జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి

Apr 6 2025 12:18 AM | Updated on Apr 6 2025 12:18 AM

జగ్జీ

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి

కాకినాడ సిటీ: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్‌ సమీపంలోని లేడీస్‌ లయన్స్‌ క్లబ్‌ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి జగ్జీవన్‌రామ్‌ ఎనలేని సేవలు అందించి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.

దీపక్‌ను కఠినంగా శిక్షించాలి

వైఎస్సార్‌ సీపీ నేత వర్ధినీడి సుజాత

పిఠాపురం: రాజమహేంద్రవరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కారకుడైన దీపక్‌ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి, మహిళల పట్ల గౌరవం ఉంటే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే నాగాంజలి చనిపోయేది కాదన్నారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని హోం మంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు కనీసంగా కూడా పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. జరుగుతున్న దారుణాలు సంఘటనలు చూస్తూంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే విషయం అర్థమవుతోందన్నారు. మహిళలు అన్నీ గమనిస్తున్నారని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే మహిళా లోకం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుందని హెచ్చరించారు. మొదటి నుంచీ నేర చరిత్ర ఉన్న దీపక్‌కు పడే శిక్ష మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారి వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉండాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని సుజాత అన్నారు.

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి 1
1/1

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement