
ఫుడ్ పాయిజనింగ్‌పై సమాచారం లేదు
● మీడియాలో చూసి వచ్చాం
● బాధితులతో మాట్లాడాం,
అవంతి సీఫుడ్స్‌కు వెళ్లి పరిశీలిస్తాం
● జిల్లా వైద్యాధికారి నరసింహనాయక్
జగ్గంపేట: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలోని అవంతి సీఫుడ్స్‌లో రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజనింగ్ జరిగి 25 మంది ఆసుపత్రిలో చేరినా కంపెనీ నుంచి కాని, బాధితులకు చికిత్స చేస్తున్న జగ్గంపేటలోని ఆసుపత్రి నుంచి కాని తమకి సమాచారం లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని జిల్లా వైద్యాధికారి నరసింహం నాయక్ తెలిపారు. సీఫుడ్స్‌లో పుడ్ పాయిజిన్‌ంగ్ వల్ల జగ్గంపేటలోని శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం జిల్లా వైద్యాధికారి నరసింహం నాయక్, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాస్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం సీఫుడ్స్ క్యాంటీన్‌లో ఏ ఆహారం తీసుకున్నారు, ఎక్కడ తేడా జరిగింది, సమాచారం బయటకు రాకుండా ఎందుకు దాచారు వంటి వివరాలను బాధితుల నుంచి సేకరించారు. అనంతరం మీడియాతో జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం సీఫుడ్స్ క్యాంటీన్‌లో ఇడ్లీ, చట్నీ తీసుకున్న వారికి, దీంతోపాటు రాత్రి బిర్యాని తిన్నవారికి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయిందని తెలిపారు. జగ్గంపేట ఆసుపత్రిలో మొత్తం 25మంది జాయిన్ అయ్యారని, వీరందరు వాంతులు విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారని చెప్పారు. కొంతమందిని ఒక రోజు అనంతరం డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అవంతి సీఫుడ్స్‌కు వెళుతున్నామని పూర్తి వివరాలు సేకరించి, తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.
శ్యాంపిల్స్ సేకరించాం
అవంతి సీఫుడ్స్‌కు, క్యాంటీన్‌కు సెంట్రల్ ఫుడ్ సేప్టీ స్టాండర్స్ అధారిటీ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌సీఐ–పాసీ) లైసెన్సు ఉందని, అయితే ఇక్కడ జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌పై వారికి సమాచారం అందించామని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 20 కోట్ల టర్నోవర్ దాటిన కంపెనీలు, అందులోని క్యాంటీన్‌లు పాసీ పర్యవేక్షణలో వుంటాయని, ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం దీనిపై విచారణ చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఫుడ్, వాటర్ శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు.
జనార్ధనస్వామి కల్యాణ మహోత్సవాలలో అశ్లీల నృత్యాలు
కొత్తపల్లి: మండలంలోని రమణక్కపేటలో వేంచేసియున్న విజయ జనార్ధనస్వామి కల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. కల్యాణ మహోత్సవాలను కూడా కూటమి నాయకులు భ్రష్టుపట్టిస్తున్నారు. భక్తి భావాలతో చేపట్టవలసిన కల్యాణ మహోత్సవాలను రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యువకుడి దుర్మరణం
రాయవరం: తల్లిదండ్రులు కుమారుడు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పదవ తరగతి పరీక్షలు రాసిన కుమారుడి ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోపు రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి వార్త తెలిసి తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామ పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుడ్డు సందీప్(16) మృతిచెందాడు. గ్రామానికి కూత వేటు దూరంలో జరిగిన ప్రమాదంలో సందీప్ ఘటనా స్థలంలోనే అసువులు బాసాడు. ఎస్సై సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం..సందీప్ లొల్ల వైపు నుంచి సోమేశ్వరం గ్రామానికి మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. స్నేహితుల వద్ద మోటార్ సైకిల్ తీసుకుని వెళ్లినట్లు సమాచారం. మోటార్ సైకిల్‌పై వేగంగా గ్రామానికి వస్తున్న సమయంలో జేబు నుంచి సెల్‌ఫోన్ తీసుకునే క్రమంలో మోటార్ సైకిల్ అదుపు తప్పింది. దీంతో మోటార్ సైకిల్‌తో పాటుగా సందీప్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లోడు వ్యాన్‌ను బలంగా ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.

ఫుడ్ పాయిజనింగ్‌పై సమాచారం లేదు

ఫుడ్ పాయిజనింగ్‌పై సమాచారం లేదు