైలజ రాజమహేంద్రవరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. హర్ష పెద్ద సోదరి అబిల పోలియో వ్యాధి బారిన పడింది. రెండో సోదరి హేనాకి వివాహం చేశారు. అంబేద్కర్ జయంతి, వేసవి సెలవులను పురస్కరించుకుని నిడదవోలులో ఉంటున్న అక్క హేనా ఇంటికి వచ్చారు. గతంలో హర్ష కుటుంబం నిడదవోలులోనే ఉండేవారు. సోమవారం మధ్యాహ్నం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలో పాల్గొని భోజనం చేసి వచ్చాడని హర్ష చిన్నాన్న మల్లవరపు వినోద్ చెబుతున్నారు. హర్ష తండ్రి మృతి చెంది మూడు నెలలు అయ్యింది. ఇంతలోనే సెలవులకని వచ్చి హర్ష గల్లంతు కావడం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. బయటికి వెళ్లి గంటలో వచ్చేస్తానని చెప్పాడని, ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. పదో తరగతి పరీక్ష రాశాడు మృతుడు మర్తి ప్రకాష్‌కుమార్ పదో తరగతి పూర్తి చేశారు. తండ్రి కిషోర్ ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తల్లి కువైట్‌లో ఉంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రకాష్కుమార్కి సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. కుమారుడు గల్లంతైన విషయం విదేశాల్లో ఉన్న తల్లి తెలుసుకుని తల్లడిల్లిపోతోంది. ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి గోదావరి నదిలో స్నానానికి దిగి యువకులు గల్లంతు కావడం బాధాకరం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గజ ఈతగాళ్లతో పాటు కాకినాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నామన్నారు. మత్య్సశాఖ, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో నదిలో యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారని చెప్పారు. ఇటీవల తాడిపూడిలో ఐదుగురు మృతి చెందడం,ఇప్పుడు ఈ ప్రమాదం బాధాకరం అన్నారు. గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకుల గల్లంతు మరొకరిని కాపాడిన స్థానికులు గల్లంతైన ఇద్దరూ నిడదవోలు వాసులే -
ఫుడ్ పాయిజనింగ్‌పై సమాచారం లేదు
● మీడియాలో చూసి వచ్చాం ● బాధితులతో మాట్లాడాం, అవంతి సీఫుడ్స్‌కు వెళ్లి పరిశీలిస్తాం ● జిల్లా వైద్యాధికారి నరసింహనాయక్ జగ్గంపేట: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలోని అవంతి సీఫుడ్స్‌లో రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజనింగ్ జరిగి 25 మంది ఆసుపత్రిలో చేరినా కంపెనీ నుంచి కాని, బాధితులకు చికిత్స చేస్తున్న జగ్గంపేటలోని ఆసుపత్రి నుంచి కాని తమకి సమాచారం లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని జిల్లా వైద్యాధికారి నరసింహం నాయక్ తెలిపారు. సీఫుడ్స్‌లో పుడ్ పాయిజిన్ంగ్ వల్ల జగ్గంపేటలోని శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం జిల్లా వైద్యాధికారి నరసింహం నాయక్, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం సీఫుడ్స్ క్యాంటీన్లో ఏ ఆహారం తీసుకున్నారు, ఎక్కడ తేడా జరిగింది, సమాచారం బయటకు రాకుండా ఎందుకు దాచారు వంటి వివరాలను బాధితుల నుంచి సేకరించారు. అనంతరం మీడియాతో జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం సీఫుడ్స్ క్యాంటీన్లో ఇడ్లీ, చట్నీ తీసుకున్న వారికి, దీంతోపాటు రాత్రి బిర్యాని తిన్నవారికి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయిందని తెలిపారు. జగ్గంపేట ఆసుపత్రిలో మొత్తం 25మంది జాయిన్ అయ్యారని, వీరందరు వాంతులు విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారని చెప్పారు. కొంతమందిని ఒక రోజు అనంతరం డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అవంతి సీఫుడ్స్‌కు వెళుతున్నామని పూర్తి వివరాలు సేకరించి, తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. శ్యాంపిల్స్ సేకరించాం అవంతి సీఫుడ్స్‌కు, క్యాంటీన్‌కు సెంట్రల్ ఫుడ్ సేప్టీ స్టాండర్స్ అధారిటీ ఇండియా (ఎఫ్ఎస్ఎస్సీఐ–పాసీ) లైసెన్సు ఉందని, అయితే ఇక్కడ జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌పై వారికి సమాచారం అందించామని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 20 కోట్ల టర్నోవర్ దాటిన కంపెనీలు, అందులోని క్యాంటీన్లు పాసీ పర్యవేక్షణలో వుంటాయని, ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం దీనిపై విచారణ చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఫుడ్, వాటర్ శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. జనార్ధనస్వామి కల్యాణ మహోత్సవాలలో అశ్లీల నృత్యాలు కొత్తపల్లి: మండలంలోని రమణక్కపేటలో వేంచేసియున్న విజయ జనార్ధనస్వామి కల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. కల్యాణ మహోత్సవాలను కూడా కూటమి నాయకులు భ్రష్టుపట్టిస్తున్నారు. భక్తి భావాలతో చేపట్టవలసిన కల్యాణ మహోత్సవాలను రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యువకుడి దుర్మరణం రాయవరం: తల్లిదండ్రులు కుమారుడు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పదవ తరగతి పరీక్షలు రాసిన కుమారుడి ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోపు రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి వార్త తెలిసి తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామ పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుడ్డు సందీప్(16) మృతిచెందాడు. గ్రామానికి కూత వేటు దూరంలో జరిగిన ప్రమాదంలో సందీప్ ఘటనా స్థలంలోనే అసువులు బాసాడు. ఎస్సై సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం..సందీప్ లొల్ల వైపు నుంచి సోమేశ్వరం గ్రామానికి మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. స్నేహితుల వద్ద మోటార్ సైకిల్ తీసుకుని వెళ్లినట్లు సమాచారం. మోటార్ సైకిల్‌పై వేగంగా గ్రామానికి వస్తున్న సమయంలో జేబు నుంచి సెల్‌ఫోన్ తీసుకునే క్రమంలో మోటార్ సైకిల్ అదుపు తప్పింది. దీంతో మోటార్ సైకిల్‌తో పాటుగా సందీప్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లోడు వ్యాన్‌ను బలంగా ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. -
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
కొవ్వూరు: కాకినాడ జిల్లా పెద్దాపురంలో శంకరయ్యపేటకి చెందిన వీరవాసరపు ఏసురత్నం అనే వివాహిత 14వ తేదీ తెల్లవారుజాము మూడు గంటల నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. కొవ్వూరులో ఉంటున్న ఆమె అత్త వారి ఇంటికి వేసవి సెలవుల నిమిత్తం వచ్చినట్లు ఆమె తల్లి ఏలేశ్వరపు దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి మరలా తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వివరాలు తెలిస్తే 94407 96622 నంబర్‌కు తెలియజేయాలని ఆయన సూచించారు. కొబ్బరితోటలో పిడుగు పడి మంటలు సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ శబ్ధంతో పడిన పిడుగుపాటుకు ఒక రైతు కొబ్బరి తోటలో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలను స్థానికులు నీళ్లతో ఆర్పివేశారు. పిడుగుపాటుకు చెట్లకు నష్టం వాటిల్లింది. -
ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
ఇరవయ్యేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుతం పదెకరాల్లో సాగు చేసి, కోతలు కోయడం పూర్తయ్యింది. ఎక్కడా కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. సీఎంఆర్ ఓపెన్ చేయకపోవడంతో చేతికొచ్చిన పంటను గట్లు, రోడ్లపై ఆరబోసి అమ్మకం కోసం ఎదురు చూస్తున్నాను. వాతావరణం అకస్మాత్తుగా మారిపోతూండటంతో పచ్చి ధాన్యాన్ని కమీషన్ ఏజెంట్లకు రూ.1,250కే అమ్ముకోవాల్సి వస్తోంది. ఆరబెట్టిన ధాన్యాన్ని సైతం దళారులు రూ.1,550కి కొంటున్నారు. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. – మలకల వరాలబాబు, రైతు, పెదబ్రహ్మదేవం, సామర్లకోట మండలం తక్కువ ధరకే అమ్ముకున్నాం రబీలో ఆరెకరాల్లో వరి సాగు చేశాను. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పండించిన ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకోవలసి వచ్చింది. రేటు వచ్చినప్పుడు అమ్ముకుందామంటే వాతావరణానికి భయపడి, దళారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్మేయాల్సి వచ్చింది. ఎకరాకు రూ.32 వేల పెట్టుబడి పెట్టాను. ఆరెకరాలకు గాను మొదట కోతలు పూర్తి అయిన నాలుగెకరాల్లో వచ్చిన ధాన్యాన్ని బస్తా రూ.1,570కి బయటి వ్యాపారులకే అమ్ముకున్నాను. రెండోసారి రెండెకరాల్లో ధాన్యాన్ని రూ.1,550కి అమ్ముకోవాల్సి వచ్చింది. – ఒబిన్ని కృష్ణ, రైతు, తాళ్లూరు, గండేపల్లి మండలం ఒక్క గింజ కూడా కొనలేదు రబీలో 11 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాను. చేతికొచ్చిన ధాన్యం కొనుగోలు చేసే నాథుడు లేక కళ్లాల్లో రాశులుగా ఆరబెడుతున్నాను. అప్పు చేసి, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఎకరాకు రూ.30 వేలు పైనే పెట్టుబడి అయ్యింది. వాతావరణ మార్పులతో చేతికొచ్చిన పంట చూస్తే భయం వేస్తోంది. ధాన్యం రాశులు కళ్లాల్లోనే ఉన్నాయి. కనీస మద్దతు ధర రూ.1,750 అని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఒక్క గింజ కొనేవారు కూడా కనిపించలేదు. దీంతో కమీషన్ ఏజెంట్లకు రూ.1,250 నుంచి రూ.1,400కు అమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయి. మా బాధలు చెప్పుకుందామంటే వినే వారు కూడా లేరు. – గంట్ల సత్తిబాబు, కౌలు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం -
నేటి నుంచి ఏపీఎస్పీ స్పోర్ట్స్ మీట్
కాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు (ఏపీఎస్పీ) రేంజ్–1 పరిధిలోని బెటాలియన్ల సిబ్బంది స్పోర్ట్స్, గేమ్స్ మీట్ మంగళవారం ప్రారంభ కానున్నాయి. ఈ పోటీలకు కాకినాడ రమణయ్యపేటలోని మూడో బెటాలియన్ ఆతిథ్యం ఇస్తోంది. బెటాలియన్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్, గేమ్ మీట్లో విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, మంగళగిరి, నెల్లూరు బెటాలియన్లకు చెందిన క్రీడా బృందాలు హాజరు కానున్నాయి. ఈ పోటీలను కమాండెంట్ నాగేంద్రరావు ప్రారంభించనున్నారు. ముగింపు రోజు కార్యక్రమంలో బెటాలియన్స్ ఐజీ పాల్గొంటారు. మహోన్నతుడు అంబేడ్కర్ కాకినాడ సిటీ: దేశ ప్రజలందరికీ మహోత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొనియాడారు. స్వాతంత్య్ర సమర యోధుడు, రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇంద్రపాలెం కూడలి వద్ద ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ తదితరులు సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ చిలుకోటి కూర్మయ్య రచించిన శ్రీఅంబేద్కర్పై అపోహల సృష్టి, వాటికి సమాధానాలుశ్రీ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. స్థానిక జగన్నాథపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో చదువుతూ ఇంటర్మీడియెట్‌లో 956 మార్కులు సాధించిన కె.రాజేశ్వరిని, 917 మార్కులు సాధించిన సీహెచ్ దేవిని సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదువు మాత్రమే ఎలాంటి సమస్యల నుంచైనా గట్టెక్కిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడాలని అన్నారు. కాకినాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ ఆధునీకరణ పనులు చేపడతామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ జేడీ జి.శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి పాల్గొన్నారు. అంబేడ్కర్ అందరివాడు తుని: అంబేడ్కర్ అందరివాడని, ఆయన అడుగు జాడల్లో యువత పయనించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా తుని సీఎంఆర్ సెంటర్లో సోమవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. దళిత నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజలకు రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించిన మహానీయుడు అంబేడ్కర్ అని రాజా కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు, బొంగు ఉమారావు, రేలంగి రమణాగౌడ్, షేక్ ఖ్వాజా, నక్కా జాన్ ఆనంద్, మీలా బుజ్జి, తుని తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హోరాహోరీగా చదరంగం పోటీలు అమలాపురం రూరల్: కోనసీమ డిస్ట్రిక్, ఆంధ్రా చెస్ అసోసియేసషన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం మండలం కామనగరువులో ఢిల్లీ పబ్లిక్ స్కూలో కోనసీమ డిస్ట్రిక్ట్ ఓపెన్ చదరంగ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 250 మందికి పైగా విద్యార్థులు తరలివచ్చారు. బి.నానిబాబు ప్రఽథమ స్థానం సాధించి రూ.4,000 నగదు బహుమతి, డి. సాత్విక్ ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుని రూ.3,000 గెలుచుకున్నాడు. టి.సాయి వెంకటేష్ తృతీయ స్థానం సాధించి రూ.2000 గెలుపొందాడు. ఏడు స్థానాల్లో విజేతలకు నగదు బహుమతులను డీపీఎస్ స్కూల్ చైర్మన్ నంద్యాల నాయుడు, డైరెక్టర్ నంద్యాల మను విహార్ సోమవారం అందజేశారు. ఈ పోటీల్లో అండర్ 9, 11, 13, 15 విభాగాల్లో మొదటి ఐదుస్థానాలకు సీ్త్ర, పురుషులకు విడివిడిగా నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. విజేతలను చెస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ తాడి వెంకట సురేష్‌కుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ దేవి దీక్షిత్, చీఫ్ ఆర్బిటర్ జీవీ కుమార్, టోర్నమెంట్ డైరెక్ట్ శ్రీనుబాబు అభినందించారు. -
మద్దతు ధర మాటే లేదు
కౌలుకు 5 ఎకరాలు చేశాను. ఎక రాకు రూ.30 వేల పెట్టుబడి పెట్టాను. సాధన రకం వరి వంగడాన్ని పండించాను. 40 బస్తాల దిగుబడి వచ్చిందనే సంతోషం లేకుండా పోయింది. బస్తాకు రూ.1,750 కనీస మద్దతు ధర వస్తుందని ఆశ పడ్డాను. తీరా ఇప్పుడు బస్తా రూ.1,250 చొప్పున అడుగుతున్నారు. అది కూడా నెల రోజుల అరువుకు అడుగుతున్నారు. గత ఏడాది రైతు భరోసా కేంద్రం ద్వారా రూ.1,750కి కొనుగోలు చేశారు. ఇప్పుడు బ స్తాకు రూ.500 చొప్పున ఎకరాకు రూ.20 వేలు నష్టపోతున్నా. పెట్టుబడి, కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదు. – పల్లా రాజు, కౌలు రైతు, లక్ష్మీపురం, పిఠాపురం మండలం -
కాలువల మూసివేత సాధ్యమేనా?
● ఏప్రిల్ 15న మూసివేయడానికి సన్నాహాలు ● ఇప్పటికీ శివారులకు సాగు నీటి అవసరం ● మరో ఐదు రోజులు పెంచాలని కోరుతున్న వ్యవసాయశాఖ ● తాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా పెంచాల్సిన గడువు ● రబీలో ఇప్పటి వరకు 111 టీఎంసీల వినియోగం ● అయినా శివారుల్లో కీలక సమయంలో సాగునీటి ఎద్దడి ● నీటి యాజమాన్యంలో అట్టర్ ఫ్లాప్ సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువల మూసివేతకు సాగునీటి పారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి మూడు ప్రధాన పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద హెడ్ స్లూయిజ్ గేట్లు మూసివేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీకి మరో ఐదు రోజులు నీరందించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతుండడంతో ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. నీటి యాజమాన్యంలో సమన్వయలోపం గోదావరి మూడు డెల్టాల పరిధిలో సుమారు 8.86 లక్షల ఎకరాల్లో వరి, ఇతర వ్యవసాయ పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్లో సాగుకు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 90 టీఎంసీలు ఉంటే సరిపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలో 4.80 లక్షల ఎకరాలలో వరి ఆయకట్టు ఉంది. దీనిలో సుమారు 4.20 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని అంచనా. పంట కాలువలు, చానల్స్ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ఆరంభంలో షార్ట్ క్లోజర్ పనులు చేస్తామని చెప్పారు కాని పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయలేదు. ఇది సాగునీటి సరఫరాకు ప్రధాన అవరోధంగా మారింది. దీనికితోడు నీటి యాజమాన్య విషయంలో అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డెల్టాకు 111 టీఎంసీలు గోదావరి డెల్టాలో డిసెంబరు 7వ తేదీన మొదలైన రబీ షెడ్యూలులో ఏప్రిల్ 15 వరకు 111.355 టీఎంసీల నీటిని పంట కాలువలకు విడుదల చేశారు. దీనిలో తూర్పు డెల్టాకు 34.293, మధ్యడెల్టాకు 20.291, పశ్చిమ డెల్టాకు 56.478 టీఎంసీల చొప్పున అందించారు. రబీ సాగు, ఇతర అవసరాలకు వాస్తవంగా 90 టీఎంసీల అయితే పంటకు సరిపోతోంది. కాని అంత కన్నా అధికంగా నీరు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అయినా డెల్టా శివారులు, మెరక ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్, మధ్య డెల్టా అనే తేడా లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో ఇంచుమించు అన్ని మండలాల్లో ఏదో ఒక సందర్భంలో రైతులు నీరందక ఇబ్బంది పడ్డారు. తూర్పు డెల్టాలో కరప, కాజులూరు, తాళ్లరేవు, కె.గంగవరం, పీబీసీలో కొత్తపల్లి, మధ్య డెల్టా పరిధిలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం మండలాల్లో చేలు నెరలు తీసిన విషయం తెలిసిందే. వంట కాలువలకు విడుదల చేసిన నీరుతోపాటు డెల్టాలో పలుచోట్ల వ్యవసాయ విద్యుత్ మోటార్లతో చేలకు పెద్ద ఎత్తున నీరందించారు. ఇలా కనీసం ఒకటిన్నర టీఎంసీ, మురుగునీటి కాలువలపై క్రాస్బాండ్లు వేయడం ద్వారా కూడా నీటిని చేలకు మళ్లించడం ద్వారా మరో ఐదు టీఎంసీల వరకు నీటిని చేలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. ఇలా చూస్తే మొత్తం 117.50 టీఎంసీల నీటిని రబీ కాలంలో అందించినట్టు. అయినప్పటికీ తూర్పు, మధ్య డెల్టాలోని ఏకంగా పదకొండు శివారు మండలాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందంటే అది ముమ్మాటికీ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యమేనని రైతులు చెబుతున్నారు. నీటి ఎద్దడి ప్రభావంతో రైతులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంట బోదెలు, చానల్స్ నుంచి, డ్రెయిన్ల నుంచి మోటార్లతో నీరు తోడకం వల్ల ఎకరాకు అదనంగా రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఎద్దడికి గురైన ప్రాంతంలో దిగుబడి పడిపోవడం కూడా రైతులకు లాభాలు మాట అటుంచి పెట్టుబడులు వస్తే గొప్ప అన్నట్టుగా మారింది. నేడు నిర్ణయం డెల్టాలో రబీ సాగుకు మరో ఐదు రోజుల పాటు గడువు పెంచే అవకాశముంది. దీనిపై మంగళవారం ధవళేశ్వరంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 15వ తేదీ అంటే మంగళవారం అర్ధరాత్రి తరువాత బ్యారేజీ గేట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కోనసీమ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బోసుబాబు అభ్యర్థించడంతో ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ గోపినాఽథ్, గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజినీరు (సీఈ) దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయశాఖతోపాటు తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపాల్సి ఉన్నందున ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా గడువు పెంచాల్సిందిగా కోరుతున్నారు. ఈ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు కాలువల మూసివేత గడువు పెంచే అవకాశముందని సమాచారం. డెల్టా ప్రధాన పంట కాలువలకు డిసెంబరు 7వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి విడుద ఇలా (టీఎంసీ)లలో...: తూర్పు డెల్టా : 34.293 మధ్య డెల్టా : 20.291 పశ్చిమ డెల్టా : 56.478 మొత్తం : 111.382 -
గంగపుత్రులు విలవిల
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కూటమి వల.. ● అప్పుడు..ఇప్పుడు అదే మోసం ● 24 గంటల్లో వేట నిషేధం ● అటకెక్కిన మత్స్యకార భరోసా ● రూ.20 వేలు ఇస్తామని బాబుదగా సాక్షి ప్రతినిధి, కాకినాడ: నడిసంద్రమే జీవనాధారంగా బతుకు నావను నెట్టుకొస్తున్న గంగపుత్రులకు పెద్ద కష్టం వచ్చి పడింది. సముద్రంలో మత్స్య ఉత్పత్తుల పరిరక్షణ కోసం ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు విధించే వేట నిషేధం ఆ కుటుంబాలకు సంకటంగా మారింది. మత్స్యకార కుటుంబాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టు కనిపిస్తోంది. సముద్రంపై వేట విరామం అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లేనట్టే. నిషేధ సమయం 60 రోజులు ప్రత్యామ్నాయ ఉపాధి గగనమైపోతుంది. ఎందుకంటే వీరంతా తరతరాలుగా సముద్రంపై వేట తప్ప మరో పని చేయలేరు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు విరామ సమయంలో ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్రెడ్డి క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా అందించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని 2019లో సీఎంగా జగన్మోహన్రెడ్డి మత్స్యకార భరోసా కింద రూ.10 వేలకు పెంచారు. వేట నిషేధం అమలులో ఉన్న సమయంలోనే ఏటా ఠంచన్‌గా భరోసా సొమ్ము జమ చేస్తూ వచ్చారు. ఇలా నిషేధ సమయంలోనే జగన్ భరోసా సొమ్ము అందివ్వడంతో సముద్ర వేటపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు సంతోషంగా ఉండేవి. వేట విరామ సమయం రెండు నెలలకు కుటుంబాలు నెట్టుకురావడానికి లోటు లేకుండా గడచిపోయేది. ఏటా మాదిరిగానే 2023–24 మత్స్యకార భరోసా కూడా ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. ఇందుకు కార్యాచరణ కూడా పూర్తయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పంపిణీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడచినా.. అప్పుడే రెండోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. ఈ విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.10 వేల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.20 వేలు ఇస్తామని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నమ్మించారు. ఎన్నికలు ముగిసి కూటమి సర్కార్ గద్దెనెక్కి 10 నెలలు గడచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కూడా వేట విరామం అమలులో ఉంది. బాబు, పవన్ ఎన్నికల్లో ప్రకటించినట్లుగా తమకు రూ.20 వేల పరిహారం ఇస్తారని వేలాది మత్స్యకార కుటుంబాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. వేట నిషేధ సమయంలో పస్తులతో కుటుంబాలను నెట్టుకొచ్చినా కూటమి ప్రభుత్వం కనీసం మానవత్వం చూపించలేదు. సూపర్ సిక్స్ హామీల మాదిరిగానే మత్స్యకారులకు ఇచ్చిన మాటను కూడా నడిసంద్రంలో విడిచి పెట్టేసింది. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర వేటపై ఆధారపడ్డ వేలాది మత్స్యకార కుటుంబాలు చుక్కాని లేని నావ మాదిరిగా తయారయ్యాయి. ఇచ్చిన హామీ అమలు చేయకుండా గాలికొదిలేయడంతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక రోడ్డున పడ్డాయి. చంద్రబాబు అండ్ కో మాటల గారడీతో నిలువునా ముంచేశారని మత్స్యకార కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. ఈసారీ కడుపు మాడ్చుకోవాల్సిందేనా? గత ఏడాది వేట విరామ సమయంలో పరిహారం రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఎగనామం పెట్టింది. అసలు గత విరామ సమయంలో పరిహారం అందుకోకుండానే రెండోసారి వేట నిషేధ సమయం మరో 24 గంటల్లో అమలులోకి వచ్చేస్తోంది. పెండింగ్ పరిహారం ఊసే లేదు అని మత్స్యకారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో మరోసారి కడుపు మాడ్చుకోవాల్సిందేనని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం ఏడాది కావస్తున్నా అందించలేదు. కూటమి ప్రభుత్వంలో రెండోసారి కూడా అందుతుందనే నమ్మకం కలగడం లేదంటున్నారు. ఇలా నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు లేడనే విషయం మరోసారి రుజువైందని మత్స్యకారులు ఆక్షేపిస్తున్నారు. బాబూ.. మాట నిలబెట్టుకో.. మత్స్యకార భరోసా ఏడాదికి రూ.20,000 ఇస్తామని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. గత ఏడాది మత్స్యకార భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. అయినప్పటికీ గత ఏడాది ఇవ్వాల్సిన భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిషేధ సమయం ముగియకుండానే ఏటా మత్స్యకార భరోసా అందజేసేవారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు కలిపి మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయాలి. – చింతా నాగ మునీంద్రరావు, మత్స్యకార నాయకుడు, చింతావానిరేవు, ముమ్మిడివరం మండలం నిషేధ సమయంలో పస్తులుండాల్సి వస్తోంది వేట నిషేధ సమయం రెండు నెలలూ ప్రత్యామ్నాయ జీవనోపాధి లేక సముద్రంపై వేటాడే కుటుంబాల వారు పస్తులుండాల్సి వస్తోంది. నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో విడుదల చేయకపోవడంతో నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రూ.10వేలు పరిహారం కాస్తా రూ.20వేలు చేస్తామంటే ఎంతో నమ్మకంగా ఉన్నారు. తీరా రెండోసారి నిషేధ సమయం వచ్చేసినా చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు. – మేరుగు ఎల్లాజీ, ఎంపీటీసీ సభ్యుడు, ఉప్పాడ ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఇవ్వాలిచంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేయడం తగదు. గత ఏడాది ఇవ్వాల్సిన పరిహారం, ఈ నెలలో నిషేధ సమయంలో ఇవ్వాల్సిన సొమ్ము కలిపి ప్రతి కుటుంబానికి రూ.40 వేలు మత్స్యకారుల ఖాతాలకు జమ చేయాలి. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కాలక్షేపం చేస్తోన్న కూటమి ప్రభుత్వం కనీసం మత్స్యకారుల విషయంలో అయినా మాట నిలబెట్టుకోవాలి. – గుబ్బల తులసీకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు, ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉమ్మడి తూర్పున.. లబ్థిదారులు: 33,704 మంది ఇవ్వాల్సిన మొత్తం: రూ.67.407 కోట్లు జగన్ హయాంలో... మత్స్యకార భరోసా వేటకు వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున 2019–20లో–23,190 మందికి రూ.23,19 కోట్లు 2020–21లో–24,587 మందికి రూ.24,587 కోట్లు 2021–22లో–30,213 మందికి రూ.30,213 కోట్లు 2022–23లో–21,394 మందికి రూ.21,394 కోట్లు 2023–24లో–24,147 మందికి రూ.24,147 కోట్లు 2019–20 నుంచి వేట నిషేధంతో ప్రభావితమైన బోటు యజమానులు, కళాసీలు 1,23,531 మందికి రూ.123.531 కోట్లు జమ చేశారు. కోనసీమ జిల్లాలో.. మండలాలు: ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, మామిడికుదురు, ఉప్పలగుప్తం, సఖినేటిపల్లి, రామచంద్రాపురం, కె గంగవరం, అల్లవరం, సఖినేటిపల్లి తీరప్రాంత గ్రామాలు: 45 మొత్తం బోట్లు: 1,700 అర్హులైన మత్స్యకారులు : 9,575 మంది కాకినాడ జిల్లాలో ... మండలాలు: తుని, తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, తాళ్లరేవు మత్స్యకార తీర గ్రామాలు: 36 మెకనైజ్డ్ బోట్లు: 467, మోటారు బోట్లు: 3,779, సంప్రదాయ బోట్లు 399 వేట నిషేధ లబ్ధిదారులు: 24,147 మంది -
కీలక వైద్యం కాకినాడకు!?
● వైద్యులు అందుబాటులో లేక ప్రత్యామ్నాయ మార్గాలకు రోగులు ● పోస్టుల భర్తీ కోసం ఎదురుచూపులు ● గైనిక్ పోస్టుల్లోనూ డెప్యుటేషన్ విధులు ● ఆర్థోపెడిక్, జనరల్ ఎండీ లేక అవస్థలు అమలాపురం టౌన్: అది వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి. కోనసీమ పేద ప్రజలకు వైద్య సేవలు అందించే పెద్ద ఆస్పత్రి. అమలాపురం జిల్లా కేంద్రం అయ్యాక ఈ ఆస్పత్రి ప్రాధాన్యం మరీ పెరిగింది. అమలాపురం సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ ఆస్పత్రి బోధనా ఆస్పత్రి అవుతోంది. ఇప్పుడున్న వంద పడకల స్థాయి కాస్తా బోధనా ఆస్పత్రి అయ్యాక 650 పడకలకు అప్‌గ్రేడ్ కానుంది. అంతటి అత్యవసర వైద్య సేవలు అందించే అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నేడు కీలక వైద్య పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. ఫలితంగా ఆయా కీలక విభాగాలకు వైద్యులు లేక ఆ వైద్య సేవలు పూర్తి స్థాయిలో రోగులకు అందడం లేదు. రోజూ 400 నుంచి 500 వరకూ ఓపీ ఉండే ఈ ఆస్పత్రిలో 70 నుంచి 80 మంది వరకూ ఇన్ పేషెంట్లు ఉంటారు. ఇలాంటి పెద్దాసుపత్రిలో రెగ్యులర్ గైనిక్‌లు (ప్రసూతి నిపుణులు) లేక అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. ఆస్పత్రికి మూడు రెగ్యులర్ గైనిక్ వైద్యులు ఉండే వారు. ఇందులో రెండు పోస్టులు గతంలోనే ఖాళీ అయ్యాయి. మూడో పోస్టు మొన్నటి వరకూ ఉండేది. ఆ గైనిక్ డాక్టర్ మెటర్నిటీ లీవులో వెళ్లడంతో ఆస్పత్రిలో రెగ్యులర్ గైనిక్‌లు లేకుండా పోయింది. దీంతో పి.గన్నవరం ప్రభుత్వ వైద్యాలయం నుంచి ఓ గైనిక్ డాక్టర్ డిప్యూటేషన్‌పై వారంలో మూడు రోజులు అమలాపురం ఆస్పత్రికి వచ్చి సేవలు అందిస్తున్నారు. ఆ వైద్యుడు విధుల్లో లేని మిగిలిన రోజుల్లో ఎవరైనా గర్భిణి లేదా బాలింత అత్యసర వైద్యం కోసం వస్తే గైనిక్ డాక్టర్ లేరన్న సమాధానం లేదా వేరే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలన్న సలహా మాత్రం ఆస్పత్రి సిబ్బంది నుంచి అనివార్యమవుతోంది. ఆర్థోపెడీషియన్ లేక.. ఆస్పత్రిలో మరో కీలకమైన పోస్టు ఆర్థోపెడిక్ వైద్యుడు. ఆ పోస్టు ఖాళీగా ఉండి వైద్యడు లేకపోవడంతో ఏదైనా రోడ్డు ప్రమాదం లేదా మరేదైనా సంభవించినప్పుడు కాళ్లు, చేతులు విరిగిన సందర్భాలలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అటుంచి కనీసం ప్రాథమిక వైద్యం అందించే పరిస్థితి కూడా లేదు. ఇక జనరల్ ఎండీ పోస్టు లేక డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలకు అందే సాధారణ వైద్యం కూడా సక్రమంగా అందడం లేదు. ఆస్పత్రిలో ఇలా కీలకమైన గైనిక్‌లు ముగ్గురి వైద్యులు, ఆర్థోపెడిక్ వైద్యుడు, జనరల్ ఎండీ ఈ అయిదు పోస్టులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు ఈ ఆస్పత్రికి వచ్చి వైద్యలు అందుబాటులో లేక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొందరైతే ప్రైవేటు ఆస్పత్రులను విధి లేక ఆశ్రయించి వేలకు వేలు బిల్లులు చెల్లిస్తున్నారు. త్వరలోనే వైద్య పోస్టుల భర్తీ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీ త్వరలోనే జరగనుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 65 వైద్య పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగితే కేవలం 22 పోస్టులే భర్తీ అయ్యాయి. ఆ పోస్టుల్లో అమలాపురం ఆస్పత్రికి భర్తీ కాలేదు. గైనిక్ డాక్టర్ డిప్యూటేషన్‌పై వారానికి మూడు రోజులు ఇక్కడే ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు రెగ్యులర్ గైనిక్ పోస్టుల్లో ఒక వైద్యురాలు మెటర్నిటీ లీవులో వెళ్లడం వల్ల డిప్యూటేషన్ విధానంలో మరో వైద్యురాలిని నియమించాం. రెండు లేదా మూడు వారా ల్లో వైద్య పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ కె.శంకరరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం అందుకే రిఫర్ టూ కాకినాడగర్భిణులు, బాలింతలకు ఏదైనా అత్యవర వైద్యం లేదా శస్త్ర చికిత్స అనివార్యమైనా, రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు లేదా చేతులు విరిగిపోయినా ఆ కేసులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి ఇక్కడ వైద్యులు సిఫార్సు చేసి ఆ లేఖను చేతిలో పెడుతున్నారు. కొందరైతే కాకినాడకు వెళ్లే బదులు ఇక్కడే ఏదైనా ప్రైవేటు ఆస్పతికి వెళ్లి వైద్యం చేయించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంతో ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారు. ఆస్పత్రిలో దాదాపు 12 వైద్య పోస్టులు ఉన్పప్పటికీ కీలక పోస్టులు లేకపోవడంతో రోగుల సంఖ్య కూడా ఆస్పత్రికి తగ్గిపోతోంది. -
సీతారాములకు ఘనంగా శ్రీపుష్పయాగం
రత్నగిరిపై ముగిసిన శ్రీరామనవమి వేడుకలు అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో చివరగా తొమ్మిదో రోజు ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీసీతారాములకు శ్రీపుష్పయాగం కార్యక్రమం నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో రాత్రి ఎనిమిది గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనంపై , పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై ప్రతిష్టించి పండితులు పూజలు చేశారు. అనంతరం సీతారాములను సుగంధ భరిత పుష్పాలతో పూజించారు. సీతారాములకు వివిధ రకా ల పిండివంటలు నివేదించారు. అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. రామాలయంలో పూలమాలలతో అలంకరించిన ఊయల మీద సీతారాములను పవళింపు చేసి మంత్రాలు చదువుతూ మూడుసార్లు ఊపారు. అనంతరం ఆ ఊయలకు అమర్చిన అద్దంలో సీతారాములను పండితులు దర్శించారు. అనంతరం పండితులకు దంపత తాంబూలాలు బహూకరించారు. భక్తులకు ప్రసాదాలను, ముత్తయిదువులకు జాకెట్టు ముక్కలను పంపిణీ చేశారు. భక్తు లు సీతారాములను అద్దంలో తిలకించి పులకించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో రత్నగిరి పై శ్రీరామ నవమి మహోత్సవాలు ముగిసాయి. -
వైభవంగా వెంకన్న శ్రీపుష్పోత్సవం
వాడపల్లిలో ముగిసిన కల్యాణోత్సవాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని శ్రీపుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన కల్యాణమహోత్సవాలు ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీపుష్పోత్సవంతో ఘనంగా ముగిసాయి. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వైఖానస పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి రాత్రి శ్రీపుష్పోత్సవం నిర్వహించారు. వివిధ రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోల పాటలతో పవళింపజేశారు. పలువురికి దంపతి తాంబులాలు అందచేశారు. కాగా అందరి సహకారంతో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు డీసీ చక్రధరరావు తెలిపారు. ర్యాలి జగన్మోహినీ కేశవస్వామికి.. కొత్తపేట: పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామికి ఆదివారం నిర్వహించిన శ్రీపుష్పోత్సవంతో కల్యాణోత్సవాలు ముగిసాయి. ఈ సందర్భంగా ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు, అర్చకులు స్వామివారి మేలుకొలుపు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. -
లోవ దేవస్థానంలో భక్తజన సందోహం
తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తజనంతో లోవ దేవస్థానం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలిచ్చిన 40వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,82,535, పూజా టికెట్లకు రూ.1,30,740, కేశఖండనశాలకు రూ.14,860, వాహన పూజలకు రూ.4,670, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.73,932, విరాళాలు రూ.1,02,063 వెరసి మొత్తం రూ.5,08,800 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. అలరించిన కవి సమ్మేళనం జాతీయ స్థాయిలో 126 మంది కవుల రాక అమలాపురం టౌన్: అంర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళా వేదిక 147వ జాతీయ స్థాయి ఉగాది శతాధిక కవి సమ్మేళనం స్థానిక శ్రీకళా రెసిడెన్సీలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీనుల విందుగా సాగింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి 126 మంది కవులు హాజరై ఉగాది కవితా గానాలతో అలరించారు. వేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో తెలుగు కవిత్వానికి వెలుగులు నింపిన మహా కవులు డాక్టర్ బోయి భీమన్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు సాహితీ దిగ్గజాలు పూల మాలలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి మాట్లాడుతూ కవిత్వం అంటే అక్షర తాండవమని, కాలంతో పాటు కవిత్వం మారాలని ఆమె సూచించారు. సమ్మేళనానికి విచ్చేసిన ప్రతీ కవిని వేదిక తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో ఏలూరులో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రతాప్ వెల్లడించారు. వేదిక జిల్లా ఽఅధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయిత సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, వేదిక జాతీయ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణలు పర్యవేక్షించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నంచి ఉగాది కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ ప్రతాప్‌ను కవులు అభినందించారు. సమ్మేళన సభలో వేదిక కమిటీ సభ్యులు యెండూరి సీతామహాలక్ష్మి, పోలిశెట్టి అనంతలక్ష్మి అరిగెల బలరామమూర్తి, శ్రీపాద రామకృష్ణ, కడలి సత్యనారాయణ, గోదావరి పత్రిక సంపాదకుడు బోళ్ల సతీష్‌లు ప్రసంగించారు. -
పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత
తుని: రైలులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలను పోగొట్టుకున్న బాధితులకు వాటిని తిరిగి రైల్వే పోలీసులు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. తుని సీతారామపురానికి చెందిన భార్యాభర్తలు తూనిగుంట్ల లలిత, ఫణిచంద్రకుమార్ గూడూరులో తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఎస్–2 కోచ్‌లో ఎక్కిన వారు రైలు నుంచి తునిలో దిగే క్రమంలో 36 గ్రాముల బంగారు ఆభరణాలున్న హ్యాండ్‌బ్యాగ్‌ను మరచిపోయారు. ట్రైను దిగిన తరువాత బ్యాగు మరచిపోయిన విషయం గుర్తుకు రావడంతో వెంటనే స్థానిక రైల్వే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాకినాడ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో జీఆర్పీ ఎస్సై జి. శ్రీనివాసరావు రైలులో ఆన్‌డ్యూటీలో ఉన్న సిబ్బంది బెహరాప్రసాద్ను ఫోన్లో సంప్రదించారు. కోచ్, సీటు నంబర్లు, బ్యాగ్ వివరాలు తెలియజేశారు. బెహరా ప్రసాద్ సంబందిత కోచ్‌కు వెళ్లి చూడగా బ్యాగ్ అక్కడే ఉంది. రైల్వే పోలీసులు బంగారు ఆభరణాలను తుని జీఆర్పీకి తీసుకువచ్చి భార్యాభర్తలకు అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన ఆన్‌డ్యూటీ సిబ్బంది బెహరా ప్రసాద్‌ను అధికారులు అభినందించారు. -
ప్రతిభ చూపిన శ్రీప్రకాష్
తుని: ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినట్లు శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్ శనివారం తెలిపారు. ప్రధమ సంవత్సరం ఎంపీసీలో ఆర్ఎస్ఎస్ నగేష్ 464/470, జి.అనూష 460/470, కె.యామినిజ్యోతిక 460/470, బైపీసీలో ఆర్ నాగసూర్యభవ్య 429/440 మార్కులు సాందించారన్నారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ నందు ఏ హర్షిత 988/1000, ఎస్.మేఘన 986/1000, బైపీసీలో ఎం.సత్యఅక్షయ 986/1000, సీహెచ్ పూర్ణశివాని 984/1000 మార్కులు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, ప్రిన్సిపాల్ భానుమూర్తి, అకడమిక్ ఇన్చార్జి శ్రీలక్ష్మి తదితరులు అభినందించారు. -
ఇంటర్ ఫలితాల్లో ప్రగతి ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియేట్ ఫలితాల్లో ప్రగతి విద్యాసంస్థల విద్యార్థులు మంచి మార్కులతో ప్రతిభ చూపారని విద్యా సంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు శనివారం తెలిపారు. ఎంపీసీ ప్రధమ సంవత్సరంలో కే.శ్యామల ప్రజ్ఞ 470 మార్కులకు 466, పిల్లా హర్షిణి 465, జి.మాధవి శ్రీదుర్గ 465, వారితో పాటు 460కు పైగా మార్కులతో 54 మంది ప్రతిభ చూపారన్నారు. బైపీసీలో పి.ఖురేషీబేగం 435, జి.తేజశ్వి, నాగమహేశ్వవరి 433 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో కె.ఽశేషలక్ష్మి 488, సీఈసీలో దేవి శరణ్య 482 మార్కులుతో ప్రతిభ చూపారన్నారు. సీనియర్ ఎంపీసీలో టి.హరిణి 988, ఐ.భాగ్యలక్ష్మి 987, బైపీసీలో కె.నిఖిత 986 సాధించారన్నారు. వీటితో పాటు జూనియర్ బైపీసీలలో 430కు పైగా 10 మందితో పాటు కాకినాడ, పెద్దాపురం, జగపతినగరం, రాజమహేంద్రవరం బ్రాంచ్‌లలో నూరుశాతం ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రగతి డైరెక్టర్లు హిమబిందు, శ్వేతబిందు, ఎజీఏం అనిల్‌బాబు, అధ్యాపకులు అభినందించారు. -
ఇంటర్లో శ్రీ షిర్డీ సాయి విజయ బావుటా
కంబాలచెరువు: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయ బావుటా ఎగుర వేశారు. ఆ వివరాలను విద్యా సంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య శుక్రవారం విలేకర్లకు వెల్లడించారు. ప్రధమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో 470 మార్కులకు 465 మార్కులతో జి. మెహెర్ సత్య ప్రసాద్, ఎం.అభినవ్ వివేక్ ప్రధమ స్థానంలో నిలవగా, 464 మార్కులతో ఎన్వీపీ వర్షిత్, ఎం.తను శ్రావ్య శ్రీ, వై.బ్లెస్సీ ద్వితీయ స్థానాన్ని, 463 మార్కులతో బి.సాయి ప్రకాష్, కె.తేజస్విని, ఎస్.నిత్యశ్రీ, పి.భద్ర సాహితి, ఎన్.లలిత, ఆర్.హజీరా తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. బైపీసీలో 440 మార్కులకు 428 మార్కులతో ఎస్.తేజశ్రీ, ప్రథమ స్థానాన్ని, 416 మార్కులతో డి.దేవిసాయి ద్వితీయ స్థానాన్నీ సాధించారు. మొత్తం 16 మంది విద్యార్థులు 460 పైగా మార్కులు సాధించగా, 63 మంది 450 పైగా, 153 మంది 420కి పైగా, 207 మంది 400కి పైగా సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో వి.మణికంఠ 990 మార్కులతో ప్రధమ, ఎం.హాసిని, ఎన్.నందిని, వి.శివ కేశవ, జి.సాయి ముఖేష్ 987 మార్కులతో ద్వితీయస్థానాన్ని, ఎ.దివ్య 986 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. బైపీసీలో 976 మార్కులతో కె.హిమశ్రీ ప్రధమస్థానాన్ని 974 మార్కులతో, కె.శిరీష ద్వితీయస్థానాన్ని సాధించారు. 13 మంది 980కి పైగా మార్కులు సాధించగా, 53 మంది 970కి పైగా, 107 మంది 950కి పైగా, 125 మంది 920కి పైగా, 203 మంది 900కి పైగా మార్కులు సాధించారని శ్రీవిద్య వివరించారు. ఈ విజయంపై విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు. -
ఘనంగా సీతారాముల చక్రస్నానం
అన్నవరం: రత్నగిరిపై నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా పంపా జలాశయంలో సీతారాములకు శ్రీచక్రస్నాన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు వెంట రాగా పల్లకీపై నవ దంపతులు సీతారాములను పంపా తీరానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడి వేదికపై సీతారాములను ఒక సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని మరో సింహాసనం మీద వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం సీతారాములకు, సుదర్శన చక్రానికి పండితులు అవభృథ స్నానం నిర్వహించారు. అనంతరం సీతారాముల విగ్రహాలను, సుదర్శన చక్రాన్ని పండితుల మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా పంపా జలాశయానికి తీసుకుని వెళ్లి, ఘనంగా శ్రీచక్రస్నానం నిర్వహించారు. అనంతరం సీతారాములను సింహాసనంపై వేంచేయించి, మరోసారి పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు, పరిచారకులు తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సీతారాములకు సాయంత్రం 4 గంటలకు నాకబలి, దండియాడింపు కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సీతారాముల విగ్రహాలతో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ నాట్యం చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి రామాలయంలో సీతారాములకు శ్రీపుష్పయాగం కార్యక్రమం నిర్వహించనున్నారు. శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం శనివారం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేసంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,80,809 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. మూడు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం
● పీఏసీలో కీలక ప్రాతినిధ్యం ● నియామకాల్లో సామాజిక సమతూకం ● బోస్, తోట, విశ్వరూప్, ముద్రగడకు చోటు సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం పలు కీలక నియామకాలు చేపట్టింది. మండల, గ్రామ స్థాయిలో నూతన కమిటీల నియామకాల్లో పాత, కొత్త నేతల కలయికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీలో అత్యున్నతమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అధిష్టానం అగ్రాసనం వేసింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టారు. పీఏసీ సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని నియమించారు. -
ఇంటర్ ఫలితాలలో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రధమ, ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470కి 467 మార్కులను యు.విరోనిక, ఎం.హర్షిత, ఎస్.తేజ, జి.రాజనీవన్తేజ, ఎ.వీరవెంకట సాయిలిఖి సాధించారని, 466 పైన 31మంది, 464పైన 369 మంది, 460పైన 1086 మంది, 450 పైన ప్రతి ఇద్దరిలో ఒకరికి అనగా 2133 మంది సాధించారని, అలాగే 99.20 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులను 11 మంది విద్యార్థులు కె.సుప్రియ, ఎ.శ్రీరామ తేజశ్విని, సీహెచ్ నేహా గ్రేస్, జి.మోహనరూప, జె.భవిత, కె.గాయత్రి, టి.సరయు, బి.యశస్విని, షేక్ షమీన, ఆర్.వీరగంగ నాగేంద్ర, పి.ప్రణవ్ సాయిగణేష్ సాధించారని, 435పైన 32 మంది, 433 పైన 91మంది, 430 పైన 167 మంది, 400 పైగా మార్కులు 463 మంది సాధించారని, అలాగే 99.47 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఏడుగురు విద్యార్థులు ఎం.ప్రియహాసిని, సీహెచ్ హరిసూర్య, పి.పవిత్ర, కె.మానస, ఎం.లేఖన, ఎస్.సాయిలిఖిత, పి.ధాత్రికావ్యశ్రీ సాధించారని, 23 మంది విద్యార్థులకు 990 మార్కులు, 331 మంది విద్యార్థులకు 985 మార్కుల పైన, 791 మంది విద్యార్థులకు 980 మార్కుల పైన, 2151 మంది విద్యార్థులకు 950 మార్కులపైన సాధించారని, 99.98 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు షేక్ ఫాతిమున్నీసా బేగం 991 మార్కులు, పి.నాగవైష్ణవి, సీహెచ్వీడీ రేణుక, ఎన్.వైష్ణవి, బి.హర్షిత, ఎన్.మణి, జి.రితిక 990 మార్కులు సాధించారని, 108 మంది విద్యార్థులు 980 పైన, 204 మంది విద్యార్థులు 970 పైన, 297 మంది విద్యార్థులు 950 మార్కులపైన సాధించారని, అలాగే 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధికమార్కులు వచ్చిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యాసంస్థల టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. -
అక్క బంగారం కాజేసి కటకటాలకు
● పెద్దమ్మ కూతురితో కలసి చోరీ చేసిన చెల్లి ● కట్టర్ సాయంతో తాళాలు తొలగించిన వైనం ● 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, ఇంటి డాక్యుమెంట్ల స్వాధీనం నిడదవోలు : సొంత అక్క బంగారంపైనే చెల్లెలు కన్నేసింది. అదును చూసి ఇద్దరి సాయంతో వాటిని అపహరించి చివరకు కటకటాల పాలైంది. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ శనివారం స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఎంవీ నగర్లో బలిజ సత్యనారాయణ, శశి లలితాదేవి దంపతులు నివసిస్తున్నారు. లలితాదేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె సొంత చెల్లెలు పడాల లక్ష్మీశైలజ తాడేపల్లిగూడెంలో ఉంటోంది. శైలజ ఆర్థిక పరిస్థితుల వల్ల తన అక్క బంగారం దొంగిలించి తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని పథకం వేసింది. ఈ మేరకు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన తన పెద్దమ్మ కుమార్తె బండి సత్యవేణి సహాయం తీసుకుంది. ఆమెకు ఈ పథకం గురించి చెప్పింది. బీరువా తాళాలు బద్దలు కొట్టడానికి ఓ వ్యక్తిని పురమయించాలని చెప్పింది. ఆమె ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కప్పకాయల సురేంద్రను తీసుకుని ఆటోలో ఈ నెల పదో తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు లలితాదేవి ఇంటికి చేరుకున్నారు. వారు ముగ్గురు ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించి, ఎవరైనా వస్తే చెప్పాలని సత్యవేణిని ఆటో వద్ద కాపలా ఉంచారు. తర్వాత నిందితులు శైలజ, సురేంద్ర కలిసి ఇంటికి వేసిన తాళాన్ని ఐరన్ కట్టర్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. గదిలో ఉన్న బీరువా లాకర్‌ను కూడా కట్టర్ సహాయంతో కట్ చేసి బీరువాలోని 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు, ఇంటి, ఖాళీ స్థలం డాక్యుమెంట్లు అపహరించుకుపోయారు. దీననిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా శైలజ, సత్యవేణి, సురేంద్రల నేరం చేసినట్టు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తిలక్ పేర్కొన్నారు. వీరి నుంచి 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్ల విలువ రూ.12.55 లక్షలు ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలో ముద్దాయిలను గుర్తించి కేసులు ఛేదించిన ఎస్సై కె.జగన్మోహన్రావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు. -
మరో మైలురాయిగా టైగర్ ట్రయంఫ్
● వెనుదిరిన సైన్యం, నేవీ అధికారులు ● నేటి నుంచి బీచ్ రోడ్డులో యథాతథంగా రాకపోకలు కాకినాడ రూరల్: ఇండో – అమెరికన్ సైనిక దళాల మధ్య పరస్పరం నైపుణ్యం పంచుకునే లక్ష్యంతో నిర్వహించిన టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు ఇరు దేశాల రక్షణ అంశంలో మరో మైలురాయిగా నిలిచాయి. పరస్పర సహకారంతో పాటు, విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతో నాలుగో ఎడిషన్ యాంఫిబియస్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్–25 విన్యాసాలు నిర్వహించారు. విశాఖ తీరంలో ఈ నెల 1న భారత్,– అమెరికా దేశాల నేవీ, ఎయిర్‌ఫోర్స్, సైనిక దళాల సంయుక్త విన్యాసాలు ప్రారంభమయ్యాయి. కాకినాడ తీరంలో ఈ నెల 8 నుంచి క్లిష్టమైన సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహించారు. ఇందులో ఇరు దేశాల నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు పాల్గొన్నాయి. సముద్ర కార్యకలాపాలు, విమానాల క్రాస్– డెస్ ల్యాండింగ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ (ఆర్ఏఎంటీ), కంబైన్డ్ కో ఆర్డినేషన్ సెంటర్ ద్వారా విపత్తులు నిర్వహణపై ఎక్సర్సైజ్లో యూఎస్ దళాలు పాల్గొన్నాయి. ప్రతిష్టాత్మక విన్యాసాలు ముగియడంతో ఇరు దేశాల అధికారులు శనివారం తిరుగుపయనమయ్యారు. నేవీ అధికారులు, సిబ్బంది తమతో తీసుకువచ్చిన వాహనాలను, ఇతర సామగ్రిని విశాఖకు తరలిస్తున్నారు. ఆదివారం ఉదయానికి బీచ్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఉదయం 8 గంటల నుంచి బీచ్ రోడ్డులో ఉప్పాడకు రాకపోకలను పునరుద్ధరించనున్నారు. అలాగే సూర్యారావుపేట, పోలవరం, పరకాల్వ, నేమాం గ్రామాల ప్రజలు బీచ్‌కు వచ్చేందుకు అనుమతించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం నుంచి ఎత్తివేస్తున్నామని రూరల్ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. -
నేటి నుంచి తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు
● లోవ గ్రామంలో 26న జాగరణ ● 27న తీర్థం, ఊరేగింపు ● పలు గ్రామాల్లో జాతరలకు భారీ ఏర్పాట్లు తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు ఆదివారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ జరగనున్నాయి. ప్రతి సంవత్సరం గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరు గ్రామంలో తలుపులమ్మ తల్లికి పుట్టింటి సంబరాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానం ఆవరణలో నెల రోజులు ఆషాఢ మాసోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పుట్టింటి సంబరాల సందర్భంగా 14 రోజుల ఉత్సవాల అనంతరం అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థం నిర్వహిస్తారు. గ్రామస్తుల అభీష్టం మేరకు లోవ దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో లోవ గ్రామంలో ఉపాలయం వద్ద నాలుగెకరాల విస్తీర్ణంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా పేలుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, వారి ఆడపడుచులు, అల్లుళ్లు, బంధుమిత్రులు లోవ కొత్తూరు వచ్చి గంధామావాస్య ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు అవసరమైన ఖర్చును లోవ దేవస్థానం నుంచి భరిస్తామని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. సంబరాలు జరుగుతాయిలా.. మొదటి రోజయిన ఆదివారం గరగల సంబరాలతో అమ్మవారి పుట్టింటి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. వివిధ గ్రామాల్లో గరగలను ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. 26వ తేదీ రాత్రి జాగరణ, 27న అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 26న 50 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు, కేరళ లేడీ డ్రమ్స్ టీమ్, కాంతార లైటింగ్ డ్యాన్స్ టీమ్, గోపాల గోపాల ప్రోగ్రాం, పెద్ద ఆంజనేయ బృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 27న వివిధ వాహనాలపై బళ్ల వేషాలు, నక్కపల్లి వారి మ్యూజికల్ బ్యాండ్, 60 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో.. లోవ దేవస్థానం పరిసర ప్రాంతవాసులకు తలుపులమ్మ తల్లి ఇలవేల్పు కావడంతో గంధామావాస్య రోజున వివిధ గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వి.కొత్తూరు, కొత్త వెలంపేట, సీతయ్యపేట, మర్లపాడు, రాజుపేట, జగన్నాథగిరి, గెడ్లబీడు, వెలంపేట కాలనీ, తాళ్లూరు, కుమ్మరిలోవ తదితర గ్రామాల్లో వేర్వేరుగా తలుపులమ్మ తల్లి జాతర భారీగా నిర్వహిస్తారు. దీని కోసం ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యాన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రదర్శనల్లో వెండి తెర, బుల్లి తెర నటీనటులు పాల్గొని ఆయా గ్రామస్తులను అలరించనున్నారు. -
కేసులు బేషరతుగా ఉపసంహరించాలి
● ప్రజాస్వామ్యానికి సంకెళ్లు అన్యాయం ● కాకినాడలో జర్నలిస్టుల ధర్నా ● డీఆర్ఓకు వినతిపత్రం సాక్షి ప్రతినిధి, కాకినాడ: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేసే విధానాలకు ప్రభుత్వం తక్షణం స్వస్తి పలకాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. పత్రికలకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు. ‘సాక్షి’ పత్రికపై కక్ష కట్టి సంపాదకులు ధనుంజయరెడ్డి సహా విలేకర్లపై అక్రమంగా నమోదు చేసిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ సిటీ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యాన కలెక్టరేట్ గేటు వద్ద ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, కెమెరామన్లు శనివారం మండుటెండలో నిరసన తెలిపారు. ప్రభుత్వం అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తే పాత్రికేయులంతా ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం, వియ్ వాంట్ జస్టిస్, కేసులు ఉపసంహరించుకోవాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు నుంచి ప్లకార్డులతో డీఆర్ఓ కార్యాలయం వరకూ జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓ వెంకట్రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె.స్వాతిప్రసాద్ మాట్లాడుతూ, పత్రికలు ప్రచురించే వార్తలపై అభ్యంతరాలుంటే వాటిని సవరించాని కోరే హక్కు ఎవరికై నా ఉంటుందని అన్నారు. అలా కాదని, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం బేషరతుగా కేసులు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.నవీన్‌రాజు మాట్లాడుతూ, అక్రమ కేసులతో పాత్రికేయులు, పత్రికలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సహేతుకం కాదని అన్నారు. నిష్పక్షపాతంగా వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులతో వేధింపులకు దిగడం సరి కాదని, కేసులు ఉపసంహరించుకోవాలని జాప్ ప్రతినిధి కృష్ణంరాజు డిమాండ్ చేశారు. డాక్టర్ ఎస్ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. కాకినాడ సిటీ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ, పత్రికలు, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో చీఫ్ లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి టీవీ ప్రతినిధి బొక్కినాల రాజు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు నయీంఖాన్ దురానీ, అంజిబాబు, వీధి గోపి, మేకల వెంకట రమణ, దొరబాబు, సురేష్, సూర్యనారాయణ, దుర్గారావు, బండి రాజేష్, ముమ్మిడి వెంకట రమణ (చిన్నా), నందిని, బీసీఎన్ శివ, గోన సురేష్, ఆకెళ్ల శ్రీనివాస్, తోట చక్రధర్, రాజబాబు, తలాటం సత్యనారాయణ, బొత్స వెంకట్, దొమ్మేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘నన్నయ’ వీసీకి రత్నసింహ్‌జీ మహిదా అవార్డు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ‘రత్నసింహ్‌జీ మహిదా మెమోరియల్ అవార్డు అందుకున్నారు. ఆమెకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ శనివారం ఈ అవార్డు అందజేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని రాజ్పిప్లాలో సామాజిక సంస్కర్త, విద్యావేత్త, గిరిజనుల సంక్షేమానికి అంకితమైన దివంగత రత్నసింహ్‌జీ మహిదా జ్ఞాపకార్థం సంఘ సేవ చేసిన ప్రముఖులకు ఈ సంవత్సరం నుంచి అందజేస్తున్నారు. బిర్సాముండా గిరిజన యూనివర్సిటీ వీసీ మధుకర్బాయ్ ఎస్తో పాటు 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించి, భారత రాష్ట్రపతి నుంచి ‘నారీరత్న’ పురస్కారాన్ని అందుకున్న ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీకి ఈ అవార్డును తొలిసారిగా ప్రదానం చేశారు. కారు బోల్తా.. 10 మందికి గాయాలు దేవరపల్లి: అతి వేగంగా వెళుతున్న కారు 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి, పంట పొలాల్లో బోల్తా పడి, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్దకు చేరుకున్నారు. అక్కడ కారు ఒక్కసారిగా అదుపుత ప్పి హైవే పైనుంచి పల్టీలు కొడుతూ పంట పొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో కారులోని 10 మంది కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. కారులోని వారిని స్థానికులు బయటకు తీసి, హైవే అంబులెన్స్‌లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయమూ లేదని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో గౌరక్క (కోతుల లత), గౌరక్కగారి చిన్నమ్మాయి, కోతుల సోమశేఖర్, కోతుల యశ్వంత్, కోతుల చందన, భార్గవి, పభ్రేష్, లలిక, శిరీష, కారు డ్రైవర్ గౌరక్కగారి శ్రీకాంత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు దేవరపల్లి ఎస్సై ఇ.సుబ్రహ్మణ్యం తెలిపారు. -
సాక్షిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్.ధనంజయరెడ్డితో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వి.నవీన్‌రాజ్ శుక్రవారం డిమాండ్ చేశారు. మాచర్ల మండలంలో జరిగిన పి.హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసు ప్రచురణ వార్త కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చరిల్లుతాయనే సాకుతో కేసు బనాయించటం అక్రమమని పేర్కొన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు.. ఆ పనికి బదులుగా ఇలా అక్రమ కేసులు బనాయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రచురితమైన సమాచారంలో తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు వివిధ మార్గాలున్నాయన్నారు. వాటిని కాదని, మీడియాను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే వైఖరిని పోలీసులు అనుసరించటం సరైనది కాదని స్పష్టం చేశారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ స్టేషన్ వ్యవహారాలపై ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి కూడా 8 దినపత్రికలకు పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు. నేరానికి బాధ్యులైన వారిని పట్టుకుని శిక్షించేలా పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో సరైన సమాచారం నిష్పక్షపాతంగా అందించే కచ్చితమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలకు పోలీసులు పాల్పడకుండా చూసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నవీన్‌రాజ్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పల్లి ఫణీంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శిగా కొయ్యా మురళీకృష్ణ, రాష్ట్ర మేధావి విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎలిశెట్టి కొండలరావు ( గిరి), రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మారేళ్ల స్టీఫెన్ ఆనంద్‌ను, సంయుక్త కార్యదర్శిగా నక్కా జాన్ ఆనంద్‌ను నియమించారు. ఆదర్శమూర్తి ఫూలే కాకినాడ సిటీ: దేశంలోని మహా నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా కాకినాడ జీజీహెచ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితరులు శుక్రవారం పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫూలే స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని అన్నారు. వెనుకబడిన వర్గాల విద్య కోసం, మానవ హక్కుల కోసం ఫూలే ఎంతో పోరాడారని వివరించారు. అత్యంత వెనుకబడిన కులాల వారి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ, కాపు, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా 513 మందికి రూ.11 కోట్ల 86 లక్షల 44 వేల రుణాల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం.లల్లి తదితరులు పాల్గొన్నారు. నేడు యథావిధిగా రిజిస్ట్రేషన్లు కాకినాడ లీగల్: రెండో శనివారం సెలవు అయినప్పటికీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శనివారం పని చేయనున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ యథావిధిగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేస్తారు. సెలవు రోజున పని చేయాలనే ఆదేశాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్ రద్దు కాకినాడ క్రైం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేశారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. -
క్షేత్రం నుంచి క్షాత్రానికి!
పిఠాపురం: వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించే ఎడ్లు నేడు పరుగు పందేలలో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పూర్వం నుంచి ఎడ్ల పందాలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు పండుగలకు మాత్రమే పోటీలు పరిమితమయ్యేవి. ఆ సరదా పోటీలు నేడు మామూలు సందర్భాలలోనూ కొనసాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు వెచ్చించి మరీ పోటీలకు ఎడ్లను పెంచడంలో పలువురు రైతుల ఆసక్తి చూపుతున్నారు. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని వారంటున్నారు. వ్యవసాయ రంగంలో యంత్ర విప్లవం రావడంతో ఎడ్ల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వాటిని మరో విధంగా వినియోగిస్తున్నప్పటికీ కొందరు రైతులు ఎడ్ల బండ్ల పోటీల కోసం ప్రత్యేకంగా పెంచుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒక చోట ఎడ్ల పరుగు పందాలు జరుగుతుండగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పందేల కోసం రైతులు తమ ఎడ్లను తీసుకుస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించనున్నారు. జిల్లాలో లైను పందాలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందాలు ఆడుతుంటారు. వీటికి సెపరేటు పరుగు పందాలలో పాల్గొనే ఎడ్లకు గిత్తల ప్రాయం నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. కేవలం ఒక సంవత్సరం వయసు నుంచే చిన్న సైజు బండ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. సాధారణ ఎడ్లలా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తు సమయానుకూలంగా దూరాలను లక్ష్యంగా పెట్టి పరుగు పెట్టిస్తుంటారు. సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందేలకు వినియోగిస్తారు. పరుగు పందేలలో పాల్గొనే ఎడ్ల ఖరీదు రూ.లక్షలు పలుకుతోంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. ఒక రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చై నా రైతులు వెనుకాడడం లేదు. ఇతర జిల్లాలకు వెళ్లి మరీ రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మేతలోనే సత్తా పందాలలో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేకమైన మేతతో మేపుతుంటారు. కేవలం ప్రత్యేకమైన దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు, నిత్యం ఉడకబెట్టి నానబెట్టిన ఎండుగడ్డి ముక్కలలో వేసి దాణాగా మేపుతారు. వీటి మేతకు సంవత్సరానికి సుమారు రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందేలు ఉన్నా లేకపోయినా వీటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పదని, మేతలో ఎప్పుడు మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉందంటున్నారు. బండి సదుపాయాలు ప్రత్యేకమైనవి సాధారణంగా బరువులు లాగే ఎడ్ల బళ్లు చాలా బరువుగా పటిష్టంగా పెద్దపెద్ద చక్రాలతో ఉంటాయి. ప్రస్తుతం ఆ చెక్క చక్రాల స్థానంలో టైర్లు వచ్చాయి. గతంలో కేవలం ప్రత్యేకమైన చెక్కతో చేసిన చక్రాలు గల బళ్లు ఉండేవి. కాని పరుగు పందాలలో ఉపయోగించే బళ్లు మాత్రం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. బరువు తక్కుగా ఉండేలా పటిష్టంగా చిన్న సైజులో అందంగా తయారు చేయిస్తారు. వాటికి వివిధ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రూటు మార్చిన బసవడు ఏటా పెరుగుతున్న ఎడ్ల పందాలు రూ.లక్షలు పలుకుతున్న పందెపుటెడ్లు ప్రత్యేక పోషణ, సాధన, రక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్న రైతులు గెలుపు కిక్కే వేరంటున్న యజమానులు నేడు చేబ్రోలులో పోటీలకు సమాయత్తం ఎడ్లకు ఎయిర్ కూలర్లు కంటిలో లోపం రాకుండా దుమ్ము ధూళి పడినా కంటి చూపు దెబ్బతినకుండా లక్ష్యం వైపు దూసుకుపోయే విధంగా పందెం ఎడ్ల కళ్లకు కాటుక పెడుతుంటారు. పరిగెట్టి అలిసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి మందులతో మసాజ్ చేస్తుంటారు. రాత్రి సమయాల్లో ఈగలు, దోమలు కుట్టకుండా దోమ తెరలతో పాటు ప్రత్యేకంగా ఎయిర్ కూలర్లు వాడుతున్నారు. పది నిమిషాల పరుగుకు పది నెలల సాధన పందెంలో ఎడ్లు పది నిముషాలు పరుగు పెట్టాలంటే పది నెలల ముందు నుంచి ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక సంరక్షణ ఉంటుంది. ఎంతో శ్రమకోర్చి వాటిని పెంచి పోషిస్తుంటాం. ఎడ్ల పందేలు మన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా మా తాతల నాటి నుంచి కొనసాగిస్తున్నాం. పందేల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి రోజు పరుగులో శిక్షణ ఇస్తుంటాం. మేతకు ఎక్కువ ప్రాధాన్యనిస్తాం. బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. – రవీంద్రనాథ్ చౌదరి, రైతు, మండపేట ఆనందం కోసమే అంత కష్టం మా కుటుంబంలో పూర్వం నుంచి ఎడ్లను పోషిస్తున్నాం. ముఖ్యంగా పరుగు పందేలంటే మాకు చాలా ఇష్టం. ఏటా వీటి పోషణకు రూ.లక్షలు ఖర్చు అవుతున్నా పోటీలలో గెలుపు సాధించినప్పుడు వచ్చే ఆనందం వెల కట్టలేనిది. అందుకే ఎంత ఖర్చయినా లెక్క చేయం. వీటిని కంటికి రెప్పలా చూసుకుంటాం. వాటికి అనేక సౌకర్యాలు కల్పించి కాపాడుకుంటాం. – కుర్రా పురుషోత్తం, రైతు, బాపట్ల -
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
మామిడికుదురు: నగరం గ్రామంలో ఓఎన్జీసీ రిఫైనరీ గేటు ఎదురుగా 216వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ సైకిల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన కోన వెంట్రావు (70) రిఫైనరీ గేటు ఎదురుగా ఉన్న హోటల్లో టిఫిన్‌కి వెళ్లాడు. అక్కడ టిఫిన్ లేక పోవడంతో పక్కనే ఉన్న మరో హోటల్‌కి వెళ్లి సైకిల్ నడిపించుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అప్పటికే కదలిన ఓఎన్జీసీ మెయింటెనెన్స్‌కు సంబంధించిన లారీ ప్రమాదవశాత్తూ వృద్ధుడిపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో లారీ వెనుక చక్రం వృద్ధుడి పొట్ట కింది భాగం నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 వాహనం వచ్చి అందులోని సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మోటారు సైకిల్ ఢీకొని..ముమ్మిడివరం: నడిచి వెళుతున్న వ్యక్తి మోటారు సైకిలిస్టు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమానపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తకాలువకు చెందిన శీలం నాగేశ్వరరావు (54) గురువారం సాయంత్రం కూలిపనికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా యానాం నుంచి వస్తున్న మోటారు సైకిలిస్టు అతనిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు అందించిన తరువాత ఇంటికి తీసుకు వచ్చి శుక్రవారం ముమ్మిడివరం ప్రవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నాగేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని.. తుని: అన్నవరం–రావికంపాడు మధ్యలో రైలు ఢీకొని (45) ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. మృతుడు నలుపు, తెలుపు, ఆరెంజ్ రంగు అడ్డచారల టీషర్ట్, సిమెంట్ రంగు ఫ్యాంట్ ధరించాడని, కుడిచేయి దండపై పెద్దసైజు టాటూ ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. మహిళ మెడలో గొలుసు అపహరణ అన్నవరం: సత్యగిరిపై వివాహ వేడుకలు జరుగుతున్న వేళ వశుక్రవారం దుండగులు మహిళ మెడలో గొలుసును అపహరించారు. సత్యగిరి జంక్షన్‌లోని విద్యుత్ లైట్ వెలగకపోవడంతో అదే అదునుగా వివాహానికి హాజరైన ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు యువకులు లాక్కుని పరారయ్యారు. గొలుసు బరువు 26 గ్రాములు కాగా మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.రెండు లక్షలు ఉంటుందని బాధితురాలు చెప్పినట్లు ఎస్ఐ శ్రీ హరిబాబు తెలిపారు. ఘటన స్థలంలో సీసీ టీవీలు కూడా పనిచేయడం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ ఆధారాల కోసం సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవం చాగల్లు: మండలంలోని ఊనగట్ల గ్రామంలో మతి స్థిమితం లేని 16 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో రాజమహేంద్రవరం నామవరానికి చెందిన నందా శ్రీను అనే వ్యక్తికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద తీర్పు ఇచ్చినట్టు ఎస్సై కె.నరేంద్ర శుక్రవారం తెలిపారు. 2017 జూలై 19న బాలికపై అత్యాచారం చేయడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నందా శ్రీనుపై అప్పటి ఎస్సై జయబాబు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగారశిక్ష విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి హాకీ విజేత కాకినాడ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈనెల 6 నుంచి 9 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్స్ హాకీ పోటీలలో కాకినాడ జిల్లా బాలుర జట్టు విజేతగా నిలిచిందని జిల్లా హాకీ సంఘ కార్యదర్శి నంబు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాల విభజన తరువాత సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం కాకినాడ డీఎస్‌ఏలో జరిగిన కార్యక్రమంలో డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, పీడీలు రవిరాజు, నూకరాజు, సూరిబాబు, సునీల్, పరశురాం, డిఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్రలు విజేతలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు. -
ఎక్కడో.. మన స్థానం!
జిల్లాలో పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలు ఫస్టియర్ జనరల్ 21,004 ఒకేషనల్ 1,656 సెకండియర్ జనరల్ 20,179 ఒకేషనల్ 1,692 మొత్తం 44,531 గత ఏడాది మన జిల్లా స్థానం 18 ఫ నేడు ఇంటర్ ఫలితాల విడుదల ఫ తేలనున్న 44,531 మంది భవితవ్యం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. వార్షిక పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, కళాశాలల యాజమాన్యాల ఉత్కంఠకు శనివారం తెర పడనుంది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను విజయవాడలోని కార్యాలయంలో మాధ్యమిక విద్యా శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ శనివారం విడుదల చేయనున్నారు. ఎటువంటి సాంకేతిక అవరోధాలూ లేకుంటే ముందుగా ప్రకటించిన సమయానికే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యాభ్యాసంలో విద్యార్థులు మరో మెట్టు ఎక్కడానికి తోడ్పడే ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత విద్యా సంవత్సరం మాదిరిగానే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు మాధ్యమిక విద్యా మండలి కృషి చేసింది. మార్చి ఒకటో తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు 20వ తేదీతో ముగిశాయి. పరీక్షలు పూర్తి కాకుండానే మార్చి ఏడో తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఏప్రిల్ 4వ తేదీతో మూల్యాంకనాన్ని ముగించారు. 28 రోజుల్లో పూర్తి స్థాయిలో స్పాట్ వేల్యుయేషన్ ముగించి, వారం రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 12న ఫలితాలు విడుదల చేయగా ఈ ఏడాది ఒక రోజు ముందే విడుదల చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 44,531 మంది పరీక్షలు రాశారు. 2023 వరకూ ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు విడుదల చేయగా, గత ఏడాది నుంచి కొత్త జిల్లాల ప్రకారం విడుదల చేస్తున్నారు. గత ఏడాది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మన జిల్లా రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే, ఫస్టియర్‌లో 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లా ఏ స్థానంలో నిలుస్తుందోనని అధికారులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంటర్ ఫలితాలు విద్యార్థుల మొబైల్ ఫోన్లకే నేరుగా విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియెట్ కమిషనర్ కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను హెచ్‌టీటీపీఎస్://రిజల్ట్స్బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా కూడా పొందవచ్చు. అలాగే మన మిత్ర యాప్‌లో 95523 00009 నంబరుకు హాయ్ అని ఇంగ్లిషులో మెసేజ్ పంపించడం ద్వారా కూడా ఫలితాలను నేరుగా సెల్లో పొందే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. -
భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం
యుద్ధ నౌకపై హెలికాప్టర్ విన్యాసాలునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): భారత్, అమెరికా దేశాలు సంయుక్తంగా కాకినాడ బీచ్‌లో నిర్వహిస్తున్న ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ శుక్రవారం ఘనంగా ముగిసింది. హెదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ మానవత సహాయ, విపత్తు ప్రతిస్పందన, కాల్పనిక ప్రకృతి వైపరీత్యం తరువాత ఫీల్డ్ ఆసుపత్రి ఏర్పాటు, సరఫరా, పంపిణీ ప్రదేశాలను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను సంయుక్త బలగాలు చేపట్టాయని తైలిపారు. భారత్‌తో కలిసి రెండో సారి ఈ విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్నారు. టైగర్ ట్రయంఫ్ వంటి వ్యాయామాల ద్వారా యూఎస్, భారత్ పరస్పర భద్రతా లక్ష్యాలు సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు జరిగిన వ్యాయామం, ఉభయచర ల్యాండింగ్ తదితర అంశాలు ముగిసాయని తెలిపారు. విశాఖలో వారంరోజుల పాటు ఆపరేషన్ ప్రణాళిక, యూనిట్–స్థాయి శిక్షణ, సబ్జెక్ట్ నిపుణుల మార్పిడి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నారు. యూఎస్ నేవీకి సంబంధించిన విడ్బే ఐలాండ్, క్లాస్ డాక్ ల్యాండింగ్ అధికారికంగా జరగాల్సిందన్నారు. ఏప్రియల్ 1న జలాశ్వలో ప్రారంభమైన ఈ వేడుకలో 3 వేల మంది సిబ్బంది, నాలుగు నౌకలు, ఏడు విమానాలు పాల్గొన్నాయని తెలిపారు. ముగిసిన టైగర్ ట్రయంఫ్–2025 విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్న యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ -
స్తంభాన్ని ఢీకొట్టిన కారు
మామిడికుదురు: మొగలికుదురు గ్రామ పంచాయతీ సమీపంలోని కడలి రోడ్డులో శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాలువ పావంచాను ఢీ కొట్టి దాని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దానికి ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దూరంగా పడింది. ఈ సమయంలో సమీపంలో ఎవరూ లేక పోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
స్వామీ.. భద్రతేదీ..!
ఫ అన్నవరం దేవస్థానంలో భద్రతకు ఏటా రూ.4.50 కోట్లు ఫ కానరాని లగేజీ స్కానర్లు, మెటల్, హ్యాండ్ డిటెక్టర్లు ఫ 2020లోనే ఇంటెలిజెన్స్ నివేదిక ఫ నాలుగేళ్లయినా అమలుకు నోచుకోని వైనం అన్నవరం: కొద్ది రోజుల కిందట ఓ సత్రంలో మద్యం సీసాల కలకలం.. తాజాగా మద్యం తాగి ఆలయానికి వెళ్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులు.. కారులో మద్యం సీసాలు.. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నవరం దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల తనిఖీలు పెరిగినా అవి మద్యం తాగిన వారిని పట్టుకోవడానికి, మద్యం సీసాలతో రత్నగిరికి వెళ్తున్న వారిని నిరోధించడానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. భక్తుల లగేజీని స్కానర్లతోను, భక్తులను మెటల్ డిటెక్టర్లతోను తనిఖీ చేయడం వంటివి దేవస్థానంలో జరగడం లేదు. దేవస్థానంలో భద్రతా చర్యలకు ఏటా రూ. 4.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 14 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బందికి జీతాలు, సుమారు 40 మంది హోం గార్డులు, 60 మంది సెక్యూరిటీ గార్డులకు జీతాల రూపంలో ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఆయుధాలు కలిగి ఉండే ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయం చుట్టూ మాత్రమే ఉంటారు. వారు 24 గంటలూ అక్కడే ఉంటారు. మిగిలిన భద్రతా విషయాలు వారి పరిధిలో లేవు. ట్రాఫిక్ క్లియర్ చేయడం, స్వామివారి ఆలయం దిగువన క్యూ లైన్ల వద్ద, రోడ్డు జంక్షన్లు, ఉత్సవాల సమయంలో భద్రతా విధుల్లో హోం గార్డులు పాల్గొంటున్నారు. సెక్యూరిటీ గార్డులు కూడా దాదాపు ఇవే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక్క అంచె తనిఖీ కూడా లేదు తిరుమల – తిరుపతి దేవస్థానంలో మూడంచెల్లో తనిఖీలు చేస్తూంటారు. కొండ దిగువన అలిపిరి వద్ద భక్తుల లగేజీని యంత్రాలతో స్కాన్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తరువాత స్వామివారి దర్శనానికి కంపార్ట్మెంట్ లోపలకు వెళ్లే ముందు మరోసారి తనిఖీ చేస్తారు. అనంతరం ఆలయానికి సమీపానికి చేరుకున్నాక క్యూ లైన్లో మరోసారి తనిఖీ జరుగుతుంది. కానీ, అన్నవరం దేవస్థానంలో పకడ్బందీగా ఒక్క అంచెలో కూడా తనిఖీ జరగడం లేదు. లగేజీ తనిఖీ నామమాత్రమే సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తుల లగేజీని టోల్గేట్ వద్ద సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంగా మద్యం సీసాలు, మాంసాహారం, లేదా మద్యం తాగి పట్టుబడితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీలు కూడా సాధారణ రోజుల్లోనే జరుగుతున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో వాహనాల తనిఖీ సాధ్యమే కావడం లేదు. ఒక వాహనం తనిఖీ చేయడానికి 10 నిమిషాలు పడితే, ఆ సమయంలో వెనుక చాలా వాహనాలు నిలిచిపోతాయి. దీంతో తూతూమంత్రంగా తనిఖీలు చేసి పంపించేస్తున్నారు. కార్తికం, వైశాఖం, శ్రావణ మాసాలతో పాటు వివాహాల సీజన్, ఉత్సవాల సమయంలో భక్తులు వేలాది కార్లలో రత్నగిరికి తరలి వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యంత్రాల సాయం లేకుండా ఆ కార్లను తనిఖీ చేయడం సాధ్యం కాని పని. ఇంటిలిజెన్స్ అధికారుల సూచనలివీ.. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు 202లో అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. ఆ సందర్భంగా పలు సూచనలతో నివేదిక అందజేశారు. వారి సూచనలివీ.. ఫ రత్నగిరి టోల్గేట్ వద్ద కచ్చితంగా రెండు లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలి. భక్తుల లగేజీ స్కాన్ చేశాక మాత్రమే ఆ వాహనాలను అనుమతించాలి. ఫ దేవస్థానం బస్సులలో వచ్చే వారి లగేజీ కూడా తనిఖీ చేయాలి. ఫ రత్నగిరి మెట్ల దారి వద్ద కూడా లగేజీ స్కానర్ ఏర్పాటు చేసి, ఆ ప్రక్రియ పూర్తి చేశాక మాత్రమే భక్తులను కొండ పైకి అనుమతించాలి. ఫ స్వామివారి ఆలయ ప్రాంగణం లోపలకు వెళ్లేచోట, ఆలయం వద్ద, వెలుపలకు వచ్చేచోట మెటల్ డిటెక్టర్ డోర్లు ఏర్పాటు చేయాలి. ఫ ప్రతి భక్తుడిని హ్యాండ్ డిటెక్టర్లతో తనిఖీ చేశాకే లోపలకు అనుమతించాలి. ఫ స్వామివారి ఆలయానికి రాకపోకలు సాగించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్ రెండు దారులు మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు. ఫ దేవస్థానంలో అన్ని ప్రాంతాలూ కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించడానికి సిబ్బందిని 24 గంటలూ అందుబాటులో ఉంచాలి. సీసీ టీవీ ఫుటేజ్‌లను స్థానిక పోలీసులు కూడా పరిశీలించాలి. అరకొరగానే సూచనల అమలు ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల్లో 10 శాతం కూడా దేవస్థానంలో ప్రస్తుతం అమలవడం లేదు. ఎక్కడా లగేజీ స్కానర్లు లేవు. మెటల్ డిటెక్టర్ డోర్లు లేవు. ఒకటి రెండుచోట్ల ఉన్నా పని చేయడం లేదు. భక్తులను తనిఖీ చేసేందుకు హ్యాండ్ డిటెక్టర్లు కూడా లేవు. స్వామివారి ఆలయానికి రెండుకన్నా ఎక్కువ మార్గాలే ఉన్నాయి. చాలాచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ, సత్యగిరిపై మాత్రం ఇంకా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది టోల్గేట్ వద్ద సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం సీసాలు తెచ్చుకుని అక్కడ తాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీసీ ఫుటేజ్‌ను భద్రతా సిబ్బంది కాకాకుండా సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగులే పరిశీలిస్తున్నారు. అటకెక్కిన లగేజీ స్కానర్ల ప్రతిపాదనటోల్గేట్ వద్ద లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు అలిపిరి వెళ్లి, అక్కడ ఏవిధంగా తనిఖీ చేస్తున్నారో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఈని ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాక టోల్గేట్ వద్ద పెద్ద షెడ్డు నిర్మించి, భక్తుల లగేజీ స్కాన్ చేయడానికి రెండు స్కానర్లు కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించారు. లగేజీ స్కాన్ చేసేటప్పుడు వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని భావించి, కళాశాల మైదానంలో నుంచి ఘాట్ రోడ్డు వరకూ మరో రోడ్డు నిర్మించారు. భక్తుల వాహనాలు కళాశాల మైదానంలోకి చేరుకుని, అక్కడి నుంచి స్కానింగ్ అయ్యాక ఘాట్ రోడ్డులోకి ప్రవేశించి రత్నగిరికి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే, ఆటోలు, బైక్‌ల మీద వెళ్లేవారిని కూడా టోల్గేట్ వద్ద తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఆయన బదిలీ అనంతరం టోల్గేట్ వద్ద షెడ్డు నిర్మించారు తప్ప లగేజీ స్కానర్లు, ఇతర చర్యలు తీసుకోలేదు. దీంతో, రద్దీ సమయంలో తనిఖీలు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవస్థానంలో ఇప్పటికై నా అధికారులు, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. -
గుర్రాల జోరు.. కుర్రకారు హుషారు!
పిఠాపురం: రేసు గుర్రాల గిట్టల హోరుతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు మారుమోగింది. ఉత్కంఠ మధ్య రెప్ప పాటులో గమ్యాన్ని చేరుకోడానికి గుర్రాలు దౌడు తీస్తుంటే రేగిన దుమ్ములో జనం కేరింతలు కొట్టారు. ఎప్పుడో పదేళ్ల క్రితం జిల్లాలో సామర్లకోటలో జరిగిన గుర్రప్పందేలు తరువాత మళ్లీ ఇప్పుడే జరగడంతో వాటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చేబ్రోలులో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు పోటీ నిర్వహించారు. ఏటా ఈ పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొత్తగా గుర్రప్పందేలు నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచి సుమారు 35 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ పందాల్లో చేనుల అగ్రహారం మణికి చెందిన జెస్సీ గుర్రం ప్రధమ స్థానాన్ని కై వసం చేసుకుంది. రామన్నపాలేనికి చెందిన చోడమాంబిక గుర్రం విక్రమ్ రెండోస్థానాన్ని, అంకుపాలేనికి చెందిన మోదమాంబకు చెందిన గుర్రం మురుగన్ మూడోస్థానాన్ని కై వసం చేసుకుంది. ఆర్ఆర్ పేటకు చెందిన దాడి రాముడు గుర్రం భగి, సింగపూర్ సత్యనారాయణకు చెందిన గుర్రం దేవర, కోటనందూరుకు చెందిన శివరాజ్ బ్రదర్స్ గుర్రం రాఖీ, సామర్లకోటకు చెందిన జగదీష్ రాజా గుర్రం, శివరాజ్ బ్రదర్స్ గుర్రం చిన్ని, ఆర్ఆర్పేటకు చెందిన దాడి నూక హనుమంత్ గుర్రం కాళీ, చోడమాంబిక గుర్రం రాకెట్ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. చేబ్రోలులో ఉత్సాహంగా గుర్రప్పందేలు విజేతలకు బహుమతులు అందజేత -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కిళ్లీ కొట్లే బెల్ట్ షాపులు
సామర్లకోట మండలం జి.మేడపాడులోని మద్యం షాపునకు అనుబంధంగా పెదబ్రహ్మదేవం గ్రామంలో సుమారు 12 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ప్రతి పాన్షాప్లోనూ మద్యం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రతి కిళ్లీ కొట్టూ ఒక బెల్ట్ షాపుగా మారిపోతోంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ కిళ్లీ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఒక్కో బెల్ట్ షాపులో రూ.50 వేలకు మించి అమ్మకాలు జరుగుతున్నాయన్నది అంచనా. దీనినిబట్టి వాటి ఆదాయం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ప్రకటనలు చేసిన చంద్రబాబు నాయుడు వీటిపై ఒక్కసారి దృష్టి సారించాలి. – మలకల సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు, పీబీ దేవం, సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలోని బెల్ట్ షాపు -
శత్రువుకు దడ పుట్టేలా..
కాకినాడ రూరల్: శత్రువుకు దడ పుట్టేలా ఇండో – అమెరికన్ టైగర్ ట్రయంఫ్–25 విన్యాసాలు కాకినాడ తీరంలో జరుగుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన వైమానిక దళాలు గురువారం సంయుక్త విన్యాసాలతో అదరగొట్టాయి. సాధారణ ప్రజలకు అనుమతి లేనప్పటికీ ఈ విన్యాసాలు చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కాకినాడ తీర ప్రాంతంతో పాటు సూర్యారావుపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాల్లో చక్కర్లు కొట్టాయి. ఆకాశం నుంచి పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలోని వారు బయటకు వచ్చి, వాటిని ఆసక్తిగా తిలకించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 157హెచ్‌యూకు చెందిన ఎంఐ–17వీ5 ద్వారా 16 మంది యూఎస్ స్పెషల్ ఫోర్సెస్, గరుడ, పారా కమాండోలను యాంఫిబియస్ విన్యాసాలు జరిగే కాకినాడ బీచ్‌లోని నావెల్ ఎన్క్లేవ్ వద్ద బీచ్ ల్యాండింగ్ జోన్(ఎల్‌జెడ్)కు చేర్చారు. బీచ్‌లోకి సందర్శకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు : జేసీ రాహుల్ మీనా పిఠాపురం: ఏ ఒక్క రైతూ మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకుని నష్టపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారి రైతుల నుంచి తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు చేస్తూ, దోచుకుంటున్న వైనంపై ఈ నెల 9న ‘దోపిడికే ప్రాధాన్యం’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఎండీ నాయక్, డీసీఓ మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి అచ్యుతరావు తదితరులతో కలిసి జేసీ గురువారం గొల్లప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలోని గొల్లప్రోలు–1 రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలుపై గ్రామ వ్యవసాయ సహాయకులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోళ్లు ప్రారంభించాలని సిబ్బందికి సూచించారు. కొనుగోళ్లపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన గోనెసంచులు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. గ్యాస్ ధర పెంపుపై నిరసన కాకినాడ సిటీ: వంట గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన కాకినాడలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొత్త కాకినాడ నుంచి రామాలయం, డైరీ ఫామ్ రోడ్డు, ఏల్చూరి పాపారావు ఇంటి మీదుగా మదర్ థెరిస్సా బొమ్మ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, అటు మోదీ, ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత గ్యాస్ పేరుతో ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆర్భాటంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. తీరా ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వంట గ్యాస్‌పై రూ.50 పెంచి ప్రజలపై భారం మోపడమేమిటని దుయ్యబట్టారు. ఇప్పటికే గడచిన 10 నెలల కాలంలో విద్యుత్ చార్జీలు, మందులు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తిపన్ను, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బాదుడే బాదుడంటూ చంద్రబాబు ఆందోళనకు దిగారని, ఇప్పుడు ఆయన చేసినదేమిటని మధు ప్రశ్నించారు. సీపీఐ నాయకులు కె.బోడకొండ, తోకల ప్రసాద్ మాట్లాడుతూ, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
తాగునీటి చౌర్యంపై చర్యలు
● కుళాయిలకు అక్రమ మోటార్లు బిగిస్తే పైపులైన్లు కట్ ● అధికారులకు కలెక్టర్ ఆదేశం కాకినాడ సిటీ: తాగునీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు బిగించి, కృత్రిమంగా నీటి కొరత సృష్టిస్తున్న వారి ఇళ్ల పైపులైన్లను కట్ చేయాలని, తద్వారా శివారు ప్రాంతాల ప్రజలకు నీటి ఎద్దడి నివారించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఎంపీడీఓలను ఆదేశించారు. ఎంపీడీఓలు, డ్వామా ఏపీఓలతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా జిల్లాలోని ప్రతి ఆవాసంలో కనీసం ఒక తాగునీటి వనరును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అక్విడెక్ట్ నిర్మాణ పనుల కారణంగా పంపా రిజర్వాయర్‌కు ఏలేరు నీరు విడుదల చేయడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్నవరం దేవస్థానం, గ్రామానికి ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తమ అధికారులకు ప్రసంశలు ఉపాధి హామీ పథకం లక్ష్య సాధనలో ఉత్తమ కృషి చేసిన ఎంపీడీఓలను, ఏపీఓలను కలెక్టర్ షణ్మోహన్ అభినందించి, జ్ఞాపికలు అందజేశారు. అన్ని సూచికల సాధనలో జిల్లాలోనే పిఠాపురం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రెండో స్థానంలో గండేపల్లి, మూడో స్థానంలో కాకినాడ రూరల్, నాలుగో స్థానంలో ఏలేశ్వరం మండలాలు నిలిచాయని వివరించారు. జిల్లాలో గడచిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా 78 లక్షల పని దినాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా, 75 లక్షల పని దినాలు కల్పించి, 96 శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. అంతకు ముందు సంవత్సరం కంటే అదనంగా 6 లక్షల పని దినాలు కల్పించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని కోరారు. పని దినాల కల్పనలో ఏలేశ్వరం, గండేపల్లి, కిర్లంపూడి, జగ్గంపేట, యు.కొత్తపల్లి మండలాలు ముందు నిలిచాయన్నారు. తుని, కరప, కోటనందూరు, పెదపూడి మండలాలు లక్ష్య సాధనకు మరింత కృషి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం సమన్వయంతో రూ.76.62 కోట్లతో 146.57 కిలోమీటర్ల సీసీ, బీటీ రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, పౌల్ట్రీలకు రూ.20.90 కోట్లతో 1,045 షెడ్లు నిర్మించామని చెప్పారు. 769 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం, 27 సంస్థల్లో మొక్కలు నాటడం, 76 ఫార్మ్‌పాండ్స్ నిర్మాణ పనులు నిర్వహించామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ఉపాధి పనులు మరింత ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశువుల దాహార్తి తీర్చేందుకు 461 నీటి తొట్టెలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 246 పనులు మంజూరుచేసి 78 పనులు పూర్తి చేశారని తెలిపారు. మిగిలిన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆరేళ్ల లోపు చిన్నారుల ఆధార్ నమోదుకు పోస్టాఫీసు, సీఎస్సీ, సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన షెడ్యూల్ తెలియజేస్తామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆచారాలను ‘గంట‘ కలిపేశారు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను వివాదాలకు వేదికగా జనసేన నేతలు మార్చేశారు. ఉత్సవాల సందర్భంగా రోజూ స్వామివారికి వాహన సేవ నిర్వహిస్తుంటారు. వాహనాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించే సమయంలో గుడిలో జేగంట మోగిస్తుంటారు. గ్రామంలో ఒక కుటుంబీకులు జేగంట కొట్టడం ఆచారంగా వస్తోంది. కొంతకాలంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లే గుడిలో గంట కొట్టాలనే కొత్త ఆచారానికి నాంది పలికారు. ఈ నేపథ్యంలో గంట కొట్టే విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జనసేన నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మూడు రోజులుగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. రోజూ రెండు వర్గాలు తామంటే తామంటూ బాహాబాహీలకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించే సమయంలో రెండు వర్గాలు కొట్లాటకు దిగడంతో పోలీసులు వారిని తప్పించి ఆలయ అర్చకుడితో జేగంట మోగించి వాహన సేవను నిర్వహించారు. చివరి రోజు రథోత్సవం తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని పోలీసులు జనసేన నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్చార్జి చెప్పినా.. గంట కొట్టే విషయంలో జనసేనకు చెందిన రెండు వర్గాలు ఆలయానికి చేరుకుని పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ను ఈ విషయమై నిలదీశారు. తాము ఎన్నికల్లో కష్టించి పనిచేశామని, తమకు అవకాశం ఇవ్వకుండా వేరే వర్గానికి అవకాశం ఇస్తారా అంటూ ఒక వర్గం. వారు ఇటీవలే పార్టీలోకి వచ్చారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము జనసేనకు మద్దతుగా పని చేస్తున్నాం.. మాకే అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుబట్టారు. వివాదాలు లేకుండా ఆలయ ఆచారాలను నిర్వహించాలని ఇన్చార్జ్ చెప్పినప్పటికి లెక్క చేయని రెండు వర్గాలు వాగ్వాదాలకు దిగడంతో ఆలయంలో ఉత్సవ వేళ గందరగోళంగా మారింది. కాగా ఆలయంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న జేగంట స్థానంలో జనసేన నేతలు కొత్త గంటను తెచ్చి పెట్టడం విమర్శలకు దారితీసింది. ఉన్నతాధికారులు కలగజేసుకుని శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చేబ్రోలులో రాముడి సాక్షిగా జనసేన వర్గాల కొట్లాట ఆలయంలో జేగంట కొట్టే ఆచారానికి అపచారం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
చిన్నతనం నుంచే చోరీల బాట
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చిన్నతనం నుంచే చోరీల బాట పట్టిన దొంగను నిడదవోలు పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, రూ.3.60 లక్షల విలువైన 4 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు, టీవీ, మోటారుసైకిల్, ఐరన్ రాడ్డు, స్కూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం సమీపంలోని గునుపూడి బ్రాహ్మణవీధిలో నివాసముండే పందిరి వెంకట నారాయణ ఆలియాస్ నారిగాడు చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. 2008లో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలో సైకిళ్లు, ఇనుపముక్కలు దొంగతనం చేసేవాడు. దీంతో పోలీసులు వెంకట నారాయణను పట్టుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఆ తర్వాత పలు చోరీలకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేయడం, బయటకు రావడం, మళ్లీ దొంగతనం చేయడం, తిరిగి జువైనల్ హోమ్‌కు వెళ్లడం పరిపాటిగా మారింది. అలా అమలాపురం, పి.గన్నవరం, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ 22న ఆలమూరు పోలీసులు అరెస్టు చేసి తిరిగి జైలుకు పంపారు. నెల తర్వాత బెయిల్‌పై విడుదలైన వెంకట నారాయణ సమిశ్రగూడెం, ఉండ్రాజవరం, పెనుమంట్ర, ఐనవల్లి, పెరవలి, రావులపాలెం, భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిల్లో మరో నేరస్తుడు శివసుబ్రహ్మణ్యంతో కలిసి నేరాలు చేశాడు. ఇదిలా ఉండగా.. వెంకట నారాయణ ఉండ్రాజవరంలోని సీపాని విజయలక్ష్మి ఇంటి తాళాలు పగులకొట్టి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కదలికలపై కన్నువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో 57 కేసులున్నట్టు గుర్తించారు. కేసును చేధించిన నిడదవోలు సీఐ స్వరూప్, ఉండ్రాజవరం ఎస్సై జి.శ్రీనివాసరావు, సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు, సీసీఎస్ ఎస్సై రవీంద్ర, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.నరసింహ కిశోర్, క్రైం అడిషనల్ ఎస్పీ ఎల్.అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్ జిల్లా దొంగ అరెస్టు రూ.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం -
బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పిఠాపురం: స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ మైదానంలో బుధవారం నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృపారావు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. వీటికి జిల్లా నలుమూలల నుంచి 25 మంది హాజరుకాగా, 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేశామన్నారు. వీరందరూ ఈ నెల 12, 13వ తేదీలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ యూత్ మెన్ అండ్ వుమెన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రైళ్లలో చోరీలు చేస్తున్న యువకుడి అరెస్టు నిడదవోలు: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన ఉలవలపూడి దుర్గారావును బుధవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం రైల్వే సీఐ ఎస్.సోమరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉలవలపూడి దుర్గారావు కొంత కాలంగా రైళ్లలో ప్రయాణికుల బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్నాడు. అలాగే రైలు ఫుట్‌బోర్డుల దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణికులను కర్రతో కొట్టి, ఆ ఫోన్లు కిందపడగానే వాటిని తీసుకుని ఉడాయిస్తాడు. ఇలా అతడు దోచుకున్న 18 సెల్ఫోన్లు, 30 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వాటి విలువ సుమారు రూ. 3.70 లక్షలు ఉంటుందని రైల్వే సీఐ తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధుడిపై పోక్సో కేసు నల్లజర్ల: మండలంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను లైంగికంగా వేధించిన ఓ వృద్ధుడి (హెచ్ఐవీ రోగి)పై పోలీసులు పోక్సో కేసు కట్టారు. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కాకినాడ తీరం.. కదన రంగం
● ఉత్సాహంగా టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు ● పాల్గొన్న భారత్, అమెరికా సైనికులు కాకినాడ రూరల్: కాకినాడ తీరం కదన రంగాన్ని తలపిస్తోంది. శత్రు దేశాలకు వణుకు పుట్టేలా భారత, అమెరికా దేశాల సైన్యాలు తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. క్లిష్ట సవాళ్లను ఎదుర్కొనేలా.. అంకిత భావంతో ఇరు దేశాల సైన్యం ఐక్యతను ప్రదర్శిస్తూ పరస్పర సహకారం, రక్షణ సామర్థ్యం పెంపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. భారత్, అమెరికా దేశాల సైన్యం చేపడుతున్న టైగర్ ట్రయంఫ్ – 25 సంయుక్త విన్యాసాలు ఈ నెల ఒకటిన విశాఖలో ప్రారంభమవ్వగా కాకినాడలో 12న ముగియనున్నాయి. కాకినాడ తీరంలోని నావల్ ఎన్క్లేవ్ ప్రాంతంలోనూ, సాగర తీరంలోనూ నాలుగు రోజుల పాటు విన్యాసాలు చేపడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఇండియన్ నేవీ, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (యూఎస్ఏఎఫ్) బుధవారం ప్లయింగ్ మిషన్‌ను నిర్వహించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సి – 130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్, భారత నావికాదళానికి చెందిన హాక్స్, యూఎస్ఏఎఫ్కి చెందిన సి – 130 సంయుక్త విన్యాసాలలో పాల్గొన్నాయి. అలాగే ఐఎన్ఎస్ జలాశ్వ, యుఎస్ఎస్ కామ్‌స్టాక్ యుద్ధ నౌకలతో తీరంలో విన్యాసాలు ప్రదర్శించారు. -
పెట్రో ధరలపై సీపీఎం ధర్నా
కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ సుంకాల పేరుతో గ్యాస్‌పై నేరుగా రూ.50 పెంచారన్నారు. దీనివల్ల నిత్యావసర సరకుల ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. ఒకపక్క దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టి మరిన్ని ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మోదీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చేది అచ్చేదిన్ అన్న విషయాన్ని ప్రస్తావించారని ఎవరికి అచ్చేదిన్ అని ఆనాడే సీపీఎం ప్రశ్నించిందన్నారు. సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు సంపద పెంచడమే బీజేపీ, మోదీ విధానాలని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా మనదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం విడ్డూరంగా ఉందని ఆందోళనకారులు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడాలన్నారు. గాడిమొగ గ్యాస్ ఉమ్మడి జిల్లా వాసులకు రూ.100కే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు కె.సత్తిరాజు, పలివెల వీరబాబు, మలక వెంకటరమణ, జి.భూలక్ష్మి, టి.రాణి, ఆర్.తలుపులమ్మ, పోలితల్లి, కె.సత్తిబాబు, వి.కుమార్‌స్వామి, టి.వీరబాబు, రాజు, నరేంద్ర, శివ పాల్గొన్నారు. -
ఏమీ బాగోలేదు స్వామీ..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం.. భక్తులకు అందిస్తున్న సేవలకు సంబంధించి మూడో నెల అభిప్రాయ సేకరణలో కూడా మెరుగుదల కనిపించలేదు. గత ఫిబ్రవరిలో చిట్టచివరి ఏడో ర్యాంకు, మార్చిలో రెండో ర్యాంకు సాధించినా అసంతృప్తి అలాగే ఉంది. తాజాగా ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేసిన గణాంకాల ప్రకారం భక్తుల అసంతృప్తి ఇంకా పెరిగినట్టు తెలుస్తోంది. అభిప్రాయాల సేకరణ దేవస్థానాల్లో అందే సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకుంది. వాటిని ప్రామాణికంగా తీసుకుని తాజా ర్యాంకులు ప్రకటించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల, విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి, సింహాచలం వరాహ నృశింహస్వామి, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానాలకు సంబంధించి మార్చి 20 – ఏప్రిల్ నాలుగో తేదీల మధ్య సేకరించిన అభిప్రాయాల ప్రకారం మంగళవారం ర్యాంకులు విడుదల చేసింది. దర్శనంలో రెండు సత్యదేవుని దర్శనం మీరు అనుకున్న సమయంలో జరిగిందా అనే ప్రశ్నకు 69 శాతం మంది భక్తులు అవునని సమాధానం చెప్పగా, 31 శాతం మంది కాలేదన్నారు. సింహాచలం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు కూడా ఇదే విధంగా రెండో ర్యాంకు వచ్చింది. మౌలిక వసతుల్లో ఆరు దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు, తదితర విషయాలపై 60 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. 40 శాతం మందికి మాత్రం నచ్చలేదు. ఈ విభాగంలో అన్నవరానికి ఆరో ర్యాంకు వచ్చింది. ప్రసాదానికి రెండు సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యత విషయాలలో 80 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా 20 మంది అసంతృప్తి చెందారు. దీనిలో రెండో ర్యాంకు వచ్చింది. పెరిగిన అసంతృప్తి గతంలో జరిగిన అభిప్రాయ సేకరణలో స్వామివారి దర్శనంపై 70 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి అది 69 శాతానికి పడిపోయింది. మౌలిక వసతుల విషయంలో గతంలో 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి 60 శాతం మంది మాత్ర మే బాగున్నాయన్నారు. ప్రసాదం రుచి, నాణ్యతపై గతంలో 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి 80 శాతానికి పరిమితమైంది. అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానం రత్నగిరి సేవలపై భక్తుల అసంతృప్తి అభిప్రాయ సేకరణలో వెల్లడి వరుసగా మూడో నెలా అదే ఫలితం కనిపించని మెరుగుదల -
వైభవంగా పొన్నవాహన మహోత్సవం
కొత్తపేట: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం పొన్న వాహన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఈ కార్యక్రమం జరిపారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున స్వామి వారి మేలుకొలుపు, గౌతమి నది నుంచి తీర్థపు బిందెను తీసుకువచ్చి విశేషార్చన, నిత్య హోమాలు నిర్వహించారు. రాత్రి ఉభయ దేవేరులతో స్వామివారు పొన్నవాహనంపై గ్రామంలో విహరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం సజ్జాపురానికి చెందిన నందగోపాల మహిళల కోలాట భజన మండలి కోలాటం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. -
270 కేజీల గంజాయి స్వాధీనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ రహదారిపై దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్ట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడి చేశారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన సందీప్‌శర్మ, అదే రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ మోనుసైని ఏజెన్సీ ప్రాంతం నుంచి 270 కేజీల గంజాయిని కంటైనర్‌లో లోడ్ చేసుకుని బయలుదేరారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆ లారీ వచ్చే ప్రాంతంలో కాపు కాశారు. ఎన్ఎల్ 01 ఏజే 6162 కంటైనెర్ను ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో లారీ డ్రైవర్ మోనుసైని పోలీసులకు చిక్కగా, మరో నిందితుడు సందీప్ శర్మ పారిపోయాడు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. లారీడ్రైవర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, అతడిపై తదుపరి చర్యల కోసం సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు పంపారు. గంజాయిని తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన కంటైనర్‌ను సీజ్ చేశారు. కాగా.. గంజాయిని పట్టుకున్న బొమ్మూరు సీఐ పి.కాశీ విశ్వనాథంతో పాటుఈగల్ టీం, పోలీసు సిబ్బందిని ఎస్పీ నరసింహ కిశోర్, ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య అభినందించారు. కంటైనర్‌లో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు గంజాయి విలువ రూ.13.50 లక్షలు -
సీటీఎస్ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏఐటీటీ–25 అండర్ సీటీఎస్ పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జీవీకే వర్మ బుధవారం తెలిపారు. 12వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 97012 15511 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోండి..కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో అర్హతగల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్షకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారిణి ఎం లల్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కులధ్రువీకరణ పత్రం, టెట్ పరీక్షలో అర్హత సాధించి రుజువు వంటివి జతపరచాలన్నారు. దరఖాస్తును వెనుకబడిన తరగతుల సంక్షేమం అండ్ సాధికారత అధికారి కార్యాలయం, 2వ అంతస్తు, ప్రగతి భవన్, డీఆర్డీఏ కాంప్లెక్స్, కాకినాడ చిరునామాలో సమర్పించాలని ఆయన సూచించారు. సత్యదేవునికి ఘనంగా జన్మ నక్షత్ర పూజలు అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరిచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ల రసాలు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్చకులు దత్తాత్రేయ శర్మ, సుధీర్, పవన్ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి యాగశాల లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. నేడు నిజరూప దర్శనం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు గురువారం ఏ విధమైన ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్‌లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చిన్నారులకు ఆధార్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకినాడ సిటీ: జిల్లాలో 0–6 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులకు వెంటనే ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలని, ఆధార్ నంబర్ లేని చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టిక ఆహార సేవలు నిలిపివేస్తామని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సీ్త్ర, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి, సీడీపీవోలు, పోస్టల్, సీఎస్సీ, ఆధార్, జీఎస్డీబ్ల్యూఎస్ అధికారులతో ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ నమోదు క్యాంపుల నిర్వహణ ఇతర అంశాలపై కలెక్టర్ షణ్మోహన్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారం పొందుతున్న 0–6 చిన్నారులకు తప్పనిసరిగా ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఆధార్ చిన్నారులకు మే నెల నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం నిలిపి వేయాలని కలెక్టర్ చెప్పారు. ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి, సీడీపీవోలు, పోస్టల్ ఆధార్ మేనేజర్ రాజ్‌కుమార్, సీఎస్ఈ ఆధార్ మేనేజర్ ఆదిత్య, జీఎస్డీబ్ల్యూఎస్ ఆధార్ కోఆర్డినేట్ శంకర్ పాల్గొన్నారు. -
మేనేజ్మెంట్ ఫెస్ట్‌తో ఉపయోగం
కాకినాడ రూరల్: విద్యార్థి దశలో మేనేజ్మెంట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు వాళ్లలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి, సమాజంలో ఎదుర్కోబోయే వివిధ సవాళ్లను నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్, కామర్స్, మేనేజ్మెంట్ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో తలాష్–2కె25 పేరుతో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ప్రశాంతిశ్రీ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌గా విభాగాధిపతి డాక్టర్ డి.అజయ్ రతన్ నేతృత్వం వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబాల్సేల్ గుప్త మాట్లాడుతూ ఇలాంటి అనుభవాలు ఉద్యోగ అవకాశాల్లో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ తలాష్ అనే ఒక మంచి టైటిల్‌ను దీనికి అందించిన విభాగాన్ని అభినందించారు. మరో విశిష్ట అతిథి ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) కె. సునీల్‌కుమార్ బహుమతులు విద్యార్థులకు అందించారు. వివిధ క్యాంపస్‌లు, కాలేజీల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విభాగాధిపతి డాక్టర్ డి.అజయ్ రతన్ మాట్లాడుతూ, ‘విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బిజినెస్ దృక్పథం, సమస్య పరిష్కరణ నైపుణ్యాలు, బృందపనుల అవగాహన కలిగించేలా ఈ ఫెస్ట్‌ని రూపొందించామన్నారు. డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధు కుమార్, మణికంఠేశ్వర్‌రెడ్డి, మనోజ్ దేవ, డాక్టర్ అప్పారావు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమా రజిత పాల్గొన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ప్రసన్నశ్రీ -
ఎన్.సూరవరం కార్యదర్శి సస్పెన్షన్
తుని రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, వసూలు చేసిన ఆస్తి పన్నులను సబ్ ట్రెజరీలో జమ చేయకపోవడంపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తుని మండలం ఎన్.సూరవరం పంచాయతీ గ్రేడ్–3 కార్యదర్శి కె.వెంకటలక్ష్మి సస్పెండ్ అయ్యారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు బుధవారం ఈఓపీఆర్డీ జి.మరిడియ్య తెలిపారు. టి.తిమ్మాపురం, తేటగుంట గ్రామాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ, ఇటీవల ఎన్.సూరవరానికి వెంకటలక్ష్మి బదిలీపై వచ్చారు. ఆ రెండు గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసేందుకు డిమాండ్ నోటీసులు ఇవ్వకపోవడం, వసూలు చేసిన మొత్తంలో కొంత సొమ్ము సబ్ ట్రెజరీకి జమ చేయలేనట్టు ఆమైపె ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో తుని ఎంపీడీఓ, పెద్దాపురం డీఎల్పీఓలు వేర్వేరుగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దాన్ని సమగ్రంగా పరిశీలించిన ఉన్నత అధికారులు కార్యదర్శి వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. హాకీ టోర్నీ విజేత ‘కాకినాడ’ ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీ విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైఎస్సార్ జట్టుపై 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి ధవళేశ్వరం: వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో మోటారు సైక్లిస్టు మృతి చెందాడు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం యర్రంపాలేనికి చెందిన నేటి శ్రీను (50) ఈ నెల 4వ తేదీన తణుకు మండలం వేల్పూరులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి బుధవారం స్వగ్రామానికి మోటారు సైకిల్‌పై ప్రయాణమయ్యాడు. ఉదయం 10 గంటల సమయంలో ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలైన శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు సీఐ టి.గణేష్ ఆధ్వర్యంలో ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంపద సృష్టి.. రాబడి నష్టి!
లక్ష్యానికి దూరంగా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని చూస్తే ఏ ఒక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 60 శాతం లక్ష్యాన్ని కూడా అధిగమించ లేక చతికిలపడ్డాయి. భూముల విలువను అడ్డంగా పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌శాఖకు నిర్ధేశించిన లక్ష్యంగా రూ.615.32 కోట్లు. వచ్చిన ఆదాయం చూస్తే రూ.335.97 కోట్లు మాత్రమే నమోదైంది. 54.44 శాతం ఆదాయాన్ని మాత్రమే జిల్లాలో సంబంఽధిత శాఖ రాబట్టగలిగింది. అదే 2023–24 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం రూ. 544.27 కోట్లు. వచ్చిన ఆదాయం రూ.329.97 కోట్లు నమోదైంది. అప్పట్లో ఆదాయ వృద్ధి 60.63 శాతంగా నమోదైంది. ప్రభుత్వం భూమి విలువలు పెంచినప్పటికీ జిల్లాలో ఉన్న తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆదాయ పరంగా బాగా వెనుకబడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా పెద్దాపురం నిలిచింది. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ.39.87 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.18.44 కోట్లతో కేవలం 46.26 శాతానికే పరిమితమవ్వడంతో ఆశ్చర్యపోవడం ఆ కార్యాలయ ఉద్యోగుల వంతైంది. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కేవలం 5,076 లావాదేవీలు మాత్రమే జరగడం గమనార్హం. కొద్దిగా అటు ఇటుగా మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం సంపద సృష్టి అంటూ ప్రజలపై భారం మోపడం తప్ప రిజిస్ట్రేషన్లలో ఏమాత్రం వృద్ధి సాధించలేదని సంబంధితశాఖ ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు విజన్ రిజిస్ట్రేషన్ శాఖకు శాపమై కూర్చుంది. ఆర్థికంగా బలోపేతం చేస్తానంటూ భూముల విలువ అడ్డంగా పెంచేసి ప్రజల నెత్తిన భారం మోపారు. పోనీ భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. రిజిస్ట్రేషన్లు పెరగడం మాట దేవుడెరుగు ఆదాయం అడ్డంగా పడిపోయింది. అనుకున్నదొక్కటి అయిన దొక్కటి మొత్తానికి మొదటికే మోసం వచ్చిందంటూ రిజిస్ట్రేషన్ శాఖ తల పట్టుకుంటోంది. భూముల విలువ పెంపుతో కాకినాడ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించలేక చతికిలపడ్డాయి. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అయితే కనీసం 50 శాతం లక్ష్యాలను కూడా చేరుకోలేక వెనకపడ్డాయి. చంద్రబాబు సంపద సృష్టి అనే నినాదం మాటేమోకానీ తమకు గుదిబండగా మారిందని భూముల క్రయవిక్రయదారులకు గగ్గోలు పెడుతున్నారు. నిర్ధేశించిన ఆర్థిక లక్ష్యాలు సాధించలేక యంత్రాంగం చేతులెత్తేయక తప్పింది కాదు. భూముల విలువ పెంపుతో భారమే తప్ప ఏ ఒక్కరికీ ఎటువంటి ప్రయోజనం కలగలేదని రిజిస్ట్రేషన్‌శాఖ ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. గత ప్రభుత్వంలో భూముల ధరలు స్వల్పంగా పెంచింది. కూటమి గద్దె నెక్కాక భూమి విలువలను భారీగా పెంచడంతో గత ఆర్థిక సంవత్సరం కంటే తక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ప్రజలు భూములు కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రభుత్వానికి చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల వడ్డన భారీగా ఉండటంతో తక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న పరిస్థితి కనిపించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 589 తక్కువ దస్తావేజులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 91,946 రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో 91,357 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అనుకున్నదొక్కటి అయినదొక్కటి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. తొమ్మిది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్థేశించిన లక్ష్యాన్ని సాధించలేదు. మెజార్టీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులు 50శాతం ఆదాయాన్ని కూడా చూడలేక పోయామంటున్నారు. జిల్లాలో భూ విలువల సవరణలతో చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. ధరలు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చునని సంబంధిత శాఖ అంచనా వేసుకుంది. లక్ష్యాలను అధిగమిస్తాయనుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెనుకబడటంతో శాఖ ఉన్నతాధికారులు లబోదిబోమంటున్నారు. ఆర్థిక సంవత్సరం మార్చి నెల ముగిసే సరికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా లెక్కలు తీసి చూస్తే చంద్రబాబు సంపద సృష్టి మాటేమో కానీ అనుకున్నదొకటి అయినదొక్కటి అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే భూముల విలువ భారీగా పెంచినా ఆ స్థాయిలో ఆదాయం నమోదు కాలేదంటున్నారు. క్రయ, విక్రయాలు తగ్గుముఖం పట్టడం చూసి స్థిరాస్థి రంగంలో విశేషమైన అనుభవం కలిగిన వారు మదనపడుతున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతలా భారీగా భూ విలువలు పెంచకున్నా పిఠాపురం, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్ధేశించిన లక్ష్యాలను 70శాతం అఽధిగమించడం గమనార్హం. బోల్తా కొట్టిన ‘బాబు’ విజన్ ప్రజలకు భారం...ఆదాయం ఘోరం నీరుగారిన సర్కార్ లక్ష్యాలు పడకేసిన రిజిస్ట్రేషన్లు స్పష్టం చేసిన మార్చి నివేదికలు 2023–14లో రిజిస్ట్రేషన్లు 91,946 2024–25లో రిజిస్ట్రేషన్లు 91,357 60 శాతం లక్ష్యాన్ని అధిగమించలేకపోయాయి నిర్ధేశించిన లక్ష్యం రూ.615.32 కోట్లు సాధించిన ఆదాయం రూ.335.97 కోట్లు 2024–2025 ఆర్థిక సంవత్సరంలో.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం ఆదాయం శాతం మొత్తం కోట్లలో.. కోట్లలో.. డాక్యుమెంట్లు కాకినాడ (జిల్లా రిజిస్ట్రార్) రూ.196.96 రూ.105.19 53.14 17,778 సర్పవరం రూ.88.89 రూ. 49.71 55.92 5,263 పిఠాపురం రూ. 57.65 రూ. 32.74 56.80 11,060 తుని రూ.61.50 రూ.35.36 57.50 15.199 సామర్లకోట రూ.62.29 రూ.33.42 53.66 10,439 పెద్దాపురం రూ.39.87 రూ.18.44 46.26 5,076 ప్రత్తిపాడు రూ.45.51 రూ.23.43 51.48 10,447 జగ్గంపేట రూ.25.80 రూ.14.98 58.07 5,987 తాళ్లరేవు రూ.36.82 రూ.21.69 58.90 10,108 2023–2024 ఆర్థిక సంవత్సరంలో.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం ఆదాయం శాతం మొత్తం కోట్లలో కోట్లలో డాక్యుమెంట్లు కాకినాడ (జిల్లా రిజిస్ట్రార్) రూ.185.95 రూ.96.60 51.951 8,502 సర్పవరం రూ.69.68 రూ. 48.67 69.86 5,735 పిఠాపురం రూ. 46.38 రూ. 32.86 70.87 12,155 తుని రూ.56.08 రూ.34.73 61.94 13,946 సామర్లకోట రూ.48.37 రూ.35.66 73.73 10,622 పెద్దాపురం రూ.36.64 రూ.21.84 59.60 6,001 ప్రత్తిపాడు రూ.42.00 రూ.25.48 60.68 11,713 జగ్గంపేట రూ.23.79 రూ.13.15 55.29 7,446 తాళ్లరేవు రూ.35.35 రూ.20.93 59.21 7,446 -
పంజాబ్‌లో వాడపల్లి యువకుడి మృతి
● మృతుడు వైఎస్సార్ సీపీ నేత సముద్రం కుమారుడు ● స్వగ్రామంలో అంత్యక్రియలు కొవ్వూరు: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న వాడపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఉప సర్పంచ్ లంకదాసు సముద్రం పెద్ద కుమారుడు నాగ వెంకట యశ్వంత్ (23) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమృత్‌సర్‌లో ఓ పరీక్ష రాసేందుకు ఈ నెల 6వ తేదీన తన స్నేహితుడి కలిసి మోటారుసైకిల్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కుపర్తల సమీపంలో హైవేపై డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యశ్వంత్‌తో పాటు అతడి స్నేహితుడు, విజయనగరానికి చెందిన గానా సిద్విక్ వర్మ (23) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అమృత్సర్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్ స్వగ్రామమైన వాడపల్లి తీసుకొచ్చారు. వాడపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న యశ్వంత్ ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యారు. మద్రాసులో ఉద్యోగం కుడా వచ్చింది. ఈ వారంలోనే ఉద్యోగంలో చేరనున్న సమయంలో మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారు. ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు), మాజీ ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. -
అట్టనాణేలతో లెక్కల పాఠాలు
అమలాపురం టౌన్: బ్రిటీషు కాలంలో దాదాపు 110 ఏళ్లనాటి ఎనిమిది రకాల అట్ట నాణేలను అమ లాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. కాలగర్భంలో కలిసి మరుగున పడిపోయిన ఈ నాణేలు అప్పట్లో అర్ధ రూపాయి, పావలా, బేడా (రెండు అణాలు), అణా, అర్ధణా, కాణి, దమ్మిడి అనే ఎనిమిది రకలుగా చెలామణిలో ఉండేవి. అప్పట్లో ఈ నాణేలను పిల్లలకు లెక్కలు నేర్పడానికి ఉపయోగించేవారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. అసలైన నాణేలు పిల్లలకు ఇస్తే అవిపోతే అనివార్యమయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టకుని వీటిని అట్టతో త యారు చేయించారు. వెండి రంగు, రాగి రంగుతో ఉండే ఈ అట్టనాణేలకు, అసలైన నాణేలకు వ్యత్యాసాన్ని ఎంతో పరీక్షించి చూస్తే తప్ప తెలియదు. ఈ నాణేలను బ్రిటీషు వారు జర్మనీ దేశానికి చెందిన లాంగ్ మన్స్ అనే కంపెనీ ద్వారా తయారు చేయించి మన దేశానికి రప్పించి ఇక్కడ విద్యార్థులకు లెక్కలు నేర్పేవారు. అయితే ఈ పద్ధతి ఎక్కువ కాలం నడవకపోవడంతో ఈ అట్టనాణేలు క్రమేణా అదృశ్యమయ్యాయి. అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన నడింపల్లి రామరాజు 50 ఏళ్ల కిందట అనేక పాఠశాలలను సందర్శించి తిరిగి అట్టనాణేలను సేకరించారు. ఆయన నుంచి తాను సేకరించినట్లు కృష్ణ కామేశ్వర్ తెలిపారు. 110 ఏళ్ల క్రితం చలామణి సేకరించిన కృష్ణ కామేశ్వర్ -
ప్రతి రైతు పారిశ్రామికవేత్తగా ఎదగాలి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి రైతూ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, వ్యవసాయాన్ని పరిశ్రమగా చేపట్టాలని జాతీయ వాణిజ్య పరిశోధన, వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమహేంద్రవరం ఐసీఏఆర్ – నిర్కా (సీటీఆర్ఐ)లో మంగళవారం వ్యవసాయంలో ఆవిష్కరణలు – వ్యవసాయం పారిశ్రామికరణ దిశగా ఆవిష్కర్తల కలయిక కార్యక్రమం జరిగింది. అధ్యక్షత వహించిన శేషుమాధవ్ మాట్లాడుతూ వ్యవసాయంలో వాణిజ్యపరమైన వినూత్న ఆవిష్కరణలు, అవకాశాలతో పాటు వాణిజ్య పంటల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే దిశగా రైతులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు కృషి చేయాలన్నారు. న్యూఢిల్లీ ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఐపీటీఎం) డాక్టర్ నీరు భూషణ్ ముఖ్యఅతిథిగా ఆన్లైన్లో హాజరు కాగా, వారి తరఫున న్యూఢిల్లీ ఐసీఏఆర్ – ఐటీఎంయూ డాక్టర్ వి.విక్రమ్‌సింగ్ ఆన్లైన్లో సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీఎంయూ నోడల్ ఆఫీసర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.రవిశంకర్ మాట్లాడుతూ ఆవిష్కర్తల కలయిక ఆవశ్యకతలను వివరించారు. వాణజ్య వ్యవసాయంపై ఆవిష్కరణలు, విలువ ఆధారిత పదార్థాల తయారీపై రైతుల విజయగాథలు, కోత అనంతరం వాణిజ్య పంటలలో వివిధ ఉత్పత్తులలో సంకలనం చేయబడిన సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, హైదరాబాద్ ఐసీఏఆర్–నారమ్ మేనేజ్మెంట్ డివిజన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ హెడ్ ఎస్.సెంథిల్ వినాయగం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నటరాజ్, నాబార్డు ఏజీఎం సోము నాయుడు, ఎపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడారు. అనంతరం 11 మంది ఔత్సాహిక యువత తమ అనుభవాలను వివరించారు. 11 ఎగ్జిబిషన్ స్టాళ్లలో పసుపు, అశ్వగంధం, ఆముదం, మిరప ఉత్పత్తులతో పాటు ఎన్జీవో, ఎఫ్‌పీవోలు, ఏపీసీఎన్ఎఫ్ (ప్రకృతి వ్యవసాయం) వారి వివిధ ఉత్పత్తులు, రోబోటిక్స్, డ్రోన్స్, జ్యూట్‌బ్యాగులను ప్రదర్శించారు. అనంతరం 17 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను సత్కరించారు. నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ ఉత్సాహంగా ‘ఆవిష్కర్తల కలయిక’ -
ఎట్టకేలకు పారిశుధ్య నిర్వహణ టెండర్ విడుదల
అన్నవరం దేవస్థానం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంతో సహా రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలలో శానిటరీ మెటీరియల్‌తో సహా క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజడ్ టెండర్ ప్రకటన మంగళవారం విడుదలైంది. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ ప్రొక్యూర్ టెండర్ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు ఆరు నెలలు ఆలస్యం చేశారు. గత అక్టోబర్‌లో విడుదల కావల్సిన టెండర్ ఆరునెలలు ఆలస్యం వచ్చింది. టెండర్లు దాఖలుకు అభ్యర్థన తేదీ ఈ నెల 16, ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న, టెండర్ దాఖలుకు చివరి తేదీ మే ఒకటి, మే ఐదున టెండర్ టెక్నికల్ బిడ్ తెరుస్తారు. మే 12న ఖరారు చేస్తారు. జూన్ ఒకటి నుంచి కొత్త కాంట్రాక్ట్ ప్రారంభమవుతుంది. కాగా.. చెత్త ట్రాక్టర్ కాంట్రాక్టును టెండర్ పిలవకుండా నెలకు రూ.60 వేలకు అప్పగించడంతో సాక్షిలో వార్త వచ్చిన విషయం తెలిసిందే. దీంతో టెండర్లు పిలిచి, అతి తక్కువకు దాఖలైన రూ.23,990కు ఖరారు చేశారు. దీంతో దేవస్థానానికి నెలకు రూ.30,010 ఆదా అయ్యింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అనుమానాస్పద స్థితిలో ఉద్యోగిని మృతి
నిడదవోలు: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లి కరుణ (28) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకై క కుమార్తె కరుణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం సాధించింది. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరగడం, కాళ్లూ చేతులు వంకర్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న కరుణను బంధువులు పద్మ, సుబ్బు కలిసి కారులో నిడదవోలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న కరుణను రాత్రి 9 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరుణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గదిలో ఉంచారు. బంధువులు, తల్లిదండ్రులు మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుణకు పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూశారు. అయితే వివాహం విషయంలో కుటుంబంలో కలహాలు జరుగుతున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కరుణ మరణ సమాచారం తెలుసుకున్న పట్టణంలోని వివిధ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆసుపత్రికి తరలివచ్చారు. మృతురాలి కరుణ తల్లి సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వీరబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కరుణ మృతదేహన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ సంతాపం తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం రాజానగరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జాతీయ రహదారిపై జీఎస్ఎస్ వైద్య కళాశాల సమీపంలో సోమవారం రూ.10 లక్షల విలువైన బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా మంగళవారం కూడా పైప్రాంతానికి కొద్దిదూరంలో పిరమిడ్‌ను చేర్చి ఉన్న పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై రూ.ఒక లక్ష విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ తహసీల్దార్ (పౌరసరఫరాలు) గొలుగూరి బాపిరాజు తెలిపారు. చక్రద్వారబంధానికి చెందిన మాడబోయిన గోపి నుంచి వడిశలేరుకు చెందిన వట్టికూటి మణికంఠ మినీ వ్యాన్‌ను అద్దెకు తీసుకుని, అనపర్తి నుంచి గండేపల్లికి ఈ బియ్యాన్ని రవాణా చేస్తున్నాడన్నారు. నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. -
పిడుగు పడి రైతు మృతి
నల్లజర్ల: పిడుగు పడి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపల్లి శివారు కృష్ణమ్మగూడెంలో వెలగాని సత్యనారాయణ (47) తన ఇంటి సమీపంలోని మామిడి చెట్టు వద్ద ఉన్న సిమెంట్ బెంచీపై కూర్చున్నాడు. ఈదురుగాలులతో వర్షం పడుతున్న ఆ సమయంలో పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు నబీపేట నుంచి వచ్చి ఇక్కడి ఎంపీపీ స్కూలు వద్ద ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు. వివాహిత మౌన దీక్ష కిర్లంపూడి: తన కుమారుడికి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజుపాలెంలోని తన అత్తారింటి వద్ద నాగ వెంకటలక్ష్మి అనే వివాహిత తన కుమారుడు, కుటుంబ సభ్యులతో మంగళవారం మౌన దీక్షకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామానికి చెందిన నాగ వెంకటలక్ష్మికి కొత్తపల్లి మండలం గోర్సకు చెందిన వీరబాబుతో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్నేళ్ల తరువాత రాజుపాలెంలో వారు స్థిరపడ్డారు. అయితే వీరబాబు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కానీ ఈ విషయం చెప్పకుండానే వివాహం చేశారు. వారికి మగబిడ్డ పుట్టిన తర్వాత ఆమెను అత్తింటివారు దూరం పెట్టారు. కుమారుడికి రావాల్సిన ఆస్తిని వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఇదేంటి అని అడిగితే ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయటకు వెళ్లగొడుతున్నారు. దీంతో నాగ వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి దీక్ష చేపట్టింది. -
13న గురుకులాల్లో ప్రవేశ పరీక్ష
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలలో 2025–26 విద్యా సంత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13వ తేదీన నిర్వహించనున్నట్లు పిఠాపురం అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ త్రివేణి తెలిపారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీబీఆర్‌ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్,ఇన్ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు)తో పరీక్షకు హాజరు కావాలని ఆమె కోరారు. నేడు రాష్ట్ర స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ్య ఎంఎస్ఎన్ పీజీ సెంటరులో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో తలాష్ – 2కె 25 పేరిట రాష్ట్రస్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్‌ను బుధవారం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రశాంతి శ్రీ తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నన్నయ్య యూనివర్శిటీ వీసీ ప్రసన్న శ్రీ,, ఓఎన్జీసీ ఈడీ రత్నేష్‌కుమార్ హాజరవుతారన్నారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు అన్నవరం: సత్యదేవునికి చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు మంగళవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు తులసి దళార్చన నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 20 లక్షల ఆదాయం సమకూరింది. ఘనంగా సీతారాముల వేద సదస్యం కాగా, రత్నగిరి రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సీతారాముల వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని మరో ఆసనంపై ఉంచి పూజలు చేశారు. సీతారాములకు నూతన పట్టు వస్త్రాలను ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు అందజేశారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, గంగబాబు, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి కార్యక్రమం నిర్వహించారు. సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై దాడులు కాకినాడ క్రైం: కాకినాడలో కూటమి నేతల అండదండలతో విచ్చలవిడిగా లక్షల్లో జరుగుతున్న నంబర్‌గేమ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని దినసరి కూలీలు, నిరుపేదల జీవితాలతో చెలగాటమాటమాడుతున్న సింగిల్ నంబర్ లాటరీల భాగోతాన్ని గత నెల 20న ‘కూటమి వారి లాటరీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ బిందుమాధవరావు తీవ్రంగా స్పందించి ఆకస్మికంగా దాడులు చేయించారు. కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లై ఓవర్, సంజయ్‌నగర్ లారీ ఆఫీసు, ఎమ్ఎస్ఎన్ చారిటీస్ నూకాలమ్మ గుడి వద్ద పార్కు తదితర ప్రాంతాల్లో నిత్యం సింగిల్ నంబర్ లాటరీతో పేదల పొట్టగొడుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ టూటౌన్, త్రీటౌన్ పరిధిలో పలు సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలను పోలీసులు గుర్తించారు. నంబర్ గేమ్ ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదును, మొబైల్ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. నంబర్ గేమ్‌కు మూలాలు, పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వేద సదస్యం నిర్వహిస్తున్న పండితులు -
దోపిడీకే ప్రాధాన్యం
పిఠాపురం: ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారారు. తాము చెప్పిందే ధర అన్నట్టుగా రైతులను దోచుకుంటున్నారు. వేరే దారి లేక వారు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రబీ సీజన్లో ప్రైవేటు ధాన్యం వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నా అడిగే నాథుడు కనిపించడం లేదు. ప్రస్తుతం గోదావరి డెల్టా, ఏలేరు పరిధిలో రబీ వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జోరుగా సాగుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులదే హవాగా మారింది. దీంతో ఒకపక్క దిగుబడులు ఆశించిన స్థాయిలో లేక, మరోపక్క మద్దతు ధర రాక రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. ఒక్క గింజ సేకరిస్తే ఒట్టు రబీ వరి కోతలు ప్రారంభించి రెండు వారాలైనా ఇంకా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో కోసిన ధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. తాము తప్ప ఎవరూ కొనేవారు లేరన్న సాకుతో ప్రైవేటు వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు అమాంతం తగ్గించేశారు. రబీ కోతల ప్రారంభంలో 75 కేజీల సన్న రకాల ధాన్యం బస్తా రూ.1,450 చెప్పిన వ్యాపారులు కోతలు ముమ్మరం అయ్యాక ఒక్కసారిగా ధరను బస్తాకు రూ.250 చొప్పున తగ్గించేశారు. ప్రస్తుతం 75 కేజీల బస్తాను రూ. 1,200కు మాత్రమే కొంటున్నారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అమ్ముకుంటున్నారు. దీంతో ఎకరానికి రూ.10 వేల వరకు రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో 30 శాతానికి పైగా కోతలు పూర్తి కాగా సుమారు 1.20 లక్షల టన్నుల ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, సన్నరకం ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,740కి (ఏ గ్రేడ్ రకం) కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాని ఎక్కడా ఒక్క గింజ కూడా కొన్న ఆనవాళ్లు లేవు. జిల్లాలో రబీ సాగు వివరాలు రబీ సాగు చేసిన భూములు 1,58,120 ఎకరాలు సాగు చేసిన రైతులు – 1.45 లక్షల మంది ఏటా ధాన్యం దిగుబడి – 5.70 లక్షల టన్నులు గత రెండు వారాలుగా అమ్మిన ధాన్యం – సుమారు 1.20 లక్షల టన్నులు రోజూ – 1,500 నుంచి 2,000 టన్నుల ధాన్యం అమ్మకాలు సిండికేటుతో పతనమైన ధాన్యం ధర ప్రారంభంలో బస్తా రూ.1,450, ప్రస్తుతం రూ.1,200 కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించిన రైతులు ధర పతనంతో ఎకరానికి రూ.10 వేల వరకు నష్టం వేరే దారి లేక నష్టం వచ్చినా అమ్ముకుంటున్న రైతులు అమ్మక తప్పడం లేదు రోజురోజుకు ధాన్యం ధరలు తగ్గించేస్తున్నారు. ఎందుకని అడిగే వారు లేరు. ఎవరికి వారే ఏదో విధంగా ధాన్యం అమ్ముడైతే చాలు అన్నట్టుగా అమ్మేస్తున్నాం. కోత కోయక ముందు రూ.1,450 అన్నారు. తీరా కోత కోసాక రూ.1,00 అంటున్నారు. అయినప్పటికి అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో పాటు రైతులకు వేరే దారిలేక వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10వేల నష్టం తప్పడం లేదు. ప్రస్తుతం అంతా యంత్రాలతో కోతలు కోస్తుండడం వల్ల అంతా పచ్చి ధాన్యమే ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులు పచ్చి ధాన్యం ఎలా ఉన్నది అలా కొంటున్నారు. అందుకే వారు అడిగిన ధరకు అమ్మాల్సి వస్తోంది. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అయితే ధాన్యం ఎండబెట్టి పూర్తిగా ఆరిన తరువాత ఎగరబోసి ఏవిధమైన తుక్కు లేకుండా చేసి అమ్మితేనే కొంటారు. అందుకే ధర లేక పోయినా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నాం. – కరణం శ్రీను, రైతు, పిఠాపురం ఆ నిబంధనలు మా పాలిట శాపాలు ప్రభుత్వం ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ముందు మేము రైతు సేవా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇవ్వాలి. కూపన్ తీసుకోవాలి. తరువాత సిబ్బంది వారికి వీలు కుదిరినప్పుడు వచ్చి శాంపిల్స్ తీసుకెళతారు. తేమ ఎక్కువగా ఉంది బాగా ఆరబెట్టి తీసుకురండి అంటారు. ఇంతలో ఏ వర్షం అయినా వచ్చిందంటే ఉన్న ధాన్యం కాస్తా తడిసిపోతాయి. దీంతో అంతా నష్టమే మిగులుతుంది. ముఖ్యంగా పచ్చి ధాన్యం ప్రభుత్వం కొనదు. దీనివల్ల ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో వ్యాపారులు వారి ఇష్టానుసారం ధర నిర్ణయించి కొంటున్నారు. మాకు నష్టాలు తప్పడం లేదు. ఆరబెట్టి అమ్ముదామని కళ్లాల్లో ఉంచిన ధాన్యం రెండు రోజుల క్రితం వచ్చిన వానకు తడిసి పోయాయి. దీంతో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పచ్చి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తే తప్ప ప్రైవేటు వ్యాపారుల హవా తగ్గదు. – గంధం కృష్ణ, రైతు, కొత్తపల్లి -
అన్నవరం దేవస్థానం ఆదాయం తగ్గడానికి కారణమేంటి?
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కన్నా రూ.ఆరు కోట్లు అధికంగా ఖర్చు అయిన వైనంపై సంబంధిత అధికారులపై రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘లక్ష్మీ..రావేం మా కొండకి ?’ వార్తా కథనంపై దేవదాయశాఖా మంత్రి స్పందించారు. గతేడాది అన్నవరం దేవస్థానం ఆదాయం రూ.135 కోట్లు కాగా, వ్యయం రూ.141 కోట్లుగా నమోదైంది. 2023–24 సంవత్సరంలో మిగిలిన రూ.7.5 కోట్లు నిధుల నుంచి రూ. ఆరు కోట్లు మళ్లించి చెల్లింపులు చేశారు. ఒకప్పుడు ఆర్థికంగా రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉన్న అన్నవరం దేవస్థానానికి ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణాలేమిటనే దానిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. తన ఆదేశాలతో బాటు ఆయన ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను కూడా జత చేసి పంపించారు. దీంతో బాటు గత మూడేళ్లు ఆదాయ వ్యయాల వివరాలను కూడా పంపించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలను అన్నవరం దేవన్థానం అధికారులకు పంపించిన కమిషనర్ మంగళవారం సాయంత్రంలోగా నివేదిక పంపించాలని ఆదేశించారు. దాంతో దేవస్థానం అధికారులు నివేదిక తయారు చేశారు. 2022–23, 23–24 సంవత్సరాలలో దేవస్థానం వ్యయం కన్నా ఆదాయమే అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రదక్షిణ దర్శనం కొనసాగించి ఉంటే రూ.పది కోట్లు పైగా ఆదాయం 2023 అక్టోబర్‌లో దేవస్థానంలో రూ.300 టిక్కెట్‌తో సత్యదేవుని ప్రదక్షిణ దర్శనాన్ని అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ ప్రారంభించారు. ఈ ప్రదక్షిణ దర్శనం కోసం దాత సహకారంతో ఆలయంలో నాలుగు మూలలా బంగారు గంధం గిన్నె, బంగారు హుండీ, బంగారు కామధేనువు, బంగారు కల్పవృక్షం ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని దర్శిస్తూ స్వామి, అమ్మవారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. రూ.300 టిక్కెట్ అయినా ఆ దర్శనానికే భక్తులు మొగ్గు చూపేవారు. దీంతో ఆ ఒక్క నెలలోనే రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ తరువాత ఆ దర్శనం నిలిపివేసి రూ.200 టిక్కెట్ మీద అంతరాలయం దర్శనం మాత్రమే చేసుకునే వీలు కల్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.200 టిక్కెట్‌తో అంతరాలయం దర్శనం ద్వారా రూ.5.49 కోట్ల ఆదాయం వచ్చింది. అదే రూ.300 టిక్కెట్ తో ప్రదక్షిణ దర్శనం ఏర్పాటు చేసి ఉంటే రూ.ఎనిమిది కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ‘సాక్షి’ కథనంపై స్పందించిన దేవదాయశాఖ మంత్రి ఆనం వెంటనే నివేదిక పంపించాలని కమిషనర్‌కు ఆదేశాలు -
బొమ్మను తుడిచేశారు.. గుండెల్లో గుడిని ఏం చేస్తారు?
పిఠాపురం: కొన్నేళ్లుగా జరగనంత అభివృద్ధి ప్రజల ముంగిటకే పాలన, అధికారులంతా గ్రామాల్లోనే ప్రజల ముందే పని చేయడం ఇలా ఒకటేమిటి అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు తెచ్చిన ఏకై క నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇదే మాట ప్రతీ నోటా వినబడుతోంది. దీన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు జగన్‌ను తలుచుకుని పథకాలు ఇవ్వలేని తమను ఎక్కడ తరిమి కొడతారో అనే భయమో ఏమో ఆయన బొమ్మ లేకుండా చేద్దామనుకుని శిలాఫలకాలపై మాజీ సీఎం పేరుతో ఉన్న బొమ్మలను చెరిపేస్తున్నారు. కానీ ఆయన కట్టించిన భవనాన్ని, పాలనను మాత్రం కావాలంటున్నారు. అదే కార్యాలయంలో ఆయన నియమించిన సిబ్బందితో పనులు చేయించుకుంటూ అది కట్టించిన వారి ఆనవాళ్లు మాత్రం ఉండకూడదనుకుంటున్నారు. దీన్ని చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బొమ్మను తీయగలరు గాని ఆయన చేసిన మంచిని జనం గుండెల్లోంచి తొలగించలేరుగా అంటున్నారు. -
బీచ్‌లో భారీ పోలీసు బందోబస్తు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుంచి బీచ్ రోడ్డును మూసివేశారు. దీంతో లైట్‌హౌస్ మీదుగా బీచ్ రోడ్డులో ఉప్పాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 13వ తేదీ వరకూ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేయడంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు బీచ్‌కు రాకుండా నిషేధించారు. సుమారు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్యకృష్ణ, తిమ్మాపురం ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ అధికారి సుష్మితలు బీచ్‌లో 130 మంది సిబ్బందికి విధులు కేటాయించారు. స్తంభించిన ఎన్టీఆర్ వైద్య సేవలు కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) సోమవారం స్తంభించిపోయాయి. ప్రభుత్వ నిర్వాకంతో నెట్వర్క్ ఆస్పత్రులు తలపెట్టిన సమ్మె పేదల ఆరోగ్యంపై గుదిబండగా మారింది. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ ఎన్టీఆర్ వైద్య సేవల కింద కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 80 నుంచి 110 సర్జరీలు ఉచితంగా జరుగుతూంటాయి. అటువంటిది సోమవారం ఒక్క సర్జరీ కూడా నమోదు కాలేదు. జిల్లాకు రావలసిన సుమారు రూ.150 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసేంత వరకూ సమ్మె విరమించేది లేదని ఏపీ స్పెషాలిటీ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, రాష్ట్ర నాయకత్వం హాజరు కానుందని, చర్చల అనంతరం కొనసాగింపుపై మరింత స్పష్టత వస్తుందని వారు తెలిపారు. స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ సిటీ: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 3,318.25 లక్షల విలువైన 798 యూనిట్లు మంజూరు చేశారన్నారు. వీటికి సబ్సిడీ కింద రూ.1310.10 లక్షలు, బ్యాంకు రుణం రూ.1,824.24 లక్షలు, లబ్ధిదారు వాటా రూ.165.91 లక్షలుగా నిర్ణయించారని వివరించారు. దీని ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు రూ.2.50 లక్షల నుంచి రూ.20 లక్షల విలువైన 32 రకాల స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న ఎస్సీ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత వెబ్సైట్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అందుబాటులోకి వస్తుందని, దీని ద్వారా వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పూర్తి వివరాలకు సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో సంప్రదించాలని సత్యవతి సూచించారు. పీజీఆర్ఎస్కు 478 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు 478 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సీపీఓ పి.త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటికి సత్వరమే సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీనూకాంబిక ఆలయ అభివృద్ధికి విరాళం ఆలమూరు: చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి గుమ్మిలేరుకు చెందిన వ్యాపారవేత్త ముత్యాల వీర భాస్కరరావు, కృష్ణవేణి దంపతులు సోమవారం రూ.1,01,116 అందజేశారు. గాలి గోపురం నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చారు. ఈఓ ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఉత్సవ కమిటీ చైర్మన్ గన్ని వెంకట్రావు (అబ్బు)కు నగదు రూపంలో ఆలయ ఆవరణలో అందజేశారు. -
గ్రాసిమ్ నుంచి ముడుపుల కోసమే..
పెదపూడి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి, వారి నుంచి ముడుపులు పొందడమే ధ్యేయంగా అసెంబ్లీ వేదికగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్యాన్సర్ ప్రచారం చేశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అంతే తప్ప బలభద్రపురం, పరిసర ప్రాంత ప్రజల క్షేమం కోరి కాదని అన్నారు. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే నల్లమిల్లి లేవనెత్తిన క్యాన్సర్ అంశం బలభద్రపురానికి శాపంగా మారిందని ధ్వజమెత్తారు. ఇటీవల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడినట్టుగా క్యాన్సర్‌పై ముందే ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయించి, అప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాగుండేదని అన్నారు. అలా కాకుండా బలభద్రపురంలో 200 మందికి పైగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను పరామర్శించానంటూ ఎమ్మెల్యే చెప్పారని, దీనిలో నిజం ఎంతుందో ఆయనకే తెలుసని అన్నారు. తప్పుడు ప్రచారంతో ఊరికి చేటు అసెంబ్లీలో రామకృష్ణారెడ్డి క్యాన్సర్ అంశాన్ని ప్రస్తావించడం, దానిపై మీడియా అత్యుత్సాహంతో విపరీత ప్రచారం కల్పించడంతో బలభద్రపురం ప్రాంతాన్ని క్యాన్సర్ భూతం కబళించిందేమో అనే స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగిందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఈ ప్రచారంతో ఆ గ్రామంలోని తమ వారి ఇళ్లకు రావటానికి ఇతర ప్రాంతాల్లోని బంధువులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ వచ్చినా కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా భయపడిపోతున్నారన్నారు. అలాగే, ఆ ఊరి వారితో వివాహ సంబంధాలు కలుపుకోవాలన్నా బయటి గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలభద్రపురంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో సర్వే చేస్తూంటే, వారిని కూడా బెదిరించి విషయాన్ని పక్కతోవ పట్టిస్తూ లేనిది ఉన్నట్లుగా చూపించేందుకు ఎమ్మెల్యే విఫలయత్నం చేశారని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ప్రభుత్వ సర్వేలో జాతీయ సగటు కంటే తక్కువగా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారని గుర్తు చేశారు. డైవర్షన్ రాజకీయాలకు అలవాటు పడిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంకా స్వతంత్ర సర్వే అంటూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీ ఏర్పాటు సమయంలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసునని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి చెప్పారు. 2019 ప్రథమార్ధంలోనే నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే కేపీఆర్ సంస్థ నుంచి గ్రాసిమ్ సంస్థకు భూబదలాయింపు చేశారన్నారు. ఆ తర్వాత వెంటనే దొంతమూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారం రోజుల్లో భూబదలాయింపు ఉత్తర్వులు రద్దు చేయిస్తానని చెప్పి, ఆ పని ఎందుకు చేయించలేకపోయారని, దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీ వలన ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే, అధికారంలో ఉన్నందున చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అంతే తప్ప అవగాహన లేకుండా బలభద్రపురానికి, పరిసర ప్రాంతాలకు మాయని మచ్చ తీసుకు రావద్దని హితవు పలికారు. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, అంతా మంచి జరుగుతుందని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. అందుకే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ ప్రచారం అనపర్తి ఎమ్మెల్యే అత్యుత్సాహం బలభద్రపురానికి శాపం వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ధ్వజం -
లక్ష్మీ.. రావేం మా కొండకి?
వ్యయం కేటగిరీ రూ.కోట్లలో సిబ్బంది జీతభత్యాలు 23.35 పెన్షన్లు 13.71 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ 8.10 ప్రసాదం సరకుల కొనుగోళ్లు 23.17 వ్రతాల విభాగం కొనుగోళ్లు 5.05 పడితరం, పూజలు 00.51 ఉత్సవాల ఏర్పాట్లు 1.63 పురోహితులు, ఇతరుల పారితోషికాలు 16.00 శానిటేషన్ 6.60 ధర్మ ప్రచారం 00.50 ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ 2.11 ట్రాన్స్‌పోర్టు 1.43 విద్యాసంస్థలు, దత్తత ఆలయాలు 5.09 ఎస్పీఎఫ్, సెక్యూరిటీ గార్డులు 4.36 సీజీఎఫ్, ఇతర చెల్లింపులు 12.49 వివిధ నిర్మాణాలు 12.75 ఎలక్ట్రికల్ వర్క్స్ కొనుగోళ్లు 4.53 ఇతర ఖర్చులు 00.04 మొత్తం (సుమారు) 141.49 ఇతర వ్యయాలు, అడ్వాన్సులు, డిపాజిట్లు రూ.6.05 కోట్లు● రత్నగిరి వాసుడిని కటాక్షించని శ్రీమహాలక్ష్మి ● ఖర్చుకు రూ.6 కోట్ల దూరంలో సత్తెన్న ఆదాయం ● 2024–25లో రాబడి రూ.135 కోట్లు ● వ్యయం రూ.1.41 కోట్లు ● అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఆదాయానికి భారీగా గండి అన్నవరం: అనుకున్నదే జరిగింది.. రత్నగిరి వాసుడు సత్యదేవుడిని లక్ష్మీదేవి పూర్తి స్థాయిలో కరుణించలేదు. ఫలితంగా ఒకప్పుడు మిగులు నిధులతో, సిరిసంపదలతో తులతూగిన అన్నవరం దేవస్థానంలో ఇప్పుడు రాబడి తగ్గి, ఖర్చు పెరిగింది. ఫలితంగా 2024–25లో వ్యయం కన్నా వార్షికాదాయం రూ.6 కోట్లు తక్కువగా నమోదైంది. గత ఏడాది సగం గడిచినప్పటి నుంచే ఈ పరిస్థితి కనిపిస్తున్నా చక్కదిద్దడంలో అధికారులు విఫలమవడం.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో దేవస్థానం ఆర్థిక పరిస్థితి దిగజారింది. 2019–24 మధ్య ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో కరోనా విపత్తు రెండేళ్లు పంజా విసిరి, భక్తుల రాక తగ్గినా.. దేవస్థానం ఆదాయంపై ఆ ప్రభావం పడలేదు. అటువంటిది కూటమి పది నెలల పాలనలో అంతా సజావుగా ఉన్నా ఆదాయం పెరగకపోవడం గమనార్హం. ఖర్చయిపోయిందిలా.. అన్నవరం దేవస్థానానికి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.135,69,42,831 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఖర్చు వ్యయం రూ.141,49,16, 971 అయింది. దీంతో దేవస్థానం ఆదాయం కన్నా వ్యయం సుమారు రూ.6 కోట్లు అధికంగా నమోదైంది. ఇటీవలి కాలంలో ఈవిధంగా ఆదాయం తగ్గి, ఖర్చు పెరగడం ఇదే ప్రథమం. ప్రదక్షిణ దర్శనం రద్దుతో రూ.5 కోట్ల నష్టం సత్యదేవుని ఆలయంలో రూ.300 టికెట్టుతో ప్రదక్షిణ దర్శనాన్ని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ ప్రారంభించారు. ఆలయంలో నాలుగు మూలలా శ్రీగంధం గిన్నె, లక్ష్మీ హుండీ, పారిజాత వృక్షం, కామధేనువు విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ప్రదక్షిణ దర్శనానికి మొగ్గు చూపేవారు. 2023 అక్టోబర్‌లో ఈ దర్శనం ప్రారంభిస్తే నెల రోజుల్లోనే సుమారు రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. అయితే, ఆజాద్ బదిలీ తరువాత ఈఓగా వచ్చిన కె.రామచంద్ర మోహన్ ఈ దర్శనాన్ని నిలిపివేశారు. ఆయన తరువాత ఈఓగా వచ్చిన వీర్ల సుబ్బారావు కూడా దీనిని పునరుద్ధరించలేదు. ఈ ప్రదక్షిణ దర్శనం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దేవస్థానం ఏటా సుమారు రూ.6 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. గత ఏడాది మిగులుతో వ్యయాల సర్దుబాటు గత ఏడాది రూ.7 కోట్లు మిగలడంతో ఆ మొత్తంలో రూ.6 కోట్లు ఈ ఏడాది వ్యయాలకు సర్దారు. 12 ఏళ్ల క్రితం కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు వ్యయం రూ.కోటి మాత్రమే ఎక్కువైంది. వైఎస్సార్ సీపీ పరిపాలనలో 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ దేవస్థానం వెంటనే రికవరీ అవడంతో లోటు కనిపించలేదు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, చిన్నచిన్న విషయాలను కూడా పెద్ద వివాదాలుగా మార్చడం, దేవస్థానంపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినా సిబ్బంది సలహాల ప్రకారం కాకుండా సొంత అజెండాతో వ్యవహరించడం వంటి చర్యలతో దేవస్థానం ప్రతిష్ట మసకబారుతోంది. ఫలితంగా భక్తుల రాక తగ్గి, ఆదాయం తగ్గుతోంది. ఇటీవల అధికారులు తీసుకున్న నిర్ణయమే దీనికి తాజా ఉదాహరణ. నీటి సమస్య సాకుతో ఏసీ గదులను ఒక రోజు అద్దెకివ్వకపోవడంతో దేవస్థానం సుమారు రూ.లక్ష ఆదాయం కోల్పోయింది. ఆ తరువాత ఏసీ గదులు అద్దెకివ్వడం పునరుద్ధరించినా ఇప్పటికీ వాటిని అద్దెకివ్వడం లేదనే భావనే భక్తుల్లో ఉంది.అన్నవరం దేవస్థానం2024–25 ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాల వివరాలు ఆదాయం రూ.కోట్లలో వ్రతాలు 38.40 ప్రసాదాల విక్రయం 33.07 హుండీల ద్వారా 18.79 షాపుల వేలం, లీజులు 15.77 వసతి గదుల అద్దెలు 12.27 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 5.49 ఇతర ఆర్జిత సేవలు 4.13 ట్రాన్స్‌పోర్టు 2.03 డిపాజిట్లపై వడ్డీలు 4.80 కేశఖండన టికెట్ల ద్వారా 00.94 మొత్తం (సుమారు) 135.69 అడ్వాన్సులు, డిపాజిట్లు, క్యాపిటల్ డొనేషన్లు 7.20 -
‘సాక్షి’ తోడుగా.. దేవస్థానానికి ఆదా
● రత్నగిరిపై నెలకు రూ.23,990కే ‘చెత్త’ ట్రాక్టర్ కాంట్రాక్ట్ ఖరారు ● గతంలో టెండర్ లేకుండానే రూ.60 వేలకు అప్పగింత ● దీనిపై ‘సాక్షి’ కథనం ● స్పందించి టెండర్ పిలిచిన అధికారులు ● తాజాగా మరింత తక్కువకు కొటేషన్ ● దేవస్థానానికి నెలకు రూ.36,010 మిగులు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ట్రాక్టర్‌తో చెత్త తరలించేందుకు గాను నెలకు రూ.23,990కు టెండర్ ఖరారైంది. దీనికి సంబంధించిన వివరాలివీ.. రత్నగిరిపై సత్యదేవుని వ్రతాల్లో ఉపయోగించిన పత్రి, పువ్వులు, తమలపాకులతో పాటు ఆలయ ప్రాంగణంలో చెత్తను తరలించే పనిని గతంలో శానిటరీ కాంట్రాక్టర్ నిర్వహించేవారు. గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఈ కాంట్రాక్ట్ నిర్వహించిన కేఎల్‌టీఎస్ సంస్థ మార్చి 1 నుంచి వైదొలగింది. దీంతో, దేవస్థానంలో చెత్త తరలింపునకు ఒక ట్రాక్టర్, రెండు ట్రక్కులు, ట్రాక్టర్‌కు అవసరమయ్యే డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు భరించేలా నెలకు రూ.60 వేలకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. టీడీపీలోని ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి సిఫారసుతో ఆ పార్టీ కార్యకర్తకు ఏకపక్షంగా ఈ పనిని అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో చెత్త ట్రాక్టర్ నిర్వహించిన యడ్ల కృష్ణ అనే వ్యక్తి తాను నెలకు రూ.43 వేలకే చెత్త తరలిస్తానని లిఖితపూర్వకంగా తెలియజేసినా దేవస్థానం అధికారులు స్పందించలేదు. ఈ వ్యవహారంపై ‘రత్నగిరిపై చెత్త వివాదం’ శీర్షికన మార్చి 28న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో విధి లేని పరిస్థితిలో స్పందించిన అధికారులు చెత్త తరలింపునకు టెండర్ పిలిచారు. ఈ టెండర్లను సోమవారం తెరవగా నాలుగు కొటేషన్లు వచ్చాయి. వీటిలో అతి తక్కువగా నెలకు రూ.23,990కే దాఖలైన టెండర్‌ను ఖరారు చేశారు. ‘సాక్షి’ కథనం కారణంగా దేవస్థానానికి నెలకు రూ.36,010, సంవత్సరానికి రూ.4,32,120 మేర ఆదా అయ్యింది. శానిటేషన్ టెండర్ పిలిస్తే రూ.లక్షల్లో ఆదా చెత్త ట్రాక్టర్ టెండర్లోనే దేవస్థానానికి నెలకు రూ.36,010 ఆదా కాగా, ఇక శానిటేషన్ టెండర్ కూడా పిలిస్తే రూ.లక్షల్లో ఆదా అయ్యే అవకాశం ఉంది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి టెండర్ పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో గుంటూరుకు చెందిన కనకదుర్గ సర్వీసెస్ సంస్థకు 349 మంది పని వారిని సమకూర్చే పనిని అప్పగించారు. వాస్తవానికి దీనిని కూడా టెండర్ ద్వారానే చేయాల్సి ఉంది. ప్రస్తుతం దేవస్థానం అధికారులు శానిటరీ మెటీరియల్ సూపర్బజార్లో కొనుగోలు చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణకు సుమారు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీనికి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా భవిష్యత్తులో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శానిటేషన్ కాంట్రాక్టుకు కూడా టెండర్ పిలిస్తే దేవస్థానానికి నెలకు రూ.10 లక్షల వరకూ మిగిలే అవకాశం ఉంది. దీనిపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. -
జాతీయ కళా డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో కోనసీమ కళాకారులు
కొత్తపేట: దేశవ్యాప్త కళాకారులతో న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన డాక్యుమెంటరీ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరు గరగ నృత్యం కళాకారులు పాల్గొన్నారు. కొత్తపేట మండలం పలివెలకు చెందిన కొమారిపాటి ఏసువెంకటప్రసాద్, మండపేట రూరల్ మండలం తాపేశ్వరానికి చెందిన కొరివి కళ్యాణ్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ ఏడాది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో దేశ వ్యాప్తంగా వివిధ కళారూపాలకు చెందిన 5,196 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. కాగా ఢిల్లీలోని భారత సంగీత, నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆయా కళాబృందాల్లో ఒక్కో బృందం నుంచీ ఇద్దరి చొప్పున మొత్తం 100 మందిని ఎంపిక చేసి ‘జయతి జయమమ్మా భారతం’ పేరుతో డాక్యుమెంటరీ ప్రోగ్రాం చేశారు. ఇందులో కోనసీమ జిల్లాకు చెందిన ఏసువెంకటప్రసాద్, కళ్యాణ్ గరగ నృత్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్యాపుణిచ, సెక్రటరీ రాజుదాస్ తదితర ప్రముఖులు అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. ఏసు వెంకటప్రసాద్ గరగ నృత్యం జానపద కళా విభాగంలో సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. -
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి..
● వైభవంగా రత్నగిరి రాములోరి కల్యాణం ● పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అమ్మవారు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదివారం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు తిలకిస్తుండగా.. రత్నగిరిపై రామాలయం పక్కన వార్షిక కల్యాణ వేదిక మీద.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ ఈ క్రతువును కన్నుల పండువగా దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు పండితులు సీతారాములకు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. వధూవరులైన సీతారాములను ఉదయం 7 గంటలకు వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీపై గ్రామంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం సీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై సీతారాములను వేద మంత్రోచ్చారణల నడుమ పండితులు వేంచేయించారు. పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు. ఉదయం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో సీతారాముల కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. సీతారాములకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు పట్టువస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశేషాలతో కూడిన ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) వివరించారు. అనంతరం పుణ్యాహవాచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, యుగఛిత్రాభిషేకం తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఉదయం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర – బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్టులకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులైన సీతారాములకు పండితులు వేదాశీస్సులు అందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. రాత్రి నవ వధూవరులు సీతారాములకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకులు దేవులపల్లి ప్రసాద్, చిట్టిం వాసు, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కొండలరావు పర్యవేక్షించారు. సీతారాముల కల్యాణానంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. దీనికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే శ్రీరామనవమి నాడు మాత్రం తొలుత సీతారాముల కల్యాణం జరుగుతుంది. -
వచ్చే నెల 7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల నిర్వహణ దిశగా అన్నవరం దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీరామ నవమి పర్వదినమైన ఆదివారం సత్యదేవుని కల్యాణోత్సవాల వాల్ పోస్టర్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఆవిష్కరించారు. మే 7వ తేదీ (వైశాఖ శుద్ధ దశమి) నుంచి మే 13వ తేదీ (వైశాఖ బహుళ పాడ్యమి) వరకూ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మే 8వ తేదీ (వైశాఖ శుద్ధ ఏకాదశి) రాత్రి 9 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దివ్య కల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వేద పండితుడు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, ఏఈఓలు కొండలరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో వినియోగించేందుకు గాను విశాఖ జిల్లా గాజువాకకు చెందిన గుంటపల్లి ప్రసాద్ అరకిలో ముత్యాలను ఈఓ సుబ్బారావుకు అందజేశారు. వక్ఫ్ బిల్లుపై న్యాయ పోరాటం బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కాకినాడ ముస్లిం సమాఖ్య, మేవా, ముస్లిం అడ్వొకేట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయించాయి. నగరంలోని మేవా హాలులో కాకినాడ ముస్లిం సమాఖ్య అధ్యక్షుడు ఎస్ ఏజాజుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఆదివారం జరిగిన సమావేశంలో మేవా అధ్యక్షుడు ఎమ్డీ జవహర్ ఆలీ, కార్యదర్శి సయ్యద్ సలార్ వక్ఫ్ బిల్లు–2025లో పొందుపరచిన అంశాలపై చర్చించారు. ఏజాజుద్దీన్ మాట్లాడుతూ, ఈ బిల్లు వలన ముస్లిం సమాజానికి కలిగే అనర్థాలను విస్తృతంగా తీసుకుని వెళ్లాలని, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఉద్యమించాలని అన్నారు. జవహర్ ఆలీ మాట్లాడుతూ, ఈ బిల్లుపై సర్వోన్నత న్యాయస్థానంలో పోరాడాలని, దీనిపై ముస్లింలకు అవగాహన కార్యక్రమలు నిర్వహించాలని సూచించారు. నగరంలోని ముస్లిం యువత, ఉద్యోగులు, మేధావులతో త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేసి, ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ముస్లిమేతర సంఘాలతో చర్చలు జరిపి, అందరి మద్దతూ కూడగట్టాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీలకతీతంగా రామచంద్రపురం, పిఠాపురం ప్రాంతాల నుంచి కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అభిప్రాయాలు తెలియజేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు గౌస్ మొహిద్దీన్ నవాబ్, అబ్దుల్ బషీరుద్దీన్, రహ్మన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఆరోగ్య కష్టం!
ఇవీ డిమాండ్లు ● జిల్లాకు రావలసిన సుమారు రూ.150 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ● క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం చేసి, చెల్లింపులు వేగవంతం చేయాలి. ● కొత్త టారిఫ్‌లు నిర్ణయించాలి. వివిధ చికిత్సలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న టారిఫ్‌లను సమీక్షించాలి. ● సమస్యల పరిష్కారంపై తగిన కాలపరిమితితో స్పష్టతనివ్వాలి. ● నిధులు విడుదలైన సందర్భాల్లో కార్యాలయాల స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ఇతర సమస్యల వల్ల కలుగుతున్న జాప్యాన్ని నివారించాలి. ● బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం ● సుమారు రూ.150 కోట్ల మేర బకాయి ● నిర్వహణ కష్టమవుతోందంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు ● నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్! కాకినాడ క్రైం: కూటమి సర్కార్ నిర్వాకంతో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) సేవలు సోమవారం నుంచి పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ పథకం కింద రోగులకు చికిత్సలు, శస్త్రచికిత్సలకు నెట్వర్క్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు వెచ్చించాయి. వాటికి ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. దీనిపై పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినా.. అధికారం చేపట్టిన పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం నయా పైసా కూడా చెల్లించలేదు. మరోవైపు పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా ప్యాకేజీల ధరలు మార్చాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సిబ్బంది జీతాలు సహా ఆసుపత్రుల నిర్వహణ భారమవుతోందని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడనుంది. 26 లేఖలు రాసినా.. ఎన్టీఆర్ వైద్యసేవల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు నివేదిస్తూ సంఘ జిల్లా నాయకత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వానికి 26 లేఖలు రాశారు. వీటిపై ప్రభుత్వం నుంచి ఇసుమంతైనా స్పందన కానరావడం లేదు. చివరిగా గత నెల 7న అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినా, ప్రభుత్వం స్పందించలేదు. ఎన్టీఆర్ వైద్య సేవను ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేయనున్న నేపథ్యంలో ప్యాకేజీల ఖరీదు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది నెట్వర్క్ ఆసుపత్రులకు మరో పెను సవాలు కానుంది. రూ.150 కోట్ల బకాయి జిల్లాలో 41 మల్టీస్పెషాలిటీ, 9 డెంటల్ కలిపి మొత్తం 50 ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటికి గడచిన 11 నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం, విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక సేవల నిలిపివేతకు యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. నల్ల రిబ్బన్లతో ప్రదర్శన, వినతుల వెల్లువ సహా అన్ని మార్గాల్లోనూ తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించడానికి నానా పాట్లూ పడ్డాయి. పట్టించుకోని నేతలు తమ ఓట్లతో గద్దెనెక్కిన కూటమి నేతల అసలు రంగు బయట పడుతోందని వైద్యులు చర్చించుకుంటున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆటంకం కలగకూడదనే సదుద్దేశంతో కూటమి ప్రజాప్రతినిధుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూంటే తమను అలుసుగా చూస్తూ, అవమానించారని వాపోతున్నారు. జిల్లాలోని కూటమి నేతల కార్యాలయాల ముందు వినతిపత్రాలతో పడిగాపులు కాయించారని పలు ఆసుపత్రుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపుపై గత ఏడాది ఆగస్టులో నేతలు కోతలు కోసినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వారు చెబుతున్నారు. పేదలకు ప్రాణసంకటం ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవ అని మారిస్తే సరిపోయిందా? ఆ స్ఫూర్తి కొనసాగించవద్దా! నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్ న్యాయబద్ధమైనదే. ప్రభుత్వం రూ.కోట్లకు కోట్లు బకాయి పెడితే ఆసుపత్రులు నడిచేదెలా? సేవల నిలుపుదల వరకూ రావడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఈ పరిస్థితి పేదలకు ప్రాణసంకటం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి, ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగేలా చూడాలి. – పలివెల వీరబాబు, సీఐటీయూ కాకినాడ నగర కో కన్వీనర్, మాజీ సర్పంచ్, ఇంద్రపాలెం, కాకినాడ -
జగన్మోహనం.. శివకేశవ క్షేత్రం
● భక్తులను ఆకట్టుకునే ద్విముఖ రూపాలు ● కోరిన కోర్కెలు నెరవేర్చే దివ్య స్వరూపం ● ప్రపంచ ప్రసిద్ధి చెందిన ర్యాలి క్షేత్రం ● నేటి నుంచి కళ్యాణ మహోత్సవాలు కొత్తపేట: ముందు పురుషరూపం, వెనక సీ్త్ర రూపంతో ఏకశిలలో జగన్మోహినీ, విష్ణువు సాక్షాత్కరించే అద్భుత క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే క్షేత్రం ర్యాలి. ఈ క్షేత్రంలో ఈ నెల 6 నుంచి 13 వరకూ స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం ఆరో స్థానాన్ని దక్కించుకని ఖ్యాతికెక్కింది. ఈ క్షేత్రంలో ముందు భాగం కేశవుని రూపం, వెనుక జగన్మోహినీగ స్వయంభూగా అవతరించారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఏకశిలా విగ్రహం ఉన్న ఈ ఆలయంలో అణువణువునా ఉన్న అద్భుతాలు భక్తి భావాలను పెంపొందిస్తాయి. ఈ ఆలయంలో భక్తులందకీ గర్భాలయ ప్రవేశం ఉండటం విశేషం. అంతే కాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం ఒక విశేషం. కాగా శివాలయంలో నీరు ఇంకి పోవడం, శ్రీజగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదముల నుంచి నిరంతరం నీరు (గంగ) ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెప్తోంది. ఆలయ విశిష్ట చరిత్ర ఈ ఆలయ ప్రత్యేకతలకు తగినట్లే ఆ దైవం వెలిసిన విధానం కూడ ఒక చరిత్ర సంతరించుకుంది. ఈ ఆలయంలో దైవం, రాక్షస సంహారంలో భాగంగా ఏర్పడిన ఒక అవతారమని చారిత్రక కథనం. ఇటు గౌతమి అటు వశిష్ట నదీ పాయల మధ్య ఆవిర్భవించిన ఈ ఆలయ స్థాపనకు, ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు రావడానికి కూడా ఒక కథ ఉన్నట్టు పండితులు వెల్లడిస్తున్నారు. విక్రమదేవుడు అనే భక్తుడు ఒకప్పుడు అడవిలా ఉన్న ప్రాంతంలో వేట సాగిస్తూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతనికి కలలో కనబడిన మహావిష్ణువు స్వయంభూ శిల రూపంలో నేను ఈప్రాంతంలో ఉన్నానని నీవు కర్రతో రథం చేయించి లాగుకొని వెళ్ళితే ఆ రథం శీల రాలి పోతుందని అక్కడ తవ్వితే విగ్రహం బయట పడుతుందిని చెప్పి అదృశ్యమయ్యాడని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ ప్రకారం విక్రమ దేవుడి ద్వారా ఈ విగ్రహం బయటపడిందని చరిత్ర చెబుతోంది. రథం శీల రాలడం వలన ఈ దైవం వెలసిన ప్రాంతానికి శ్రీర్యాలిశ్రీ అని పేరు వచ్చిందని నానుడి. పాప సంహారం కోసం వెలసిన దైవం అమృతం కోసం తగవులాడుకుంటున్న దేవదానవులను శాంతిపజేసి దానవులకు అమృతం అందకుండా చేసేందుకు మహా విష్ణువు జగన్మోహినీగా ఈ లోకంలో అవతరించిన విషయం తెలిసిందే. ఆ ఘట్టం ముగిసిన తరువాత అత్యంత సుందరంగా ఉన్న జగన్మోహినిని మోహించిన శంకరుడు ఆమెను వెంటాడటంతో సీ్త్ర రూపంలో ఉన్న విష్ణుమూర్తి ర్యాలి గ్రామం వరకూ వచ్చి ఇక్కడ అంతర్థానమైనట్టు ఆలయ చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ మోహించుకోవడాన్ని సర్వజనానికి తెలిసేటట్టు చేయడం కోసం సీ్త్ర పురుష రూపాల్లో ఏక శిలలో లోకనాఽథులు ఇద్దరూ ఇక్కడ స్వయంభూలుగా వెలిశారని భక్తులు విశ్వాసం అడుగడుగునా అద్భుతాలే లోకనాథులు వెలసిన ఈ గ్రామంలో జగన్మోహిహినీ కేశవస్వామి ఆలయంలో అణువణువునా అద్భుతాలే కనిపిస్తాయి. అత్యంత ఎత్తయినా పురాతన నిలువు గోపురం అందరినీ ఆకర్షించే గర్భగుడితో పాటు శ్రీదేవి, భూదేవి విగ్రాహాలు సైతం ఎంతగానో అకర్షిస్తాయి. ఇవి అన్ని ఒక ఎత్తయితే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వింత. ఈ ఆలయ ప్రధాన విగ్రహమే ఐదు అడుగుల ఎత్తున ఉన్న సాలగ్రామ ఏక శిలలో సీ్త్ర పురుష రూపాల్లో శివ కేశవులు సాక్షాత్కరించడం భక్తి పారవశ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ఒక్క శిలలోనే రెండు విధాలైన ఆలయాలు, పొన్న చెట్టు, దక్షిణ భాగంలో గోవర్ధన పర్వతం, మకర తోరణం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సాలగ్రామ ఏక శిలా విగ్రహంలోనే దశావతారాలు కన్పించడం మరో అద్భుత విశేషం. కంఠంలోని హారాలు, కర కంకణాలు, శంకు చక్రాలు జీవం ఉట్టి పడేలా శివకేశవులే మన ముందు ప్రత్యక్ష మయ్యినట్టుగా చూసేవారికి అనుభూతి కలుగుతుంది. సాలాగ్రామ విగ్రహం పాదాల వద్ద గంగా జలం నిత్యం ఉబుకుతూనే ఉండడం ఇక్కడ మరో విశిష్టత. పాదాల వద్ద వున్న గంగాదేవి విగ్రహం నుంచి ఈ జలం ప్రవహిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతుందని భక్తుల విశ్వాసం. విగ్రహం వెనుక వైపు వున్న జగన్మోహినీ రూపం మరింత సమ్మోహనం. సీ్త్ర రూపంలో వున్న మహాశిష్ణువు అత్యంత సౌందర్యంగా కనిపిస్తారు. శిరమున సిగచుట్టూ అప్పుడే సంపెంగ నూనె రాసుకొన్నట్లున్న శిరోజాలు సహజమైన చీర కట్టు, తలలో ముచ్చటగొలిపే చామంతి పువ్వు విశేషంగా కనిపిస్తాయి. అంతేకాక పద్మినీ జాతి సీ్త్రలకు శుభసూచకంగా ఉండేలా పుట్టుమచ్చలు సైతం ఈ విగ్రహంలో సాక్షాత్కరించడం భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వుంటుంది. రావులపాలెం బస్ కాంప్లెక్సు నుంచి రెండు గంటలకు ఒకసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కల్యాణ మహోత్సవాలు ఇలా.. ఆదివారం గరుడ వాహన సేవ, గ్రామోత్సవం, రాత్రి 8–45 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం, 7, 8, 9 తేదీల్లో స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, పదో తేదీన సదస్యం, 12న చక్రస్నానం, 13న శ్రీపుష్పోత్పవంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయని దేవస్థానం ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు. -
రారండోయ్ రాములోరి కల్యాణానికి..
● సత్యదేవుడు అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా వధూవరులైన సీతారాములు ● పసుపు దంచిన ముత్తయిదువలు ● రత్నగిరి క్షేత్ర పాలకుడు సీతారాముని కల్యాణం నేడు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడైన శ్రీరాముని ఆలయంలో నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చైత్ర శుద్ధ అష్టమి శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా రాగా సాయంత్రం నాలుగు గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వధూవరులుగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ముత్తయిదువులతో పాటు ఈఓ సుబ్బారావు కొంతసేపు పసుపు దంచారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. నేడు సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉదయం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటలకు సీతారాములను వెండి హనుమద్వాహనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకీ మీద గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం రత్నగిరి రామాలయం వద్ద వార్షిక కల్యాణవేదికపై ఉదయం పది నుంచి ఒంటి గంట వరకూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో మాంగల్యధారణ జరుగుతుంది. అనంతరం భక్తులకు ప్రసాదం, వడపప్పు పానకం పంపిణీ చేస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు రోజుకొక వేడుకతో శ్రీరామ నవమిని తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి ఏడు గంటలకు రామాలయంలో జరిగే శ్రీసీతారాముల శ్రీపుష్పయోతోత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
ఆఫీసర్స్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విజయ రెడ్డి
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమలాపురం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ వీపీసీ మీటింగ్ హాల్లో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు డాక్టర్ కీర్తి రామకృష్ణ అధ్యక్షతన జరిగాయి. అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్ బాలచంద్ర యోగేశ్వర్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. విజయ రెడ్డిని జిల్లా పశువైద్య అధికారి కె.వెంకట్రావు, ఉప సంచాలకులు కర్నీడీ మూర్తి, వైద్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. పేపరు మిల్లు ఉద్యోగి అదృశ్యం రాజమహేంద్రవరం రూరల్: స్థానిక హుకుంపేటలోని అత్తారింటి నుంచి తన సొంతిల్లు ఉన్న కాతేరులోని కంఠమణివారి వీధికి వెళ్లిన పెనుమాక సునీల్‌కుమార్ కనిపించడం లేదని అతని భార్య పెనుమాక మాణిక్యం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తున్న పెనుమాక సునీల్‌కుమార్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో హుకుంపేటలోని జనచైతన్య లే అవుట్‌లోని అత్తగారింటి నుంచి ఏపీ 39 ఎంపీ 3018 నెంబరు రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాణిక్యం పేర్కొంది. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్‌వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్‌కుమార్ ఆచూకీ తెలిసినా, మోటారు బైక్ ఆచూ కీ తెలిసినా బొమ్మూరు ఇన్స్పెక్టర్ 94407 96533, 94911 22811 ఫోన్ నెంబరులో తనకు తెలియజేయాలని ఎస్సై రమేష్ కోరారు. -
క్రీడాకారులను తయారుచేద్దామా?
● కోచ్ కావాలనుకునేవారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్న క్రీడాప్రాధికార సంస్ధ ● ఈ నెల 14 తుది గడువు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటి): క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. ఆయా స్థాయిల్లో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడాప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని, పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలా మంది శిక్షణను పూర్తి చేసుకుని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్మీడియెట్, ఆపై.. ఇంటర్మీడియెట్, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్లలోపు అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లాస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా, వర్సిటీ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ యూనివర్శిటీ స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం, ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. ఏయే అంశాల్లో .... సైక్లింగ్, క్రికెట్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జుడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, సాఫ్ట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, టేబుల్‌టెన్నిస్, లాన్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషూ, యోఆ, త్రోబాల్ తదితర క్రీడాంశాలుంటాయి. శిక్షణ కేంద్రాలు క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రాన్ని కేటాయిస్తారు. వారు యూనిఫాంతో పాటు సాధారణ దుస్తులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలలో ఎన్ఎస్ఎన్ఐఎస్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. మే 6 నుంచి జూలై 2 వరకు శిక్షణ... ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్ ఉంటాయి. మే 6 నుంచి జూలై 2 వరకు ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈనెల 14. మంచి అవకాశం క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పిస్తోంది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. వివరాలకు 89196 42248 నెంబురులో సంప్రదించండి. – శ్రీనివాస్ కుమార్, డీఎస్డీఓ -
త్వరలో వినియోగంలోకి..
● రూ.30 లక్షలతో కొత్త నివేదన శాల నిర్మించిన దాత ● ముచ్చటగా 3 నెలలే అందులో నివేదనల తయారీ ● తిరిగి ఉపయోగంలోకి తేవాలని దేవస్థానం నిర్ణయం అన్నవరం: రత్నగిరిపై సుమారు ఏడాదిన్నర కిందట ప్రారంభించి, కొన్నాళ్లు ఉపయోగించి, తరువాత నిరుపయోగంగా వదిలేసిన కొత్త నివేదన శాలను త్వరలో వినియోగంలోకి తీసుకుని రానున్నారు. వివరాలివీ.. సత్యదేవునికి నివేదనలు, పులిహోర, దద్ధోజనం, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు తయారు చేసేందుకు స్వామివారి ఆలయానికి దిగువన కుడివైపున గతంలో నివేదన శాల ఉండేది. దీనిని భక్తులు వేచియుండేందుకు వీలుగా కంపార్ట్మెంట్ తరహాలో క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు గాను మార్చారు. దీని స్థానంలో మరో నివేదన శాల నిర్మించేందుకు అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయించారు. రామాలయానికి ఎదురుగా ఉన్న సర్కులర్ మండపం మీద నూతన నివేదన శాల నిర్మించాలని పండితులు సూచించారు. దీనిపై ఈఓ అభ్యర్థన మేరకు తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) రూ.30 లక్షల వ్యయంతో కొత్త నివేదన శాల నిర్మించారు. దీనిని 2023 ఆగస్టు నెలలో దాత చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తరువాత సత్యదేవుని నివేదనలన్నీ ఇక్కడే తయారు చేసేవారు. ఈఓ ఆజాద్ 2023 నవంబర్‌లో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం దేవదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న కె.రామచంద్ర మోహన్ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తరువాత నివేదన శాల భూస్పర్శతో ఉండాలని కొంత మంది పండితులు సూచించారు. దీంతో పాత నివేదన శాలలోనే మరలా నివేదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పాత నివేదన శాలకు మార్పులు చేసి, 2023 నవంబర్ నుంచి అందులోనే నివేదనలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నివేదన శాల నిరుపయోగంగా మారింది. దీనిపై దాత తాతబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 21న ‘దాతల ఆశయాలకు తూట్లు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించారు. భక్తులకు పంపిణీ చేసే పులిహోర, దద్ధోజనం, చక్కెర పొంగలి వంటివి కొత్త నివేదన శాలలో తయారు చేయాలని ఆదేశించారు. వాటి తయారీకి అవసరమైన పాత్రలు, కుక్ నియామకం వంటి అంశాల్లో కొంత జాప్యం జరిగింది. గత నెల 28న నిర్వహించిన హుండీల ఆదాయం లెక్కింపు సందర్భంగా కొత్త నివేదన శాల వినియోగంపై సంబంధిత అధికారులను చైర్మన్, ఈఓ మరోసారి ఆదేశించారు. అవసరమైన వంట పాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. పాత నివేదన శాలలో పని చేస్తున్న వంట సహాయకురాలితో కొత్త నివేదన శాలలో పులిహోర తదితర ప్రసాదాలు తయారు చేయించాలని నిర్ణయించారు. వారం, పది రోజుల్లో కొత్త నివేదన శాలను వినియోగంలోకి తెస్తామని ఆలయ ఏఈఓ కొండలరావు తెలిపారు. -
8 నుంచి ఇండో – అమెరికా సైనిక విన్యాసాలు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం మరోసారి వేదిక కానున్నది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, పరసర్ప నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంఫ్–2025 పేరిట 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 1న విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 8 నుంచి కాకినాడ తీరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విన్యాసాలు ఈ నెల 13న కాకినాడలో ముగియనున్నాయి. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కాకినాడ సూర్యారావుపేటలోని నేవల్ ఎన్క్లేవ్ వద్ద ఇరు దేశాల ఉమ్మడి విన్యాసాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన నావికా దళాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని తమ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం తూర్పు నౌకాదళ పరిధిలోని విశాఖ, కాకినాడ తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ జలాశ్వ, యూఎస్ఎస్ కామ్‌స్టాక్ ద్వారా ఇండో, అమెరికా నావికా దళాలు విన్యాసాలు కొనసాగిస్తున్నాయి. -
హెపటైటిస్ హడల్..!
వారం రోజుల్లో పరీక్షలు పూర్తి గ్రామంలో హైపటైటిస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రకాల వైద్య సేవలందిస్తున్నాం. వారం రోజులలో పరీక్షలు పూర్తి చేస్తాం. – దుర్గారావు దొర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వైద్యులకు పూర్తి సహకారం గ్రామంలో కామెర్ల సంబంధిత వ్యాధులు ప్రభలుతుండడంతో గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టాం. తాగునీటి నాణ్యతపై మరింత దృష్టి సారించాం. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా గ్రామస్తులకు అవగాహన కల్పించడంతోపాటు వైద్యులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాం. – మల్లిడి వీర బాబ్జి, సర్పంచ్, పల్లం, కాట్రేనికోన మండలం ● తల్లడిల్లుతున్న పల్లం గ్రామం ● చురుకుగా వైద్య పరీక్షలు ● అంతకంతకూ పెరుగుతున్న కేసులు ● ఆందోళనలో మత్స్యకారులు సాక్షి, అమలాపురం/కాట్రేనికోన: రోజుల తరబడి సాగుతున్న రక్త పరీక్షలు.. పరీక్షలు జరుగుతున్న కొద్దీ బయటపడుతున్న కామెర్ల సంబంధిత వ్యాధులతో మత్స్యకార గ్రామం పల్లం తల్లడిల్లుతోంది. కాట్రేనికోన మండలం శివారు గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ గ్రామంలో హెపటైటిస్ వ్యాధి ప్రబలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కామెర్ల సంబంధిత వ్యాధులు గ్రామంలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గ్రామంలో తొలుత నలుగురు గర్భిణుల్లో కాలేయానికి సంబంధించి వాపు లక్షణాలను గుర్తించారు. వీరు కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలకు వెళ్లిన సమయంలో ఇది బయట పడింది. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో ఇక్కడ కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా మరిన్ని కేసులు వెలుగు చూశాయి. దీంతో గ్రామంలో ఉన్న అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 12 వేల వరకు జనాభా ఉండగా, వీరిలో 7,800 మంది వరకూ నివసిస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో వేటకు, ఉద్యోగ, ఉపాధికి వెళ్లారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్ల వయస్సు దాటిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకార ఇప్పటి వరకూ 2,281 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో హెపటైటిస్–బి సర్ఫేస్ యాంటిజెన్ (హెచ్‌బీఎస్‌ఏజీ) 12 మందికి నిర్ధారణ అయ్యింది. హెపటైటిస్–సి వైరస్ (హెచ్‌సీవీ) తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. గ్రామంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో హైపటైటిస్– ఎ, బి, సి కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 118 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తొలి దశలో చేపట్టిన ర్యాపిడ్ టెస్టులో ఇంతకు రెండు మూడు రెట్లు పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖతో సంబంధం లేకుండా స్థానికంగా వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు చేసేవారు ఒకే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం, గ్రామంలో మత్స్యకారుల సామూహిక జీవన విధానం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా సంక్రమిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు అప్రమత్తమైనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమిస్తోంది భావిస్తున్నారు. మరిన్ని పరీక్షలు జరిగితే మరికొంత మందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. అలాగే, వ్యాధి లక్షణాలున్న వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తున్నారు. వారం పది రోజులుగా ఇక్కడ కామెర్లు ప్రబలుతూండగా జిల్లా యంత్రాంగం కేవలం పరీక్షలతో సరిపెడుతోందని, వ్యాధికి సంబంధించిన మందులు వ్యాధిగ్రస్తులకు ఇంకా అందలేదని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో పరీక్షలు ముమ్మరం నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా పల్లం గ్రామంలో కొంత మందికి కాలేయ సంబంధ వ్యాధులైన హెపటైటిస్ బి, సి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత నెల 20న ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ మేరకు కలెక్టరు ఇంటింటా రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ కిట్లతో కాలేయ పరీక్షలు చేయాలని ఆదేశించారు. గత నెల 24న రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు చేసేందుకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను పల్లం హెల్త్ సెంటర్‌కు పంపించారు. గత నెల 25 నుంచి వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఆరు బృందాలుగా ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ వరకు రక్త నమూనాలు సేకరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన మొత్తం 5,436 మందికి రక్త నమూనాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 2,318 మంది రక్త నమూనాలు సేకరించి ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా హెపటైటిస్–బి 223, హెపటైటిస్–సి 80 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాట్రేనికోన వైద్యాధికారి లిఖిత మాట్లాడుతూ, పాజిటివ్ వచ్చిన వారి రక్త నమూనాలను అదనపు పరీక్షల కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. మరిన్ని పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ కేసులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న యాంటీ వైరల్ మాత్రలు అందచేస్తామన్నారు. -
చీకటి పడితేనే.. సీతారాముల కల్యాణం
పిఠాపురం: ప్రపంచమంతా శ్రీరామ నవమికి శ్రీ సీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తూంటా రు. కానీ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాత్రం చీకటి పడ్డాకే శ్రీరాముడి కల్యాణం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతున్నారు. చేబ్రోలులోని శ్రీ సీతారామ స్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. తన వంశానికి చెందిన దామర సీతాదేవి జ్ఞాపకార్థం పిఠాపురం మహారాజా రావు కుమార మహీపతి గంగాధర రామారావు బహద్దూర్ 1800 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో పిఠాపురం రాజావారి ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో ఇదొకటి. ఇక్కడ ధృవమూర్తి కూడా భద్రాచలం సీతారామచంద్రస్వామిని పోలి ఉండటం విశేషం. ప్రతి గ్రామంలో సీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తారు. కానీ ఈ ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు, సీతారామ కల్యాణం రాత్రి వేళ చేస్తూంటారు. పూర్వం పిఠాపురం మహారాజా వారికి తన ఆస్థానంలో ఉన్న అన్ని రామాలయాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీరాముడి కల్యాణాలు తన చేతుల మీదుగా జరిపించడం ఆనవాయితీగా ఉండేది. దీనిలో భాగంగా రాజావారు తొలుత పిఠాపురంలోని ఆలయాలను, తరువాత గొల్లప్రోలు ఆలయాలను సందర్శిస్తూ చివరిగా చేబ్రోలు చేరుకునే సమయానికి చీకటి పడేది. దీంతో ఆయన వచ్చిన తర్వాతనే రాత్రి సీతారాముల కల్యాణం జరిపించేవారు. దీంతో ఇదే ఈ ఆలయంలో ఆనవాయితీగా మారిపోయింది. రాజుల కాలం పోయినప్పటికీ అప్పటి ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాతే కల్యాణ తంతు ప్రారంభమవుతుంది. కల్యాణోత్సవం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అలా శ్రీరామ నవమి నాడు కల్యాణం ప్రారంభమై, అర్ధరాత్రి 12 గంటలు దాటడంతో మరునాడు పూర్తవుతుంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఈ కల్యాణోత్సవాలు చేస్తూంటారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మొదటి రోజు శేష, రెండో రోజు హనుమంత, మూడో రోజు గజ, నాలుగో రోజు పొన్న వాహనాలపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఐదో రోజు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీపుష్ప యాగంతో ఈ కల్యాణోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకుడు రేజేటి రామానుజాచార్యులు తెలిపారు. ఈ ఏడాది సీతారాముల కల్యాణాన్ని వేలాదిగా తరలి వచ్చిన భక్త జన సందోహం తిలకిస్తూండగా ఆదివారం అర్ధరాత్రి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. -
జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి
కాకినాడ సిటీ: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్ సమీపంలోని లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి జగ్జీవన్‌రామ్ ఎనలేని సేవలు అందించి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. దీపక్‌ను కఠినంగా శిక్షించాలివైఎస్సార్ సీపీ నేత వర్ధినీడి సుజాత పిఠాపురం: రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కారకుడైన దీపక్‌ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి, మహిళల పట్ల గౌరవం ఉంటే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే నాగాంజలి చనిపోయేది కాదన్నారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని హోం మంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు కనీసంగా కూడా పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. జరుగుతున్న దారుణాలు సంఘటనలు చూస్తూంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే విషయం అర్థమవుతోందన్నారు. మహిళలు అన్నీ గమనిస్తున్నారని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే మహిళా లోకం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుందని హెచ్చరించారు. మొదటి నుంచీ నేర చరిత్ర ఉన్న దీపక్‌కు పడే శిక్ష మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారి వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉండాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని సుజాత అన్నారు. -
నాగాంజలి మృతి బాధాకరం
● ఆమె ఆఖరి కోరిక ప్రకారం దీపక్‌కు కఠిన శిక్ష పడాలి ● ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి ● బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం ● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి బాధాకరమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఆమె మరణవార్త తెలుసుకుని పోస్ట్‌మార్టం చేస్తున్న ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆయన శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై ఆమె తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దీపక్‌కు కఠిన శిక్ష పడాలని నాగాంజలి కోరుకుందని, అది నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపక్ లాంటి కీచకులకు తగిన శిక్ష విధించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చన్నారు. నాగాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తానేదో రాజకీయం చేస్తున్నట్లు కొందరు పేర్కొనడం తగదని భరత్‌రామ్ పేర్కొన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నప్పుడు తాను కూడా వెళ్లానన్నారు. నాగాంజలి స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా.. లేక ఎవరైనా చేశారా అనే అనుమానాస్పద ఘటన నేపథ్యంలో ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకూ అండగా ఉండాలని భావించామని వివరించారు. అప్పుడే విషయం బయటకు వచ్చిందని, లేకుంటే ఆ రోజు సాయంత్రమే చక్కబెట్టేసి ఉండేవారని అన్నారు. విషయం బయటకు వచ్చాకే దీపక్‌పై కఠిన సెక్షన్లు పెట్టారన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి స్పందించకపోవడం, కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. దీనినిబట్టి కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకు ఇచ్చే గౌరవమేమిటో అర్థమవుతోందని భరత్‌రామ్ అన్నారు. -
తప్పిపోయిన బాలుడు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు అప్పగింత
కాకినాడ సిటీ: ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో సికింద్రాబాద్ నుంచి కాకినాడ వచ్చే ట్రైన్ నంబర్ 67446 ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎం2 కోచ్‌లో 8 ఏళ్ల బాలుడు ఎక్కినట్లు గుర్తించిన టీటీ ఎస్ అచ్యుతరావు ఆ బాలుడిని కాకినాడ ఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి శుక్రవారం అప్పగించారు. ఈ బాలుడి విషయాన్ని సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్. విజయలక్ష్మికి వివరించగా ఆమె బాలుడి వివరాలను తెలుసుకున్నారు. బాలుడి పేరు పి.గణేష్, తండ్రి రాజు, వయస్సు 8 సంవత్సరాలు బలగం పేట, అమీర్‌పేట, హైదరాబాద్ అని చెప్పాడన్నారు. తల్లిదండ్రులు తనను తిట్టడంతో తన తల్లిదండ్రులకు చెప్పకుండా సికింద్రాబాద్‌లో రైలు ఎక్కినట్లు చెప్పాడని సీ్త్ర శిశుసంక్షేమశాఖ అధికారులు వివరించారు. ఈ బాలుడిని జీఆర్పీ ఎస్ఐ ఎన్ రవికుమార్ ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బందికి సంరక్షణ నిమిత్తం అప్పగించినట్లు తెలిపారు. -
గడ్డికి గడ్డుకాలం..!
పిఠాపురం: ఎండాకాలం వచ్చిదంటే పచ్చిగడ్డి మచ్చుకై నా కనిపించదు. వేసవిలో పశుపోషణ అంతా ఎండుగడ్డి పైనే ఆధారపడి ఉంటుంది. గతంలో ఎండు వరి గడ్డికి లోటు ఉండేది కాదు. కానీ కొన్నేళ్లుగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఎండుగడ్డికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. దీంతో మూగజీవాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిని అధిగమించే దిశగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. ఫలితంగా పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్ర కోతలతో.. కొన్నేళ్లుగా కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు యంత్రాలతో వరి కోతలపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పులతో పంటను హడావుడిగా ఒబ్బిడి చేసుకునేందుకు యంత్రాలతో కోతలకే రైతులు సిద్ధపడుతున్నారు. కూలీలతో పోలిస్తే యంత్రాలతో కోతల వలన ఖర్చు, సమయం ఆదా అవుతోంది. అయితే, కూలీలతో కోతలు కోయిస్తే పశువులకు అవసరమైన ఎండుగడ్డి పెద్ద మొత్తంలో లభిస్తుంది. అదే యంత్రాలతో కోతలు కోస్తున్న పొలాల్లో ఎండుగడ్డి రావడం లేదు. యంత్రంతో కోతల వలన వరి దుబ్బులో సగానికి పైగా నేల మీదే ఉండిపోతుంది. మిగిలిన సగం యంత్రంలో నలిగిపోయి పశువులు తినడానికి పనికి రాకుండా పోతోంది. అక్కడక్కడ యంత్రాలతో కోసిన గడ్డిని సేకరిస్తున్నప్పటికీ డీజిల్ వాసన వస్తూండటంతో ఆ గడ్డిని పశువులు తినడం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు చాలా మంది పంట పొలాలను రొయ్యలు, చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. పలుచోట్ల పొలాలు రియల్ ఎస్టేట్ లే అవుట్లుగా మారిపోతున్నాయి. ఈ కారణాల వలన కూడా పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. పశుగ్రాస పథకాలు దూరం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కనిష్టంగా 25 సెంట్లు, గరిష్టంగా 2.5 ఎకరాల సొంత భూమి కలిగి ఉన్న రైతులకు పశుగ్రాసం పెంపకానికి చేయూతనిచ్చేవారు. సైలేజ్ గడ్డి, టీఎంఆర్ దాణా, పశుగ్రాసం పెంచడానికి పచ్చిరొట్ట విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై అందిచేవారు. దీంతో వేసవిలో పశుగ్రాసానికి కొరత లేకుండా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశుగ్రాస పథకాలను పక్కన పెట్టేశారు. దీంతో ఈ ఏడాది రబీ కోతలు మొదలైన తొలి దశలోనే పశుగ్రాసం కొరత రైతులను వెంటాడుతోంది. పెరిగిన ధరలు కేవలం కూలీలతో కోతలు కోసిన వరి గడ్డి మాత్రమే పశువులకు పనికి వస్తూండటం.. అది అతి తక్కువగా మాత్రమే అందుబాటులో ఉండటంతో గడ్డి ధరలు భారీగా పెరిగాయి. ట్రాక్టర్ ఎండుగడ్డి ధర రూ.12 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు నేరుగా పొలాల్లోనే వరిగడ్డిని కొనుగోలు చేసి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో స్థానికంగా గడ్డికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో పశువులకు మేత దొరకడం కష్టంగా మారిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు ఇక పచ్చగడ్డి కరువే యంత్రాలతో వరి కోతలు ఎండు గడ్డి కొరతతో ఇబ్బందులు పశుగ్రాస పథకాలను మరచిన ప్రభుత్వం పశుపోషణ భారంగా మారిందంటున్న పాడి రైతులు జిల్లాలో పశువుల వివరాలు ఆవులు 76,502 గేదెలు 2,82,273 గొర్రెలు 1,01,870 మేకలు 1,41,229 పశువులకు అవసరమయ్యే ఎండుగడ్డి రోజుకు 2 మెట్రిక్ టన్నులుఅప్పుడు అమ్మే వాళ్లం.. ఇప్పుడు కొనాల్సి వస్తోంది యంత్రాలు వచ్చాక పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో కోతలు కోసి, కుప్పలుగా వేసే వాళ్లం. దాంతో పశుగ్రాసానికి ఇబ్బందులుండేవి కావు. చాలా గడ్డి అందుబాటులో ఉండేది. ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడకు వచ్చి ఎండుగడ్డి కొనుక్కునే వారు. కానీ, ఇప్పుడు మా సొంత గేదెలకే గడ్డి లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల నుంచి గడ్డి కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో పశువులను పెంచడం మోయలేని భారంగా మారింది. అందుకే చాలామంది పశువులను అమ్ముకుంటున్నారు. – పెద్దింటి రాజు, రాపర్తి, పిఠాపురం మండలం ఎండుగడ్డి దొరకడం లేదు వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రస్తుతం అన్నిచోట్లా యంత్రాలతో కోతలు జరుగుతున్నాయి. దీంతో ఎండుగడ్డి దొరకడం కష్టంగా మారింది. గంతలో మనుషులతో కోతలు జరిగేవి. అప్పుడు ఎండుగడ్డి పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ వెతికినా ఎండుగడ్డి దొరకడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం ఎండలు ముదరడంతో పచ్చిగడ్డి దొరికే పరిస్థితి లేదు. ఎండుగడ్డి దొరకక పశు పోషణ కష్టంగా మారింది. – చర్మాకుల కృష్ణ, రాపర్తి, పిఠాపురం మండలం -
స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కాకినాడ లీగల్: స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్ జె.జయలక్ష్మి మాట్లాడుతూ, స్లాట్ బుకింగ్ కోసం కక్షిదారులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో లాగిన్ అయి, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు. అందులో వివరాలు పొందుపరచి, స్లాట్ బుకింగ్ ఆప్షన్‌కు వెళ్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎంచుకోవాలని తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ బుకింగ్ తేదీ, సమయం పచ్చ రంగులో, ముందుగా ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం నమోదు చేసుకున్న తేదీలు, సమయాల వివరాలు ఎరుపు రంగులో కనిపిస్తాయన్నారు. కక్షిదారులు పచ్చరంగులోని తేదీలను ఎంచుకోవాలన్నారు. అనంతరం కక్షిదారు మొబైల్‌కు వన్ టైం పాస్వర్డ్ వస్తుందన్నారు. దానిని నిర్ధారించాక స్లాట్ బుక్ అవుతుందని చెప్పారు. ఒకసారి బుక్ చేసుకున్న స్లాట్ మార్చుకోవాలంటే అదనంగా రూ.200 చెల్లించాలని తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా తొలుత రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజును సబ్ రిజిస్ట్రార్ ఆర్వీ రామారావు సమక్షంలో జయలక్ష్మి అందజేశారు. తప్పని ఇబ్బందులు స్లాట్ బుకింగ్‌తో కొంత మంది క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. స్లాట్ బుకింగ్ సమయానికి క్రయవిక్రయదారులు రాకపోవడంతో స్లాట్ బుకింగ్ ముగిసింది. వారికి సాయంత్రం 5.30 తరువాత ఇప్పటి వరకూ ఉన్న ఫ్రేమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ చేశారు. సాయంత్రం 5.30 తరువాత పాత విధానంలో సుమారు 30 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉదయం 10.30 నుంచి 5.30 వరకూ స్లాట్ విధానంలో సుమారు 30 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేశారు. రాత్రి 8 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తూండటంతో సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది, క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానం వలన ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
గండేపల్లి: ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యువీ శివనాగబాబు తెలియజేశారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామానికి చెందిన బాడవుల కేదార్ మణికంఠ (21) రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం రాజమహేంద్రవరం నుంచి తన స్నేహితుడైన విష్ణువర్ధన్తో కలిసి మోటార్ సైకిల్‌పై ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో బిర్యాని తినేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండలంలోని గండేపల్లి శివారుకు వచ్చేసరికి ఎన్టీ రాజాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మోటార్ సైకిల్‌పై అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వచ్చి వీరి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో కేదార్ మణికంఠకు తీవ్రంగాను, విష్ణువర్ధన్‌కు స్వల్పంగాను గాయాలుకాగా వీరిని రాజానగరం జీఎస్‌ఎల్‌కు తరలించగా అప్పటికే కేదార్ మణికంఠ మృతి చెందినట్టు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. -
దోషులను కఠినంగా శిక్షించాలి
● నాగాంజలి మృతికి సంతాపం ● బాధితులను ప్రభుత్వ పెద్దలు ఎందుకు పరామర్శించలేదు? ● వైఎస్సార్ సీపీ నేత నాగమణి కాకినాడ రూరల్: ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్‌ను, ఇతర దోషులందరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జోనల్ కార్యదర్శి జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిన నాగాంజలి కుటుంబానికి పార్టీ తరఫున ఆమె సంతాపం, సానుభూతి తెలిపారు. కాకినాడ కొత్త గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం నాగమణి మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, తాను ఇటీవల రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగాంజలిని చూశామన్నారు. ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే తన మనస్సు చలించిపోయిందన్నారు. మహిళా హోం మంత్రి ఉండి కూడా రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున నాగాంజలిని ఆస్పత్రిలో కనీసంగా కూడా పరామర్శించలేదన్నారు. గత వారం సీఎం చంద్రబాబు పోలవరం వచ్చారని, పరామర్శించాలనుకుంటే రాజమహేంద్రవరం అక్కడకు ఎంత దూరమని ప్రశ్నించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనను ఎందుకు ఖండించలేదని నిలదీశారు. సుమారు 30 వేల మంది మహిళలు కనిపించడం లేదని ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేసి జైలుకు పంపడమే పరిపాలనని ప్రభుత్వం భావిస్తోందన్నా రు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండె సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతూంటే దానిపై కూడా మంత్రి లోకేష్ సైటెర్లు వేస్తున్నారని దుయ్యబట్టారు. మా రెడ్‌బుక్ చూస్తే ఒకరికి గుండె నొప్పి వస్తుందని, మరొకరికి బాత్రూములో చేయి వి రుగుతుందంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి ని కూడా వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. అ హంకారం తగదని, ప్రజలను రక్షించాలనే లక్ష్యంతోనే పరిపాలన సాగించాలని నాగమణి హితవు పలికారు. -
రక్తదానంపై అవగాహనకు సైకిల్ యాత్ర
తుని రూరల్: రక్తదానంపై యువతలో అవగాహన, చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సేవ్ బ్లడ్ పేరుతో తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఆకేటి బుజ్జిబాబు శుక్రవారం సాయంత్రం సైకిల్ యాత్ర చేపట్టాడు. తుని మండలం వి.కొత్తూరు సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి బస చేశాడు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ, నాలుగు నెలల పాటు తన యాత్ర కొనసాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తానన్నారు. గతంలో కూడా తాను అనేక యాత్రలు చేశానన్నారు. -
అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు రాజమహేంద్రవరం రూరల్: కాతేరులో తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో గురువారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సదస్సుకు 18 వేలమంది హాజరయ్యారని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దృఢంగా ఉండేలా సన్నద్ధం చేయాలని, అప్పుడే వారు వృద్దులోకి వస్తారన్నారు. జాతీయస్థాయి పరీక్షలైన జేఈఈ (మెయిన్), జేఈఈ (అడ్వాన్స్డ్) అండ్ నీట్‌లలో తరచుగా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు పుస్తకాలకన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి ఎక్కువగా అలవాటు పడ్డారని, మొబైల్‌తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి తల్లిదండ్రులు వివరించాలని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి కేవలం విద్య మాత్రమేనని, తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా జరిగే ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్)పరీక్షలలో 25మంది పరీక్ష రాస్తే కేవలం ఒక్కరికి మాత్రమే సీటు దొరుకుతుందని అదే తిరుమలలో ప్రతి నలుగురిలో ఒకరికి సీటు లభిస్తోందని చెప్పారు. మెడికల్‌లో దేశవ్యాప్తంగా జరిగే నీట్ పరీక్షల ప్రకారం 16మంది పరీక్ష రాస్తే కేవలం ఒకరికి సీటు లభిస్తుందని, అదే తిరుమలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మెడికల్ సీటు వస్తుందన్నారు. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినిదేవి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులని వారిని చూసే ఎక్కువగా నేర్చుకుంటారని, కాబట్టి పిల్లల నడవడికను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని అన్నారు. విజ్ఞానభారతి నేషనల్ సెక్రటరీ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలను ఎక్కువగా చదవాలని అప్పుడే వారికి జ్ఞాన సముపార్జన లభిస్తుందని అన్నారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి
ఏలేశ్వరం: గత నెల 20న మండల పరిధిలోని తిరుమాలిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గెద్దనాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బొడ్డేటి నాగలక్ష్మి భర్త గోవిందు(39) గురువారం చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం కిర్లంపూడి మండలం గెద్దనాపల్లికి చెందిన గోవింద్ బెల్లం వ్యాపారం కోసం గత నెల 20న మోటారుబైక్పై ఏలేశ్వరం వస్తుండగా మార్గమధ్యలో తిరుమాలి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ రాయవరం: ఇటీవల రాయవరం ఆలయంలో పట్టపగలు జరిగిన చోరీ ఘటనలో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాలను రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాయవరం అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మెడలో మంగళసూత్రాలు చోరీ చేసిన నిందితుడు తోరాటి సాయివరప్రసాద్‌ను అరెస్ట్ చేశామన్నారు. రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన సాయివరప్రసాద్ మహేంద్రవాడ్ రోడ్డులో పాత హెచ్‌పీ గొడౌన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు సాయివరప్రసాద్‌ను విచారించగా, నేరం అంగీకరించాడన్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు మంగళసూత్రంతో పాటుగా, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ చేసిన వెండి కిరీటం, వెండి చెవులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అనపర్తి జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. నేరం జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్‌బాబు, పీసీ జీవీ కుమార్‌ను జిల్లా ఎస్పీ అభినందించారు. కోర్టులో దొంగతనం కాకినాడ లీగల్: కాకినాడ కోర్టులో దొంగతనం జరగడం కలకలం రేపింది. కోర్టుల ప్రాంగణంలో పలు న్యాయస్థానాల్లో మూడు కోర్టులకు అనుసంధానం చేసి ఉన్న ఏసీల కాపర్ వైర్లను ఆగంతకులు బుధవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. కాకినాడ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం, స్పెషల్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులకు సంబంధించి 14 ఏసీల కాపర్ వైర్లను దొంగలు ఎత్తికెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కోర్టు సంబంఽధించిన న్యాయమూర్తులు కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవికి తెలియపరిచారు. ఇదే తరహాలో 2023లో జనవరి నెలలో కాకినాడ బార్ అసోసియేషన్‌లో ఏసీ కాపర్ వైర్ల దొంగతనం జరిగింది. అదే నెలలో కాకినాడ నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టుల ఏసీల కాపర్ వైర్లను దొంగిలించారు. -
వెంకన్న కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు కళ్యాణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం ఆలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మహేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏడు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రధానంగా 8వ తేదీన జరిగే రథోత్సవం, రాత్రి జరిగే కల్యాణోత్సవం తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత శాఖల అధికారులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ బందోబస్తుకు అవసరమైన సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని సబ్ డివిజన్ అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఆర్డీఓ పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ తమ పరిధిలో తీసుకునే ఏర్పాట్లను, ముందస్తు చర్యలను వివరించారు. తహసీల్దార్ టి.రాజరాజేశ్వరరావు, ఎంపీడీవో బీకేఎస్ఎస్వీ రామన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై ఎస్.రాము, ఆర్ అండ్ బీ శాఖ డీఈఈ రాజేంద్ర, ఏఈ మణికుమార్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ అశోక్, వాడపల్లి ఉప సర్పంచ్ పోచిరాజు బాబురావు, లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అనుమతుల్లేని క్వారీలో యంత్రాల సీజ్
రౌతులపూడి: మండలంలోని ములగపూడిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సర్వే నంబరు–1లో ప్రభుత్వ అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న నల్లరాయిని అధికారులు గుర్తించారు. ఈ క్వారీలో పనిచేస్తున్న ఒక కంప్రెసర్, డ్రిల్లింగ్ మెషీన్, 323 పొక్లెయిన్‌ను సీజ్‌చేసి స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఆర్ఐ మురళీకృష్ణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న యంత్రాలను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని చెఆప్పరు. ఆర్ఐ పట్నాయక్, వీఆర్ఓ శ్రీను, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
టోల్ ఎగ్గొట్టేందుకు అడ్డదారులు
కిర్లంపూడి: టోల్ ఫీజులు ఎగ్గొట్టేందుకు అడ్డదారుల్లో గ్రామాల మధ్యలోంచి వెళ్లేందుకు భారీ వాహనాల డ్రైవర్లు వెనుకాడడంలేదు. మండల పరిధి కృష్ణవరంలోని టోల్గేట్ వద్ద ఫీజు ఎగ్గొట్టేందుకు బూరుగుపూడి ఊరు శివారున పొలవరం కాలువ గట్టు మీదుగా కృష్ణవరం ఊరు మధ్యలో నుంచి సుమారు 60–65 టన్నుల ఇసుక లోడుతో నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు వెళుతున్నాయి. దీంతో కృష్ణవరంలోని గ్రామస్తులు గురువారం లారీలను అడ్డుకున్నారు. భారీ ఇసుక లారీలు గ్రామం మధ్యలో నుంచి వేగంగా వెళ్లడంతో ఏ సమయాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మార్గంలో ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ఉండడంతో విద్యార్థులకు ఏ ముప్పు వాటిల్లుతుందోనని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సామర్థ్యాన్ని మించి ఇసుక లోడులు వెళ్లడం వల్ల సీసీ రోడ్డు పాడైపోతుందన్నారు. దీంతో పాటు ఇళ్లల్లోకి దుమ్ముధూళీ రావడంతో పాటు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాల్లోంచి లారీల రవాణాను ఆపకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
మీరు ఏదో మంచి చేస్తారని గెలిపించాం
మలికిపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఏదో చేస్తారని.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకుని.. మీరు చేసినా చేయకపోయినా మీ వెనుక ఉండి పార్టీని గ్రామాల్లో అభివృద్ధి పథంలో నడిపే వాళ్లమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా కేశనపల్లి సర్పంచ్, మలికిపురం మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు యెనుముల వీర వెంకట సత్య నాగేంద్రప్రసాద్ (నాగు) అన్నారు. ఈ మేరకు కాపు, బీసీ కార్పొరేషన్ రుణాల సమస్యలను వివరిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశిస్తూ గురువారం ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. మలికిపురం మండలంలోని 21 గ్రామాల్లో కాపు కార్పొరేషన్‌కు రుణాల కోసం 1,060 మంది దరఖాస్తు చేస్తే 44 మందికి మాత్రమే ఇచ్చారని, ఇది చాలా అన్యాయమని ఆ వీడియోలో పేర్కొన్నారు. కేశనపల్లిలో కాపు కార్పొరేషన్ రుణాల కోసం 70 మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ‘కార్పొరేషన్ లోన్ల గురించి మీరు చెబుతున్నారు. మేమే చెప్పు దెబ్బలు తింటున్నాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కార్పొరేషన్ లోన్లు చాలా తక్కువగా ఇచ్చారనే బాధ ఉందని, రెండు కార్పొరేషన్ లోన్లు ఇచ్చిన మీరు 70 మందితో మమ్మల్ని తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేషన్ లోన్ల విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిశీలించాలన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు 484 మంది దరఖాస్తులు పెట్టుకుంటే మండలంలో 65 మందికి ఇస్తామని చెబుతున్నారని, ఈ విషయాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు వివరిస్తే.. ఈ సమస్య తన పరిధిలో లేదని చెబుతున్నారన్నారు. 1994 నుంచి టీడీపీలో ఉన్నామని, గ్రామంలో పార్టీ నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ వచ్చామని తెలిపారు. కార్పొరేషన్ రుణాల విషయంపై పునరాలోచన చేసి, సర్పంచ్‌లు తలెత్తుకుని తిరిగేలా చేయాలని కోరారు. కేశనపల్లిలో రెండు కాపు కార్పొరేషన్ రుణాలు, ఒక బీసీ కార్పొరేషన్ రుణం ఇస్తే మిగిలిన దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని నాగు అన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారనుకున్నాం కేశనపల్లి సర్పంచ్ యెనుముల నాగు కార్పొరేషన్ లోన్లతో గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితి సీఎం, డిప్యూటీ సీఎంకు వీడియో సందేశం -
5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ అమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5,6 తేదీల్లో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం చార్టర్ అధ్యక్షుడు తీగెల రాజా, ఐకాన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మణి వెంకట్ చెప్పారు. గురువారం రాజమహేంద్రవరం క్లబ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాదిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కుస్తీ పోటీలను తమ క్లబ్ తరఫున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కుస్తీ పోటీలను దక్షిణాదిలో కూడా పరిచయం చేయాలనే ఆశయంతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామన్నారు. అండర్–15 బాలబాలికలకు, అండర్–20 పురుషులు, మహిళలకు రాష్ట్ర స్థాయిలో రెజ్లింగ్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 300 మంది రెజ్లర్స్ హాజరవుతారని చెప్పారు. ఈ పోటీల విజేతలు ఈ నెల 23న రాజస్థాన్‌లోని కోటాలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. క్లబ్ స్పోర్ట్స్ చైర్మన్ మద్దూరి శంకర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు దివాన్‌చెరువు ఎస్వీబీసీ కల్యాణ మండపంలో జరుగుతాయన్నారు. రెజ్లర్లకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి ఉదయగిరి సురేష్, కోశాధికారి కామేశ్వరిదేవి, స్పోర్ట్స్ డైరెక్టర్ పి.హెచ్.ఎస్.కార్తీక్, సంయుక్త కార్యదర్శి వంశీ పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రూ.171.33 కోట్లతో అన్నవరం దేవస్థానం బడ్జెట్
అన్నవరం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రూ.171.33 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదిస్తూ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.46.25 కోట్లు, వివిధ కొనుగోళ్లకు రూ.31.20 కోట్లు, సీజీఎఫ్, ఆడిట్ ఫీజు ఇతర చెల్లింపులకు రూ.23 కోట్లు, భక్తుల సదుపాయాలకు రూ.7.64 కోట్లు, స్వామివారి కల్యాణ, ఇతర ఉత్సవాలకు రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించారు. కేటాయింపులు ఇలా.. ● సిబ్బంది జీతాలకు రూ.18 కోట్లు, అర్చకులు, వేద పండితుల జీతాలకు రూ.6 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు రూ.13.50 కోట్లు, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు రూ.9 కోట్లు. ● ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, పంచదార, గోధుమ నూక, వంట గ్యాస్ తదితర కొనుగోళ్లకు రూ.25 కోట్లు, వ్రతాలు, ఇతర ఆర్జిత సేవలకు అవసరమయ్యే సరకుల కొనుగోళ్లకు రూ.5 కోట్లు, ఇతర పూజా సామగ్రి కొనుగోళ్లకు రూ.1.15 కోట్లు. ● వ్రత పురోహితులకు చెల్లించే పారితోషికాలకు రూ.16 కోట్లు, ప్రసాదం ప్యాకర్లకు రూ.2.10 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.1.60 కోట్లు. ● దేవస్థానంలో శానిటేషన్‌కు రూ.7.50 కోట్లు, షామియానా, పందిళ్లకు రూ.14 లక్షలు. ● ఎలక్ట్రికల్ వర్క్స్, వాటర్ సప్లై తదితర వాటికి రూ.1.55 కోట్లు, సోలార్ ప్లాంట్ నిర్వహణకు రూ.10 లక్షలు. ● దేవస్థానం నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు రూ.3.75 కోట్లు, దత్తత ఆలయాల నిర్వహణకు రూ.90 లక్షలు, ఆగమ పాఠశాలకు రూ.30 లక్షలు, దేవస్థానం ఆసుపత్రి నిర్వహణ, మందుల కొనుగోలుకు రూ.8 లక్షలు. ● స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు రూ.2.25 కోట్లు, సెక్యూరిటీ గార్డులకు రూ.2 కోట్లు, హోం గార్డులకు రూ.1.10 కోట్లు. ● సీజీఎఫ్ తదితర చెల్లింపులకు రూ.7.20 కోట్లు, సెక్షన్–65 ఈఏఎఫ్ కింద రూ.10 కోట్లు, ఆడిట్ ఫీజు రూ.1.20 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి రూ.2.4 కోట్లు, ప్రభుత్వ ట్యాక్స్‌లకు రూ.2.5 కోట్లు. ● ఇంజినీరింగ్ పనులకు రూ.4 కోట్లు, ఎలక్ట్రికల్ సామగ్రి కొనుగోళ్లకు రూ.కోటి, కొత్త వాహనాల కొనుగోలుకు రూ.కోటి. ● సిబ్బందికి వివిధ అడ్వాన్స్‌లు, రుణాలకు రూ.70 లక్షలు. ● కొత్త డిపాజిట్లు రూ.3 కోట్లు. మెచ్యూర్ అయిన డిపాజిట్లు తిరిగి జమ చేయడానికి రూ.కోటి, ఈఎండీ చెల్లింపులు రూ.కోటి. ● దేవస్థానం ట్రాన్స్‌పోర్టు నిర్వహణకు రూ.1.16 కోట్లు. ● సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్ట్‌లో భక్తులకు భోజనాలు పెట్టేందుకుగాను వివిధ దినుసుల కొనుగోలుకు రూ.3.30 కోట్లు, కూరగాయల కొనుగోలుకు రూ.కోటి, పాలకు రూ.60 లక్షలు, గ్యాస్‌కు రూ.55 లక్షలు, జీతాలకు రూ.కోటి, ఇతర ఖర్చులకు రూ.11.70 లక్షలు. ● గో సంరక్షణ ట్రస్ట్‌లో ఆవుల మేత, దాణాలకు రూ.20 లక్షలు, వైద్య ఖర్చులకు రూ.లక్ష, సిబ్బంది జీతాలకు రూ.31 లక్షలు. -
శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. రత్నగిరిపై రామాలయం వద్ద గురువారం ఉదయం పండితులు పందిరి రాట వేశారు. తొలుత పందిరి రాటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించి, పూజలు చేశారు. అనంతరం సుస్వర వేద మంత్రోచ్చారణ నడుమ రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు తదితరులు పందిరి రాటకు పూజలు చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రామాలయ అర్చకుడు దేవులపల్లి వరప్రసాద్, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితుడు చామర్తి కన్నబాబు, పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి శ్రీరామ నవమి వేడుకలు ఈ నెల ఐదో తేదీ నుంచి 13వ తేదీ వరకూ తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులుగా అలంకరించడంతో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఆరో తేదీ ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. 7న ప్రత్యేక పూజలు, 8న పండిత సదస్యం, 9, 10 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక పూజలు, 11న సీతారాముల వనవిహారోత్సవం, 12న శ్రీచక్రస్నానం, దండియాడింపు నిర్వహిస్తారు. 13వ తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
పరీక్ష కేంద్రాల్లో ‘నన్నయ’ వీసీ తనిఖీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న డిగ్రీ, బీఈడీ, లా పరీక్ష కేంద్రాలను ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని వీఎస్ లక్ష్మీ మహిళా కళాశాల, ప్రగతి డిగ్రీ కళాశాలను సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 109 కేంద్రాల్లో 22 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. వేసవి నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వీసీ ప్రసన్నశ్రీ సూచించారు. -
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పచ్చని చేలపై కన్నీటి వరద ఈ ఫొటో చూడండి.. కనుచూపు మేరంతా వరద నీటిలో చిక్కుకున్న పొలాలే.. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనిదీ చిత్రం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏలేరు వరద నీరు ఒక్కసారిగా వెల్లువెత్తి, విరుచుకుపడింది. కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగా ఏలేశ్వరం జలాశయం నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని వదిలేయడంతో పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలను వరద ముంచెత్తింది. పెద్ద ఎత్తున బురదతో కూడిన వరద నీరు రావడంతో పొలాల్లో మట్టి మేటలు వేసింది. ఈ విపత్తు జరిగి ఇప్పటికి అక్షరాలా ఆరు నెలలైంది. వేలాది మంది రైతులు భారీగా నష్టపోయారు. అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చామని చెప్పిందే.. తప్ప ఇప్పటికీ తమకు నయాపైసా అందలేదని చాలా మంది బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. -
అన్నదాతలతో పరిహాసం
8లోపరిహారం లేదు.. పట్టించుకునే వారూ లేరు సార్వాలో రెండెకరాల్లో వరి పంట వరదకు కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేశాయి. ఇప్పటి వరకూ పైసా కూడా పరిహారం రాలేదు. ఇసుక మేటలు తొలగించడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. అదీ లేదు. నా పొలానికి ఎదురుగా ఉన్న గొర్రిఖండి కాలువకు గండి కూడా పడింది. దానిని సగం పూడ్చి వదిలేశారు. ఫలితంగా దాళ్వా పంట కూడా సాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది. – పడాల అచ్చారావు (బాబూరావు), రైతు, గొల్లప్రోలు పరిహారం ఊసెత్తడం లేదు ఏలేరు వరదలు, అధిక వర్షాల వల్ల మా పంటలు పోయాయి. అప్పట్లో అధికారులు వచ్చి నష్టం నిర్ధారించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపాం.. పరిహారం వస్తుందని చెప్పారు. నెలలు గడుస్తున్నా పరిహారం మాత్రం రాలేదు. ఎవరూ ఆ ఊసెత్తడం లేదు. ఎవరిని అడగాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి మాది. – ధర్మారపు లక్ష్మీకుమారి, రైతు, యండపల్లి, కొత్తపల్లి మండలం వేశామంటున్నారు.. మాకు రాలేదు మాకు సంబంధించి మూడెకరాల్లో పంట వరదలో కొట్టుకుపోయింది. పంట పూర్తిగా దెబ్బ తిన్నట్లు అధికారులు గుర్తించారు. నష్ట పరిహారం వస్తుందని అప్పట్లో చెప్పారు. తరువాత పరిహారం వేశామని కూ డా అంటున్నారు. కానీ మాకు మాత్రం ఒక్క రూపా యి కూడా పడలేదు. అడుగుతూంటే ఎవరూ సమాఽ దానం చెప్పడం లేదు. అసలు వస్తుందో రాదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో మేమున్నాం. – మొగలి అప్పలరాజు, రైతు, యండపల్లి, కొత్తపల్లి మండలం పరిహారం గురించి పట్టించుకోవడం లేదు పంటలు దెబ్బతిని, తీవ్రంగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నష్టపరిహారం వేశారని అధికారులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరికి వేశారో, ఎంత వేశారో చెప్పడం లేదు. ఎవరిని అడిగినా రాలేదనే అంటున్నారు. మాకు రాలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు. – దువ్వా జయలక్ష్మి, రైతు, యండపల్లి, కొత్తపల్లి మండలం పంట భూమిలో ఇసుక మేటలు ఇది ఏ నదీ తీరానికి సంబంధించిన ఫొటో అని అనుకుంటే పొరపాటు పడినట్లే.. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన వరదల కారణంగా పిఠాపురం మండలం రాపర్తి గ్రామం వద్ద ఏలేరు కాలువకు పడిన గండ్లతో పొలాల్లో ఇసుక, మట్టి ఇలా మేటలు వేసింది. ఇలా పొలాల్లో మేటలు వేసిన ఇసుక, మట్టిని తొలగించుకోవడానికి హెక్టారుకు రూ.17 వేల చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ, ఆవిధంగా ఆర్థిక సాయం అందలేదని చాలా మంది రైతులు వాపోతున్నారు. ● గత సెప్టెంబర్‌లో వెల్లువెత్తిన ఏలేరు ● వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు ● రైతులకు రూ.కోట్లలో నష్టం ● నెలలు గడుస్తున్నా అందని పరిహారం ● వరద నీట కొట్టుకుపోయిన కూటమి నేతల హామీలుపిఠాపురం: అధిక వర్షాల కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో జిల్లాలోని ఏలేరు, పంపా, సుద్దగెడ్డ, తాండవ నదులకు ఊహకందని రీతిలో వరదలు వచ్చాయి. వరదలు, అధిక వర్షాల కారణంగా జగ్గంపేట, పెద్దాపురం, కిర్లంపూడి, తాళ్లరేవు, సామర్లకోట, పిఠాపురం, తొండంగి, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని తదితర 20 మండలాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద నీట మునిగి సర్వనాశనమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులు సుమారు రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. ముఖ్యంగా వేలాది ఎకరాల్లో పచ్చని పంటలకు ఊపిరి పోసే ఏలేరు.. తన ఆయకట్టు భూములపై ప్రతాపం చూపింది. పరీవాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జలాశయంలోకి ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. దీనిని అంచనా వేసుకుంటూ, జలాశయం నుంచి తగిన స్థాయిలో దిగువకు నీటిని వదలాల్సి ఉండగా.. అధికారులు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని విడిచిపెట్టారు. ఆ రోజుల్లో 10 వేల క్యూసెక్కుల లోపే అదనపు జలాలను విడిచిపెడుతున్నట్లు అధికారులు చెప్పగా.. వాస్తవానికి అంతకు పదింతల మొత్తంలో నీటిని రోజుల తరబడి వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా ఒక్కసారిగా ఏలేరు జలాలు ఉరకలెత్తి విరుచుకుపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు, పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు జలమయమయ్యాయి. ఏలేరు నదికి సుమారు 200కు పైగా గండ్లు పడ్డాయి. సుమారు 200 ఎకరాల పంట భూముల్లో ఇసుక, మట్టి మేటలు వేశాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్పట్లో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతులను, వరద బాధితులను పరామర్శించారు. వారిలో మనోధైర్యం నింపి, బాధితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హడావుడిగా మొక్కుబడి పర్యటనలు చేశారు. బాధితులకు తక్షణం పరిహారం ఇస్తామంటూ హామీలిచ్చారు. కానీ, ఆ మాటలు పరిహాసంగానే మిగిలాయి. నెలలు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని వేలాది మంది రైతులు వాపోతున్నారు. పరిహారం ఇచ్చామని చెబుతున్నారు తప్ప ఎంత మందికి ఇచ్చారు, ఎంత ఇచ్చారనే లెక్కలు మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ బహిర్గతం చేయడం లేదు. అటు ప్రభుత్వాధినేతలూ పట్టించుకోవడం మానేశారు. దీంతో పంటలు నష్టపోయి, పరిహారం అందక ఏలేరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఏలేరు వరద నష్టాలు ఇలా.. అధికారుల ప్రాథమిక అంచనా వరద ప్రభావిత మండలాలు 20 ముంపులో చిక్కుకున్న గ్రామాలు 206 నీట మునిగిన పంటల విస్తీర్ణం సుమారు 1,00,000 ఎకరాలు మట్టి మేటలు వేసిన పొలాలు సుమారు 200 ఎకరాలు దెబ్బ తిన్న పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, మినుము నష్టపోయిన రైతులు సుమారు 50,000 పంట నష్టం సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నీట మునిగిన పంటల విస్తీర్ణం 75,000 ఎకరాలు నష్టపోయిన రైతులు 41,796 పంట నష్టం అంచనా రూ.172 కోట్లు ప్రభుత్వం కుదించిందిలా.. పంట నష్టం 34,812 ఎకరాలు నష్టపోయిన రైతులు 24,879 ఎకరానికి రూ.10 వేల ఇన్పుట్ సబ్సిడీ, ఇసుక మేటలు తొలగించుకోవడానికి హెక్టార్‌కు రూ.17 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. -
భావనారాయణ స్వామి భూములను పరిశీలించిన కలెక్టర్
కాకినాడ రూరల్: సర్పవరం గ్రామంలోని భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన విలువైన భూములను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గురువారం పరిశీలించారు. ఇదే భూములను క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ బుధవారం పరిశీలించగా.. మరుసటి రోజే కలెక్టర్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు, ఎమ్మెల్యే నానాజీతో కలిసి దేవస్థానానికి చెందిన సుమారు 18 ఎకరాల భూములను కలెక్టర్ పరిశీలించారు. భూముల హద్దులను చూసి ఎన్ని ఎకరాలుందో నివేదిక ఇవ్వాలని సర్వే అధికారులను ఆదేశించారు. సర్పవరంలో క్రికెట్ స్టేడియం ప్రతిపాదన రావడంతో విలువైన దేవుడి భూములు 18 ఎకరాలతో పాటు దీనిని ఆనుకుని ఉన్న రైతులకు చెందిన మరో 12 ఎకరాలు కూడా సేకరించేందుకు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. భూములు ఎందుకు పరిశీలించారనే విషయాన్ని కలెక్టర్ వెల్లడించలేదు. ఎమ్మెల్యే నానాజీ మాత్రం క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదన మేరకు భూములు పరిశీలించినట్లు చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా సర్వే అధికారి సుబ్బారావు, తహసీల్దార్ కుమారి, ఆలయ ఈఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్యామలకు కలెక్టర్ అభినందనలు కాకినాడ సిటీ: పెద్దాపురానికి చెందిన గోలి శ్యామల గత జనవరిలో విశాఖపట్నం నుంచి సముద్రంలో ఈదుకుంటూ కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌కు విజయవంతంగా చేరుకున్నారు. ఆమె సాహసాన్ని అభినందిస్తూ వరల్డ్ ఓపెన్ వాటర్ అసోసియేషన్ ప్రశంసాపత్రం అందజేసింది. ఈ నేపథ్యంలో శ్యామల జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను కలెక్టరేట్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదుతూ గమ్యాన్ని చేరుకోవడం గొప్ప విశేషమని ఆమెను కలెక్టర్ అభినందించారు. వక్ఫ్ సవరణ బిల్లు.. రాజ్యాంగంపై దాడికాకినాడ రూరల్: వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ఏ కరీం బాషా అన్నారు. గురువారం తన నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా అని ఆరోపించారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లింల షరియత్‌కు పూర్తి విరుద్ధమన్నారు. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా చట్టంలో ఎలాంటి మార్పూ చేయలేదని, ఇది కేవలం బడాబాబులకు దోచిపెట్టడానికేనని విమర్శించారు. సీఎం చంద్రబాబు ముస్లింలకు చేస్తున్న అన్యాయాన్ని టీడీపీలోని ముస్లిం నాయకులు, కార్యకర్తలు గ్రహించాలని బాషా కోరారు. సమావేశంలో మైనార్టీ సెల్ రూరల్ అధ్యక్షుడు కేజీఎన్ వలి, నాయకులు షేక్ సంధాని, చాంద్ బాషా, అన్సారీ బేగ్ పాల్గొన్నారు. ఔను.. బర్డ్‌ఫ్లూతోనే కోళ్ల మరణాలు పిఠాపురం: గత ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకూ పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని మూడు కోళ్లఫామ్‌లలో పెద్ద సంఖ్యలో కోళ్లు బర్డ్‌ఫ్లూ వల్లనే మృతి చెందాయని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రచురించి, కోళ్లు చనిపోయిన ఫామ్‌లపై ఆంక్షలు విధించారు. కోళ్లు చనిపోయిన ఫామ్‌ల నుంచి కిలోమీటరు పరిధిని ఇన్ఫెక్టెడ్ జోన్‌గా, 10 కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి, ఆంక్షలు అమలు చేయాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాంతాల నుంచి కోళ్లను అమ్మడం, కొనడం, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీఓ 122 జారీ చేశారు. అప్పట్లో పిఠాపురం, మండలంలోని కుమారపురం, చిత్రాడ, నర్సింగపురం, గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామాల్లోని ఫామ్‌లలో ఒక్కసారిగా వందలాది కోళ్లు మృతి చెందాయి. సంబంధిత కోళ్ల కంపెనీ సిబ్బంది వచ్చి, చనిపోయిన కోళ్ల శాంపిల్స్ తీసుకెళ్లారు. పశు సంవర్ధక శాఖ అధికారులు హుటాహుటిన ఆయా ఫామ్‌లను పరిశీలించారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపించారు. అక్కడ వివిధ పరీక్షల అనంతరం ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూ వల్లనే మరణించినట్లు నిర్ధారించారు. -
వ్యర్థాలతో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్
సామర్లకోట: స్థానిక ఏడీబీ రోడ్డులోని రిలయన్స్ పవర్ ప్లాంటు సమీపంలో రిలయన్స్ బయో ఎనర్టీ ప్లాంట్‌ను బుధవారం ఆన్లైన్ (వర్చువల్ విధానంలో)లో ప్రారంభించారు. డ్రోన్ కెమెరా ద్వారా ఫ్యాకర్టీ పరిసరాలను రిలయన్స్ అధినేతలు, మంత్రి లోకేశ్ తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.375 కోట్ల వ్యయంతో నిర్మించే ప్లాంటులో వరి, చెరకు, మొక్కజోన్న, ఆయిల్‌పామ్, పూలతోటలు, ఆక్వా సముదాయాల నుంచి వచ్చే వ్యర్థాలు, పశువుల పేడతో ‘కంప్రెస్డ్ బయో గ్యాస్’ ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే మూడు యూనిట్ల ద్వారా రోజుకు 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రతినిధులు తెలిపారు. బయో ఎనర్జీ మొదటి యూనిట్ ప్లాంటుకు రూ.114.20 ఖర్చు చేసినట్టు ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన రెండు యూనిట్లు ఆగస్టు నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు.వర్చువల్ విధానంలో ప్రారంభించిన మంత్రి లోకేశ్ -
భావనారాయణునికి శఠగోపమేనా !
కాకినాడ రూరల్: దేవుడి భూములు అన్యాక్రాంతమవ్వకుండా కాపాడవల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉంటుంది. ఆదాయం కోసమో, ఇతర అవసరాల కోసమో దేవుడికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేయాలనుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. ఇప్పటికే విలువైన భూములు చేతులు మారినా పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు ఉన్న భూములను కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆదాయం లేదనే నెపంతో ఏ విధంగా ఇతరులకు అప్పగించాలా అని చూడడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన విష్ణు క్షేత్రమైన సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయం భూములకు రక్షణ లేకుండా పోయింది. గ్రామంలో ఆలయం ఎదురుగా గోశాలను ఆనుకుని మాధవపట్నం రోడ్డును చేర్చి సుమారు 1.79 ఎకరాల భూమి ఖాళీగా ఉండడంతో దానిపై కొందరి కన్ను పడింది. దీనికి వంత పాడేలా 11 సంవత్సరాలు లీజు అనే అంశాన్ని దేవదాయ శాఖ అధికారులు తెరపైకి తీసుకురావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. గోశాలలోని గోవులు ఈ ఖాళీ స్థలంలో పశు గ్రాసం తినేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జనసేన నేతలు చాలా గోవులను ధారాదత్తం చేశారు. ఇప్పుడు ఖాళీ స్థలంపై దృష్టి పడడంతో దానిని వాణిజ్య అవసరాల నిమిత్తం 11 సంవత్సరాల లీజుకు ఇచ్చేందుకు దేవదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విలువైన స్థలం ప్రైవేట్ పరం చేసేలా టెండర్లు పిలవడంతో పాటు వేలం వేసేందుకు సర్పవరం ఆలయ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కసారి ప్రైవేట్ పరమైతే తరువాత న్యాయపరమైన లిటిగేషన్ల ద్వారా అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సర్పవరం గ్రామంలోని భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన సుమారు 18ఎకరాల భూమిని బుధవారం ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎండోమెంట్ డీసీ డీఎల్వీ రమేష్‌బాబును వెంటబెట్టుకుని పరిశీలించారు. కోట్ల రూపాయల విలువైన ఈ దేవుడిని భూమిని స్టేడియం నిర్మాణం కోసం ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటించకుండా మాములుగా పరిశీలించేందుకు వచ్చినట్టు డీసీ చెప్పడం వెనుక రహస్యం ఏమిటని గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఈఓ ఎం.లక్ష్మినారాయణను వివరణ కోరగా సర్పవరం భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన భూమి ఎకరం 79 సెంట్లు ఖాళీగా ఉండడంతో వేలం పాట ద్వారా ఆదాయం పొందేందుకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. త్వరలో 11 సంవత్సరాల లీజు గడువుతో వేలం నిర్వహిస్తామన్నారు. దేవస్థానానికి చెందిన 18ఎకరాలు భూములు డీసీ, ఎమ్మెల్యే పరిశీలన చేశారని, కారణం తనకు తెలియదన్నారు. దేవుడి భూములపై కొందరి కన్ను ఆదాయం కోసమని 1.79 ఎకరాల వేలానికి రంగం సిద్ధం స్టేడియం కోసమని మరో 18 ఎకరాల ధారాదత్తానికి ఎమ్మెల్యే పరిశీలన -
సామర్లకోట చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
సామర్లకోట: పట్టణ మున్సిపల్ కౌన్సిల్లో బలనిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు బుధవారం జిల్లా కలెక్టన్ షన్మోహన్ సగిలి, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతి పత్రాలు అందజేశారు. కొంత కాలంగా చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ తీరుపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అసంపూర్తితో ఉన్నారు. దాంతో 31 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్ సభ్యులలో 22 మంది సంతకాలు చేసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ సగానికి మించి సభ్యులు బల నిరూపణ కోసం వినతి పత్రం అందజేస్తే దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. అయితే బలనిరూపణ సమావేశం ఏర్పాటుకు కలెక్టరు నుంచి ఆదేశాలు రావలసి ఉందన్నారు. వినతి పత్రంలో సంతకాలు చేసిన వారి నుంచి సమాచారం సేకరించి తదపరి నిర్ణయం తీసుకొంటారన్నారు. పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నిక జరగడం వలన ఆమెను దింపే అధికారం మెజార్టీ సభ్యులకు ఉంటుందని కమిషనర్ తెలిపారు. వైస్‌చైర్మన్ ఉబా జాన్‌మోజెస్, కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీసత్యనారాయణ, పాగా సురేష్‌కుమార్, నేతల హరిబాబు, యార్లగడ్డ జగదీష్, వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్నం దొరబాబు పాల్గొన్నారు. బల నిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ కలెక్టర్‌కు, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు -
రైతులకు నష్టం రాకుండా చూడాలి
రబీ వరి పంట కోతలు ప్రారంభించాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల నష్టపోతున్నాము. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది దిగుబడులు కూడా తగ్గడంతో అంతగా ఆదాయం వచ్చే అవకాశం లేనందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి. – గొల్లపల్లి వీరబాబు, రైతు, మల్లేపల్లి, గండేపల్లి మండలం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించారు. ఇంకా పూర్తి స్థాయిలో కోతలు ప్రారంభం అయ్యే లోపు అన్ని మండలాల్లోను కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం గండేపల్లి, ఏలేశ్వరం, కొత్తపల్లి మండలాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో తొలుత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాము. రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. – ఎన్.విజయకుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ -
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
కాకినాడ సిటీ: ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్లో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఏప్రిల్ మొదటి వారంలోనే ఉపాధి హామీ పనులు ప్రారంభించి, వేసవి మూడు నెలలూ పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నత్తనడకన నడుస్తోందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. జిల్లాలో మూడు నెలలుగా ఉపాధి హామీ పనులు నామమాత్రంగా జరిగాయన్నారు. చేసిన పనులకు కూడా డబ్బులు విడుదల కాక, కూలీలు నానా అవస్థలూ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలి కేవలం రూ.7 పెంచి, కనీస వేతనం రూ.307గా నిర్ణయించారని తెలిపారు. ఇక నుంచి కూలీలకు కచ్చితంగా రూ.307 వేతనం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్న సదుపాయాలన్నీ కూలీలకు కల్పించాలన్నారు. మేట్లకు పారితోషికం ఇవ్వాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, జిల్లా నాయకుడు కూరాకుల సింహాచలం, ఉపాధ్యక్షులు దుప్పి అదృష్టదీపుడు, చొల్లంగి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు సోషల్ పరీక్షకు 342 మంది గైర్హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెల 17వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు సోషల్ పరీక్ష నిర్వహించారు. దీనికి 27,407 మంది హాజరు కాగా 342 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, ట్రెజరీ అధికారులకు జిల్లా విద్యా శాఖాధికారి పిల్లి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. మట్టి లారీలను అడ్డుకుని ఆందోళన పి.గన్నవరం: ఊడిమూడిలంక నుంచి వస్తున్న మట్టి లారీల వల్ల తమ వంతెన ధ్వంసం అవుతున్నదంటూ జి.పెదపూడి గ్రామస్తులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. లంక నుంచి వస్తున్న మట్టి లారీలను వంతెన వద్ద అడ్డుకుని ఆందోళన చేపట్టారు. మట్టి లారీల రాకపోకల వల్ల వంతెన బలహీనపడుతోందని జి.పెదపూడి సర్పంచ్ దంగేటి అన్నవరంతో పాటు ఆందోళనకారులు వివరించారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలకు ఈ వంతెన ఆధారమన్నారు. లారీల రాకపోకల వల్ల వంతెన మార్జిన్లో ఉన్న మంచినీటి పైపు లైన్లు ధ్వంసం అవుతున్నాయని వివరించారు. వేరే వంతెన మీదుగా మట్టి లారీలు తరలించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరో వర్గానికి చెందిన కొందరు అక్కడికి రావడంతో వివాదం తలెత్తింది. కొన్నేళ్లుగా ఈ వంతెన మీదుగా మట్టి లారీలు వెళ్తున్నాయని, అప్పుడు ఎందుకు అడ్డగించలేదని వారు ఆందోళన కారులను నిలదీశారు. వీరికి మట్టి ర్యాంపు నిర్వాహకుడి అనుచరులు కూడా తోడవడంతో ఇరువర్గాల మధ్య వివాదం పెరిగింది. విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ అక్కడికి చేరుకుని, ఇరువర్గాలతో చర్చించారు. ఒకానొక దశలో వివాదం ముదరడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. తహసీల్దార్ సమక్షంలో అధికారులతో చర్చించి వంతెన సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్సై సూచించారు. అనంతరం లారీలను పంపించి వేశారు. 4 నుంచి స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు అమలాపురం టౌన్: జిల్లాలోని 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 4 నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు జిల్లా రిజిస్ట్రార్ సీహెచ్ నాగలింగేశ్వరరావు తెలిపారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్లాట్ బుకింగ్ విధానం అమలుపై కార్యాలయ సిబ్బందికి నాగ మల్లేశ్వరరావు అవగాహన కల్పించారు. భూముల రిజిస్ట్రేషన్లను కొనుగోలు, అమ్మకందార్లు తమకు నచ్చిన సమయంలో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. -
ఎక్కడ పనులు అక్కడే..
స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేయకపోవడంతో నగరంలో పలు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉండిపోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్పొరేషన్ భవనం సైతం మధ్యలోనే నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా నిధులు లేవని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ సిటీ గడువు పెంచి, నిధులు విడుదల చేయాలి. – నల్లబిల్లి సుజాత, మాజీ కార్పొరేటర్ -
ముమ్మరంగా ఇంజినీరింగ్ పనులు
కాకినాడ సిటీ: వర్షాలు ప్రారంభమయ్యేలోపు రానున్న మూడు నెలల్లో జిల్లాలో చేపట్టిన ఇంజినీరింగ్ పనులను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల ద్వారా తాను సమర్పించిన అంశాలను కలెక్టర్ షణ్మోహన్ ఆయనకు వివరించారు. అనంతరం వీరపాండ్యన్ మాట్లాడుతూ, రానున్న మూడు నెలల్లో కూలీలకు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 11 గంటలలోపు, మధ్యా హ్నం 4 గంటల తర్వాత పనులు చేయించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై, ముఖ్యంగా నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. నీటి వనరులన్నింటినీ శుభప్రరచి, ఫ్లషింగ్ చేయించాలన్నారు. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో 4 నుంచి 6 పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏఎన్ఎం వద్ద 500, పీహెచ్‌సీల్లో వెయ్యి, సీహెచ్‌సీల్లో 5 వేలు, జిల్లా ఆసుపత్రిలో 10 వేలు చొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని అంబులెన్స్‌ల్లో ఎమర్జెన్సీ రెస్క్యూ మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు. కాలువలు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలకు లోను కాకుండా చూడాలని, తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని వీరపాండ్యన్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, డీఆర్ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, డ్వామా పీడీ ఎ.వెంకటల క్ష్మి, డీఈఓ పి.రమేష్, డీఎంహెచ్ఓ జె.నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకాధికారి వీరపాండ్యన్ ఆదేశం -
కొండెక్కుతున్న కోడిమాంసం ధరలు
ధర పెరిగినా రైతుకు ఒరిగిందేమీ లేదు పౌల్ట్రీ వ్యాపారంలో గత మూడు నెలల నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. బర్డ్ ప్లూ వైరస్ వదంతులతో పెంచిన కోళ్లను ఇంకా మేపలేక దశల వారీగా విక్రయించుకుని తీవ్రమైన నష్టాలను చవిచూశాం. ఇటీవల ఉగాది, రంజాన్ సందర్భంగా బాయిలర్ ధరల పెరిగినా రైతులకు ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం బాయిలర్ కోళ్లు రైతుల వద్ద లేకపోవడంతో కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఆ లాభాలు వాళ్లకే వెళ్లిపోతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పెరిగిన ధర నిలకడగా ఉండే అవకాశం కూడా లేదు. – బొబ్బా వెంకన్న, పౌల్ట్రీ రైతు,పెదపళ్ల, ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా సాక్షి, అమలాపురం: బర్డ్ ఫ్లూతో విలవిలలాడిన కోడి కోలుకుంటోంది. సంక్రాంతి తరువాత మొదలైన పౌల్ట్రీ రైతుల కష్టాలు.. ఇంచుమించు తెలుగు సంవత్సరాది వరకు కొనసాగాయి. గత వారం రోజుల నుంచి కోడి ధర క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు కొండెక్కింది. బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్ల పెంపకాన్ని రైతులు తగ్గించి వేయడంతో... డిమాండ్‌లో సగం కూడా కోళ్లు మార్కెట్‌కు రాకపోవడంతో వాటి ధర అంచనాలకు మించి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తూర్పు గోదావరి జిల్లాలో 2.50 కోట్ల వరకు గుడ్లు పెట్టే కోళ్లు, నాలుగు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతోంది. ఈ జిల్లాలో ప్రతి రోజూ 80 లక్షల కోడిగుడ్ల ఉత్పత్తి అవుతుండగా 48 లక్షల గుడ్లు ఒడిశా, బిహార్, కోల్‌కతాలకు ఎగుమతవుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఐదు లక్షల లేయర్ కోళ్లు పెరుగుతున్నాయి. లక్షకు పైగా నాటు కోళ్ల పెంపకం జరుగుతోంది. మరో మూడు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకం సాగుతోందని అంచనా. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో 18 కమర్షియల్ పౌల్ట్రీ ఫామ్‌లు ఉండగా వీటిలో సుమారు 57 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో 5 లక్షల వరకు బ్రాయిలర్ ఫామ్‌లు కాగా, మిగిలిన లేయర్ (కోడి గుడ్డు పెట్టే) కోళ్లు. మూడు జిల్లాల్లో రోజుకు 100 టన్నుల వరకు కోడి మాంసం విక్రయాలు చేసేవారు. అదే ఆదివారం, ఇతర పండగల సమయంలో 150 టన్నుల వరకు విక్రయాలు ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గత ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరి అగ్రహారంలో లక్షలాది కోళ్లు మృతి చెందడంతో ఆ ప్రభావం మూడు జిల్లాల పౌల్ట్రీలపై పడింది. బర్డ్ ఫ్లూకు ముందు కిలో చికెన్ ధర రూ.240 నుంచి రూ.260 వరకూ ఉండేది. బర్డ్ ఫ్లూ భయంతో నాలుగైదు రోజులలో అది కాస్తా కేజీ రూ.150కి పడిపోయింది. తరువాత కేజీ రూ.120కి చేరింది. ధర తగ్గడం అటుంచి వారం రోజుల పాటు ప్రభుత్వ అధికారులే కోడి మాంసం విక్రయాలను అడ్డుకున్నారు. తరువాత అమ్మకాలకు అనుమతి ఇచ్చినా నెల రోజుల పాటు చికెన్ అమ్మకాలు మూడు జిల్లాలలో దాదాపు నిలిచిపోయాయి. కేవలం మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు మాత్రమే సాగాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లోనూ, రెస్టారెంట్లు ఇలా ప్రతిచోటా చికెన్ తప్ప మిగిలిన మాంసాహారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. సంక్రాంతి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో బర్డ్ ఫ్లూ చావు దెబ్బతీసింది. జిల్లా సరిహద్దును ఆనుకుని తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బ కోనసీమ జిల్లా పౌల్ట్రీని కుదేలు చేసింది. ఈ జిల్లాలో వైరస్ జాడ లేకున్నా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. కోడి మాంసం, కోడి గుడ్డు అమ్మకాలను అధికారులు నిషేధించడంతో ధర పడిపోయి రైతులు.. అమ్మకాలు లేక వ్యాపారులు ఆందోళన చెందారు. బర్డ్‌ఫ్లూ నుంచి కోలుకుంటున్న కోడి భారీగా పెరిగిన బ్రాయిలర్.. లేయర్ కోడి ధరలు బ్రాయిలర్ రైతు వద్ద కేజీ రూ.152, రిటైల్ రూ.175 లేయర్ లైవ్ రైతు వద్ద కేజీ రూ.125 బ్రాయిలర్ మాంసం కేజీ రూ.300.. లేయర్ మాంసం కేజీ రూ.200 డిమాండ్‌లో మూడు వంతులు మాత్రమే మార్కెట్‌కు బర్డ్ ఫ్లూతో ఇంచుమించు నెలన్నర రోజులు అతలాకుతలమైన పౌల్ట్రీ పరిశ్రమ పది రోజులుగా కోలుకుంటోంది. కోడి మాంసం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. బ్రాయిలర్ లైవ్ రైతు వారీ కేజీ ధర రూ.152 వరకు ఉండగా షాపుల వద్ద లైవ్ రిటైల్ ధర కేజీ రూ.175 నుంచి రూ.180 వరకు ఉంది. కేజీ మాంసం ధర రూ.300కు పైబడి ఉంది. ఇక లేయర్ రిటైల్ ధర కేజీ రూ.125 నుంచి రూ.130 వరకు ఉండగా, మాంసం ధర కేజీ రూ.200 వరకు ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి చూస్తే బ్రాయిలర్, లేయర్ మాంసం ధరలు మరింత పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రచారం వల్ల బ్రాయిలర్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి మొదటి వారం వరకు కొత్త బ్యాచ్‌లు (కోళ్లు పెంచడాన్ని) తగ్గించారు. దీనివల్ల మార్కెట్‌కు డిమాండ్‌కు తగిన కోళ్లు రావడం లేదు. ఇప్పుడున్న అవసరాలలో మూడవ వంతు కూడా కోళ్ల లభ్యత లేదని అమలాపురానికి చెందిన కోడి మాంసం విక్రయదారుడు యేసు సాక్షికి తెలిపాడు. ఈ కారణంగానే కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. -
కిటకిటలాడిన రత్నగిరి
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి సోమవారం కిటకిటలాడింది. ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, సత్యదేవుని వ్రతాలాచరించి, దర్శనం చేసుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సత్యదేవుని మొత్తం 40 వేల మంది దర్శించుకున్నారు. 1,500 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అమ్మవారు ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. -
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాకినాడ ఈద్గా మైదానంలో ముస్లింలు సోమవారం నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లింలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా స్థానిక ముస్లింలు భుజాలకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం ఆలోచనపరుల వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ చట్టం అప్రజాస్వామికమని, రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ముస్లింలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 13 నుంచి తలుపులమ్మ తల్లి గంధామావాస్య జాతర తుని రూరల్: లోవ కొత్తూరులో తలుపులమ్మ అమ్మవారి గంధామావాస్య జాతర ఏప్రిల్ 13 నుంచి 27 వరకూ నిర్వహించనున్నట్లు లోవ దేవస్థానం ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై లోవ దేవస్థానం కార్యాలయంలో సోమవారం ఆయన లోవ కొత్తూరు గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 13న గరగలు తీయడంతో ఉత్సవాలు ప్రారంభించి, 26న జాగరణ నిర్వహిస్తామని తెలిపారు. 27న అమ్మవారి ఊరేగింపు, తీర్థం జరుపుతామన్నారు. ప్రతి సంవత్సరం లోవ కొత్తూరులో అమ్మవారి పుట్టింటి సంబరాలుగా గంధామావాస్య ఉత్సవాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానంలో ఉత్సవాలు చేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం గంధామావాస్య ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉత్సవాలకు అవసరమైన నిధులను దేవస్థానం నుంచి కేటాయించాలని గ్రామస్తులు కోరారు. ఉత్సవాల నిర్వహణలో గ్రామస్తులు ఐక్యంగా సహకరించాలని ఈఓ విశ్వనాథరాజు కోరారు. సమావేశంలో దేవస్థానం మాజీ చైర్మన్ దూలం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
అన్నవరం దేవస్థానానికి డస్ట్బిన్లు అందజేసిన గెయిల్
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివా రి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ శ్రీగెయిల్ శ్రీ ఇండియా (రాజమహేంద్రవరం) సంస్థ రూ.18 లక్షల విలువ చేసే 85 జతల స్టెయిన్లెస్ స్టీల్ డస్ట్బిన్లను విరాళంగా అందజేసింది. సోమవా రం నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీటిని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ కేవీఎన్ రావు, జనరల్ మేనేజర్ కేబీ నారాయణ అందజేశారు. ఒకో జతలో ఒక తడిచెత్త, ఒక పొడిచెత్త డస్ట్బిన్లు ఉంటాయి. ఈ డస్ట్బిన్లనువివిధ సత్రాలలో, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి దేవస్థానంలో మరింత పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చూడాలని వారు కోరారు. గెయిల్ డీజీఎంలు రాజన్ కరతిస్వరన్, దివి ప్రభాకర్, హెచ్ఆర్ మేనేజర్ వైవీఎస్ మూర్తి, మాజీ మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ, దేవస్థానం ఈఈ వీ రామకృష్ణ, శాని టరీ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.