
కాకినాడ తీరం.. కదన రంగం
● ఉత్సాహంగా
టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు
● పాల్గొన్న భారత్, అమెరికా సైనికులు
కాకినాడ రూరల్: కాకినాడ తీరం కదన రంగాన్ని తలపిస్తోంది. శత్రు దేశాలకు వణుకు పుట్టేలా భారత, అమెరికా దేశాల సైన్యాలు తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. క్లిష్ట సవాళ్లను ఎదుర్కొనేలా.. అంకిత భావంతో ఇరు దేశాల సైన్యం ఐక్యతను ప్రదర్శిస్తూ పరస్పర సహకారం, రక్షణ సామర్థ్యం పెంపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. భారత్, అమెరికా దేశాల సైన్యం చేపడుతున్న టైగర్ ట్రయంఫ్ – 25 సంయుక్త విన్యాసాలు ఈ నెల ఒకటిన విశాఖలో ప్రారంభమవ్వగా కాకినాడలో 12న ముగియనున్నాయి. కాకినాడ తీరంలోని నావల్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలోనూ, సాగర తీరంలోనూ నాలుగు రోజుల పాటు విన్యాసాలు చేపడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఇండియన్ నేవీ, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (యూఎస్‌ఏఎఫ్) బుధవారం ప్లయింగ్ మిషన్‌ను నిర్వహించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సి – 130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్, భారత నావికాదళానికి చెందిన హాక్స్, యూఎస్‌ఏఎఫ్‌కి చెందిన సి – 130 సంయుక్త విన్యాసాలలో పాల్గొన్నాయి. అలాగే ఐఎన్‌ఎస్ జలాశ్వ, యుఎస్‌ఎస్ కామ్‌స్టాక్ యుద్ధ నౌకలతో తీరంలో విన్యాసాలు ప్రదర్శించారు.

కాకినాడ తీరం.. కదన రంగం

కాకినాడ తీరం.. కదన రంగం