ఇంటర్ ఫలితాల్లో ప్రగతి ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియేట్ ఫలితాల్లో ప్రగతి విద్యాసంస్థల విద్యార్థులు మంచి మార్కులతో ప్రతిభ చూపారని విద్యా సంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు శనివారం తెలిపారు. ఎంపీసీ ప్రధమ సంవత్సరంలో కే.శ్యామల ప్రజ్ఞ 470 మార్కులకు 466, పిల్లా హర్షిణి 465, జి.మాధవి శ్రీదుర్గ 465, వారితో పాటు 460కు పైగా మార్కులతో 54 మంది ప్రతిభ చూపారన్నారు. బైపీసీలో పి.ఖురేషీబేగం 435, జి.తేజశ్వి, నాగమహేశ్వవరి 433 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో కె.ఽశేషలక్ష్మి 488, సీఈసీలో దేవి శరణ్య 482 మార్కులుతో ప్రతిభ చూపారన్నారు. సీనియర్ ఎంపీసీలో టి.హరిణి 988, ఐ.భాగ్యలక్ష్మి 987, బైపీసీలో కె.నిఖిత 986 సాధించారన్నారు. వీటితో పాటు జూనియర్ బైపీసీలలో 430కు పైగా 10 మందితో పాటు కాకినాడ, పెద్దాపురం, జగపతినగరం, రాజమహేంద్రవరం బ్రాంచ్‌లలో నూరుశాతం ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రగతి డైరెక్టర్లు హిమబిందు, శ్వేతబిందు, ఎజీఏం అనిల్‌బాబు, అధ్యాపకులు అభినందించారు.


