
బయట కొనాల్సిన దుస్థితి
అధికారంలోకి అన్నీ డబుల్ చేసి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ప్రతి నెలా ఇచ్చిన కందిపప్పు రేషన్ వాహనాల్లో ఇవ్వడం లేదు. దీంతో కందిపప్పు బయట కొనుగోలు చేసుకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది. పేదలకు పౌష్టికాహారంగా ఉపయోగపడే కందిపప్పును రేషన్ ద్వారా ఇవ్వకపోవడం దారుణం.
– కర్రి వెంకటలక్ష్మి,
టిడ్కో గృహ సముదాయం, సామర్లకోట
స్టాక్ రావడం లేదంటున్నారు
గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా రేషన్ వాహనం ద్వారా బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు అందజేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో బియ్యం ఇస్తున్నారు. పంచదార అరకొరగా ఇస్తూండగా, కందిపప్పు అప్పుడప్పుడు కనిపిస్తోంది. గత నెల పంచదార కూడా ఇవ్వలేదు. కందిపప్పు ఊసే లేదు. డీలర్లను, రేషన్ వాహనదారులను అడిగితే పై నుంచి స్టాక్ రావడం లేదని చెబుతున్నారు. చేసేది లేక బియ్యం మాత్రమే తీసుకుని వెళ్తున్నాం.
– ఎస్‌ఎస్ రామ్‌కుమార్, కిర్లంపూడి