గంగపుత్రులు విలవిల | - | Sakshi
Sakshi News home page

గంగపుత్రులు విలవిల

Apr 14 2025 12:07 AM | Updated on Apr 14 2025 12:07 AM

గంగపు

గంగపుత్రులు విలవిల

సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
కూటమి వల..

అప్పుడు..ఇప్పుడు అదే మోసం

24 గంటల్లో వేట నిషేధం

అటకెక్కిన మత్స్యకార భరోసా

రూ.20 వేలు ఇస్తామని బాబుదగా

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నడిసంద్రమే జీవనాధారంగా బతుకు నావను నెట్టుకొస్తున్న గంగపుత్రులకు పెద్ద కష్టం వచ్చి పడింది. సముద్రంలో మత్స్య ఉత్పత్తుల పరిరక్షణ కోసం ఏటా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు విధించే వేట నిషేధం ఆ కుటుంబాలకు సంకటంగా మారింది. మత్స్యకార కుటుంబాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టు కనిపిస్తోంది. సముద్రంపై వేట విరామం అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లేనట్టే. నిషేధ సమయం 60 రోజులు ప్రత్యామ్నాయ ఉపాధి గగనమైపోతుంది. ఎందుకంటే వీరంతా తరతరాలుగా సముద్రంపై వేట తప్ప మరో పని చేయలేరు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు విరామ సమయంలో ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే సంకల్పంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా అందించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని 2019లో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకార భరోసా కింద రూ.10 వేలకు పెంచారు. వేట నిషేధం అమలులో ఉన్న సమయంలోనే ఏటా ఠంచన్‌గా భరోసా సొమ్ము జమ చేస్తూ వచ్చారు. ఇలా నిషేధ సమయంలోనే జగన్‌ భరోసా సొమ్ము అందివ్వడంతో సముద్ర వేటపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు సంతోషంగా ఉండేవి. వేట విరామ సమయం రెండు నెలలకు కుటుంబాలు నెట్టుకురావడానికి లోటు లేకుండా గడచిపోయేది. ఏటా మాదిరిగానే 2023–24 మత్స్యకార భరోసా కూడా ఇచ్చేందుకు వైఎస్సార్‌ సీపీ సిద్ధమైంది. ఇందుకు కార్యాచరణ కూడా పూర్తయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడి ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పంపిణీ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు.

అధికారంలోకి వచ్చి 10 నెలలు గడచినా..

అప్పుడే రెండోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. ఈ విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.10 వేల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.20 వేలు ఇస్తామని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నమ్మించారు. ఎన్నికలు ముగిసి కూటమి సర్కార్‌ గద్దెనెక్కి 10 నెలలు గడచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కూడా వేట విరామం అమలులో ఉంది. బాబు, పవన్‌ ఎన్నికల్లో ప్రకటించినట్లుగా తమకు రూ.20 వేల పరిహారం ఇస్తారని వేలాది మత్స్యకార కుటుంబాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. వేట నిషేధ సమయంలో పస్తులతో కుటుంబాలను నెట్టుకొచ్చినా కూటమి ప్రభుత్వం కనీసం మానవత్వం చూపించలేదు. సూపర్‌ సిక్స్‌ హామీల మాదిరిగానే మత్స్యకారులకు ఇచ్చిన మాటను కూడా నడిసంద్రంలో విడిచి పెట్టేసింది. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర వేటపై ఆధారపడ్డ వేలాది మత్స్యకార కుటుంబాలు చుక్కాని లేని నావ మాదిరిగా తయారయ్యాయి. ఇచ్చిన హామీ అమలు చేయకుండా గాలికొదిలేయడంతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక రోడ్డున పడ్డాయి. చంద్రబాబు అండ్‌ కో మాటల గారడీతో నిలువునా ముంచేశారని మత్స్యకార కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి.

ఈసారీ కడుపు మాడ్చుకోవాల్సిందేనా?

గత ఏడాది వేట విరామ సమయంలో పరిహారం రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఎగనామం పెట్టింది. అసలు గత విరామ సమయంలో పరిహారం అందుకోకుండానే రెండోసారి వేట నిషేధ సమయం మరో 24 గంటల్లో అమలులోకి వచ్చేస్తోంది. పెండింగ్‌ పరిహారం ఊసే లేదు అని మత్స్యకారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో మరోసారి కడుపు మాడ్చుకోవాల్సిందేనని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం ఏడాది కావస్తున్నా అందించలేదు. కూటమి ప్రభుత్వంలో రెండోసారి కూడా అందుతుందనే నమ్మకం కలగడం లేదంటున్నారు. ఇలా నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు లేడనే విషయం మరోసారి రుజువైందని మత్స్యకారులు ఆక్షేపిస్తున్నారు.

బాబూ.. మాట నిలబెట్టుకో..

మత్స్యకార భరోసా ఏడాదికి రూ.20,000 ఇస్తామని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. గత ఏడాది మత్స్యకార భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. అయినప్పటికీ గత ఏడాది ఇవ్వాల్సిన భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నిషేధ సమయం ముగియకుండానే ఏటా మత్స్యకార భరోసా అందజేసేవారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు కలిపి మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయాలి.

– చింతా నాగ మునీంద్రరావు, మత్స్యకార నాయకుడు, చింతావానిరేవు, ముమ్మిడివరం మండలం

నిషేధ సమయంలో

పస్తులుండాల్సి వస్తోంది

వేట నిషేధ సమయం రెండు నెలలూ ప్రత్యామ్నాయ జీవనోపాధి లేక సముద్రంపై వేటాడే కుటుంబాల వారు పస్తులుండాల్సి వస్తోంది. నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో విడుదల చేయకపోవడంతో నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రూ.10వేలు పరిహారం కాస్తా రూ.20వేలు చేస్తామంటే ఎంతో నమ్మకంగా ఉన్నారు. తీరా రెండోసారి నిషేధ సమయం వచ్చేసినా చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు. – మేరుగు ఎల్లాజీ,

ఎంపీటీసీ సభ్యుడు, ఉప్పాడ

ప్రతి కుటుంబానికి

రూ.40వేలు ఇవ్వాలి

చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేయడం తగదు. గత ఏడాది ఇవ్వాల్సిన పరిహారం, ఈ నెలలో నిషేధ సమయంలో ఇవ్వాల్సిన సొమ్ము కలిపి ప్రతి కుటుంబానికి రూ.40 వేలు మత్స్యకారుల ఖాతాలకు జమ చేయాలి. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా కాలక్షేపం చేస్తోన్న కూటమి ప్రభుత్వం కనీసం మత్స్యకారుల విషయంలో అయినా మాట నిలబెట్టుకోవాలి.

– గుబ్బల తులసీకుమార్‌,

జెడ్పీటీసీ సభ్యుడు,

ఉప్పాడ కొత్తపల్లి మండలం

ఉమ్మడి తూర్పున..

లబ్థిదారులు: 33,704 మంది

ఇవ్వాల్సిన మొత్తం: రూ.67.407 కోట్లు

జగన్‌ హయాంలో...

మత్స్యకార భరోసా వేటకు వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున

2019–20లో–23,190 మందికి రూ.23,19 కోట్లు

2020–21లో–24,587 మందికి రూ.24,587 కోట్లు

2021–22లో–30,213 మందికి రూ.30,213 కోట్లు

2022–23లో–21,394 మందికి రూ.21,394 కోట్లు

2023–24లో–24,147 మందికి రూ.24,147 కోట్లు

2019–20 నుంచి వేట నిషేధంతో ప్రభావితమైన బోటు యజమానులు, కళాసీలు 1,23,531 మందికి రూ.123.531 కోట్లు జమ చేశారు.

కోనసీమ జిల్లాలో..

మండలాలు: ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, మామిడికుదురు, ఉప్పలగుప్తం, సఖినేటిపల్లి, రామచంద్రాపురం, కె గంగవరం, అల్లవరం, సఖినేటిపల్లి

తీరప్రాంత గ్రామాలు: 45

మొత్తం బోట్లు: 1,700

అర్హులైన మత్స్యకారులు : 9,575 మంది

కాకినాడ జిల్లాలో ...

మండలాలు: తుని, తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్‌, తాళ్లరేవు

మత్స్యకార తీర గ్రామాలు: 36

మెకనైజ్డ్‌ బోట్లు: 467,

మోటారు బోట్లు: 3,779,

సంప్రదాయ బోట్లు 399

వేట నిషేధ లబ్ధిదారులు: 24,147 మంది

గంగపుత్రులు విలవిల1
1/3

గంగపుత్రులు విలవిల

గంగపుత్రులు విలవిల2
2/3

గంగపుత్రులు విలవిల

గంగపుత్రులు విలవిల3
3/3

గంగపుత్రులు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement