వైఎస్సార్‌ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం

Published Sun, Apr 13 2025 12:15 AM | Last Updated on Sun, Apr 13 2025 12:15 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం

పీఏసీలో కీలక ప్రాతినిధ్యం

నియామకాల్లో సామాజిక సమతూకం

బోస్‌, తోట, విశ్వరూప్‌,

ముద్రగడకు చోటు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం పలు కీలక నియామకాలు చేపట్టింది. మండల, గ్రామ స్థాయిలో నూతన కమిటీల నియామకాల్లో పాత, కొత్త నేతల కలయికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీలో అత్యున్నతమైన పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అధిష్టానం అగ్రాసనం వేసింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టారు. పీఏసీ సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని నియమించారు.

వైఎస్సార్‌ సీపీలో  ‘తూర్పు’నకు అగ్రాసనం1
1/3

వైఎస్సార్‌ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం

వైఎస్సార్‌ సీపీలో  ‘తూర్పు’నకు అగ్రాసనం2
2/3

వైఎస్సార్‌ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం

వైఎస్సార్‌ సీపీలో  ‘తూర్పు’నకు అగ్రాసనం3
3/3

వైఎస్సార్‌ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement