
ఇంటర్ ఫలితాలలో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రధమ, ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470కి 467 మార్కులను యు.విరోనిక, ఎం.హర్షిత, ఎస్.తేజ, జి.రాజనీవన్‌తేజ, ఎ.వీరవెంకట సాయిలిఖి సాధించారని, 466 పైన 31మంది, 464పైన 369 మంది, 460పైన 1086 మంది, 450 పైన ప్రతి ఇద్దరిలో ఒకరికి అనగా 2133 మంది సాధించారని, అలాగే 99.20 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులను 11 మంది విద్యార్థులు కె.సుప్రియ, ఎ.శ్రీరామ తేజశ్విని, సీహెచ్ నేహా గ్రేస్, జి.మోహనరూప, జె.భవిత, కె.గాయత్రి, టి.సరయు, బి.యశస్విని, షేక్ షమీన, ఆర్.వీరగంగ నాగేంద్ర, పి.ప్రణవ్ సాయిగణేష్ సాధించారని, 435పైన 32 మంది, 433 పైన 91మంది, 430 పైన 167 మంది, 400 పైగా మార్కులు 463 మంది సాధించారని, అలాగే 99.47 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు.
సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఏడుగురు విద్యార్థులు ఎం.ప్రియహాసిని, సీహెచ్ హరిసూర్య, పి.పవిత్ర, కె.మానస, ఎం.లేఖన, ఎస్.సాయిలిఖిత, పి.ధాత్రికావ్యశ్రీ సాధించారని, 23 మంది విద్యార్థులకు 990 మార్కులు, 331 మంది విద్యార్థులకు 985 మార్కుల పైన, 791 మంది విద్యార్థులకు 980 మార్కుల పైన, 2151 మంది విద్యార్థులకు 950 మార్కులపైన సాధించారని, 99.98 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు షేక్ ఫాతిమున్నీసా బేగం 991 మార్కులు, పి.నాగవైష్ణవి, సీహెచ్‌వీడీ రేణుక, ఎన్.వైష్ణవి, బి.హర్షిత, ఎన్.మణి, జి.రితిక 990 మార్కులు సాధించారని, 108 మంది విద్యార్థులు 980 పైన, 204 మంది విద్యార్థులు 970 పైన, 297 మంది విద్యార్థులు 950 మార్కులపైన సాధించారని, అలాగే 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధికమార్కులు వచ్చిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యాసంస్థల టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.